కడప స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిననిరవధిక దీక్షఆరో రోజుకు చేరుకుంది. కాగా గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నరమేష్, బీటెక్ రవిల ఆరోగ్యం క్షీణించింది. సుగర్ లెవెల్స్ పడిపోయాయి. వైద్యులు సూచించినా వారు వైద్య చికిత్సకునిరాకరిస్తున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యే వరకు తమ దీక్షను మాత్రం ఆపేదే లేదని ఈ ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆదివారం వీరిని పరీక్షించిన వైద్యులు రమేశ్, రవి ఇద్దరూ బరువు తగ్గారని...చాలా నీరసంగా ఉన్నారని...షుగర్ లెవల్స్, బీపీ పడిపోయాయని తెలిపారు. మరోవైపు దీక్షతో వీరి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

governer 25062018 2

మరో పక్క, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి గవర్నర్ నరసింహన్ కొద్ది సేపటి క్రితం ఫోన్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్షకు దిగిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి పై నరసింహన్ వాకబు చేశారని సీఎం కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించకముందే ఆసుపత్రికి తరలించాలని గవర్నర్ సూచించినట్టు సమాచారం. ఈ విషయంలో వైద్యుల బృందం ఇచ్చే రిపోర్టునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు నరసింహన్ సూచించారు.

governer 25062018 3

కాగా, తాను కూడా నిత్యమూ వారి ఆరోగ్యం గురించి అధికారులతో మాట్లాడుతున్నానని, వారి దీక్షకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని, ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం కడప వాసుల కలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో, కేంద్రంతో మాట్లడండి అంటూ గవర్నర్ కు, చంద్రబాబు చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమ పై, కేంద్రం కావాలని ఆలస్యం చేస్తుందని, మీరు కేంద్రంతో మాట్లాడి, ఇక్కడ జరుగుతున్న ఆందోళనలు,కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రబాబు కోరారు. అయితే గవర్నర్ మాత్రం, ఇది నా చేతిలో లేదని చెప్పినట్టు తెలుస్తుంది.

40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు వ్యవహరా శైలి, సామాన్య రాజకీయ నాయకుల కంటే ఎంతో భిన్నం. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ, తన పని తాను చేసుకు పోతూ ఉంటారు. ఆయన మీద ఆరోపణలే కానీ, ఒక్కటి అంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. మొన్నటి దాక, రెండు ఎకరాలు, రెండు వేల కోట్లు అని, సింగపూర్ హోటల్ అని, ఇలాంటి ఆరోపణలు చేసే వారు. మరో పక్క, రాజశేఖర్ రెడ్డితో పోలుస్తూ, చంద్రబాబు ఎవరికీ సహాయం చెయ్యరు అనే ప్రచారం చేసే వారు. నిజానికి అది తప్పు. చంద్రబాబు దోచుకునే వారికి సహాయం చెయ్యరు. కాని చాలా మందికి సహాయం చేసే వారు. విచిత్రం ఏమిటి అంటే, ఆ సహాయం చేసే వారే చంద్రబాబుకి ఎదురుతిరుగుతూ ఉంటారు. అప్పటి కెసిఆర్ నుంచి, ఇప్పటి ఐవైఆర్ దాకా అదే తీరు. బహుసా ఇది చంద్రబాబు జాతకం అనుకుంటా. తాను ఎవరికైతే సహాయం చేస్తారో, వారే ఆయనకు ఎదురు తిరుగుతారు.

తాజా సందర్భంలోకి వస్తే- రాష్ట్రప్రభుత్వ ప్రధార కార్యదర్శిగా పనిచేసిన ఐ.వై.ఆర్.కృష్ణారావు అంటే బాబుకి ఎంతో గౌరవం. పదవీ విరమణ తర్వాత ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని పలువురు సూచించారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కృష్ణారావుకి ఇచ్చారు. ఐ.వై.ఆర్.పై ఉన్న నమ్మకంతో ఆ కార్పొరేషన్‌కు వందకోట్ల రూపాయలు కేటాయించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఐ.వై.ఆర్. తన రూటు మార్చరు. ఏపీ సర్కార్‌కీ, చంద్రబాబుకీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్‌లు షేర్‌ చేశారు. తనకీ, ప్రభుత్వానికీ వ్యతిరేకంగా షేర్‌ చేసిన పోస్టింగ్‌లను చూసిన ముఖ్యమంత్రి ఐ.వై.ఆర్‌ని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పీఠం నుంచి తొలగించారు. ఆ తర్వాత ప్రభుత్వానికీ, చంద్రబాబుకీ వ్యతిరేకంగా కోర్టులలో ఆయన పిటీషన్లు వేయడం విచిత్ర పరిణామం

