తెలుగుదేసం పార్టీ మూడు రోజుల పాటు నిర్వహించిన మహనాడులో, అనేక విషయలు చర్చించారు. ప్రతిపక్షాలు మాత్రం, భజన చేసుకున్నారు అని, స్వీట్లు తిన్నారు అంటూ ఎగతాళి చేసినా, ఇక్కడ మాత్రం రాష్ట్ర సమస్యల దగ్గర నుంచి, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర దాకా చర్చించారు. ఈ మొత్తం మూడు రోజుల మహానాడులో, జేసి దివాకర్ రెడ్డి స్పీచ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. జన్మభూమి కమిటీల ద్వారా జరుగుతున్న పనులు, వాటి వల్ల వస్తున్న చెడ్డ పేరుతో పాటు, చంద్రబాబు ఎక్కువ సేపు చేస్తున్న టెలి కాన్ఫరెన్స్ ల పై కూడా, జరుగుతున్న వాస్తవాలు చంద్రబాబు ముందు ఉంచారు. జేసి దివాకర్ రెడ్డితో పాటు, మహానాడుకు వచ్చిన కొంత మంది కార్యకర్తలు కూడా, జన్మభూమి కమిటీల వల్ల, ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరును చంద్రబాబు వద్దకు తీసుకువెళ్ళారు. అంతే, మహానాడు పూర్తయిన మరుసటి రోజే చంద్రబాబు దీని పై రివ్యూ చేసారు.. అన్ని విషయాలు చర్చించి 24 గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారు.

cbn 31052018 2

రాష్ట్రంలో అర్హులైన పేదలకు పింఛన్ల విషయంలో అన్యాయం జరగకూడదనే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి కమిటీల అనుమతితో సంబంధం లేకుండా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. మొత్తం 3.25లక్షల మందికి కొత్తగా ఈ విధంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఎవరికైనా పింఛను ఇవ్వాలంటే.. ఆ గ్రామంలోని జన్మభూమి కమిటీ దానికి అనుమతిస్తూ లేఖ ఇవ్వాలి. అయితే కొన్నిచోట్ల జన్మభూమి కమిటీలు అర్హతలున్నవారిని ఎంపికచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక నుంచి పింఛన్ల ఎంపిక ప్రక్రియను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌)ద్వారా చెయ్యనున్నారు.

cbn 31052018 3

పింఛన్ల కోసం మీ సేవ, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరందరి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌లోకి తీసుకుంటున్నారు. ఈ రెండురోజుల్లోనే మొత్తం 3.25లక్షల మంది అర్హులను రియల్‌టైమ్‌ పాలన ద్వారా ఎంపిక చేయబోతున్నారు. 2.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే ప్రక్రియ మొదలైంది. కొత్త విధానంలో పింఛన్లు అందిచేందుకు వీలుగా జీవో 135లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ జీవోలో ఉన్న విధి, విధానాల ప్రకారం జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించినవారికే కొత్త ఫించన్లు ఇవ్వాలి. అలాగే టెలీకాన్ఫరెన్స్‌లు కూడా, వారానికి ఒకే రోజు ఉండే విధంగా, తద్వారా అధికారులు ఎక్కువ సేపు ఫీల్డ్ లో ఉండే విధంగా కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు రాష్ట్రంలో కుట్రకు ప్లాన్ చేసారా ? శాంతి బాధ్రతలకు విఘాతం కలిగించే భారీ చర్యకు సంఘవిద్రోహ శక్తులు పూనుకున్నాయా ? అవును అనే సమాచారం వస్తుంది. అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాన్ని ఉధృతం చేశారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే రూ.4వేల కోట్లు చెల్లించాలంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 24గంటల దీక్ష ముగిసింది. దీక్ష తర్వాత, ఈ రోజు ఆత్మఘోష పాదయాత్ర పేరుతో గుంటూరు, గోరంట్ల మీదుగా తాడికొండ వరకు బాధితులు ర్యాలీ చేపట్టటానికి ప్లాన్ చేసారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదన్నారు. బాధితులు మాత్రం, మేము ర్యాలి చేసి తీరుతాం అంటూ ప్రకటించారు.

