గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ ఏటేటా అమాంతం పెరుగుతూ వెళ్తోంది. గత ఏడాది 7.5లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది 9లక్షల పైనే ఉండబోతోంది. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే మాత్రం ఈ సంఖ్య 10 లక్షలు దాటుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అత్యధిక ప్రయాణికుల వృద్ధితో గత ఐదేళ్లుగా దేశంలోనే మొదటి స్థానంలో గన్నవరం నిలుస్తోంది. ఈసారి కూడా గత ఏడాదితో పోలిస్తే.. 1.5లక్షల మంది పెరగనున్నారు. దేశంలోని మరే విమానాశ్రయంలోనూ ఈ స్థాయిలో ప్రయాణికుల వృద్ధి లేదు. అంతకుముందు ఏడాది సైతం ప్రయాణికుల సంఖ్య 1.5లక్షలు పెరిగింది. ఈ ఏడాది అదే కొనసాగుతోంది.

international airport 27052018 2

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 2500 మంది రాకపోకలు సాగిస్తున్నారు. నెలకు 75 వేలకు పైగా ఉంటున్నారు. ఎనిమిది నగరాలకు 52 సర్వీసులు నిత్యం నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రతి పావుగంటకో సర్వీసు రావడం, పోవడం జరుగుతున్నాయి. దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, చెన్నై, విశాఖ, కడప, తిరుపతి నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి నగరానికి వెళ్లే సర్వీసుకూ భారీ డిమాండ్‌ ఉంటోంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు నడిచే సర్వీసులకు ఆక్యుపెన్సీ 80శాతం పైగా ఉంటోంది. దీంతో విమానయాన సంస్థలు సైతం కొత్తగా సర్వీసులను పెంచుకుంటూ వెళుతున్నాయి. 2016-17లో 7596 విమాన సర్వీసులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించగా.. ప్రస్తుత ఏడాదికి 18,720కు చేరాయి. ఏడాదిలోనే రెట్టింపవ్వడం గమనార్హం.

international airport 27052018 3

దేశంలోని అనేక ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించేవారి సంఖ్య ఇక్కడి నుంచి నిత్యం వేల సంఖ్యలో ఉంటోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి ఏటా లక్షల సంఖ్యలో దేశంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకూ వ్యాపార, వాణిజ్య పనులపైనా, చదువులు, విహార యాత్రలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం ఎనిమిది నగరాలకే సర్వీసులు నడుస్తున్నాయి. అదికూడా.. తిరుపతి, కడప, విశాఖను వదిలేస్తే.. హైదరాబాద్‌తో సహా మరో ఐదు నగరాలకే సర్వీసులున్నాయి. కేరళ, అహ్మదాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, భువనేశ్వర్‌, గోవా, పూణె, ఔరంగాబాద్‌ లాంటి అనేక నగరాలకూ ఇక్కడి నుంచి విపరీతమైన రద్దీ ఉంటుంది. వాటికీ సర్వీసులను ఏర్పాటు చేస్తే.. ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం ఉన్న దాని కంటే రెట్టింపు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో పక్క, ఇంటర్నేషనల్ సర్వీసులకి, ఎప్పుడో అనుమతులు లభించినా, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు నెలకొల్పినా, కేంద్రం మాత్రం ఇంటర్నేషనల్ సర్వీసులకు అడ్డు పడుతుంది. ప్రస్తుతం, ఈ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా ఆయనకు అవకాసం ఉన్న మేరకు సహయం చేస్తున్నారు..

రాజధాని అమరావతి నగరంలో ఐఏఎస్‌, ఎమ్మెల్యేలు, ఎన్‌జీవోలకు నిర్మిస్తున్న హౌసింగ్ టవర్స్ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ, మలేషియన్‌ షియర్‌ వాల్‌ టెక్నాలజీతో ఒక్క ఇటుక అవసరం లేకుండానే మొత్తం సిమెంట్‌ కాంక్రీట్‌తో ఆకాశహార్మ్యాలను నిర్మిస్తోంది ప్రభుత్వం. ఈ కారణంగా నిర్మాణాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాయపూడి, నేలపాడు గ్రామాల్లో పెద్దఎత్తున జరుగుతున్న ఈ నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న కారణంగా, తక్కువ మంది కూలీలతో లక్ష్యసాధన దిశగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

