అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు కియా మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఇది విని మన రాష్ట్ర ద్రోహులు కుయ్యో మొర్రో అనటమే... అనంతపురంలో నిర్మిస్తున్న ప్లాంట్‌లో ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ కార్లను కూడా తయారు చేయాలని దక్షిణ కియా యోచిస్తోంది. 2021నాటికి ఎలక్ర్టిక్‌ వాహనాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంతో కంపెనీ ఉంది. కియా మోటార్స్‌ కార్పొరేషన్‌కు చెందిన కియా మోటార్స్‌ ఇండియా వచ్చే మూడేళ్ల కాలంలో దేశీయ మార్కెట్లో మూడు మోడళ్లను విడుదల చేయానుకుంటోంది. వీటి ద్వారా దేశీయ మార్కెట్లోకి కంపెనీ ప్రవేశిస్తుంది. మొద ట ఎస్‌యువి, ఎస్‌పి కాన్సె్‌ప్టలను విడుదల చేస్తుంది. వీటిని ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

kia 12062018 2

‘‘అనంతపురం ప్లాంట్‌లో ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ వాహనాలను తయారు చేయాలనుకుంటున్నాం’’ అని కియా మోటార్స్‌ ఇండియా సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కూక్‌ హ్యున్‌ షిమ్‌ పిటిఐ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎలక్ర్టిక్‌ కార్ల మార్కెట్లో మార్గదర్శిగా ఉండాలనుకుంటున్నామని, ఇందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే 2021నాటికి పూర్తి ఎలక్ర్టిక్‌ వాహనాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్‌ పేర్కొన్నారు. తాము ఇప్పటికే ఎలక్ర్టిక్‌ వాహనాలను యూరప్‌ , అమెరికా మార్కెట్లలో విక్రయిస్తున్నామని, వీటికి సంబంధించిన మొత్తం టెక్నాలజీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. చార్జింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, బ్యాటరీ లైఫ్‌ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సమస్యలు 2021నాటికి పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడేళ్లకాలంలో మూడు మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్‌ పేర్కొన్నారు.

kia 12062018 3

తమ గ్లోబల్‌ పోర్ట్‌ఫోలియోలో 16 బ్రాండ్స్‌ ఉన్నాయని, వీటిలో ఏ మోడల్‌ను భారత మార్కెట్లోకి లోకలైజేషన్‌ తర్వాత విడుదల చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎస్‌యువి, ఎంపివి మార్కెట్లో కియా ఇప్పటికే సత్తా చాటుకుంటోందని, ఇలాంటి వాహనాలకు భారత మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ ఉందని షిమ్‌ పేర్కొన్నారు. హ్యాచ్‌బ్యాక్స్‌, కాంపాక్ట్‌ కార్లు కూడా తమ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా కియా వాహనాలను అందుబాటులో ఉంచాలనుకుంటున్నామని, ఇందులో భాగంగా సరైన డీలర్‌ పార్ట్‌నర్లను ఎంపిక చేసే ప్రక్రియ సాగుతోందని ఆయన చెప్పారు. 120 మంది సప్లయర్లతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. తమ ప్లాంట్‌లో హ్యుండయ్‌ కంపెనీ కార్లను తయారు చేసే అవకాశం ఉండదన్నారు. కియా కార్లకు భారత్‌లో అధిక డిమాండ్‌ ఉంటుందని ఆశిస్తున్నామని, కంప్లీట్లీ నాక్డ్‌ డౌన్‌ (సికెడి) రూపంలో విడిభాగాలను తెచ్చి ఇక్కడి ప్లాంట్‌లోనే కొన్ని మోడళ్లను అసెంబుల్‌ కూడా చేస్తామని ఆయన చెప్పారు.

