రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని, మాట ఇచ్చిన ప్రకారం మీరే ఆదుకోవాలి అంటూ, జనవరి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధని మోడీని కలిసారు. దాదాపు 110 పేజీల నివేదిక, ప్రతి అంశం పై ఇచ్చారు. ఎధావిధగా, మీరు ఫ్లైట్ దిగి అమరావతిలో దిగే లోపే, ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అంటూ ప్రధాని మాటలు చెప్పి పంపించారు. ఏ మార్పు లేకపోవటం, అసలు సమస్యలు తీర్చకపోగా, మరింత ఎక్కువగా ఇబ్బంది పెట్టటంతో, ఎన్డీఏ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేశారు చంద్రబాబు. అప్పటి నుంచి, ప్రాధాని మోడీనే లక్ష్యంగా, విమర్శలు గుప్పిస్తూ, ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇంత ధీటుగామ, మోడీ లాంటి శక్తివంతమైన నేతను డీ కొట్టని విధంగా, పోరాటం చేస్తున్నారు. మరో పక్క బీజేపీ నేతలు కూడా, అబద్ధాలు చెప్తూ, విష ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, విడిపోయిన తరువాత, మొదటి సారి మోడీ-బాబు ముఖాముఖి కాబోతున్నారు.

modi cbn 09062018 2

దేశంలో, రాష్ట్రాలు ఎదుర్కుంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరగటం, ఫెడరల్ స్పూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తుంది అనే విమర్శలు రావటంతో, కేంద్రం దిగి వచ్చింది. ఈ నెల 16వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను రావాల్సిందిగా కబురు పెట్టింది. ఈ నెల 16వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ సాధారణ మండలి సమావేశం ఇందుకు వేదిక కానుంది. 16న జరిగే సమావేశంలో ప్రధానిని చంద్రబాబు అడగాల్సినవన్నీ అడిగేసే అవకాశం కూడా ఉంది. ఈ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో పాలుపంచుకోవాలని చంద్రబాబు కూడా నిర్ణయించారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీ, రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో నీతి ఆయోగ్‌కు కేంద్రం ఇచ్చిన టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌(టీవోఆర్‌)పై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మన రాష్ట్రంతో పాటు కేరళ, పశ్చిమ బంగా, ఢిల్లీ, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలు గళమెత్తాయి.

modi cbn 09062018 3

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ విమర్శిస్తోంది. నీతి ఆయోగ్‌ అనేది కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించిందే తప్ప.. అదేమీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. దానికి విరుద్ధంగా ఫలానా నిబంధనల ప్రకారమే రాష్ట్రాలకు నిధుల పంపిణీ ఉండాలంటూ మోదీ ప్రభుత్వం నీతిఆయోగ్‌కు టీవోఆర్‌ ఇచ్చింది. నీతి ఆయోగ్‌ చేయాల్సిన పనిని కేంద్రం చేయడం ఏమిటని కేరళలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం మండిపడింది. ఆ ఆర్థికమంత్రుల రెండో సమావేశం అమరావతిలో నిర్వహించారు. ఇప్పుడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొననున్నారు. అక్కడే ప్రధానిని కేంద్రం వైఖరిపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పడం జనాభా నియంత్రణ కోసం బాగా కృషిచేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించనుంది.

హైదరాబాద్ లో ఉన్న సెలబ్రిటీ ఎవరైనా సరే కెసిఆర్ ను ఒక్క మాట అనాలి అంటే భయపడిపోతారు. ఇక సినిమా వాళ్ళు అయితే సరే సరి. కెసిఆర్ కు ఎలాంటి భజన చేస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రముఖ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మల్యే కోట శ్రీనివాసరావు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. ఒక పక్క బీజేపీ నాయకులు చంద్రబాబు పై విమర్శలు చేస్తూ, నానా మాటలు అంటుంటే, మాజీ బీజేపీ నాయకుడుగా, కోటా ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఆసక్తి నెలకొంది. ముక్కుసూటిగా మాట్లాడే కోటా, ఏ విషయం పై అయినా కుండ బద్దులు కొట్టేస్తారు అనే పేరు ఉంది. అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు గురించి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, ఉన్న విషయం చెప్పేశారు.