housing 27052018 2

సహజంగా ఇంటి నిర్మాణం అనగానే ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకరతో పాటు ప్రధానంగా గోడల నిర్మాణానికి ఇటుకలు అవసరమవుతాయి. అయితే ఇది ఖర్చుతో కూడిన వ్యవ హారం. అలానే కొన్ని లక్షల ఇటుకలు నిర్మాణ ప్రదేశానికి తరలించాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం షియర్‌ వాల్‌ టెక్నాల జీని వినియోగిస్తోంది. లెజిస్లేటివ్‌, ఏఐఎస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్‌కి రూ. 635.91 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎన్‌జీవోలకు నిర్మిస్తున్న జీవో టైప్‌-1కి రూ.866.1 కోట్లు, క్లాస్‌-4 ఉద్యోగులకు నిర్మించే టవర్స్‌కి రూ. 707.44 కోట్లు కలిపి మొత్తం రూ. 2,209.45 కోట్లతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 65.4 ఎకరాల భూమిని వినియోగిస్తున్నారు. మొత్తం 61 టవర్స్‌లో 3,840 ఫ్లాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

housing 27052018 3

శాసనసభ్యులు, మండలి సభ్యుల కోసం రాయపూడి గ్రామ పరిధిలోనే మరో బ్లాక్‌లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇక్కడ 12 టవర్స్‌లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం 288 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఇక్కడ నివాస సౌకర్యం కల్పిస్తారు. కృష్ణానదికి సమీపంలో రాయపూడి వద్ద అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ ఆరు బ్లాకుల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. స్టిల్ట్‌ ఫ్లోర్‌ కలిపి మొత్తం 13 అంతస్థులుగా డిజైన్‌ చేశారు. మొత్తం 144 ఫ్లాట్లు నిర్మాణం చేస్తున్నా రు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నేలపాడు గ్రామంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 27.47 ఎకరాల విస్తీ ర్ణంలో 22 టవర్లను ఇక్కడ నిర్మిస్తున్నారు. 1,968 ఫ్లాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి అన్నీ 2019 ఫిబ్రవరి 12వ తేదీకి పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొన్నారు.

చంద్రబాబు ఒక సీక్రెట్ సర్వే చేపిస్తున్నారు.. దీని కోసం గూఢచార శాఖ రంగంలోకి దిగింది.. ఒక పక్క ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు జరుగుతూ ఉన్నా, స్వయంగా గ్రౌండ్ లెవెల్ సర్వే ఒకటి చేపిస్తున్నారు చంద్రబాబు. ప్రజల మూడ్ ఎలా ఉంది ? ప్రభుత్వం పై ఎలాంటి అబిప్రాయం ఉంది ? లోపాలు ఏంటి ? జగన్ వైపు ఎంత మంది వెళ్తున్నారు ? పవన్ ప్రభావం ఉంటుందా ? తదితర విషయాలను తెలుసుకుని పక్కా లెక్కకు వచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. బూత్‌ల వారీ కొందరిని ఎంపిక చేసి, వారి సెల్‌నెంబర్‌లను ఇచ్చి వారి నుంచే సర్వే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని నిర్దేశించింది. దీంతో రంగంలోకి దిగిన గూఢచార శాఖ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. అందుకు అనుగుణంగా నియోకవర్గాల వారీ సంపూర్ణ నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయి.

cbn 27052018 2

మొన్నటి దాక ఐవీఆర్‌ఎస్‌ సర్వేల్లో, పార్టీ వ్యవహారాలపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల వారీ గుర్తించిన పార్టీ నాయకులు, సీనియర్‌ కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకునేందు కు ఇటీవల ఆయన సర్వేలు చేయించారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ఒక సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ సర్వేల, వారి ఎంపిక విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని సామాజిక వర్గాలు, అన్ని వయస్సుల వారు అలాగే అన్ని రంగాలకు చెందిన వారు ఉండే విధంగా ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆ యా నియోజకవర్గాల వారీ పార్టీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జి పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా గమనించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం పరిస్థితి, నాయకులపై ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

cbn 27052018 3

దీంతో గూఢచార శాఖ సిబ్బంది ఆయా నియోజకవర్గాల వారీ ప్రజల మొగ్గు టీడీపీకి ఏ స్థాయిలో ఉంది, వైసీపీకి ఎంత ఉంది? జనసేన ప్రభావం ఉండబోతుం దా? తదితర అంశాలను క్రోడీకరిస్తూ నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సర్వేని అత్యంత రహస్యంగా నిర్వహిస్తుండగా, వివిధ రూపాల్లో క్రమేపీ వ్యవహారం బయటకు పొక్కింది. టిడిపి నాయకుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు అవ్వక్కయ్యారు. చంద్రబాబు ఎంతో పకడ్బందీగా సర్వే చేపిస్తున్నారని తెలుసుకుని, ఆ సర్వే సమాచారం తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సర్వేని బట్టే తరువాత ఎన్నికల్లో టికెట్లు తదితర అంశాలు ముడిపడి ఉండటంతో, ఈ సర్వే ఫలితాల పై అందరికీ ఆసక్తి నెలకొంది..

