రాజధాని నిర్మాణం కోసం తనపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్‌ అడిగితే రైతులు సెంటు భూమి కూడా ఇచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు. మహానాడులో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ అమరావతికి ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయన్నారు. ఎంతోమంది ముందుకు వచ్చి రాజధానికి విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.42 వేల కోట్లు అవసరమని, రూ. 22 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. రాజధానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చి లెక్కలు అడుగుతోందని.. ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

cbn 29052018 2

యూసీలన్నీ స్వీయధృవపత్రాలు అంటూ అవాస్తవాలు చెబుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే అమిత్‌ షా లక్ష్యమని చంద్రబాబు మండిపడ్డారు. రూ.98 వేల కోట్లతో గుజరాత్‌లో కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారని, అమరావతికి రూ.1500 కోట్లు ఇచ్చి చాలంటున్నారని అన్నారు. అనుమతులు కూడా ఇవ్వబోమని బెదిరిస్తున్నారని సీఎం తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర పెద్దలు అవహేళనగా మాట్లాడుతున్నారని, నిధులన్నీ అమరావతికే ఖర్చు పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు తెచ్చి రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, అమరావతి నుంచి ఆదాయం వచ్చాక అప్పులు తీరుస్తామని మహానాడులో చంద్రబాబు పేర్కొన్నారు.

cbn 29052018 3

తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలే లక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను చిన్నారులు.. విదేశాల్లో ఆర్జించిన సంపాదనలో కొంత మొత్తాని ఎన్నారైలు సైతం విరాళాలుగా రాజధాని నిర్మాణం కోసం ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రూ.75 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపారు. రాజధానిలో రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసిన అనంతరం 5 వేల ఎకరాలను విక్రయించుకుని రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే అవకాశముందని సీఎం తెలిపారు. రాజధాని నిర్మాణం అంటే గిట్టని, నచ్చని వ్యక్తులు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఆఖరు నిమిషంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మారిన ఓ వ్యక్తి.. బీజేపీకి అద్దె మైకు, వైకాపాకు సొంతమైకులా మాట్లాడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. వీరి కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు.

నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యల పై, మహానాడు వేదికగా, చంద్రబాబు ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. నీ స్థాయి ఏంటి ? నువ్వు ఏమన్నా ప్రదానివా ? ఒక పార్టీ ప్రెసిడెంట్ వచ్చి, ఒక ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాధానం చెప్తామా ? ప్రధాని అడగాలి, కేంద్రం అడగాలి, నువ్వు ఎవరు అంటూ అమిత్ షా పై చంద్రబాబు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం అమిత్ షా వరకు వెళ్ళటంతో, చంద్రబాబు రియాక్షన్ విని, చంద్రబాబు అంత మాటన్నారా అంటూ, అమిత్ షా అన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు ఇంత దూకుడుగా మాట్లడతారని అనుకోలేదు, నేను వాళ్ళని లెక్కలు అడగలేదు, ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ గా ప్రశ్నించాను అని కొంత మంది నాయకుల వద్ద అన్నట్టు తెలుస్తుంది. మహానాడు మొదలైన దగ్గర నుంచి, అక్కడ వస్తున్న విమర్శల పై ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని, అమిత్ షా ఇప్పటికే బీజేపీ పార్టీకి ఆదేశించారు.

amitshah 29052018 2

దీంట్లో భాగంగా, చంద్రబాబు మొదటి రోజు చేసిన విమర్శలకు, తానే ప్రధాని అన్నట్టు, తానే ప్రభుత్వం అన్నట్టు, లెక్కలు ఇవ్వండి, ucలు ఇవ్వండి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు... ‘‘ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టని రాజధానికి నిధులు ఎలా ఇస్తాం? అమరావతి డిజైన్లు ఇంకా సింగపూర్‌ వద్దే ఉన్నాయి. ఇచ్చిన నిధులకు యూసీలూ ఇవ్వలేదు’’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. సోమవారం మహానాడు వేదిక నుంచి అమిత్‌షాకు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాష్ట్రానికీ, రాజధానికీ నిధులు ఇవ్వకున్నా ఇచ్చామనడం దుర్మార్గం. అమరావతికి ఇచ్చిన నిధులకు యూసీలు పంపినా పంపలేదనడం మరింత దుర్మార్గం’’ అని అన్నారు. అసలు యూసీల గురించి మాట్లాడేందుకు అమిత్‌ షా ఎవరని ప్రశ్నించారు.

