సువిశాల ప్రాంగణం.. అతిథిలకు రాజమర్యాదలు.. సేవలు అందించేందుకు సైనికులు! ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే తెలుగుతమ్ముళ్ల పసుపు పండుగ మహానాడుకు నగరం సర్వంగ సుందరంగా ముస్తాబయింది. మహానాడుకు హాజరయ్యే టీడీపీ కుటుంబ సభ్యుల కోసం ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఈ మూడురోజుల వేడుకకు రాష్ట్రం నలుమూలలతో పాటు దేశ విదేశాల నుండి వచ్చేవారికి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వచ్చే అతిథుల కోసం అత్యంత సుచికరమైన, రుచికరమైన వంటకాలను పెద్దఎత్తున సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకలో 30వేల మంది ప్రతినిధులు, లక్ష మంది వరకు సందర్శకులు పాల్గొంటారనే అంచనాతో అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశారు.

mahanadu 27052018 2

అయితే ఈ సారి, మాహానాడు వేదిక పై వేసిన సెట్టింగ్, మాత్రం హైలైట్ గా నిలిచింది. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టిన నదుల అనుసంధానంలో ప్రథమమైన పట్టిసీమ ప్రతిబింబించేలా వేదికను రూపొందించారు. ఒక వైపు ప్రకాశం బ్యారేజీ (కృష్ణమ్మ నది), మరో వైపు రాజమండ్రి బ్యారేజి (గోదారమ్మ నది), మధ్యలో పట్టిసీమ ప్రాజెక్ట్ సెట్టింగ్ పెట్టారు. పార్టీ కార్యక్రమం అయినా సరే, రాష్ట్రాన్ని కాపాడిన పట్టిసీమ గురించి, అక్కడకు వచ్చిన కార్యకర్తలకు మరింత అవగాహన కల్పించటం కోసం ఇలా చేసారు. పట్టిసీమ అనే ప్రాజెక్ట్ లేకపోతే మన రాష్ట్రానికి కనీసం తాగు నీరు కూడా తాగే పరిస్థితి లేదు, చంద్రబాబు ప్రభుత్వానికి అనేక కష్టాలు వచ్చేవి. ఇవన్నీ ముందే ఊహించిన చంద్రబాబు, తను అధికారంలోకి రాగేనే, పట్టిసీమ ప్రాజెక్ట్ మొదలు పెట్టి, రికార్డు టైంలో పూర్తి చేసారు..

mahanadu 27052018 3

పట్టిసీమ ఒక్కటే కాదు, స్టేజి మీద వివిధ బీసి సంఘాలకు ఇస్తున్న చేయూత పై, ఫోటోలోతో అవగాహన కలిపించారు.. బీసిలు లేనిదే, తెలుగుదేశం పార్టీ అనేది లేదు అని చంద్రబాబు ఎప్పుడూ చెప్తూ ఉంటారు.. దానికి తగ్గట్టుగా, బీసిలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అనేక పధకాలు మొదలు పెట్టారు.. ఇవన్నీ ఆ స్టేజి పై ప్రదర్శించారు... ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వేదికపై ప్రసంగాలను అందరూ వీక్షించేలా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంగణంలో ఫొటో ఎగ్జిబిషన్‌తో పాటు రక్తదానం చేసే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ్యత్వ నమోదుకూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వచ్చే వారికోసం అవసరమైన మంచినీరు సహా మజ్జిగ అందించనున్నారు.

సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం బాధితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 24 గంటల దీక్షకు సంఘీభావంగా రాజమహేంద్రవరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య, ఆకుల లక్ష్మీ పద్మావతి ఒక రోజు దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పవన్ కు మద్దతుగా కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా దీక్ష చేపట్టారు. జనాలు ఎక్కువుగా కనిపించటానికి, జిల్లా నుంచి అందరూ కాకినాడ తరలివచ్చి బలాన్ని చాటడంతో పాటు దీక్ష విజయవంతం చేసేందుకు కాకినాడలో కార్యక్రమం పెట్టారు. ఈ మేరకు పవన్ ఫాన్స్ అందరూ కాకినాడ వెళ్లి దీక్షలో పాల్గొన్నారు.

