దేశంలో అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. వర్షం వస్తే కానీ పంటలు పండవు. కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావం కారణంతో పొలాలు ఉన్నా రైత న్నలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ర్టాలకు పరుగులు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. ఇక వర్షాలు రావు... మా బతుకులు మారవు అని నిట్టూర్చుకున్న రైతన్నలకు పెనుకొండకు దక్షిణ కొరియ కియ కార్ల పరిశ్రమ రావడంతో ప లు గ్రామాల ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. ఒక్కసారిగా రైతులతో పాటు రైతుకూలీల జీవన శైలిలో పెనుమార్పులు వచ్చాయి. ఇందులో కురబవాండ్లపల్లికి కియ కార్లపరిశ్రమ తలుపు తట్టింది. ఏడాది కిందట లక్షలు పలికిన ఎకరా భూమి నేడు కోట్లు పలుకుతోంది. ఇక పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు పరిహారం సొమ్ము ఖాతాల్లో వచ్చి పడింది.

kia 28052018 2

న్నో ఏళ్లుగా చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్న గ్రామీణ కుటుంబాల్లో కియ రాకతో ఒక్కసారిగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఏపీఐఐసీ కియతో పాటు అనుబంధ సంస్థ పరిశ్రమల కోసం ఎర్రమంచి, దుద్దేబండ, హ రిపురం, అమ్మవారుపల్లి గ్రామాల పరిధిలో 1410.14 ఎకరాల భూములను సేకరించారు. ఇందులో ఎర్రమంచి, అమ్మవారిపల్లి మధ్య కేటాయించిన 587.84 ఎకరాల భూమిలో కియ ప్రధాన పరిశ్రమ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో 200 మందికిపైగా కురబవాడ్లపల్లి రైతుల భూములే ఉన్నాయి. ప్రభుత్వం ఎకరాకు రూ. 10.50 లక్షలతో ఇవ్వగా ఒక్కో రైతుకు రూ.10లక్షల నుంచి కొన్ని కుటుంబాలకు కోటిన్నర దాకా తీసుకున్న రైతులు ఉన్నారు. వీటికితోడు కియ సమీపంలోనే భూములను కొందరు రైతులు ఎకరా రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు రియల్‌ వ్యాపారులకు విక్రయించారు. ఇలాకూడా మరో రూ.25 కోట్లు చేరి వంద కోట్లకు చేరిపోయింది.

kia 28052018 3

ఓవైపు పరిహారం మరోవైపు భూ ముల విక్రయాలతో వచ్చిన డబ్బులతో కొంత విలాసాలకు కేటాయిస్తూ, మరికొంత డబ్బును పెట్టుబడి పెడుతూ ఏడాదిలో పల్లెజీవితంలో పెనుమార్పులు వచ్చేశాయి. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో గ్రామాల్లో ఎటు చూసినా వచ్చిన డబ్బులు ఏం చేసినావు అన్న చర్చలే వినిపిస్తున్నాయి. కియకు అనుబంధంగా మరో 16 అనుబంధ పరిశ్రమలు రావడంతో మరో వంద కోట్లు లచ్చిందేవి వాలిపోయే పరిస్ధితి కనిపిస్తున్నది. సాధారణ జీవన ప్రమాణాలు సాగించే గ్రామా ల్లో కియ రాకతో ప్రజల జీవనశైలిలో మార్పు వస్తోంది. ఇక పెనుకొండలో స్థలాలు, అద్దెల ధరలు పెరగడంతో ప్రతి రోజు లక్షల్లో నగదు చేతులు మారుతోంది. పెనుకొండకు పలు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్ల కంపెనీలు క్యూకట్టే పరిస్థితి వస్తోందని ప్రజలు భావిస్తు న్నారు. కియ, అనుబంధ పరిశ్రమలు పూర్తయితే ఈ ప్రాంతం గ్రామీణ, పట్టణస్థాయి ప్రజల జీవనశైలి మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొంత మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేల పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరిని ఉద్దేశించి ఆయన కటువుగా మాట్లాడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా పరోక్షంగా చురకలు అంటిస్తున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం హెచ్చరికలతో ఆందోళన చెందారు. మరికొందరు భుజాలు తడుముకున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లపై చంద్రబాబు పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేయడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది."మీ తప్పులు నా నెత్తిన వేసుకోను. మీ కోసం నేను మునగను. కొంతమంది పైపైన తిరుగుతున్నారు. వాటిని నేను గమనిస్తున్నాను. నాకు ఏ నియోజవర్గంలో ఏమి జరుగుతుందో మొత్తం తెలుసు! మీరేంచేస్తున్నారో నాకు తెలియదనుకుంటే పొరపాటు పడినట్టే. మీకు త్వరలోనే నియోజకవర్గాల్లో మీ పరిస్థితి ఏంటో చెబుతాను'' అంటూ చంద్రబాబు చురకలు అంటించారు.