kota 09062018 2

అమరావతి నిర్మాణంపై కోట శ్రీనివాసరావు తన మనసులోని మాట చెప్పారు. తన ఉద్దేశం ప్రకారం హైదరాబాద్‌లా అమరావతి కావాలంటే 20 ఏళ్లు పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపున్న నాయకుడని.. రాష్ట్రం ఆయన చేతిలో ఉండటమే మంచిదన్నారు. ఆయన తప్ప ఇంకెవరు చేయగలరని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ... అసెంబ్లీలో ఉండకుండా... బయట తిరగటం సరికాదన్నారు. ఇప్పుడేమైనా ఎన్నికలున్నాయా అని అడిగారు. పార్టీ మారేవాళ్లనూ ఆయన వదల్లేదు. ఒక పార్టీలో ఉండి గెలిచిన తర్వాత .. మరో పార్టీకి వెళితే.. ప్రజలకు సమాధానం చెప్పాలన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. పార్టీ మారమని జనం చెబితే మారాలని తెలిపారు.

kota 09062018 3

అలాగే కెసిఆర్ గురించి చెప్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అదృష్టవంతుడని.. 'ఒలిచిన అరటి పండు' చేతిలో పెట్టినట్టు రాష్ట్రాన్ని ఇచ్చారని.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సహా అన్నీ ఇక్కడే ఉన్నాయన్నారు. దేనిపైనా అయినా కేసీఆర్.. గట్టిగా మాట్లాడగలరని చెప్పారు. హోంగార్డులకు జీతాలు పెంచడంతో పాటు.. నీళ్లు, కరెంట్ ఇస్తున్నారన్నారు. ఇవే చేయగలరని... అంతేకానీ తరాలు మార్చేంతగా గొప్పవేం లేవన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రం ఇది అని తెలంగాణ గురించి చెప్పుకొచ్చారు. తెలంగాణాలో అన్ని వనరులు చక్కగా అమర్చి ఉన్నాయని, కెసిఆర్ ఇక్కడ పెద్దగా కష్టపడేది ఏమి లేదని చెప్పారు.

తిరుమల పవిత్రతను, వెంకన్న స్వామిని, కూడా రాజకీయాల్లోకి లాగి, చంద్రబాబుని రాజకీయం సాధించటం కోసం, రమణ దీక్షితులతో కలిసి, ఆపరేషన్ గరుడ బ్యాచ్ ఎలాంటి నాటకాలు ఆడిస్తున్నారో చూసాం... లేని పింక్ డైమెండ్ పోయింది అంటూ అబద్ధాలు, చివరకి స్వామి వారికి కూడా నైవేద్యం ఇవ్వటం లేదు అంటూ అపచారపు మాటలు, నేళమాలిగులు తవ్వేసారు అంటూ రమణ దీక్షితులు ఆరోపణలు చేసారు. అమిత్ షా తిరుమల వెళ్లి వచ్చిన మరుసటి రోజే, ఇవి మొదలు పెట్టారు. నిన్న ఏకంగా జగన్ ను కలిసారు దీక్షితులు, అదీ లోటస్ పాండ్ లో... ఇలా తిరుమల ప్రతిష్టతను సర్వ నాశనం చేస్తున్నారు. దీంతో రమణ దీక్షితుల అసత్య ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమయింది. ఈ రోజు శ్రీవారి దర్శనానికి శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద వచ్చారు.

ttd 08062018 2

దీంతో ఆయనకు మరమ్మతులు జరిగిన వకుళమాత పోటును టీటీడీ చూపించింది. అన్నీ గమనించిన పరిపూర్ణానందస్వామి, పోటులో తవ్వకాలు జరగలేదని నిర్ధారించారు. సంపంగి ప్రాకారంలో ప్రసాదాల తయారీ ప్రాంతాన్ని కూడా పరిపూర్ణానంద స్వామికి చూపించి అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది. 2001, 2007లో పోటు మరమ్మతుల కారణంగా ఇక్కడే ప్రసాదాలను తయారు చేశామని పరిపూర్ణానంద స్వామికి పోటు సిబ్బంది చెప్పారు. రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాన్ని కూడా టీటీడీ చూపించింది. రమణ దీక్షితులు ఆరోపణలపై పరిపూర్ణానంద స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం జరిగే పీఠాధిపతుల సమావేశంలో ఈ అంశాన్ని తెలియజేస్తానని పరిపూర్ణానంద స్వామి టీటీడీకి హామీ ఇచ్చారు.