amitshah 29052018 3

‘‘బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పాలనలో జోక్యం చేసుకోవడం ఏంటి? ఏదైనా ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పాలి. అమరావతికి ఇచ్చింది రూ.1500 కోట్లు. రూ.1509కోట్ల మేర యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు పంపాం. ఆ యూసీలు పరిశీలించి.. తదుపరి నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్‌ కూడా చెప్పింది. ఇప్పుడు మళ్లీ యూసీలు ఇవ్వడం లేదని షా అనడం సరికాదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఏ విమర్శ చేసినా, చంద్రబాబు డాక్యుమెంట్ లు, వీడియోలు చూపించి మరీ, బీజేపీ ఆడుతున్న అబద్ధాలు తిప్పి కొడుతున్నారు. చంద్రబాబు దూకుడికి, రాష్ట్ర బీజేపీ నేతలు చేతులు ఎత్తేయటంతో, అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. అయితే, అమిత్ షా ని కూడా చంద్రబాబు వాయించారు. దీంతో అమిత్ షా నొచ్చుకున్నట్టు తెలుస్తుంది.

జూన్ 16న, ప్రధాని మోడీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుస్తారా ? చంద్రబాబు వెళ్తారో లేదో కాని, మోడీ మాత్రం అందరి ముఖ్యమంత్రులను జూన్ 16న, కలుద్దాం రండి అంటున్నారు. ఆర్థిక అంశాల పై వివిధ రాష్ట్రాల నుంచి తలెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో వచ్చే నెల 16వ తేదీన ఢిల్లీలో నీతి అయోగ్ కీలక సమావేశం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశ అజెండా అంశాలను కూడా రాష్ట్రాలకు పంపించారు. ఈ ఆహ్వానంలో ప్రధానంగా సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా స్పందించడం విశేషం. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు. 2022 సంవత్సరం వరకు అభివృద్ధి అనే అంశం పై కొన్ని రంగాల పై చర్చించనున్నారు.

modi cbn 29052018 2

మూడో విడత నీతి ఆయోగ్ సమావేశాల్లో చర్చించిన అంశాల పై తీసుకున్న చర్యలపై ముందుగా ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం వ్యవసాయ రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చిస్తారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడం పైనా చర్చ ఉంటుంది. ఇ-నామ్, భూసార ఆరోగ్య పరీక్షలు, గ్రామీణ వ్యవసాయ పరిస్థితి, జాతీయ ఉపాధి హామీ పథకం, జల సంరక్షణపై ఉపాధి హామీ ప్రభావం పైనా చర్చిస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వాస్య సురక్ష మిషన్ గురించి అజెండాలో పొందుపరిచారు. కీలక అవసరాలున్న జిల్లాలకు అందించాల్సిన ప్రత్యేక సాయం, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్ర ధనుష్ సహా మహాత్మాగాంధీ 150 జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల సలహాలు తీసుకోనున్నారు.

modi cbn 29052018 3

కేంద్ర రాష్ట్రాల మధ్య ఇటీవల సన్నగిల్లుతున్న సత్సం బంధాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇటీవల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తర, తూర్పు రాష్ట్రాలు కేంద్రం పై విరుచుకుపడుతున్నాయి. సహకార సమాఖ్య విధానానికి కేంద్రం తూట్లు పొడుస్తోందన్న ఆందోళన ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. కేవలం కొన్ని రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్న కేంద్రం మిగిలిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదనే అసంతృప్తిని రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితి పై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు సహకార సమాఖ్య విధానం పైనే ఎక్కువగా స్పందించడం, దీని పైనే కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో బీజెపికి ఎదురుదెబ్బ తగలడం, ఇతర రాష్ట్రాల్లో కూడా అసంతృప్తి పెరుగుతుండడంతో కేంద్రం దిగి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగో నీతి అయోగ్ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రం సహకార సమాఖ్య విధానానికి కట్టుబడి ఉంటుందని రాష్ట్రాలకు రాసిన ఆహ్వాన లేఖలో పేర్కొనడం విశేషం.

