వైసీపీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని, ఏపీలో ఉన్న ఉద్వేగ పూరిత పరిస్థితుల వల్ల వారు రాజీనామాలు చేసినట్లు తనకు అనిపిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ అమిత్ షా డైరెక్షన్ లో జరుగుతున్నాయి అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న వారు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. భావోద్వేగపూరితంగా ఉన్నాయి కాబట్టి, మరో వారం రోజుల తరువాత రావాలని స్పీకర్ వారితో చెప్పారు.

ycp mp 30052018 2

అయితే, తమ పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీల భవిష్యత్తు పై జూన్ 5 నుంచి 7వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన నేపథ్యంలో, వీరి రాజీనామాలు ఆమోదించినా, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఎంతమాత్రమూ కనిపించడం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల తరువాత జూన్ 4వ తేదీన లోక్ సభ సమావేశం జరుగగా, వచ్చే సంవత్సరం జూన్ 3తో మోదీ సర్కారుకు ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది.

ycp mp 30052018 3

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, ఓ ఉప ఎన్నిక జరిగితే, అందులో గెలిచే సభ్యుడి పదవీకాలం కనీసం ఏడాది పాటు ఉండాలి. జూన్ 5నే ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఎన్నికలు జరగాలంటే ఆపై మరో నెల రోజుల సమయమైనా పడుతుంది. అప్పుడు గెలిచే సభ్యుడి పదవీకాలం ఏడాది ఉండదు. ఇక నెలన్నర క్రితమే వీరి రాజీనామాలు ఆమోదం పొందినా, ఉప ఎన్నికలు వచ్చేవి కావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఖాళీ అయ్యే చోట్ల ఎన్నికలు జరిపించేందుకు ఈసీ 90 రోజుల వరకూ సమయం తీసుకుంటుంది కాబట్టి.

దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పై వస్తున్న వ్యతిరేకత ద్రుష్టిలో పెట్టుకుని, ఆరెస్సెస్‌ పావులు కదుపుతుంది... మోడీ ఓడిపోయినా, కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదు అనే ఉద్దేశంతో భారీ స్కెచ్ వేస్తున్నారని ఎన్డీటీవీ సంచలన కధనం ప్రచురించింది. ఆ కధనం ప్రకారం, మోడీకి ప్రత్యామ్నాయ అభ్యర్దిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని రంగంలోకి దించుతుంది ఆరెస్సెస్‌. 2019 ఎన్నికలకు కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రధానిగా రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనిలో భాగంగానే, వచ్చే నెలలో ఆరెస్సెస్‌ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్‌ అంగీకరించరనే సమాచారం రావటంతో, రాజకీయ వర్గాల్లో పెను ఆసక్తినే రేకెత్తించింది.

modi 30052018 2

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ ట్విటర్‌లో తననుతాను సిటిజన్‌ ముఖర్జీగా ప్రస్తావించుకుంటారు. తద్వారా తాను ‘స్వతంత్ర’ పౌరుడిననే సందేశాన్ని ఇస్తారు. ఈ సంకేతాలకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు ఉంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత జనవరిలో బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సందర్భంగా.. భువనేశ్వర్‌లో ఒడిసా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌తో ప్రణబ్‌ ఒక విందు సమావేశం జరిపారు. సోనియాగాంధీ, శరద్‌ పవార్‌ ఇచ్చిన విందులాగా మీడియాలో దీనిపై ఎక్కడా హడావుడి జరగలేదు. అయితే, ఈ సమావేశానికి దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే ఆడ్వాణీ తదితరులు హాజరయ్యారు. పేరుకిది బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సమావేశమే అయినా నిజానికి మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించిన కీలక సందర్భం కూడా అని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

modi 30052018 3

దానికి కొద్దినెలల ముందు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే.. నవీన్‌ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. బెంగాల్‌ వాస్తవ్యులైన దాదాకు, దీదీకి మధ్య ఆది నుంచీ సత్సంబంధాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో కీలకపాత్ర పోషించడానికి ప్రణబ్‌ సిద్ధంగా ఉన్నారని ఓ ఎంపీ వివరించారు. బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రె్‌సను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని ఆరెస్సెస్‌ పట్టుదలగా ఉంది. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాతుకుపోతుందన్నది దాని భయం. అందుకే.. అది ప్రత్యామ్నాయ వ్యూహాల మీద సీరియ్‌సగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటయ్యే ఫ్రంట్‌ వెనుక రహస్య అస్త్రమే ప్రణబ్‌ అని ఎన్డీటీవీ వర్గాలు విశ్లేషించాయి.

