ఇప్పటివరకు నలభై శాతం పైగా పనులను పూర్తి చేసుకున్న బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ రానున్న నవంబర్ నెల నాటికి ముగించటానికి వీలుగా నిర్దేశించుకున్న రోడ్డు మ్యాప్ ప్రకారం సమాంతరంగా నాలుగు ప్రధాన పనులు జరగతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనుల కంటే ఇక మీదట పనులు వేగంగా జరగనున్నాయి. ప్రధానంగా వయాడక్ట్ నిర్మాణానికి సంబంధించి గడ్డర్ల ఏర్పాటు, బ్యాలెన్స్ పిల్లర్ల నిర్మాణం, అప్రోచ్ పనులు, బెంజిసర్కిల్ దగ్గర పిల్లర్ల ఏర్పాటు వంటి పనులు మొదలయ్యాయి. ఫ్లై ఓవర్‌ పిల్లర్లకు అనుసంధానంగా కీలకమైన వయాడక్ట్‌ నిర్మాణంలో భాగంగా గడ్డర్ల పనులను అర్ధరాత్రి కాంట్రాక్టు సంస్థ చేపట్టింది. ఇప్పటికి నాలుగు గడ్డర్లను అమర్చారు. ప్రతిరోజూ రెండు గడ్డర్ల చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు భారీ క్రేన్లతో అర్థరాత్రి సమయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా గడ్డర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో తెల్లవారుఝామున చూసే సరికి కొత్తగా కనిపిస్తోంది

benzcircle 12062018 2

ఎస్‌వీఎస్‌ కళ్యాణమండపం దగ్గర పీ1-పీ2 పిల్లర్ల పై ప్రస్తుతం గడ్డర్ల ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి వరుసగా రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల మీద క్రమంగా గడ్డర్లను ఏర్పాటు చేసుకుంటూ వెళతారు. పెనమలూరులోని క్యాస్టింగ్‌ డిపో నుంచి నిర్దేశించుకున్న రూట్‌ ప్లాన్‌ ప్రకారం ట్రాలీలపై గడ్డర్లను బెంజిసర్కిల్‌కు తీసుకు వస్తున్నారు. రాత్రి 11గంటల ప్రాంతంలో ట్రాఫిక్‌ను హైవే ఒక వైపుకు పరిమితం చేస్తున్నారు. హైవేను వన్‌వే చేశారు. ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగలేదు. అర్ధరాత్రి తర్వాత 1-3 గంటల మధ్యన గడ్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. బెంజిసర్కిల్‌ నిర్మాణానికి సంబంధించి మొత్తం 240 గడ్డర్లను అమర్చాల్సి ఉంది.

benzcircle 12062018 3

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి మొత్తం 49పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి మొత్తం 30 పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఇంకా 19 పిల్లర్లు వివిధ దశలలో ఉన్నాయి. జూలై నెలాఖరుకు ఇవి పూర్తవుతాయి. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ అప్రోచ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఎస్వీఎస్ జంక్షన్ దగ్గర, రమేష్ హాస్పిటల్స్ దాటిన తర్వాత రెండు అప్రోచ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండు చోట్ల అప్రోచ్ లను వేయటానికి నేల చదును జరిగింది. అప్రోచ్ పనులను ముందుగా ఎస్వీఎస్ జంక్షన్ నుంచి ప్రారంభించారు. బెంజిసర్కిల్ దగ్గర 9, 10 పిల్లర్లను ఏర్పాటు చేయటానికి ప్రత్యేకంగా బ్యారికేడింగ్ చేపట్టనున్నారు. బ్యారికేడింగ్ ఏర్పాటుకు ఎన్ హెచ్, పోలీసు ఉన్నతాధికారులు జాయింట్గా పరిశీలించారు. రెండు రోజుల్లో బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి పిల్లర్ల పనులు ప్రారంభిస్తారు.