cbn 28052018 2

"కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులను నేను నా నెత్తిన వేసుకోను. ఎవరూ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం పనిచేయవద్దు. అధికారం ద్వారా ప్రజలకు సేవచేసి పది కాలాలపాటు ఆ హోదాని నిలుపుకునే విధంగా మసలుకోండి'' అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్కడితో ఆయన ఆగలేదు. మరింతగా తన స్వరం పెంచారు. "సైకిల్ ర్యాలీలు నిర్వహించమంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు పైపైనే తిరుగుతున్నారు. నేను ఏదైనా పని చెబితే ఒక చెవితో విని, మరో చెవిలోంచి వదిలేస్తున్నారు. అటువంటి వారిని వదిలిపెట్టను. సీరియస్‌నెస్ లోపించింది. కొందరు నేతలైతే విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీతో పాటు పార్టీ మునుగుతుంది. అలా జరగనివ్వడానికి నేను సిద్ధంగా లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి వారి స్థానమేంటో త్వరలోనే చూపిస్తాను'' అంటూ చంద్రబాబు తీక్షణంగా హెచ్చరించారు.

cbn 28052018 3

ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మరోవైపు ప్రతిపక్షలు విమర్శలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో విపరిణామాలను ధీటుగా ఎదుర్కొనేందుకు బాబు సమాయత్తమయ్యారు. పార్టీ నేతలకు అందుకే చురకలు అంటిస్తున్నారు. సమన్వయ కమిటీ భేటీ చివరిలో "మీలో కొంతమంది వ్యవహారశైలి సరిగ్గా లేకపోతే సరిదిద్దుకోవాలని చెబుతా. వినకపోతే చర్యలు తప్పవు'' అని కూడా చంద్రబాబు ముక్తాయింపు ఇచ్చారు. దీంతో కొందరు నేతలకు ముచ్చెమటలు పట్టాయి. పార్టీ కార్యక్రమాల్లో కొందరు చురుకుగా పాల్గొనడం లేదు. తమ తప్పు లేకపోయినా తనపైన, పార్టీపైన ప్రతిపక్షం చేస్తున్న విమర్శల పట్ల కొందరు సరిగా రియాక్ట్‌ కావడం లేదు. ఈ అంశాన్నీ చంద్రబాబు దృష్టికి వచ్చాయి. అందుకనే ఆయన ఏడాది ముందునుంచే పార్టీ నేతలను స్కాన్ చేస్తున్నారు. ట్రాక్ తప్పితే పక్కనపెట్టడం ఖాయమన్న సంకేతాలు పంపుతున్నారు.

అమరావతిపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఒక పక్క ట్విట్టర్ లో స్పందించారు. మరో పక్క మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో పనులే ప్రారంభం కాలేదని షా చెప్పడం దారుణమన్నారు. యూసీలు పంపిస్తే నిజమైనవి కావని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చేసినట్లు బుకాయిస్తారా? అని నిలదీశారు. అమరావతి ప్రణాళికలు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు ఇవ్వకుండా మొండికేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు, లోటు బడ్జెట్‌కు ఎలాంటి యూసీలు కావాలో అమిత్‌ షా చెప్పాలని ఎద్దేవా చేశారు.

cbn 28052018 3

అమిత్‌ షా నిన్న చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమైనదని చంద్రబాబు తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షుడికి యూసీల విషయం ఎందుకని ప్రశ్నించారు. యూసీలు ఇచ్చామో.. లేదో ప్రధాని మోదీ చెప్పాలి గానీ.. అమిత్‌ షాకు ఎందుకని మండిపడ్డారు. పాలనా అంశాల్లో జోక్యం చేసుకోవడానికి ఆయనెవరని ప్రశ్నించారు. దేశంలోని ప్రజల సొమ్ము అంతటినీ గుజరాత్‌కు ఎలా తరలిస్తారని చంద్రబాబు నిలదీశారు. అమిత్‌ షా ఇప్పటికైనా దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయం చేయాలని అడిగితే పవన్‌కల్యాణ్‌ వంటి వాళ్లతో ప్రభుత్వంపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తే ఒక్కశాతం ఓట్లు కూడా రావని చంద్రబాబు పేర్కొన్నారు.

cbn 28052018 2

ఈ విషయం పై, ఆర్ధిక మంత్రి యనమల కూడా స్పందించారు. కావాలనే ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు యూసీల పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. యూసీలు సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ ఎప్పటికప్పుడు యూసీలు అందజేస్తోందని తెలియజేశారు. కానీ అమిత్‌ షా మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిధులు ఎగ్గొట్టేందుకు ఇదో కొత్త నాటకమన్నారు. యూసీలు ఇవ్వకుండా కేంద్రం నిధులు విడుదల చేయదన్నారు. ఈ విషయాన్ని అమిత్‌షా తెలుసుకోవాని యనమల సూచించారు.

కొద్దిరోజుల క్రితం బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారమే రేపాయి. జీవీఎల్ చెప్పినట్టుగానే కమలనాథులు కర్ణాటక ఎన్నికలు ముగిసిన మరుక్షణమే ఏపీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్’ మొదలైనట్టుగానే అనిపిస్తోంది. ఏపీలో పార్టీల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ గడప ముందు నిల్చున్న కన్నాను వెనక్కి రప్పించి.. ఇప్పుడు ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవినే కట్టబెట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

gvl 28052018 2

టీడీపీకి వెన్నుదన్నుగా ఓ సామాజిక వర్గం, వైసీపీకి అండగా మరో సామాజిక వర్గం ఉన్నాయని.. బీజేపీ కూడా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే కన్నాకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా కన్నాతో చర్చలు జరపడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. మరో పక్క పవన్ కళ్యాణ్ తో ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని దూరం చెయ్యటానికి గేమ్ మొదలు పెట్టారు. రమణ దీక్షితులు ద్వారా ఈ గేమ్ ఆడిస్తున్నారు. ఐవైఆర్ కృష్ణా రావు ఎలాగూ వారి కంట్రోల్ లోనే ఉన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా, ఈ రెండు సామాజిక వర్గాలకు, చంద్రబాబు అనేక సహాయాలు చేసారు, చేస్తున్నారు. అందుకే, వీరిని దూరం చేసే ఆపరేషన్ మొదలు పెట్టారు.

gvl 28052018 3

బీజేపీకి అధికారంలోకి వచ్చే సత్తా ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ ఈ రెండు సామాజికవర్గాలను తమ వైపు తిప్పుకోవాలని.. తద్వారా టీడీపీకి నష్టం కలిగించాలన్నదే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే.. అమిత్ షా మార్క్ రాజకీయాలు ఏపీలో ఫలిస్తాయా అన్నది కూడా అనుమానమే. బీజేపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి వారితో జగన్, పవన్ కలిసిపోయారనే సిగ్నల్స్ ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. బీజేపీపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కాస్తోకూస్తో చల్లారాలంటే రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది గానీ.. ఇలా పార్టీని బలోపేతం చేసే నిర్ణయాలతో రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న కమలనాథుల ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియాలంటే 2019 ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.

Advertisements

Latest Articles

Most Read