ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చేలా...2050 వరకు ఈ నగరంలో నివసించే ప్రజల దాహార్తి తీర్చే ఉద్దేశంతో కృష్ణా నదిపై మరో బ్యారేజి నిర్మాణానికి రంగం సిద్ధమయింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామాల మధ్య కృష్ణా నదిపై ఈ బ్యారేజి నిర్మించనున్నారు. కృష్ణా డెల్టా వ్యవస్థ చీఫ్‌ ఇంజినీర్‌ రూ.2420.68 కోట్ల అంచనా వ్యయంతో జలవనరులశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పరిశీలన, ఆమోదం అనంతరం ఈ ఫైలును ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు. దీనిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

barrage 08062018 2

కృష్ణానదిపై నూతన బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి పైన 23 కి.మీ దూరంలో వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే దీని కోసం టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు దిగువన, ప్రకాశం బ్యారేజికి ఎగువన ఈ కొత్త బ్యారేజి నిర్మాణం జరగనుంది. 2050 నాటికి రాజధాని అమరావతి ప్రాంత జనాభా 30 లక్షలకు చేరుతుందని, వారి తాగునీటి అవసరాలు తీర్చేందుకు 10 టీఎంసీల నీరు అవసరమవుతుందని లెక్కించి దీని నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. పులిచింతలకు దిగువన ప్రకాశం బ్యారేజికి ఎగువన కురిసే వర్షాలు, వాగులు వంకల నుంచి భారీ వర్షాల సమయంలో వృధాఅవుతున్న నీటిని ఈ బ్యారేజిలో ఒడిసిపట్టే అవకాశం ఉంది.

barrage 08062018 3

బ్యారేజి నిర్మాణ ప్రాంతంలో కృష్ణానది దాదాపు 3 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. ఇక్కడ స్పిల్‌ వే 1250 మీటర్లు మేర నిర్మిస్తారు. మిగిలిన 1809 మీటర్లకు మట్టితో టై బండ్‌ నిర్మిస్తారు. నేవిగేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. స్పిల్‌ వే మార్గంలో 55 గేట్లు ఏర్పాటు చేస్తారు. అది కాక స్లూయిస్‌ మార్గంలో మరో 14 గేట్లు ఉంటాయి. ఇది ప్రకాశం బ్యారేజి కన్నా వెడల్పు ఎక్కువగా ఉంటుంది. 2009, అంతకుముందు 1903 సంవత్సరాల్లో కృష్ణానదికి గరిష్ఠ వరద వచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి తట్టుకునేలా ఈ బ్యారేజి నిర్మాణం చేపడుతున్నారు. నది కట్టల ఎత్తును కూడా అటూ ఇటూ పెంచుతారు. భూసేకరణకే రూ.770.74 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) కార్యక్రమానికి, నాగపూర్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పెద్ద దుమరామే లేపింది. అయినా ప్రణబ్ ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఆయన అక్కడకు వెళ్లారు. అయితే, ఇప్పుడు బీజేపీ చేసిన ఫోటో మార్ఫింగ్ చూసి, ప్రణబ్ బెంబేలెత్తిపోయారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్‌ ఫొటోలను బీజేపీ ఐటి సెల్ మార్ఫ్‌ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. ఇలాంటిది జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ భాజపాపై విమర్శలు చేశారు.

pranab 08062018 2

ఆరెస్సెస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించడంతో ఆయన కుమార్తె, కాంగ్రెస్‌ నాయకురాలైన శర్మిష్ట కూడా భాజపాలో చేరవచ్చంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను ఖండించిన శర్మిష్ట భాజపాపై విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌ ఆరెస్సెస్‌ సభలో ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగాన్ని అందరూ మర్చిపోతారని, ఫొటోలు, వీడియోలు మాత్రం అలాగే ఉంటాయన్నారు. ఆ ఫొటోలకు బూటకపు ప్రకటనలు జోడించి భాజపా ప్రచారం చేసే అవకాశముందని పేర్కొన్నారు. తాజాగా మార్ఫ్‌ చేసిన ప్రణబ్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో కన్పించడంతో మరోసారి ఆమె భాజపాపై ధ్వజమెత్తారు.

pranab 08062018 3

మార్ఫ్‌ చేసిన ప్రణబ్‌ ఫొటోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా.. దాన్ని ట్వీట్ చేస్తూ.. ‘చూశారా.. దీని గురించే నేను భయపడింది. మా నాన్నకు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ప్రణబ్‌ మాట్లాడి కొద్ది గంటలైనా కాకముందే.. భాజపా/ఆరెస్సెస్‌ ట్రిక్స్‌ విభాగం చురుగ్గా పనిచేసింది’ అని శర్మిష్ట పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలో ఆరెస్సెస్‌ నేతలు ప్రతిజ్ఞ చేయగా ప్రణబ్‌ మాత్రం మామూలుగా లేచి నిల్చున్నారు. అయితే ఈ ఫొటోలను కొందరు మార్ఫ్‌ చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఆరెస్సెస్‌ నేతల మాదిరిగా తన కుడిచేతిని ఛాతి వరకు చాచి ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