గత పార్లమెంట్ సమావేశాల్లో, జగన్ ఎంపీలు ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కాదు. అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం అంటూ హంగామా చేసి, అదే అవిశ్వాస తీర్మానం పట్టుకుని, ప్రధాని ఆఫీస్ లో దొరికిపోయాడు విజయసాయి రెడ్డి. దీంతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగి, మోడీ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, అన్ని పార్టీల మద్దతుతో పోరాడారు.. మోడీ కనిపిస్తే, పార్లమెంట్ లో ఆందోళన చెయ్యకుండా, వైసీపీ ఎంపీలు పారిపోయే వారు. విపక్షాలు అన్నీ కలిసి మోడీకి వ్యతిరేకంగా, మానవహారం పెడితే, ఎక్కడ అమిత్ షా చూస్తారో అని, దానికి డుమ్మా కొట్టారు వైసీపీ ఎంపీలు. ఇలా డ్రామాలు ఆడుతూ ఆడుతూ, మోడీ మీద విశ్వాసం ఉంది అని చెప్తూ, అవిశ్వాస తీర్మానం పెట్టి, రక రకాలుగా ప్రజలను మభ్య పెట్టి, చివరి రోజు మేము రాష్ట్రం కోసం రాజీనామాలు చేస్తున్నాం అంటూ, కధ ముగించారు వైసీపీ ఎంపీలు..

jagan 29052018 2

అయితే, ఈ రాజీనామా డ్రామాలు అందరూ మర్చిపోయారు అనుకుంటున్న టైంలో, కర్ణాటక ఎన్నికల్లో శ్రీరాములు, యెడ్యూరప్ప తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన, గంట లోపే, స్పీకర్ రాజీనామాలు ఆమోదించారు. దీంతో మళ్ళీ అందరి చూపు వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామాల పై పడింది. మూడు నెలలు అయినా, వీరి రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదు అంటూ చర్చ మొదలైంది. ఇవన్నీ డ్రామాలు అంటూ మరో సారి విమర్శలు వచ్చయి. దీంతో ఇప్పుడు ఈ రాజీనామా డ్రామాలో తరువాత ఎపిసోడ్ వచ్చింది. స్పీకర్ కార్యాలయం, ఈ రోజు వైసిపీ ఎంపీలను వచ్చి కలవమని కబురు పంపింది. ఎంపీలు తమ రాజీనామాలను భావోద్వేగంతో చేశారా? లేక, నిజంగానే సీరియస్ గా ఉన్నారా...? అన్న విషయాన్ని పరిశీలించి, ఆపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది

jagan 29052018 3

అయితే ఈ విషయం పై, విజయసాయి రెడ్డి సన్నిహితుల వద్ద చెప్పిన మాటలు విస్మయానికి గురి చేసాయి. మనోళ్ళు రాజీనామా ఎలాంటిదో తెలిసిందేగా, ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటూ, రెండు విషయాలు చెప్పారు విజయసాయి.. ఒకటి స్పీకర్ ఇవి భావోద్వేగంతో చేసినవి అని, రాజీనామాలు ఆమోదించారు... రెండోది ఆమోదించినా, సార్వత్రిక ఎన్నికలు ఏడాది లోపు ఉంటే, ఇప్పుడు ఎన్నికలు రావు. ఎలా చూసుకున్నా మనం సేఫ్ కదా. రాజీనామా చేసేము, పోరాడుతున్నాము అనే పేరు వచ్చింది కదా... ఏ నిర్ణయం తీసుకోవాలో ఢిల్లీ వాళ్ళు చూసుకుంటారు. మనం దానికి తగ్గట్టు, ట్యూన్ అవ్వటమే అంటూ, చెప్పారు. మరో పక్క ఎంపీలు అందరూ రాజీనామా చేసినా, తాను కూడా ఎంపీ అయినా విజయసాయి రెడ్డి మాత్రం, రాజీనామా చెయ్యని విషయం తెలిసింది. మొత్తానికి ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి..

Advertisements

Latest Articles

Most Read