ఇదే కోవలో మరో పేరు కూడా ఉంది. నెలరోజులు మాత్రమే సర్వీస్ ఉన్నప్పటికీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లంని ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టారు చంద్రబాబు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనకు ప్రభుత్వం ఏదో ఒక పదవి కట్టబెడుతుందని ప్రచారం జరిగింది. చివరకు ఆయన సైతం ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టినట్టు వార్తలొచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు పరిస్థితి కూడా ఇదే! వైఎస్. ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా కొండపైనున్న అర్చకుల క్వార్టర్స్‌లో యాగం చేసిన ఘనుడు రమణ దీక్షితులు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక కొండ దిగుతారని భావించారు. చంద్రబాబు మాత్రం తిరుమల అర్చకుల విషయంలో జోక్యం చేసుకోకూడదన్న భావనతో మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఇదే దీక్షితులు చంద్రబాబునే కాదు, ఆ వెంకన్న పరువే తీస్తున్నాడు..

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విషయాన్ని కూడా టీడీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత ప్రధాని పదవి చేపట్టిన మోదీ ఏపీ గవర్నర్‌గా నరసింహన్‌ను కొనసాగించాలా.. లేదా అనే అంశంపై చంద్రబాబును సంప్రదించినట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయననే కొనసాగించాలని చంద్రబాబు అప్పట్లో సూచించారట. అనంతరం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకంగా గవర్నర్ నరసింహన్‌ కేంద్రానికి నివేదికలు ఇచ్చారన్నది తెలుగు తమ్ముళ్ల కథనం. ఇక పవన్ సంగతి సరే సరి... కార్ వరకు వెళ్లి, పవన్ ను సాగనంపిన రోజలు ఉన్నాయి. ఇలా అనేక మంది, చంద్రబాబు ద్వారా లబ్ది పొంది, ఆయనకే గోతులు తవ్వుతున్నారు. వాళ్ళ సంగతి పూర్తిగా తెలుసుకోకుండా వారిని చేరదియ్యటం చంద్రబాబు తప్పా ? లేక కృతజ్ఞత లేకుండా ప్రవరిస్తున్న వారి తప్పా ?చంద్రబాబు జాతకమే అంత అనుకుంటా...

వచ్చే నెల నుంచి విజయవాడ నుంచి పుట్టపర్తి, నాగార్జునసాగర్‌ మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు. విజయవాడ నుంచి ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ రెండు ప్రాంతాలకు ప్రత్యేకించి పర్యాటకులకు విమానయాన సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర విమానయాన అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ప్రజాభిప్రాయాన్ని కోరినపుడు అత్యధికులు తమ సమ్మతిని తెలిపారు. దీనిపై బిడ్లను ఆహ్వానించినపుడు మిగతా సంస్థల కంటే ‘సుప్రీం ఎయిర్‌లైన్స్‌’ తక్కువ ఖర్చుకు నడిపేందుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు.

supreme 25062018 2

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే సుప్రీం ఎయిర్‌లైన్స్‌తో అవగాహన ఒప్పందం చేసుకొని సేవలు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి రోజూ ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 9 గంటలకు పుట్టపర్తిలో బయలుదేరి 10.30 గంటలకు విజయవాడకు రానుంది. సాయంత్రం మళ్లీ 5 గంటలకు మరో సర్వీసు నడపనున్నారు. విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు ఉదయం 11 గంటలకు బయలుదేరే విమానం తిరిగి సాయంత్రం 3 గంటలకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