మొత్తం అమరావతికేనా అనే వారికి, ఇలాంటివి అసలు కనపడవు.. కనిపించినా, పక్కన పడేస్తారు... చంద్రబాబు చొరవతో, తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్ గా తయారవుతుంది. ఇప్పటికే తిరుపతి మొబైల్ తయారీ హబ్ గా తయారయ్యింది... ఇప్పటికే సోలార్ ప్యానెల్స్ తయారీ మొదలు పెట్టారు... ఇప్పుడు లిథియమ్ అయాన్ బ్యాటరీలు కూడా తిరుపతిలోనే తయారుకానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీకి లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్రాజెక్టు రాబోతోంది. మనోత్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ రూ.799 కోట్లతో తిరుపతిలో కంపెనీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇదొక్కటి వస్తే మరిన్ని మొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మనోత్ ఇండస్ట్రీస్ తొలి విడతలో రూ.165 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

tirupati 12062018 2

అందులో భాగంగా రోజుకు 2 లక్షల ఏహెచ్(ఆంపియర్ అవర్) నిల్వ సామర్థ్యంతో లిథియమ్ ఐయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే ఇది అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ పరిశ్రమకు లిథియమ్ అయాన్ బ్యాటరీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో మొత్తం 120 కంపెనీలు మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో 20 మాత్రమే బ్యాటరీ ప్యాక్ యూనిట్లు కలిగి ఉన్నాయి. మిగతా కంపెనీలు బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి. మనోత్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోయే బ్యాటరీ కంపెనీ మొత్తం సామర్థ్యం రోజుకు మిలియన్ ఏహెచ్‌లు. 1700 మందికి ప్రత్యక్షంగా, వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

tirupati 12062018 3

ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ సంస్థ ప్రతినిధులు ఇలా చెప్పారు... “As a core component shall be manufactured in India, the natural corollary of this will be that there will be an increase in the value addition of the battery pack and eventually the mobile handset. An ecosystem of SME start-ups around Lithium ion products will also be planned. In order to deepen and widen the components manufacturing eco-system in India Government of India notified the phased manufacturing program (PMP) on April 28, 2017. This sent a clear signal to the investors and manufacturers that government was/is serious to promote mobile handset manufacturing in the country”

ఒక పక్క ప్రత్యెక హోదా పై నిలదీశారు... దొలేరో నగరం గుట్టు విప్పి, అమరావతి ఏమి పాపం చేసిందని ప్రశ్నించారు... రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర బీజేపీ నేతలు చెప్తున్న కాకమ్మ కధల గుట్టు విప్పారు.. జీవీఎల్ లాంటి నేతలను, మహా మూర్తి లైవ్ లో కడిగిపారేస్తే, ఏమి చెయ్యాలో తెలియక నీది తెలుగుదేశం ఛానల్ అంటూ ఎదురు దాడి చేసారు. మా ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, మేము ప్రశ్నిస్తుంటే, మీకు మేము పచ్చ చానల్స్ అయ్యామా అంటూ మహా మూర్తి అడిగే ప్రశ్నలకు ఒక్క బీజేపీ నాయకుడు దగ్గర సమాధానం లేదు.. ఇక మహా మూర్తిని అడ్డుకోవటం తమ వళ్ల కాదని, ప్రతి రోజు ఆయన చేసే ర్యాగింగ్ తట్టుకోలేమని, మహా మూర్తి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని బీజేపీ అంచనాకు వచ్చి, ఒక నిర్ణయం తీసుకుంది. అదే మహామేత వైఎస్ ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం...

mahaa 11062018 2

ఆ రెండు పత్రికలు అని ఎలా వైఎస్, రెండు పేపర్లను చూడద్దు అన్నాడో, అలాగే ప్రజల గొంతుకుగా ఉన్న మీడియాపై బీజేపీ పార్టీ జులుం చూపించింది
. బీజేపీ ఇచ్చిన హామీలు నేరవేర్చని కారణంగా దాన్ని ప్రశ్నించినందుకు మహా న్యూస్ ని బాయ్ కాట్ చేసింది. ఐదు కోట్ల మంది ప్రజలు పక్షాన పోరాటం చేసినందుకు మీడియాకి దొరికిన ఒక అరుదైన గౌరవం ఇది. ఇక మీదట బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహా న్యూస్ చర్చ కార్యక్రమాలకు మరియు ఇతర కార్యక్రమాలకు హాజరు కాకూడదని తీర్మానం చేసుకున్నారు విజయవాడ వేదికగా జరిగిన బీజేపీ రాష్ట్ర స్ధాయి సమావేశంలో మహా న్యూస్ పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు...ఏపీ హక్కుల కోసం ప్రజల తరపున పోరాటం చేస్తున్న మహా న్యూస్ ఛానెల్ ని బీజేపీ పార్టీ బాయ్ కాట్ చేయాలని తీర్మానించారు...వాళ్ళు ఇచ్చిన హామీలను నేరవేర్చలేక, ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ని ప్రశ్నించినందుకు మహా న్యూస్ కి బీజేపీ పార్టీ ఇచ్చిన గౌరవం ఇది..