kutra 31052018 2

సరిగ్గా ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్న సంఘవిద్రోహ శక్తులు, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా, రాష్ట్రంలో అలజడి రేపటానికి, తుని లాంటి ట్రైన్ తగలబెట్టే పనులు చెయ్యటానికి, ఉపయోగించుకుంటానికి ప్లాన్ చేసాయి. భారీ విధ్వంసం చేసి, మొన్న తమిళనాడులో జరిగిన విధంగా, కాల్పుల దాకా తీసుకువెళ్ళి, ఆగ్రిగోల్ద్ బాధితుల పై ప్రభుత్వం కాల్పులు జరిపింది అనే విధంగా ప్రచారం కోసం ప్లాన్ చేసాయి. అయితే, ఈ విషయం ఇంటెలిజెన్స్ అధికారులు పసి గట్టారు. వెంటనే పోలీసులకు, ప్రభుత్వానికి విషయం చెప్పి, తీవ్రతను తెలియ చేసారు. ఆగ్రిగోల్ద్ బాధితుల ముసుగులో, కుట్రను తిప్పి కొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీ మొదలు అయితే, పరిస్థితిని అదుపు చెయ్యటం కష్టం అని, ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించింది.

kutra 31052018 3

నిన్న రాత్రే విషయం తెలుసుకున్న ప్రభుత్వం, ఈ రోజు ఉదయమే మంత్రులను, ఆగ్రిగోల్ద్ బాధితుల వద్దకు చర్చలకు పంపింది. అగ్రిగోల్డ్‌ బాధితులతో మంత్రి నక్కా ఆనందబాబు చర్చులు జరిపారు. అయితే, అక్కడ ఉన్న బాధితుల తరుపున పోరాడుతున్న వారితో, విషయం వివరించి, శాంతి బాధ్రతలకు విఘాతం కలిగించకుండా, సంఘ విద్రోహ శక్తులకు అవకాసం ఇవ్వకుండా, ర్యాలీని విరమించాలని కోరారు. ప్రభుత్వం తరుపున కూడా, అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పరిష్కరిస్తామని, కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంటామని ఆనంద్‌బాబు వారికి హామీ ఇచ్చారు. దీంతో పెద్ద మనసు చేసుకున్న ఆగ్రిగోల్ద్ బాధితులు, రాష్ట్రంలో ఎలాంటి శాంతి బధ్రతల సమస్య రానివ్వకుండా, ప్రభుత్వానికి సహకరిస్తూ, ఆందోళనను విరమించుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘంతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ చర్యలతో, అటు పోలీసు అధికారులు, ఇటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి, ప్రజా సేవ చేస్తాను అంటూ, జిల్లాల పర్యటన చేస్తున్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పై గత వారం రోజులుగా ఒక ప్రచారం, వార్తల్లోకి ఎక్కింది. దానికి ప్రధాన కారణం ఆయన వారం క్రితం ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గునటం. దీంతో, ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం చాలా బలంగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా, బీజేపీకి దగ్గరగా ఉంటున్నాయి. ఆయన యాత్రలు మొదలు పెట్టిన మొదటి రోజే, నాకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ గా ఉన్నాయి అంటూ, చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్, పవన్ లను, బీజేపీ ఆడిస్తుంది అనే ప్రచారం ఉన్న నేపధ్యంలో, జగన్ ని లోపల వేసిన వ్యక్తిగా, ఆ మూడు పార్టీలతో కలిసి పని చెయ్యరు అనుకున్నారు అందరూ. కాని లక్ష్మీనారాయణ అడుగులు మాత్రం బీజేపీ వైపే అనే అనుమానాలు బలంగా ఉన్నాయి.

