ఇప్పటికే స్కూల్స్ ప్రారంభం అయ్యాయి.. కాని, ఆ గవర్నమెంట్ స్కూల్ లో మాత్రం, ఇప్పటికీ దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రవేశం కోసం రోజంతా పాఠశాల ప్రాంగణంలో పడిగాపులు పడుతున్నారు. ‘బాబ్బాబు.. ఒక్క సీటూ..’ అన్న విజ్ఞప్తులు, ‘మాకు తెలిసిన ఫ్యామిలీ అది. కాస్త చేసి పెట్టండి’ అన్న రికమండేషన్‌ ఫోన్లతో రోజంతా హడావుడిగానే ఉంటుంది. ఇంతా చేసి ఈ స్కూలు ఏదో ప్రైవేటు లేక కార్పొరేట్‌ స్కూలు కాదు. అదొక ప్రభుత్వ బడి. అయితే, కార్పొరేటును తలదన్నేలా సిద్ధమవుతుండటం, అదేస్థాయిలో టీచర్లు వినూత్న ప్రచారం చేపట్టడమే ఇప్పుడు ఈ స్కూలుకు డిమాండ్‌ను పెంచేసింది.

school 21062018 2

ప్రకాశం జిల్లా చీరాలలోని కొత్తపేటలో ప్రస్తుతం ఈ స్కూలు నిర్మాణంలో ఉంది. ఈ నెల 19వ తేదీన ఒకమేరకు నిర్మాణ పనులను పూర్తిచేసుకొని క్లాసులు జరుపుకోవడానికి సిద్ధమైంది. ‘మా దగ్గర సీట్లు అయిపోయాయి. ఇక రావద్దు’ అని చెబుతున్నా, ఈ జెడ్‌పీ స్కూలుకు పోటెత్తె తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 1000 మంది ప్రవేశాలకు అవకాశం ఉండగా, ఇప్పటికే 1500 దరఖాస్తులు వచ్చాయట! ఇంతలా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న విషయం ఏమిటీ? ఎకరా 20 సెంట్లలో దాదాపు రూ.రెండు కోట్ల వ్యయంతో ఈ నూతన పాఠశాల సిద్ధమవుతోంది. పదిరకాల క్రీడలను ఒకేసారి నిర్వహించగలిగినంత విశాలమైన మైదానాన్ని, కోర్టులను సిద్ధం చేస్తున్నారు. ఆరు లక్షల వ్యయంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బోధించనున్నారు.

school 21062018 3

ఇక్కడి డైనింగ్‌ హాల్‌లో ఒకేసారి 450మంది పిల్లలు భోజనం చేయొచ్చు. దూర ప్రాంతాలనుంచి వచ్చే వారికి ఉచిత రవాణా. విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందించనున్నారు. అంటే ఈ స్కూలులో అడ్మిషన్‌ పొందితే చాలు, ఏ సౌకర్యం, వసతికి విద్యార్థులు వెతుక్కోనక్కర్లేదు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తన కుమారుడికి ఎనిమిదో తరగతి కోసం ఈ స్కూలులో అడ్మిషన్‌ తీసుకోవడం మరో విశేషం. కొత్తపేటలోని యూపీ స్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేసి అన్ని హంగులతో హైస్కూలును ఏర్పాటుచేస్తే బాగుంటుందని అనుకొన్నారు. ఈ ఆలోచన చేసిన వారంలోపే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత ఏప్రిల్‌ 26వ తేదీన పనులు మొదలయ్యాయి. ఈ విషయంలో టీచర్లు పూర్తిగా సహకరించారు. మరోవైపు, మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, డీఈవో సుబ్బారావు అన్నివిధాల కలిసివచ్చారు. దాతలూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో, జగన, కేసీఆర్ మద్దతును బీజేపీ అధినాయకత్వం కోరుతున్నట్టు గత కొన్ని రోజులగా సమాచారం వస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో తక్కువ మెజారిటీ ఉండటంతో, బీజేపీ నానా పాట్లు పడుతుంది. తెలుగుదేశం దూరం జరగటంతో, ఇప్పుడు బీజేపీ అల్లాడిపోతుంది. అయితే, తెలుగుదేశం లేని లోటు, జగన్, కెసిఆర్ తో తీర్చుకుంటానికి సిద్ధం అయ్యింది. అయితే, ఇదే చనువుగా తీసుకుని, ఇదే మంచి అవకాసం అనుకుని, అమిత్ షా తో బేరాలు మొదలు పెట్టాడు జగన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ పదవికి, ఎన్డీఏ అభ్యర్ధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తే బాగుంటుంది అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా చేస్తే, కొన్ని ఏళ్ళ పాటు, కోర్ట్ ల్లో కేసులు నుంచి తప్పించుకోవచ్చని జగన్ ఆలోచన..