హోంగార్డులు త్వరలోనే శుభవార్త వింటారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డులు త్వరలోనే శుభవార్త వింటారని తీపికబురు అందించారు. అనంతరం తాళ్లాయిపాడులో ఎన్టీఆర్‌ గృహాలను సీఎం ప్రారంభించారు. గత కొంత కాలంగా, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డులు అనేక పర్యాయాలు అందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వం ఆదుకుంటాం అని హామీ ఇచ్చింది. దీని పై అతి త్వరలోనే శుభవార్త వింటారని, ఇప్పుడు చంద్రబాబు ప్రకటించారు.

cbn 08062018 2

మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీపికబురందించింది. ఉద్యోగుల పీఆర్సీ బకాయిల కింద తక్షణం రూ.269 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1710 కోట్ల బకాయిలు మూడు కేటగిరీలుగా ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే పెన్షనర్లకు 100 శాతం చెల్లింపులకు రూ. 715 కోట్లు విడుదల చేసింది. దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.3,919 కోట్ల భారం పడుతుంది. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.

cbn 08062018 3

విద్యుత్‌ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పీఆర్సీ-2018ని ప్రకటించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రిసిటీ పర్సనల్‌ అండ్‌ జనరల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.ఎస్‌.వి.వి.ప్రసాద్‌ అన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు, ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌, ట్రాన్స్‌కో ఎండీ అండ్‌ జెన్‌కో ఎండీ విజయానంద్‌, జేఎండీలు పరుచూరి దినేష్‌, ఉమాపతిలకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి అన్ని సర్వీసుల్లోని ఫీడర్‌ కేటగిరీ పోస్టుల భర్తీకి సానుకూలంగా స్పందించి తక్షణం ఆదేశాలు ఇవ్వడం ఆనంద దాయకం అన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనితీరు మెరుగుపరిచి విద్యుత్‌ సంస్థల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

నేను అవినీతి పై యుద్ధం చేస్తాను.. నాకు అవినీతి చేసే వారు అంటే ఇష్టం ఉండదు... నాకు అవినీతి పై యుద్ధం చేసే కసి ఉంది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రోడ్ల పై కొట్టే డైలాగ్లకు ప్రజలు ఇరగబడి నవ్వుతున్నారు. నిన్న జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ గా ఉందని, నేను వస్తే అవినీతి లేకుండా చేస్తా అంటూ చెప్పిన వేదాలకు, ఐటి మంత్రి నారా లోకేష్ సటైరికల్ గా స్పందించారు.. లోకేశ్‌ ట్వీట్‌ చేస్తూ... ఈరోజు శుక్రవారమని.. మన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడ ఉంటారో చెప్పుకోండని ప్రశ్నించారు. అందుకోసం మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఈ కింది వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకోండి అంటూ 1.నాంపల్లి కోర్టు... 2.లోటస్‌ పాండ్‌ మహల్‌.. 3.బెంగళూరు మహల్‌ అని పేర్కొన్నారు.

lokesh 08062018 2

ఇది లోకేష్ చేసిన ట్వీట్ Friday today. Where can we find our opposition leader? Choose among the following: 1) Nampally Court 2) Lotus Pond Mahal 3) Bengaluru Mahal... ఇది ఇలా ఉంటే చాలా రోజుల తరువాత జగన్ కి శుక్రవారం హాలిడే దొరికింది. గత నెల రోజులుగా, కోర్ట్ లకి వేసవి సెలవలు కవాటంతో, జగన్ కు కొంచెం ఊరట లభించింది. కోర్ట్ కి సెలవలు ఉండటంతో, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్ళే బాధ తప్పింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి, గత నెల రోజులుగా శుక్రవారం కోర్ట్ కి వెళ్ళటం మానేశారు. అయితే, ఈ రోజు నుంచి మళ్ళీ కోర్ట్ లు తెరుచుకున్నాయి. సరిగ్గా ఈ రోజే శుక్రవారం కావటంతో, కోర్ట్ కి వెళ్ళాల్సిన పరిస్థితి.

lokesh 08062018 3

అందుకే నిన్న పాదయాత్ర ఆపేసి, హైదరాబాద్ వచ్చారు జగన్. ఈ రోజు, అక్రమాస్తుల కేసులో హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాలపై విచారణ జరిగింది. మరోపక్క, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కేసు విచారణ కోసం పాదయాత్రకు ఆయన ఒక్కరోజు విరామం ప్రకటించారు.

Advertisements

Latest Articles

Most Read