సోషల్ మీడియాలో వికృత ప్రచారం చెయ్యటంలో బీజేపీ ఆరి తెరిందనే విషయం అందరికీ తెలిసిందే... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మాయ చేసి, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చెయ్యటంలో, బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.. ఇది వారి సక్సెస్ ఫార్ములా అని గర్వంగా చెప్పుకుంటారు కూడా.. ఏమి చెయ్యకపోయినా, ఆహా ఓహో అంటూ, మోడీకి బాకా కొట్టటమే కాదు, వీరికి వ్యతిరేకంగా ఉండే వారి పై వికృతమైన విష ప్రచారం చేస్తారు.. వారిని ముందుగా హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారు.. తరువాత, వారి పై విషం చిమ్ముతారు.. ఇలాంటి సంఘటనే కర్ణాటక డీజీపీ విషయంలో జరిగింది.. కుమార స్వామి ప్రమాణస్వీకారం సందర్భంలో, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. ఆమె ఆ విషయం పై కర్ణాటక డీజేపీ పై అసహనం వ్యక్తం చేసారు...

bjp 27052018 2

ఇక ఇలాంటి విషయాలు కోసమే చూస్తున్న బీజేపీ, ఈ అంశం పై విష ప్రచారం మొదలు పెట్టింది.. మమత ఒత్తిడి మేరకు, డీజీపీ నీలమణి రాజును, కుమారస్వామి బదిలీ చేసారు అంటూ, విష ప్రచారం చేసింది బీజేపీ... పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ నాలుగు అడుగులు కూడా వెయ్యలేరా ? ఆమెకు అంత అహంకారామా అంటూ ప్రచారం చేసింది. ఈ విషయం నిజమే అనుకుని, ఎంతో మంది మమతను తిట్టారు. కాని ఆ ప్రచారం వాస్తవం కాదు. రాష్ట్ర డీజీపీ నీలమణి రాజును బదిలీ చేసినట్లు వెలువడ్డ వదంతులను కర్ణాటక హోంశాఖ తీవ్రంగా ఖండించింది. నీలమణి రాజు బదిలీ కాలేదని, అదంతా వట్టిదేనని హోంశాఖ పేర్కొంది.

bjp 27052018 3

రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా నీలమణి రాజు 2017 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. 2020 జనవరి 31న ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. డీజీపీని రెండేళ్ల వరకు బదిలీ చేయకూదని నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా, బీజేపీ బ్యాచ్ ఇలా ప్రచారం చేసి, ఇది నిజం అని నమ్మించింది.. ఇప్పటికే బీజేపీ ఇలాంటి ప్రచారం మన రాష్ట్రంలో కూడా మొదలు పెట్టింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తిరుమల వివాదం.. ఏమి లేని సమస్యను, సమస్య ఉన్నట్టు సృష్టించి, సాక్షాత్తు వెంకన్నతోనే ఆటలు ఆడుతున్నారు.. ఇలాంటి విష ప్రచారాలు ఇంకా ఎన్నో బీజేపీ నుంచి వస్తాయి.. వీరికి వైసిపీ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, జనసేన చింతలబస్తీ బ్యాచ్ తోడు.. అందరూ కలిసి, రాష్ట్రాన్ని నాశనం చేసే పనిలో ఉన్నారు.. కులాల మధ్య గొడవలు పెట్టే పనిలో ఉన్నారు.. దేశ ప్రజలనే పిచ్చోల్లని చేసి, ఈ బీజేపీ బ్యాచ్ ఆడుకుంటుంది... మన రాష్ట్రంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం..

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రారంభోన్యాసం చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. విభజన హామీలు నేరవేర్చమంటే, మన రాష్ట్రం పై ఇంత కుట్ర చేస్తున్నారని చెప్పారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అంశంలో కొనసాగుతున్న వివాదం వెనుక భాజపా కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు భాజపా తెరవెనుకు కుట్ర పన్నుతోందన్నారు. తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందని... ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి నాలుక కరుచుకుందని తెలిపారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా మట్టి కరవాల్సిందేనని అన్నారు.

cbn 27052018 2

బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ.. పనులు తక్కువ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే అని ఎద్దేవా చేశారు. మోదీ పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే నోట్ల రద్దుకు మద్దతు పలికామని, కానీ ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యం దాపురించిందని చంద్రబాబు అన్నారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడిందన్నారు. ప్రధాని మోదీ చర్యలతో పాలన గాడి తప్పిందని విరుచుకుపడ్డారు.

cbn 27052018 3

దేశంలో బీజేపీ కలుషిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తూ ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. విలువల గురించి బీజేపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో శశికళకు పట్టిన గతి పడుతుందని విపక్షనేతకు భయమని... అందుకే హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. దిగజారి పోయి, తిరుమల పై కుట్రలు పన్నుతున్నారని, వెంకన్న జోలికి వస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read