vijaysai 21062018 2

అయుతే ఈ ప్రతిపాదనని చాలా సీరియస్ గా, అమిత్ షా తిప్పికోట్టినట్టు తెలుస్తుంది. అంత అత్యున్నత పదవి, విజయసాయి రెడ్డిలాగా కేసులు ఉన్న వ్యక్తికి ఇవ్వటం కుదరదు అని, వెంకయ్య తరువాత స్థానం, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తికి ఎలా ఇస్తారని, ఈ ఆలోచన మర్చిపోయి, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అమిత్ షా హుకం జారీ చేసారు. చేసేది ఏమి లేక, ఏ అభ్యర్ధిని నిలబెట్టినా, పూర్తి మద్దతు ఇస్తాము అని జగన్ చెప్పినట్టు, లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. మరో పక్క, కెసిఆర్ కూడా, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ పదవి కేశవరావుకు ఇవ్వాలని అమిత్ షా ని కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే, కెసిఆర్ ప్రతిపాదాన్ని కూడా, అమిత్ షా తిరస్కరించినట్టు తెలుస్తుంది.

vijaysai 21062018 3

ఈ నెలాఖరుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ కాలం ముగియనుండగా, ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిగా ఎవరిని నిలపాలన్న విషయమై గత కొంత కాలంగా సమాలోచనలు చేస్తున్న బీజేపీ, చివరకు మిత్రపక్షమైన శివసేనకు ఆ పదవిని ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో పక్క శివసేన మాత్రం, ప్రతి రోజు బీజేపీని తిడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది సభ్యులుండగా, ఎన్డీయేకు 111 మంది సభ్యులే ఉన్నారు. బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 122. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఆరుగురు ఎంపీలుండగా, జగన్ పార్టీకి రెండు ఎంపీలు ఉన్నారు. వారు ఇటొస్తే గెలుపు సులువవుతుందని నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులు వ్యూహాలు రచిస్తున్నారు.

నిన్న రమణ దీక్షితులు ప్రెస్ మీట్ తో, ఒక నిర్ఘాంతపోయే విషయం బయట పడింది... క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టటంతో, యావత్ హిందూ మతం అవాక్కయింది... స్వామి వారికి సేవ చేసిన దీక్షితులు, ఇలాంటి అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులతో కలిసి, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. గుంటూరుకు చెందిన అనిల్‌.. సైమన్స్‌ అమృత్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా... బుధవారం హైదరాబాద్‌లో రమణ దీక్షితులు వెనకే ఆయన కూర్చున్నారు.

deekshitulu 21062018

దీక్షితులు మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే తనకు ఫోన్‌ చేసి టీటీడీ వివరాలు అడిగారని.. తాను నివేదిక తయారు చేసి పంపించానని చెప్పారు. బోరుగడ్డ అనిల్‌పై పలు కేసులు, ఆరోపణలున్నాయి. గత ఏడాది రాజధాని పరిధిలోని తాడికొండ స్టేషన్‌లో ఆయనపై మారణాయుధాలు కలిగి ఉండటంతోపాటు చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలో 2016 ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇంటూరి సురేశ్‌ బాబును బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన కారులో మారణాయుధాలు లభించాయి. దీంతో రెండు కార్లను కూడా తాడికొండ పోలీసులు సీజ్‌ చేశారు.

deekshitulu 21062018

అనిల్‌ గుంటూరులో తనకు తాను ప్రముఖుడిగా చెప్పుకుంటూ కేంద్ర మంత్రుల పేర్లు చెప్పుకొని పంచాయితీలు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తన కారుపై ఎంపీల స్టిక్కర్‌ వేసుకొని తిరుగుతూ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు తనకు బంధువులని చెప్పుకుంటారని తెలుస్తోంది. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్‌ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడని, ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. (Courtesy: ABN Andhrajyothy)