కులాలు, మతాలు, ప్రాంతాలు కలిపే సిద్ధాంతం మాది అని చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్.. కాని, వాస్తవంలోకి వస్తే, కొన్ని కులాలకే అధికారామా అంటూ కులాలు విడదీస్తాడు... కాపు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వటం లేదు అని రాష్ట్రాన్ని అడిగుతాడు, కాని అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న విషయం మాత్రం గుర్తుకు రాదు... అమరావతి మీద తనకు ఉన్న అక్కసు కక్కుతూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు.. ఇన్నీ చేసి, తాను మాత్రం హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తూ, అమరావతిలో రెండు ఎకరాల్లో ఇల్లు కట్టుకుని, అదే అమరావతిలో తన పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. శ్రీకాకుళం మీద అంత ప్రేమ ఉంటే ఇల్లు కాని, పార్టీ ఆఫీస్ కాని అక్కడ ఎందుకు పెట్టడు ? అమరావతిలోనే ఎందుకు పెట్టాడు ? ఇలాంటి వాటికి సమాధానం ఉండదు...

amaravati 29052018 2

అమరావతి మీద విషం చిమ్మటం, రాజకీయ లబ్ది కోసం ఎగబడటం... కాని, ఇలాంటి అమరావతి ద్రోహులు తెలుసుకోవాల్సింది, అమరావతి అంటే చంద్రబాబుది కాదు, అమరావతి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులది.. అమరావతి అంటే ఒక్క కులం కాదు, అన్ని కులాలు, మతాలు కలిసి ఉన్న ప్రాంతం... ఆంధ్రులను కట్టు బాట్టలతో బయటకు గెంటితే, ఆ కసితో, మనకు ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని ఉండాలి అనుకోవటం తప్పా ? చంద్రబాబు ఒక్క పిలుపుతో, 33 వేల ఎకరాలు, రైతులు ఎందుకు ఇచ్చారు ? ప్రపంచంలో ఎక్కడన్నా, ఒక నాయకుడిని నమ్మి, ఇన్ని ఎకరాలు ఇచ్చారా ? పవన్, జగన్ లాంటి నాయకులు ఎంత మంది చిచ్చు పెట్టటానికి వచ్చినా, ఎందుకు రైతులు వీళ్ళ మాటలు వినలేదు ?

amaravati 29052018 3

అందుకే వీళ్ళకు అమరావతి అంటే కోపం, వీరి మాట విని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు అని, అక్కడ రైతుల పై కోపం.. 33 వేల ఎకరాలలో, తిరిగి ఆ రైతులకే డెవలప్ చేసిన భూమి ఇస్తారు... ప్రభుత్వానికి మిగిలేది కేవలం 9 వేల ఎకరాలు మాత్రమే. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కొచ్చి లాంటి రాజధానులు మన ఆంధ్రులకు వద్దా ? శ్రీకాకుళం వెళ్లి, అమరావతికి డబ్బులు ఉంటాయి, ఇక్కడ డబ్బులు ఉండవా అంటూ, నిస్సిగ్గుగా, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, ఇతను మాత్రం అదే అమరావతిలో లంకంత ఇల్లు కట్టుకుంటున్నాడు... అడిగే వారు లేకపోతే సరి, ప్రతి ఒక్కడు అమరావతి మీద పడి ఏడవటమే.. నిన్న అమిత్ షా ఎలా అయితే, అమరావతి పై తన అక్కసు కక్కాడో, ఈ పవన్ కూడా అదే ట్యూన్ కు డాన్స్ వేస్తున్నాడు... 13 జిల్లాల ఆంధ్రులు గర్వంగా తలెత్తుకుని చెప్పుకునే రాజధాని అమరావతి... 13 జిల్లాల ఆంధ్రుల కోసం, 29 గ్రామాల ప్రజలు, 33 వేల ఎకరాలు త్యాగం చేసారు.. మీ లాంటి హైదరాబాద్ బ్యాచ్ కు, మా రాష్ట్రంలో ఉన్న కసి అర్ధం కాదు... ఢిల్లీ స్క్రిప్ట్ కు డాన్స్ వెయ్యటం మాని, మీ నీచ్చ రాజకీయం పక్కన పెట్టి, కొంచెం మా ప్రజల మధ్య గొడవలు పెట్టటం ఆపండి.. ఎన్నికల ముందు వచ్చి, ఎన్నికలు అవ్వగానే మీ దారిన మీరు వెళ్ళిపోయే చరిత్ర మీది, మీ మాటలు వింటే, మేము మేము కొట్టుకుని చావాలి...