నిన్న పోలవరంలో రెండు అద్భుతమైన వార్తలు వినిపించాయి.. అసాధ్యం సుసాధ్యమైంది .. ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 55 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటుతుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రతిపాదనలను, ఎందరో పాలకులను చూసిన పోలవరం ఇన్నాళ్ల కు సగానికిపైగా పనులు పూర్తి చేసుకుంది.

media 12062018 2

ఈ క్రమంలో నిన్న అద్భుతం జరిగింది... పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం నిన్నటితో పూర్తైంది. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి 412 రోజులు బాగా శ్రమించి రూ.430 కోట్లతో ఈ పనిని పూర్తి చేశారు. నిర్మాణం పొడవు మొత్తం 1396.60 మీటర్లు. వెడల్పు 1.5 మీటర్లు (ఐదు అడుగుల మందం). నదీ గర్భం లోతు 40 మీటర్ల నుంచి 93.50 మీటర్లు ఉంటుంది. లోపల రాయి తగిలే వరకు వెళ్లడంతో సరిపెట్టలేదు. రాయి తగిలిన తరువాత అందులోనే మరో రెండు మీటర్ల దిగువకు వెళ్ళి అక్కడ నుంచి కాంక్రీట్‌ వేసుకుంటూ వచ్చారు. మరో పక్క నవయుగ సంస్థ నిన్న రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 11,158 క్యూ.మీ. కాంక్రీట్ వేయడం రికార్డు సృష్టించారు.

 

media 12062018 3

దీంతో రాష్ట్ర ద్రోహులకు, రాష్ట్ర వినాశనం కోరుకునే వారి కన్ను కుట్టుంది.. సోమవారం, పోలవరం వార్తలతో, న్యూస్ చానల్స్ అన్నీ నిండిపోతాయని, చంద్రబాబు చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారని, దశాబ్దాల ప్రాజెక్ట్, కేవలం చంద్రబాబు వల్లే ముందుకు వెళ్లి, కలగా ఉన్న ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాలుస్తుందని, రైతులు గుర్తిస్తారని, అందుకే టీవీ చానల్స్ లో, పోలవరం వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండటానికి, ఈ రాష్ట్ర ద్రోహులు ఒక ఐడియా వేసారు.. మెంటల్ బాగా ఉన్న ఒక మెంటలోడిని దీని కోసం సెలెక్ట్ చేసారు. ఈ మెంటలోడు హైదరాబాద్ లో కూర్చుని బూతులు తిట్టాడు.. ఇక మన రాష్ట్రంలో, ఈ మెంటలోడికి తోడు, బీజేపీ ధర్నా చేసింది. ముద్రగడ ప్రెస్ మీట్ పెట్టాడు.. పురంధేశ్వరి ప్రెస్ మీట్ పెట్టింది, విజయసాయి రెడ్డి మోత్కుపల్లి దగ్గరకు వెళ్ళాడు, ఇలా అన్ని విధాలుగా, పోలవరం ప్రాజెక్ట్ సాధించిన ఘనత గురించి ప్రజలకు తెలియకుండా, ప్రచారం రాకుండా చెయ్యటానికి ట్రై చేసారు.. కాని, వీరి పప్పులు ఉడకలేదు... ప్రజలు పోలవరం సాధించిన ప్రగతి, చంద్రబాబు కష్టం గుర్తించారు...

గత కొన్ని రోజులుగా, జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్... ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది... కేంద్రానికి వదిలి పెట్టచ్చు కదా... వారు చెయ్యకపోతే, వారినే నిందించ వచ్చు అని అన్నారు... దీని పై లోకేష్ అదిరిపోయే ట్వీట్ వేసారు.. 16 జాతీయ ప్రాజెక్ట్ ల వివరాలు పోస్ట్ చేస్తూ, మన రాష్ట్ర పర్యవేక్షణలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ ఎలా పరుగులు పెడుతుందో చూపించారు.. ఇక్కడ చంద్రబాబు, విపక్షాలు లా అలోచించి, నిందలు వేసి, రాజకీయ లబ్ధి కోసం చూడటం లేదు... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కోసం చూస్తున్నారు... అందుకే పోలవరం ప్రాజెక్ట్ బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు... దగ్గర ఉంది ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చేస్తున్నారు.. ఆయన డైరీలో సోమవారం, పోలవారం అయ్యింది... చేసిన పనులకి కేంద్రానికి లెక్కలు చెప్పి, డబ్బులు అడుగుతున్నారు.. దీంట్లో కూడా మీరు చంద్రబాబుని తప్పు పట్టటానికి ఏమి లేదు... కేంద్రం నిర్వహిస్తున్న 15 జాతీయ ప్రాజెక్ట్ ల దారుణ స్థితి ఇది... చంద్రబాబు అందుకే పోలవరం తీసుకుంది... ఆ వివరాలు చూడండి...