ఆంధ్రప్రదేశ్ ని, ది సన్ రైజ్ స్టేట్ అని ఏమంటా పిలుస్తున్నారో కాని, ఇప్పుడు మాత్రం, నిజంగానే సన్ రైజ్... రాష్ట్రంలో మండే ఎండల నుంచి విలువైన వేల కిలోవాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి రాయలసీమ జిల్లాలు వేదికల వుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన మెగా సోలార్‌ పార్క్‌లో సౌర విద్యుత్‌ ఉత్పత్తి ఊపందుకోగా అనంతపురం, కడప జిల్లాలకు సంబంధించిన మరో నాలుగు సోలార్‌ పార్క్‌ల ప్రగతి వివిధ దశల్లో ముందుకు సాగుతోంది. ఈ మూడు జిల్లాలకు చెందిన 5 సోలార్‌ పార్కుల ద్వారా సమీప భవిష్యత్తులో 4 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ రాష్ట్ర విద్యుత్‌ గ్రిడ్‌కు అందుబాటులోకి రానున్నది... విద్యుత్‌ అవసరాల కోసం చేస్తున్న ఉత్పత్తి వల్ల ఏర్పడుతున్న జల, బొగ్గు, ఇంధనాల కొరత, సంబంధిత విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థల వల్ల పెరుగుతున్న వాతావరణపరమైన కాలుష్యాల గురించి సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో వుంచుకుని ప్రత్యామ్నాయ సాంప్రదాయేతర ఇందన వనరులపై చంద్రబాబు దృష్టిని సారించింది.

solar 21062018 2

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ దాదాపు 40 జిగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశాలున్నాయని, అందులో 60 శాతం రాయలసీమ జిల్లాల్లోనే ఉత్పత్తి చేయవచ్చునని సూచించింది. ఆ సూచన మేరకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ జెన్‌కో, న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఏపీల సంయుక్త భాగ స్వామ్య వేదికగా ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టిని సారించింది. ఈ క్రమంలో ప్రపంచం లోనే ఒక స్థలంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే తొలి వ్యవస్థగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌ ఆవిర్భావం జరిగింది. ఆ పార్క్‌ ఏర్పాటుకు ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల ప్రక్రియలో మొత్తం వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిలో 500 మెగావాట్లకు గ్రీన్‌కో, 350 మెగావాట్లకు సాఫ్ట్‌ బ్యాంక్‌ ఎనర్జీ, వంద మెగావాట్లకు అజ్యూర్‌ పవర్‌, 50 మెగావాట్లకు అదాని పవర్‌ సంస్థలు ఎంపికయ్యాయి. ఆపార్క్‌ ద్వారా అంచెలంచెలుగా మొదలైన సౌరవిద్యుత్‌ ప్రస్తుతం 750 మెగావాట్లకు చేరుకుంది.

solar 21062018 3

ఈ అనుభవంతో అనంతపురం జిల్లా ఎస్‌పి కుంటవద్ద జెన్‌కో ద్వారా 1500 మెగావాట్లు, కడప జిల్లాలో మైలవరం వద్ద వెయ్యి మెగావాట్లు, గాలివీడు వద్ద 500 మెగావాట్లు చొప్పున 3 వేల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేసే వ్యవస్థల స్థాపన మొదలైంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ఆయా వ్యవస్థలను దక్కించుకున్న వివిధ ప్రైవేటు సంస్థలు ఉత్పాదనలో తలమునకలవుతున్నాయి. వీటిలో ఎన్‌పీ కుంట, మైలవరం వ్యవస్థల ద్వారా దాదాపు 800 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి మొదలైందని తెలుస్తోంది. యూనిట్‌కు రూ. 3.72 పైసలు చొప్పున చెల్లిస్తూ ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో ఆయా సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 2,022 నాటికి పూర్తి స్థాయిలో 4 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేయడం లక్ష్యం కాగా, మరో ఏడాది లోనే లక్ష్యాన్ని సాధించే అవకాశాలున్నాయని సంబంధిత అధికారవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

solar 21062018 4

ఈ ప్రాజెక్టులకు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడదని తేలిన 20 వేల ఎకరాల స్థలాలను కేటాయించిన ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతి సౌకర్యాలన్నీ ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా కల్పిస్తోంది. ఇవికాక రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా 10 మెగావాట్ల నుంచి 25 మెగావాట్ల వరకు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే చిన్న చిన్న వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి పలు ప్రైవేటు సంస్థలు ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుమల క్షేత్రంలో సౌరవిద్యుత్‌ వినియోగాన్ని పెంచిన టీటీడీ కూడా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని తమకు చెందిన స్థలంలో ప్రైవేటు సంస్థ ఒప్పందంతో నెలకొల్పిన సౌరవిద్యుత్‌ యూనిట్‌ ద్వారా 10 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, గ్రిడ్‌కు అందజేస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో అంచెలంచెలుగా పెరుగుతూ ఉన్న సౌరవిద్యుత్‌ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పరిశీలించినప్పుడు సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సౌరవిద్యుత్‌లో సింహభాగం రాయలసీమ జిల్లాల నుంచే ఉంటుందని స్పష్టమవుతోంది.

Advertisements

Latest Articles

Most Read