ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీకి లేఖ రాసారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో రివైజ్డ్ అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెకాన్ తాజా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరడంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఇటీవల దిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

cbn 20062018 2

మరో పక్క, కడప ఉక్కు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేపట్టబోయే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. కడప జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో, దీక్ష జరుగుతుంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతుండడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమంటూ ప్రకటించారు.ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం అందించాలని ఢిల్లికి వెళ్లి ప్రయత్నించినా ప్రధాని కార్యాలయం, పర్మిషన్ ఇవ్వకపోవటంతో కలువలేకపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి లేఖ ద్వారా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై వివరించారు.

cbn 20062018 3

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని ఆ లేఖలో తెలియ జేశారు. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవ డంతో ఆమరణ నిరాహారదీక్షకు ఆయన సిద్దమయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఏపి పునర్విభజన చట్టం ప్రకారం లోటు బడ్జెట్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు కల్పన వంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇవ్వాలని ఉందని సియం రమేష్ పేర్కొన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి సెయిల్‌ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని చట్టంలో 13వ షెడ్యూల్‌లో మూడో పాయింట్‌లో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని అన్నారు.

మొన్న హోం గార్డ్ లకు, ఈ రోజు అంగన్‌వాడి కార్యకర్తలకు, చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో, వారిని ఆదుకుంటున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో తన నివాసంలోని ప్రజాదర్భార్‌ హాలులో సాధికార మిత్రలతో జరిగిన సమావేశంలో ఆయన అంగన్‌ వాడీలపై వరాల జల్లు కురిపించారు. 7500లుగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్ల పైచీలుకు భారం పడుతుందని చెప్పారు.

anganvadi 20062018 2

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండోసారి అంగన్‌వాడీల వేతనాలను పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలోనే అంగన్‌వాడీలందరికీ స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒక్క ఆడపిల్లా చనిపోవడానికి వీల్లేదన్నారు. గర్భిణులు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శిశుమరణాల సంఖ్య తగ్గిందన్నారు. కేరళతో పోల్చి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉందని తాను అభిప్రాయపడుతున్నానన్నారు. చిన్న పిల్లలు చనిపోకుండా ఉండాలనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.. ప్రభుత్వ ఆస్పత్రిల్లో డెలివరీల సంఖ్య పెరగడంతో పాటు పిల్లలకు టీకాలు వేసే విధానంలోనూ ఇంకా మెరుగుదల రావాలని సూచించారు.

anganvadi 20062018 3

అలాగే వివిధ పధకాల పై కూడా మాట్లడారు.. "చంద్రన్న పెండ్లి కానుక ఆర్ధిక చేయూత ఇవ్వడం జరుగుతున్నది. ఏప్రిల్ 1 న ప్రారంభించిన చంద్రన్న పెండ్లి కానుక కోసం ఇప్పటి వరకు 14601 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 90 శాతం వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. పాఠశాల విద్యా కమిషనర్ విద్యా సంవత్సరం లో రూ.4800 కోట్ల తో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల చేసారు. బయో మెట్రిక్ హాజరు వల్ల ఉపాద్యాయులు హాజరు 98 శాతం ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు వల్ల డ్రాప్ ఔట్స్ జీరో శాతానికి చేరగలిగాము.ఇకపై విద్యార్థిని, విద్యార్థులకు ఇకపై ఇచ్చే 3 గుడ్లకు బదులు 5 గుడ్లకు పెంచడం జరుగుతున్నది. సాధికార మిత్రాల పనితీరుపై పోటీ పెడతాను. 4 లక్షల 62 వేల మంది సాధికార మిత్రాలు త్వరలో నే స్మార్ట్ ఫోన్లు అందచేస్తాను" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి మరో ఫలితం వచ్చింది. ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ లోహియా ఆటో దక్షిణ భారతంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నది. 7 బిలియన్ డాలర్ల విలువైన లోహియా గ్లోబల్ కు చెందిన లోహియా ఆటో ఇండస్ట్రీస్, తన మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పటానికి సిద్ధమైంది. లోహియా ఆటో సిఇఓ ఆయుష్ లోహియా మాట్లాడుతూ, దక్షినాదిన మా ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ స్థలాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు, కర్ణాటకన, తెలంగాణా రాష్ట్రాలు పోటీ రాగా, లోహియా మాత్రం, ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపింది. ఈ ప్రాజెక్టుకు సుమారు 50-75 ఎకరాల భూమి అవసరమవుతుంది, ఒక బిలియన్ వరకు పెట్టుబడి పెడుతున్నామని లోహియా ఆటో సిఇఓ ఆయుష్ లోహియా అన్నారు.