lokesh 12062018 2

మన దేశంలో మొత్తం 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినా వాటి పనులు పూర్తి కాలేదు... అసోంలోని కుల్సి డ్యామ్‌, ఏపీలోని పోలవరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నోవా-దిహింగ్‌ ప్రాజెక్టు, అప్పర్‌ సియాంగ్‌ ప్రాజెక్టు, హిమాచల్‌ప్రదేశ్‌లోని రేణుకాడ్యామ్‌, ఉత్తరాఖండ్‌లోని కిషుయా బహళార్థ సాధక ప్రాజెక్టు, జమ్ము కశ్మీర్‌లోని ఉజ్‌, బుర్సార్‌, మహారాష్ట్రలోని గోసిఖుర్ద్‌, యూపీలోని కెన్‌బెట్వా, సరయు నహర్‌ పరియోజన, పంజాబ్‌లోని షాపూర్‌కండి, రవివ్యాస్‌, పశ్చిమ్‌ బంగలోని తీస్తా, ఉత్తరాఖండ్‌లోని లక్వార్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఉన్నాయి... వీటిలో మన పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు, దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది.

lokesh 12062018 3

మొత్తం 16 నీటి పారుదల ప్రాజెక్ట్ ల ప్రస్తుత స్తితి చూస్తే, మన రాష్ట్రం నిర్వహిస్తున్న పోలవరం తప్పితే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిగిలిని అన్నీ ప్రాజెక్ట్ లు అసలు ముందుకు కదలటం లేదు... ఇంకా దారుణం ఏంటి అంటే, 10 ప్రాజెక్ట్ లు కనీసం రిపోర్ట్ దశను కూడా దాటలేదు... మిగిలిన 5 ప్రాజెక్ట్ ల పనులు అసులు జరగటం లేదు... 16 జాతీయ ప్రాజెక్ట్ లలో, మన పోలవరం మాత్రమే, ఈ పరిస్థితిలో ఉంది... దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... అందుకే చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పడినా, తన నెత్తిన వేసుకుని పనులు పూర్తి చేస్తున్నారు... ఇప్పుడు ఇలా లేట్ చేసి, కేంద్రం తన చేతుల్లోకి తీసుకుని, మిగతా 15 ప్రాజెక్ట్ లు లాగా, మన పోలవరం కూడా ఇలాగే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టి, ముఖ్యమంత్రిని సాధించటం కోసం, కేంద్రం ఆడుతున్న డ్రామా ఇది... చంద్రబాబుకి పోలవరం పూర్తి చెయ్యటం చేతకాదు అని ఎగతాళి చేస్తున్న రాష్ట్ర సైకోలుకి ఒక ప్రశ్న... మీ మహా మేత, కాలువలు తవ్వి మట్టి డబ్బులు కొట్టేసాడు కాని, ప్రాజెక్ట్ ఏరియాలో కనీసం 0.1 శాతం పని కూడా ఎందుకు చెయ్యలేదు ? పునరావాసానికి ఒక్క పైసా ఎందుకు ఇవ్వలేదు ? మీది డబ్బులు కొట్టేయాలి అనే సంకల్పం... చంద్రబాబుది ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలనే సంకల్పం...

రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో చెప్పే ఉదాహరణ ఇది.. మరీ ముఖ్యంగా, నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో, పోలీసు వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్ గా పని చేస్తుందో చెప్పే సంఘటన ఇది.. అలా అని అన్నీ 100% పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి అని కాదు కాని, ఉన్న దాంట్లో అద్భుతంగ పని చేస్తున్నారు.. సామాన్యుడి ట్వీట్ తో, పోలీసులకే జరిమానా వేసి, పారదర్శకంగా పని చేసి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో చూపించారు. అదీ కాక, ప్రతి ఒక్క పౌరుడుకీ ఉండే సాధనరణ ప్రశ్న, సామాన్యుడికి ఒక న్యాయం, మీ పోలీసులకు ఒక న్యాయమా అని, ఎదో ఒక సందర్భంలో అందరం అనుకునే ఉంటాం... కాని వైజాగ్ పోలీసులు మాత్రం, సామాన్యుడు అయినా ఒకటే, పోలీసులు అయినా ఒకటే, అందరికీ ఒకే న్యాయం అని మాటల్లో కాదు, చేతల్లో చెప్పి చూపించారు.

vizag 1206201 2

జూన్ 11 తారకు ఉదయం విశాఖపట్నం ఇసుక తోట జుంక్షన్ దగ్గర AP9P8283 అనే వాహనంలో ఇద్దరు పోలీస్ వారు వేగంగా వాహనం నడుపుతూ రెడ్ సిగ్నల్ ఉండగా సిగ్నల్ జంప్ చేసారు. వాళ్ళు చేసిన ఈ పనితో, అక్కడ ఉన్న సామన్య ప్రజలు, వారికి ఒక న్యాయం, మనకి ఒక న్యాయం, మనం ఇలా చేస్తే ఊరుకుంటారు అనుకుంటూ, ఎవరి పని వారు చూసుకున్నారు. కాని అదే సమయంలో అక్కడ ఉన్న ఆదిత్య అనే వ్యక్తి మాత్రం, అందరిలా చూస్తూ ఊరుకోలేదు. వెంటనే ట్విట్టర్ ద్వరా వైజాగ్ పోలీసులకు ట్వీట్ చేసారు. 5 నిమషాల క్రితం, ఇసుక తోట సెంటర్ లో, ఇద్దరు పోలీసులు, అతి వేగంతో, సిగ్నల్ జంప్ చేసారు, కొద్దిలో ఆక్సిడెంట్ మిస్ అయ్యింది, CCTV చూసి, తగు ఆక్షన్ తీసుకోండి అంటూ, ట్వీట్ చేసారు.

vizag 1206201 3

ఇక్కడ ఆదిత్య చేసింది, ఒక ట్వీట్ మాత్రమే. ఫోటో కూడా పెట్టలేదు. అయినా వైజాగ్ పోలీసులు, ఆ పౌరుడు చెప్పిన విషయాన్ని క్రాస్ చెక్ చేసారు. చెప్పిన టైం , ప్లేస్ ప్రకారం, ఆ సిసి టీవీ ఫూటేజ్ చూసారు. ఆదిత్య అనే సామాన్యుడు చెప్పిన విషయం, కరెక్ట్ అని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆ వాహనానికి ఫైన్ వేసారు. ఇదే విషయం ట్విట్టర్ ద్వారా ఆదిత్య అనే పౌరుడుకి తెలియచేసారు. యువర్ ఆక్షన్, అవర్ రియాక్షన్ అంటూ, మీరు పెట్టిన ట్వీట్ నిర్ధారించుకున్నాం. ఆ వాహనం 3 టౌన్ పోలీస్ స్టేషన్ దిగా గుర్తించాము, సిగ్నల్ జంప్ అయినందుకు వాహనం పై 1035 రూపాయిల ఫైన్ విధించాము, రూల్స్ ఆర్ రూల్స్, థాంక్స్ అంటూ ఆ పౌరుడికి విషయం తెలియచేసారు. కేవలం ఒక సామాన్యుడు చెప్పిన విషయం నమ్మి, నిర్ధారణ చేసుకుని, పోలీసులు ఆక్ట్ చేసిన విధానం హర్షణీయం. ప్రతి సారి ఇంతే అలెర్ట్ గా మన పోలీసులు ఉండాలని కోరుకుందాం..

Advertisements

Latest Articles

Most Read