janasena 27052018 2

అయితే రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జనసేన పార్టీ కండువ మెడలో వేసుకుని బీజేపీ ఎమ్యెల్యే ఆకుల సత్యనా రాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మాతి, మరికొద్ది మంది మహిళామణులతో కలసి దీక్షలో కూర్చున్నారు. ముందుగా ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా ఒక్క సారిగా ఆమె జనసేన తరపున దీక్షలో కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆకుల లక్ష్మీ పద్మావతి మాట్లాడుతూ తనభర్త బీజేపీ ఎమ్మె ల్యేగా ఉన్నప్పటికీ తాను పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన తరపున దీక్షలో కూర్చున్నానన్నారు. దీనికి తన భర్త అడ్డు చెప్ప రని, దీక్షలో కూర్చున్న విషయం ఆయనకు చెప్పే వచ్చానన్నారు. అయితే ఇది వరకు, ఎప్పుడూ, ఈవిడ ఇలా చేసిన ధాకలాలు లేవు..

janasena 27052018 3

కాగా బీజేపీకి చెందిన రాజమహేంద్రవరం నగర శాసన సభ్యుడు ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాజమహేంద్రవరంలో దీక్షలు చేపట్టడం పై జనసేన, బీజేపీ వర్గాలు విస్మయం చెందాయి. శనివారం గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర సమావేశం దృష్టికి వెళ్ళి నాయకులు మధ్య ఆంతరంగిక సమావేశంలో చర్చకు దారితీ సింది. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజకీయ భవితవ్యం పై ముందస్తు వ్యూహాలను బహిర్గతం చేసేందుకే తన భార్యను దీక్షకు పంపించారా అని ఆ పార్టీ నాయకులు సందేహపడుతున్నారు. మరో పక్క, జనసేన అయినా మనం చెప్పినట్టే ఉంటారుగా, ఏమి కాదులే అని, కొంత మంది బీజేపీ నేతలు అంటున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ మచ్చ లేని నాయకుడు... అవాక్కయ్యారా ? కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, మన కన్నా వేసిన కన్నాలు అన్నీ గుర్తుకు వచ్చాయి కదా ? నిన్న కాక మొన్న బీజేపీకి రాజీనామా చేసి, వైసిపీ పార్టీలో చేరుతున్న కన్నాని, తెల్లారే సరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసారు.. ఇప్పుడు ఈ కన్నాలు సారు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వస్తున్నారు అంట... ఈ మాట చెప్పింది భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్... దక్షిణాది దండయాత్రకు వస్తున్నాం అంటూ, డాంబీకాలు పోతున్న రాం మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటున్నాం అంటూ గుంటూరు వేదికగా ప్రకటించారు...

kanna 26052018 2

కన్నా లక్ష్మీ నారాయణ గురించి ఏమన్నారో తెలుసా ? "రాజకీయ అనుభవం ఉన్న నేత కన్నా.. మీ ముఖ్యమంత్రి కంటే ఐదేళ్లు ఎక్కువ అనుభవం ఉన్న నేత.. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఆంధ్ర ప్రజల అభివృద్ధికి బీజేపీకి కట్టుబడి ఉంది. మేం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తాం. ఇప్పటికే కేంద్రం 85 శాతం హామీలు నెరవేర్చింది. 100 కాదు 150 శాతం సహయ సహకారాలు అందించేందుకు మేం సిద్ధం. నూతన రాజకీయం ఇక్కడ తీసుకురావాలి. కన్నాకు పదవి ఇస్తే కులాన్ని చూసి ఇచ్చారంటున్నారు. అసలు ఇలా ఆలోచించే విధానానికి వ్యతిరేకంగా కొత్త రాజకీయం రాష్ట్రంలో తీసుకురావాలి. అబద్ధపు ప్రచారానికి వ్యతిరేకంగా న్యూ పాలిటిక్స్..ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. మనమే అధికారంలోకి వస్తున్నాం" అంటూ రాం మాధవ్ అక్కడ ఉన్న వారికి కనువిప్పు కలిగిస్తూ, కన్నా గురించి చెప్పారు..