విజయవాడలో జరుగుతున్న మహానాడు మూడో రోజు సాయంత్రం ఆయన ప్రసంగించారు. 70లక్షల మంది కార్యకర్తలే తెదేపాకు ఉన్న బలమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మనల్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. మహానాడులో మొత్తం 37 తీర్మానాలు చేశామని, 106 మంది మాట్లాడారని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీ, పవన్, జగన్ వైఖరి పై, వారితో అనుసరించాల్సిన విధానం పై, పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ ముగ్గిరి విషయంలో, ఎక్కడా మొహమాటం లేకుండా, అనేక సందేహాలకు సమాధానం ఇస్తూ, చంద్రబాబు ప్రసంగం సాగింది. ఒక మామూలు కుటుంబంలో పుట్టి..నిరంతర శ్రమతో ఈ స్థాయిలో వచ్చానని, ఇప్పుడు వచ్చిన నాయకులు..నడిరోడ్డుపై ఉరి తీయాలని అంటారు, బంగాళాఖాతంలో పడేస్తామని అంటారు, వాళ్ల భాష చూస్తే బాధ కల్గుతోంది అంటూ, పరిటాల రవిని చంపినప్పుడు కూడా నేను నిగ్రహాన్ని కోల్పోలేదని, ఇలాంటి వారితో మాటలు పడాల్సి వస్తుందని అన్నారు.

mahanadu 29052018 2

పవన్ కళ్యాణ్ ఆరోపణల పై స్పందిస్తూ," ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నాం- తోటపల్లిని మనమే పూర్తి చేశాం..తోటపల్లికి డబ్బులివ్వకుండా పుష్కరాలకు ఖర్చుపెట్టామని విమర్శలు చేస్తున్నారు- ప్రకృతిని ఆరాధించండం మన సంస్కృతి- నీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రకృతిని ఆరాధించాలని కృష్ణా, గోదావరి పుష్కరాలు చేశాం- ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం- మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం..ఉచితంగా మందులిస్తున్నాం- దేశంలో ఇంత బాధ్యత కలిగిన ప్రభుత్వం ఉంటే చెప్పమని ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నా- విమర్శల్లో నీతి, నిజాయతీ ఉండాలి- ఫైబర్ గ్రిడ్ హెరిటేజ్ ఉద్యోగికి ఇచ్చామని ఆరోపిస్తున్నారు..తప్పుడు సమాచారాన్ని పదేపదే చెప్తే ప్రజలు నమ్ముతారని భ్రమ పడుతున్నారు- బీజేపీ వల్ల మనం గెలిచామని మాట్లాడుతున్నారు...అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు పంచాయతీ ఎన్నికలు జరిగాయి..ఆ ఎన్నికల దామాషా ప్రకారం చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే మనకు మరో 15 నుంచి 20 సీట్లు ఎక్కువ వచ్చేవి- పవన్ కళ్యాణ్ కూడా అదే మాట పదేపదే చెబుతున్నారు- మీరు సహకరించారు అందుకు ధన్యవాదాలు ...అంతేకాని మీ వల్లే గెలిచామనడం కరెక్ట్ కాదు- బీజేపీతో విభేదించిన తర్వాత పవన్ మన గురించి మాట్లాడుతున్నారు- అప్పటి నుంచే కుట్ర ప్రారంభమైంది- డిల్లీలో స్క్రిప్ట్ తయారయింది వీళ్లు దాన్ని పాటిస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.