mahaa 11062018 3

ప్రజల పక్షాన నిలబడి, ప్రతి జిల్లాలో ఢిల్లీతో డి ఆంధ్ర రెడీ కార్యక్రమంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజల గొంతుకై పోరాటం చేయినందుకు బీజేపీ పార్టీ మహా న్యూస్ కి గొప్ప సన్మానం చేసింది...బీజేపీ పార్టీ చేస్తున్న తప్పులను, ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల తరపున ప్రసారం చేసినందుకు ఈవిధంగా ముర్కంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేసినట్టే...మహా న్యూస్ డిబేట్స్ కి బీజేపీ నాయకులు వస్తే ఏపీ కి బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చలేక పోయారని ప్రశ్నిస్తున్నారని , వాటికి వారి దెగ్గర సమాధానం లేకపోయేసరికి ఈవిధంగా మొహం చాటేస్తున్నారు... అయితే మహా న్యూస్ మాత్రం, వీరికి గట్టిగా సమాధానం ఇచ్చింది... బీజేపీ పార్టీ బెదిరింపులకు మేము బెధరం, అధరం, మేము ఇప్పుడు, ఎప్పుడు , ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాము అని చెప్పింది.

ఎవరి మీద తొందరగా నోరు జారకుండా, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే చంద్రబాబు, తన సహజ శైలికి భిన్నంగా, నాయకుల పై ఫైర్ అయ్యారు... పత్రికలకు ఎక్కి తన్నుకు చావద్దు అంటూ ఒకింత కఠినంగానే వాయించారు. నిన్న అమరావతిలో, కడప పార్లమెంట్‌ నేతలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా కడపలో, తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్న వర్గ పోరు గురించి ప్రస్తావన రాగానే, చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. నేను ఒక పధ్ధతి ప్రకారం, అన్ని పనులు చేసుకుంటూ వస్తుంటే, మీరు దాన్ని చెడగోట్టటమే పనిగా పెట్టుకున్నారు అంటూ అందుకున్నారు. ఇంత మంది ఉన్నా వేస్టే. ఇది మంచిపద్ధతి కాదు. ఎంతో కష్టపడాల్సిన సమయంలో ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగి పార్టీ పరువు తీస్తుంటే చూస్తుంటారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు ఎందుకు ఉండేది. తిని కూర్చునేందుకా? ఇది మంచిపద్ధతి కాదు అంటూ సీఎం సీరియస్‌ అయ్యారు.

cbn 12062018 2

కలిసి పని చేయకపోతే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవు.... పత్రికలకు ఎక్కి తన్నుకు చావద్దు... ఒకరిద్దరిని వదలుకోడానికి సిద్ధమే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పని చేశారు. ఇప్పుడు మీకేమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు కడప జిల్లా నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కడప జిల్లాలో చేపడుతున్నాం. కలిసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన వారే పత్రికలకు ఎక్కి పరువు తీస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకోవాలి తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడంతో మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఏమైంది మీకు? ఎన్నికల ముందు విభేదాలు సృష్టించుకుంటే ప్రజలు నమ్ముతారా? నెంబర్‌ వన్‌ స్థానంలో కడప జిల్లా ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. నాయకులు చేసే చిన్న చిన్న పొరపాట్లకు పార్టీ నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక సహించేది లేదంటూ ఇన్‌చార్జ్‌ మంత్రి సోమిరెడ్డిని ఏమి చేస్తున్నారంటూ సీఎం ప్రశ్నించారు.

cbn 12062018 3

నిధులు ఎంత అవసరమో అంతా ఇచ్చాం. పదవులు ఇచ్చాం. అన్ని ఇచ్చినా సమన్వయంతో లేకపోవడంతో విభేదాలతో పత్రికలకు ఎక్కి తన్నుకుంటున్నారు. ఇక ఇలాంటివి పునావృతం కాకూడదు. కడపలో ఓ పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. హార్టికల్చర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చే సేందుకు అన్ని రీతుల్లో చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అందరూ కోఆర్డినేషన్‌తో పనిచేయాలి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలి. కార్యకర్తల విషయంలో వివక్ష ఉండకూడదు. ఈ బాధ్యతను ఇన్‌చార్జ్‌ మంత్రి, జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షుడులు పర్యవేక్షించాలి. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరూ కష్టపడి పని చేయాలి. మంచి ఫలితాలే రాబట్టాలి. ఇప్పటి నుంచే విధి విధానాలతో ముందుకు నడవాలి అంటూ నేతలకు సీఎం క్లాస్‌పీకారు.

Advertisements

Latest Articles

Most Read