kanna 26052018 3

పదేళ్లు మంత్రిగా గుంటూరు జిల్లాను కొల్లగొట్టిన సంగతి కొత్తబిచ్చగాడు..రాంమాధవ్‌కు తెలియదేమో...? అప్పట్లో...రాంమాధవ్‌ ఎవరో...ప్రజలకు కానీ...ఇప్పటి..బిజెపి అధ్యక్షుడు 'కన్నా'కు కానీ తెలిసి ఉండదు. అందుకే...'కన్నా'లో నిజాయితీపరుడైన...నాయకుడు 'రాంమాధవ్‌'కు కనిపించి ఉంటారు. పదేళ్లు మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన 'కన్నా'...అవినీతి గురించి గుంటూరు ప్రజలే కాదు..రాష్ట్ర మంతా...కథలు..కథలుగాచెప్పుకున్నారు. ఆ సంగతి...పాపం ఈయనకు తెలిసి ఉండదు. తెల్లారితే పార్టీ మారే వ్యక్తిని బెదిరించి...పార్టీ అధ్యక్షున్ని చేసుకున్న బిజెపి పెద్దలు....ఆయన నీతిమంతుడు, చరిత్రకారుడు అని సర్టిఫికెట్‌ ఇవ్వడంకన్నా దౌర్బాగ్యం ఏముంటుంది. కులాలను అడ్డం పెట్టుకుని...టిడిపి... రాజకీయాలు చేస్తోందన్న రాంమాధవ్‌ చేసేది ఏమిటి..? 'కన్నా' బిజెపికి చేసిన సేవ ఏమిటి..? ఎందుకు ఆయనకు అధ్యక్ష పదవి వచ్చింది..? కులం కోటాలో కాదా...?

కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా జలసిరితో కళకళలాడుతోంది. ఇందుకు కారణమైన మంత్రికి రైతులే కాదు.. ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అధికారులను పరుగులు పెట్టించి.. నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయిస్తున్న దేవినేని ఉమా అంటే, ఇప్పుడు అనంత ప్రజలకు సొంత మనిషిలా అయ్యారు... కరువు జిల్లాగా పేరొంది... చుక్క నీరులేక అల్లాడిపోయే అనంతపురం జిల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.. మండు వేసవిలో కూడా అక్కడ జలసిరులు పారుతున్నాయి.. ఇందుకు కారణం భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమానేనని అంటున్నాయి టీడీపీ శ్రేణులు.. రైతులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు దేవినేని ఉమ ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉండటం ఆ జిల్లా వాసులకు ప్లస్‌పాయింట్‌ అయ్యింది. ఆయన ఇక్కడి పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు.

ananta 26052018 2

నీటి కోసం అనంత జిల్లా వాసులు పడుతున్న కష్టాలను గమనించారు. ఎక్కడెక్కడ నీటిని నిల్వ ఉంచవచ్చో పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో చకచకమంటూ పనులు కానిచ్చేశారు. జిల్లాకు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక ప్రాజెక్టును టేకప్‌ చేయడం.. అధికారులను పరుగులు పెట్టించడం చేశారు. ప్రాజెక్టులు శరవేగంగా పూర్తయ్యాయంటే అందుకు కారణం దేవినేని పనితీరే! హంద్రీనీవా రెండో దశ పనుల్లో భాగంగా మడకశిర... మారాల... చెర్లోపల్లి రిజర్వాయర్ల పనులను పర్యవేక్షించారు. రాజకీయ పలుకుబడితో నత్తనడకన పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల భరతం పట్టారు. అనంతపురం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 62 టీఎంసీల నీటిని తెప్పించగలిగారు.

ananta 26052018 3

అనంత నీటి కష్టాలు తీరడంతో రైతులు మురిసిపోతున్నారు. తాము చేసిన బృహత్తరమైన పని జిల్లా రైతాంగం గుర్తుంచుకునే విధంగా ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది తెలుగుదేశంపార్టీ! అనంతపురం నగరంలో క్లాక్‌ టవర్‌ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు కలశాలు ధరించి వెయ్యిమంది మహిళలతో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. కృష్ణా జలాలతో తెలుగుతల్లి విగ్రహానికి పూజలు చేస్తారు. అలాగే గండికోట నుంచి ఎత్తిపోతల ద్వారా మరో 20 టీఎంసీల నీటిని తీసుకురానున్నారు.. ఉంతకల్లు.. మడకశిరలో మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది ప్రభుత్వం.. మొత్తంగా అనంతపురం జిల్లా ప్రజల నీటి కష్టాలు ఇప్పటికి తీరాయి...

Advertisements

Latest Articles

Most Read