lohia 20062018 2

లోహియా ఆంధ్రప్రదేశ్ లో కనుకు ప్లాంట్ ఏర్పాటు చేస్తే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టిన ఆటో బ్రాండ్లు కియా, హీరో, ఐసుజు, అశోక్ లేల్యాండ్ సరసన చేరుతుంది. వీరే కాదు, ఇప్పటికే ఆటో-విడి భాగాలు తయారీదారులు కూడా ఆంధ్రప్రదేశ్ లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. లోహియా కొత్త ప్లాంట్ 100,000 యూనిట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. మూడు సంవత్సరాలలో 300,000 యూనిట్లు వరకు చేరుకునే అవకాసం ఉంది. దేశీయ మరియు విదేశీ మార్కెట్ల కోసం, EV లు, మోటార్ సైకిల్స్ మరియు గ్యాసోలిన్ వాహనాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది.

lohia 20062018 3

ఈ ప్లాంట్ 2020-21 నాటికి సిద్ధం చేసేలా ప్రణాలికలు రచిస్తున్నారు. ఈ కొత్తప్లాంట్ లో విద్యుత్, డీజిల్ వాహనాలు తయారు చేస్తారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని కాశీపూర్ ప్లాంట్ నుండి 100,000 యూనిట్ల వరకు, రెండు, మూడు చక్రాల వాహనాలను లోహియా ఆటో, ప్రతి సంవత్సరం తయారు చేస్తుంది. హంఫాఫర్ DLXP గ్యాసోలిన్ వాహనాలను, నేపాల్, బంగ్లాదేశ్లకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 35 వేల వాహనాలు అమ్ముడవగా, దీంట్లో సంస్థ 12 వేల యూనిట్లు విక్రయించింది. ప్రస్తుతం రూ.30 నుంచి 35 వేల మధ్య ధర కలిగిన నాలుగు స్కూటర్లను సంస్థ విక్రయిస్తున్నది. వీటిని ఒక్కసారి రీచార్జి చేస్తే 80 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణం చేయవచ్చును. హమ్‌రాహి పేరుతో రూపొందించిన ఈ-రిక్షాలు కూడా త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి. మొత్తానికి, మరో పెద్ద కంపెనీని, ఆంధ్రప్రదేశ్ ఆకట్టుకుంది.

కొన్ని దశాబ్దాలుగా ఆ కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసిన రమణ దీక్షితులు, గత కొన్ని రోజులుగా అమిత్ షా సేవలో తరించటం చూసాం, జగన్ ఇంటికి వెళ్లి ఆశీర్వదించటం చూసాం, ఇప్పుడు ఏకంగా అన్యమతస్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న దీక్షితులు, మరోసారి తెర పైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తప్ప, అన్ని చోట్లా ప్రెస్ మీట్లు పెట్టే ఆయన, ఈ రోజు హైదరాబాద్ లో పెట్టారు. చంద్రబాబు పై మరోసారి ఆరోపణలు చేసేందుకు హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రమణ దీక్షితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని క్రిస్టియన్ ప్రతినిధి బోరుగడ్డ అనిల్ ఆర్గనైజేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు.

deekshitulu 20062018 2

సైమన్ అమృత్ ఫౌండేషన్ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను అనిల్ నిర్వహిస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఇతను.. సైమన్ అమృత్ ఫౌండేషన్ సంస్థకు సీఈవో, ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. మీడియా సమావేశంలో రమణ దీక్షితులు వెనుక అనిల్ ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ బోరుగడ్డ అనిల్, మత ప్రచారం మాత్రమే కాదు, నేరాలు కూడా చేస్తూ ఉంటాడు. గతంలో అమరావతిలో భూ వివాదంలో డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప పేరు చెప్పుకొని పలు నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తితో రమణ దీక్షితులుకి సంబంధం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

deekshitulu 20062018 3

ప్రస్తుతం గుంటూరులోని వల్లూరివారి తోటలో… భీం సేన పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించారు. భీంసేన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ బోరుగడ్డ అనిల్ రమణ దీక్షితులుకు అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ.. శ్రీవారి సేవల గురించి ప్రెస్‌మీట్ లో అనిల్ బాధపడ్డారు. రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేస్తారని కూడా తనే ప్రకటించారు. 24 ఏళ్లపాటు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలందించిన రమణ దీక్షితులు.. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంతో టీటీడీ ఆయనకు రిటైర్మెంట్ ప్రకంటించింది. అప్పటి నుంచి రమణ దీక్షితులు తన ఆరోపణలను మరింత ముమ్మరం చేశారు. లోటస్‌పాండ్ వెళ్లి జగన్‌ను కలిశారు. నాడే అన్యమతస్తుల ఇంటికి ఎలా వెళ్తారనే విమర్శలు వచ్చాయి. అయినా రమణ దీక్షితులు తనను తాను సమర్థించుకున్నారు. తన పొట్ట ఎవరు నింపితే వారిని కలుస్తానని ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేరుగా మత ప్రచార సంస్థ నిర్వాహకులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడం వివాదాస్పదమవుతోంది.

Advertisements

Latest Articles

Most Read