నిన్నటి నుంచి ఏపి రాజకీయాలు జంగారెడ్డి గూడెం చుట్టూ తిరుగుతున్నాయి. కల్తీ నాటు సారా తాగి 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. లిక్కర్ రేట్లు తట్టుకోలేక, చాలా చోట్ల, సారా వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ సారాని ఇష్టం వచ్చినట్టు కెమికల్స్ కలిపి, తక్కువ రేటుకు ఎక్కువ కిక్ వచ్చేలా చేసి, కల్తీ చేసి పెడుతున్నారు. వాలంటీర్లు కూడా సారా కాస్తూ పట్టుబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ అండదండలతో, ఈ నాటు సారా మాఫియా కొనసాగుతుంది. అయితే నిన్న జరిగిన ఘటనలో, అంత మంది చనిపోవటంతో, సహజంగా అటు వైపు ఫోకస్ వస్తుంది. ఈ నేపధ్యంలోనే నిన్న చంద్రబాబు అటు వెళ్ళటం, బాధితులతో మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున సభలో చర్చకు పెట్టటం, ఇవన్నీ జరిగాయి. ప్రజల్లో దీని పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లిక్కర్ రేట్లు పెరగటంతో, నాటు సారా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిన ప్రజలు కూడా ఈ విషయానికి కనెక్ట్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఈ విషయంలో స్పందించిన ప్రభుత్వం, ఈ మరణాలు అన్నీ కూడా నాటు సారా తాగి చనిపోయిన వారి మరణాలు కాదని, ఇవన్నీ కూడా సహజ మరణాలు అని, తెలుగుదేశం పార్టీ వారిని తీసుకుని వచ్చి గోల చేస్తుందని ఆరోపిస్తున్నారు.
ఈ రోజు అయితే, ఏకంగా వాళ్ళు ఏడవటం లేదు, మీకెందుకు ఏడుపు అని ఒకరు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్లకు డబ్బులు ఇచ్చి, ఈ ఆట ఆడిస్తుంది అంటూ మరొకరు, బాధితుల పట్ల మానవత్వం లేకుండా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తుంది అంటూ, విమర్శలు చేసారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తుంది వైసీపీ. అయితే, ఇది ఇలా ఉంటే, దీనికి తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. అసలు శవ రాజకీయం చేసింది ఎవరూ అంటూ, గతంలో వైఎస్ఆర్ చనిపోయిన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, ఎక్కడో చనిపోయిన వారికి 5 వేలు ఇచ్చి, వారిని వైఎస్ఆర్ ఖాతాలో వేసి, ఓదార్పు యాత్ర చేసిన విషయాన్ని, అప్పట్లో వచ్చిన ఒక ఇంగ్లీష్ ఛానెల్ కధనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అలాగే వివేక మరణాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎలా వాడుకుంది కూడా, టిడిపి కౌంటర్ ఇచ్చింది. అంతే ఒక్క దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయ్యింది. మొత్తానికి శవ రాజకీయాలు అంటూ వైసీపీ చేసిన ప్రాపగాండాని, టిడిపి తిప్పి కొట్టింది.