చేసింది అంతా చేసారు. అటు రాష్ట్రాన్ని నాశనం చేసారు, ఇటు ప్రజలను ఇబ్బందులు పెట్టారు. బయటకు రాకుండా ఊహల్లో బ్రతికారు. ఇప్పుడు వాస్తవం తెలిసి లబోదిబో అంటూ హడావిడి చర్యలు మొదలు పెట్టారు. ఇది జగన్ మోహన్ రెడ్డి గారు గత వారం రోజులుగా ప్రవతిస్తున్న తీరు. రియాలిటీలోకి వచ్చారని భావించినా, ఇప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయిందని, ఇక వెనక్కు రావటం కష్టమే అనే భావన ప్రజల్లో ఉంది. ఇక విషయాని వస్తే, జగన్ మోహన్ రెడ్డి గత మూడేళ్ళుగా బయటకు వచ్చింది లేదు చేసింది లేదు. ఆయన లోపలే ఉంటూ, అంతా సూపర్ అంటూ భ్రమల్లో ఉండే వారు. నా పాలనలో అందరూ సంతోహంగా ఉన్నారని ఆయన భావన. ఎవరు తప్పులు ఎత్తి చూపినా, వారిని శత్రువులుగా ఉన్మాదులుగా చూసేవారు. చివరకు ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, సొంత పార్టీ ఎంపీని కొట్టే దాకా వెళ్ళింది. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అపాయింట్మెంట్ కూడా ఉండేది కాదు. అలా ఊహా లోకాల్లో విహరిస్తూ, 30 ఏళ్ళ వరకు నాకు తిరుగు లేదు అంటూ, జగన్ మోహన్ రెడ్డి బ్రతికేసేవారు. అయితే మొత్తానికి ఆయన రియాలిటీలోకి వచ్చారు. భ్రమలు తొలగిపోయాయి. వాస్తవం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అందుకే ఉన్నట్టు ఉండి జగన్ లో మార్పు కనిపిస్తుంది.
మూడేళ్ళ తరువాత, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. ఇప్పటి వరకు ఎంజాయ్ చేసింది చాలు, ఇక ఇంటిఇంటికీ తిరగాలని ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇన్నాళ్ళు మనం ప్రజల్లో లేమని, ఆయనే చెప్తున్నాడు. ఇక 50 మంది ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉందని జగనే చెప్తున్నారు. బయటకు 50 మంది మీద వ్యతిరేకత అంటే, లోపల ఇంకా రిపోర్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మూడేళ్ళకే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని జగన్ గమనించారు. ముఖ్యంగా జగన మోహన్ రెడ్డికి వచ్చిన సర్వే రిపోర్ట్ లో దారుణమైన ఫలితాలు ఉండటం, రెండు మూడు సర్వే సంస్థలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయటంతో, జగన్ మోహన్ రెడ్డి వాస్తవంలోకి వచ్చారు. అందుకే రెండేళ్ళ ముందు నుంచి, ఎన్నికలు ఎన్నికలు అంటూ పాట పాడుతున్నారు. దారుణమైన ఆర్ధిక పరిస్థితికి తోడు, దారుణమైన పాలన తోడయ్యి, జగన్ ప్రభుత్వం రోజు రోజుకీ ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఈ పరిస్థితిలో, ప్రజల వద్దకు వెళ్ళటం ఒక్కే మార్గం అని జగన్ మోహన్ రెడ్డి గమనించి, దిద్దుబాట చర్యలు మొదలు పెట్టారు.