ttd 08062018 3

టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రమణదీక్షితులు మొదలు పెట్టిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎట్టకేలకు టీటీడీ నిర్ణయించింది. ఇటు రమణదీక్షితులు సైతం తగ్గకుండా టీటీడీపై దాడి కొనసాగిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఆయన దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు పెడుతున్నారు. తిరుమలలో అడుగు పెట్టకుండానే ఆయన సాగిస్తున్న దాడిపై తగిన చారిత్రక ఆధారాలతోనూ, న్యాయపరంగానూ ప్రతిదాడి చేయాలని టీటీడీ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లుగా లేదు. ఢీ అంటే ఢీ అనే విధంగానే కొనసాగుతోంది.

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌... ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటి.. అంటే ప్రపంచంలో ఉన్న టాప్ 500 కంపెనీల్లోని ఒక కంపెనీ ఇది. ఈ కంపెనీ మన రాష్ట్రంలో, మన విశాఖలో పెట్టుబడి పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం భూమి ఇవ్వటం, పనులు మొదలు పెట్టటం కూడా జరిగింది.. అయితే, ఇంత పెద్ద కంపెనీ అయిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ పై కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. " ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి ఎకరం 30 లక్షలకి ఇచ్చారు, వాళ్లేమో 15 కోట్లకి అమ్ముకుంటున్నారు.." అంటూ చౌకబారు విమర్శలు చేసారు... ఇక్కడ మొదటిగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది వ్యక్తి కాదు, అది ఒక సంస్థ.. సరే ఇది ఎదో నోరు జారాడులే అనుకుందాం... ఎవరైనా నోరు జారటం సహజం.. కాని, ఇక్కడ ఆ సంస్థకు భూమి ఇవ్వటమే తప్పు అన్నట్టు, ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది అనే పవన్ అజ్ఞానం కాని, లేక కావాలని రెచ్చగొట్టటం కాని, సమర్ధనీయం కాదు.

franklin 08062018 2

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 33 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. 1947లో స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు 74000 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉంది. ఇలాంటి కంపెనీకి భూమి ఇస్తే, రియల్ ఎస్టేట్ చేసుకుంటుందా ? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే దానికి అర్ధం ఉందా ? ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ, కేవలం భూమి అమ్ముకోవటం కోసం, చంద్రబాబుతో ఒప్పందం చేసుకుంటుందా ? అసలు ఈ కంపెనీ మన రాష్ట్రం తీసుకురావటానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ? ఎన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయో తెలుసా ? ఇతర రాష్ట్రాలు పోటీ రాకుండా, ఈ డీల్ ఎంత సీక్రెట్ గా క్లోజ్ చేసారో తెలుసా ? 2017 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన చేసారు... ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్ ను కలిసి, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖ దూసుకెల్తుంది అని, అక్కడ కంపనీ పెట్టాలని చంద్రబాబు కోరారు..

franklin 08062018 3

అప్పట్లో ఈ వార్త వచ్చినప్పుడు, కొంత మంది హేళన చేసారు... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీ మన రాష్ట్రానికి ఏమి చూసి వస్తుంది ? చంద్రబాబు మధ్య పెడుతున్నారు అని విషం చిమ్మారు.... అప్పుడు మొదలైన చర్చలు, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 2017 నెలలో, చేసిన అమెరికా పర్యటనలో, సాన్ ఫ్రాన్సిస్కో లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలోక్ సేతి,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొయ్ బోయిరియో ని కలిసి డీల్ క్లోజ్ చేసారు... పరిశోధన మరియు అభివృద్ధి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెంటర్, కమర్షియల్ స్పేస్, ఉద్యోగస్తులకు ఇల్లు అన్ని కలిపి ఒకే చోట ఉండేందుకు అవకాశం కల్పిస్తూ ఐటి పాలసీ ఉంది... విశాఖపట్నం లో ఏర్పాటు అయ్యే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో 5 వేల మందికి మొదటి దశ లో ఉద్యోగాలు లభించనున్నాయి... ఇంత కష్టపడి తెచ్చిన కంపెనీని, కూడా హేళన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.. మొన్నటి దాకా జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసేవాడు.. ఇప్పుడు పవన్ కూడా, ఇలాగే తయారు అయ్యాడు.

Advertisements

Latest Articles

Most Read