jd 31052018 2

ఈ మాటలు బలం చేకూరుస్తూ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణా.. కన్నా లక్ష్మీనారాయణా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కన్నా సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవర్ని నిర్ణయిస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. దీంతో, 2019 ఎన్నికల్లో ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణనే అనే చర్చకు మరింత ఊతం ఇచ్చింది. ఆయన సంఘ్ వ్యక్తి అని.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీలో చేరతారని విశ్లేషణలు మొదలయ్యాయి.

jd 31052018 3

అయితే ఈ రోజు, ఈ వార్తల పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఏదో ఓ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, జిల్లాల పర్యటన పూర్తి చేసిన తరువాతే... రాజకీయ నిర్ణయం తీసుకుంటానని మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు. సమాజానికి తన వంతుగా సేవ చేయాలనే ప్రజల్లోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధ్యయనం కోసం పర్యటిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం ముందు ప్రజా సమస్యలను ఉంచుతానని, ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరిస్తే ఒకలా.. పరిష్కరించకపోతే మరోలా తన పయనం ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరు ఎటు వైపో తెలియాలి అంటే, మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.. మొత్తానికి, అన్ని వైపుల నుంచి చంద్రబాబు పై, బీజేపీ అస్త్రాలు వదులుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును ప్రభుత్వం గుర్తించింది. దీనితో పాటు మరికొన్ని ముఖ్యమైన రాష్ట్ర చిహ్నాలను బుధవారం ఖరారు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఈ చిహ్నాలను ఖరారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వృక్షంగా వేప, రాష్ట్ర జంతువుగా జింక ఇప్పటికే కొనసాగుతుండగా... రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును, రాష్ట్ర పక్షిగా రామ చిలుకను కొత్తగా ఎంపిక చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర చిహ్నాలుగా కృష్ణ జింక, వేపచెట్టు, కలువ పువ్వు, పాలపిట్ట ఉండేవి. విభజన తర్వాత నవ్యాంధ్రకు ప్రత్యేకమైన చిహ్నాలను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది.

goap 31052018 2

దీనిపై సర్కారు అటవీశాఖ అధికారులతోపాటు వివిధ వర్గాలను సంప్రదించింది. కలువపూవు స్థానంలో మల్లె పువ్వును ఎంపిక చేయాలని సూచనలు వచ్చాయి. గుప్పున సువాసనలు వెదజల్లే గుండు మల్లెల సాగుకు రాష్ట్రం ప్రసిద్ధి. ఇవంటే మహిళలకు ఎనలేని మక్కువ. పూజల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పుష్పంగా మల్లెపువ్వును ఎంపిక చేశారు. ఇక... పాలపిట్టను తెలంగాణ సర్కారు తన రాష్ట్ర పక్షిగా కొనసాగిస్తోంది. విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకుంటే మంచిదని తెలంగాణ వాసులు భావిస్తారు. అయితే... నవ్యాంధ్రలో పాలపిట్టల సంఖ్య తక్కువ.

goap 31052018 3

అదే సమయంలో... ఆకుపచ్చ వర్ణం, ఎర్రముక్కుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపించి, అలరించే రామచిలుకలను రాష్ట్ర పక్షిగా నిర్ణయించాలనే సూచనలు వచ్చాయి. ప్రభుత్వం దీనికే ఓటు వేసింది. చురుకైన చూపులు... చలాకీ కదలికలకు పేరు కృష్ణ జింక. నల్లమలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అడవుల్లోనూ ఈ జింకలు కనిపిస్తాయి. గతంలో రాష్ట్ర జంతువుగా ఉన్న కృష్ణ జింకకు విభజన తర్వాతా ఆ హోదాను కొనసాగించారు. వీచే గాలి నుంచి... ఆకు, పూత, విత్తనం వరకు ఆరోగ్యాన్ని అందించే వేపకు కూడా రాష్ట్ర వృక్షం గుర్తింపును కొనసాగిస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisements

Latest Articles

Most Read