supreme 25062018 3

మరో పక్క, విజయవాడ (గన్నవరం)- సింగపూర్‌ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. దీంతో, విజయవాడ-సింగపూర్‌ మధ్య విమానయాన సేవలను వచ్చే నెలలో ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతిపక్ష నాయుకుడు జగన్ మోహన్ రెడ్డి, చేస్తున్న పాదయాత్ర పై, ఇంటెలిజెన్స్‌ ఆరా తీసింది. ఇప్పటి వరకు పది జిల్లాల్లో జరిగిన పాదయాత్ర తీరు, ప్రజల స్పందన, ప్రభుత్వం పై ప్రభావం, ఇలా అన్ని విషయల పై ఇంటలిజెన్స్ నివేదిక రూపొందించింది. జగన్‌ ప్రసంగాలకు ఏ విధంగా స్పందన వస్తోంది? పాదయాత్రకు వచ్చే జనంలో ఎంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు? ఎంతమందిని పార్టీ నాయకులు సమీకరిస్తున్నారు..? తదితర అంశాలపై ఇంటెలిజెన్స్‌ విభాగం ఆరా తీసింది. సీఎం చంద్రబాబుపై ప్రతిపక్షనేత జగన్‌ పాదయాత్రలో చేస్తున్న విమర్శలను వైసీపీ కార్యకర్తలు, ప్రజలు ఏ రీతిలో స్వీకరిస్తున్నారనేదానిపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే, ప్రజా సమస్యల పై కాకుండా, వ్యక్తిగతంగా చంద్రబాబుని టార్గెట్ చెయ్యటంతో, అవి సామాన్య ప్రజల్లో ఏ మాత్రం స్పందన లేదని, వైసీపీ కార్యకర్తలకు మాత్రమే జోష్ నింపుతుందని తేల్చారు.

jagan 25062018 2

అలాగే జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న హామీల పై, ప్రజలు అసలు నమ్మటం లేదని చెప్తున్నారు. అందుకే, జగన్ అసలు తన హామీల విషయమే మర్చిపోయారని, ఆయన నోటి వెంట నవరత్నాలు అనే మాట వచ్చి చాలా రోజులు అయ్యిందని, అసలు విషయం మర్చిపోయి, కేవలం చంద్రబాబుని తిట్టటం కోసమే పాదయాత్ర అంతా సరిపోతుంది అని అంటున్నారు. మరో పక్క, ప్రజల సమస్యల గురించి తెలుసుకోకుండా, ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం నడుచుకుంటూ వెళ్లిపోవటం, దారిలో ఎవరన్నా కనిపిస్తే వారితో మాట్లాడటం, సాయంత్రం మీటింగ్, ఇలా ప్రజలతో సంబంధం లేకుండా, రాజకీయ షో గా వెళ్ళిపోతుందని తేల్చారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకోయినా ఆ నెపం చంద్రబాబుదే అన్నట్లు జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ప్రజలలో సానుకూల స్పందన వస్తుందా? లేదా వ్యతిరేఖత వస్తుం దా? అనేదానిపైనా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిసింది.

jagan 25062018 3

మోదీని, బీజేపీ నాయకులపైనా జగన్‌ విమర్శలు చేయకపోవడంపై ఆ పార్టీతో లాలూచీ అయ్యారని ఎంతమంది నమ్ముతున్నారు? కేసులకు భయపడి జగన్‌ మోదీపై విమర్శలు చేయడంలేదన్న వ్యాఖ్యలు పాదయాత్ర సందర్భంగా జగన్‌ ప్రసంగ సమయంలోనే చర్చించుకుంటున్న అంశాలను ఇంటిలిజెన్స్‌ గుర్తించినట్లు సమాచారం. నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్‌లకే జన సమీకరణ బాధ్యతలు ముందుగానే అప్పగిస్తున్నారన్న విషయం కూడా ఇంటిలిజెన్స్‌ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. పాదయాత్రకు వారం రోజులు ముందే ఆయా నియోజకవర్గ కోఆర్డినేటర్‌కి చేయాల్సిన ఏర్పాట్ల పై పలు అంశాలతో కూడిన సూచనలు ఇస్తున్నారని, అవి తు.చ తప్పకుండా పాటించాలని వైసీపీ నుంచి ఆదేశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, జగన్ చేస్తున్న ఆరోపణలు, ఎప్పటికప్పుడు స్థానిక తెలుగుదేశం నేతలు స్పందించక పోవటం మాత్రం, ఒక మైనస్ గా చెప్తున్నారు. ఇలాంటి అనేక అంశాలపై ఇంటిలిజెన్స్‌ లోతైన పరిశీలన జరిపి నివేదిక రూపొందిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read