mahanadu 29052018 3

జగన్ పై మాట్లాడుతూ, "గాలి జనార్దన్ రెడ్డిని, జగన్ ను పక్కన పెట్టుకొని బీజేపీ నేతలు నీతులు ఎలా చెబుతున్నారు- నేతల అవినీతి కేసులపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు- అవినీతి కేసులపై ఆనాడు దర్యాప్తు చేసి అధికారి కూడా నేడు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పర్యటిస్తున్నారు- రూ.43వేల కోట్లు అవినీతి జరిగిందని ఛార్జిషీట్ లో వేశారు- అవిశ్వాస తీర్మానం పెట్టండి మేం మద్దతు తీసుకొస్తామన్న వ్యక్తులు నేడు లాలూచీ పడి మనల్ని తిడుతున్నారు- ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోను ఎక్కే వ్యక్తులు నన్ను తిడుతుంటే బాధేస్తుంది- బెయిల్ మీద బయటకొచ్చిన అవినీతి పరుడు తిడుతున్నా ప్రజల కోసం ఆ బాధను అనుభవిస్తున్నా" అని చంద్రబాబు అన్నారు.

బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పై స్పందిస్తూ " రాజధానిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు- రాజధాని కట్టడం ఒక సవాల్..రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆదాయం సంపాదించే మార్గాల ద్వారా అమరావతి నిర్మాణం చేస్తాం- భూములిచ్చిన రైతులను అభినందిస్తున్నా- అమరావతిని, పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేయాలి- ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం సహకరించడం లేదు- పొత్తు ధర్మం పాటించలేదు- రాజకీయ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చాలా ప్రమాదకరం. న్యాయం చేయమంటే కుట్రలు చేస్తున్నారు- మీ కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ సాగవు- అభివృద్ది పనులు చేస్తున్నానని నాపై విమర్శలు చేస్తున్నారా?- విద్వేషాలు రెచ్చగొడుతూ విషం చల్లుతున్నారు- దేశ ప్రభుత్వమే ఏపీకి అవార్డులు ఇస్తోంది..ఏకపక్షంగా విమర్శలు చేస్తే మంచిది కాదు- నిధులు మంజూరు చేసి ప్రధాని ఒప్పుకోలేదని మళ్లీ వెనక్కి తీసుకున్నారు- ఆధారాలతో లెక్కలు చూపిస్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు- రాజధానికి ఇచ్చింది రూ,1500కోట్లు అయితే రూ.2100 కోట్లు ఇచ్చామంటున్నారు" అని అన్నారు.

చివరగా ముగిస్తూ, "ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి..మనం బలహీనమైతే కేంద్రంలో ఎవరూ మన మాట వినరు- మనం దెబ్బతింటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది- అడ్మినిస్ట్ర్రేషన్ అస్తవ్యస్తమవుతుంది- కేంద్రం సహకరించినా, సహకరించపోయినా రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత నాది-ఎప్పుడు పోరాడితే ఫలితాలొస్తాయో నాకు తెలుసు కాబట్టి నాలుగేళ్లు వేచి చూశా- ఈ మహానాడు ద్వారా నూతనమైన చరిత్రకు శ్రీకారం చుడుతున్నాం- రాబోయే రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఏపీని అగ్రగామిగా నిలబెడతాం- పనికిమాలిన రాజకీయాలు చేసేవారు రాష్ట్ర ద్రోహులుగా నిలిచిపోతారు..ప్రజలు వాళ్లని తరిమికొట్టాలి" అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read