అమిత్ షా ఆదేశాలు మేరకు, ఆయన వచ్చి వెళ్ళిన రెండో రోజే, ఒక పధకం ప్రకారం ఎలా దాడి చేస్తున్నారో చూస్తున్నాం... తిరుమలలో ఎదో జరిగిపోతుంది అని, చివరకు స్వామి వారికి కూడా నైవేద్యం కూడా పెట్టటం లేదు అంటూ, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిపోయిందని, స్వామి వారి పూజా కైంకర్యాల వ్యవహారంలో అధికారులు తలదూరుస్తున్నారని, వకుళామాత పోటులో బండలు మార్చే నిమిత్తం చాలా రోజులుగా దానిని మూసివేశారని ఇలా అన్ని విషయాలు చూసుకునే ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు గారు, సరిగ్గా రిటైర్డ్ అయ్యే ముందు రోజు, అమిత్ షా వచ్చి వెళ్ళిన తరువాత, రచ్చ మొదలు పెట్టారు.

tirumala 20052018

అయితే, తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలను టీటీడీ తిప్పికొట్టింది. రమణ దీక్షితులు అసత్య ఆరోపణలు చేశారంటూ... ఆధారాలతో సహా టీటీడీ బయట పెట్టింది. పోటు మరమ్మతు పనులతో వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు... రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆలయ౦లోని వకుళామాత పోటులో... ఎటువంటి తవ్వకాలు టీటీడీ జరపని చెప్పింది. కేవలం మరమ్మతులను మాత్రమే చేశామని టీటీడీ తెలిపింది. పోటును మీడియాకు చూపించి అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది.

tirumala 20052018

టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల ఆలయ వ్యవస్థ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలకు ఎక్కుతున్నారు. నిజానికి ఆయన వ్యవహారశైలి తొలినుంచీ ఇలాగే ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన తను కొలువున్న వ్యవస్థనే ఇరుకునపెట్టేలా ప్రవర్తించారని, ఆగమశాస్త్రం, ఆచార వ్యవహారాలు, నియమాలు అని మాట్లాడుతున్న రమణదీక్షితులు.. ఆయనే వాటిని చాలాసార్లు ఉల్లంఘించారనే విమర్శులున్నాయి.

 

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన మోడీ ప్రభుత్వం, అది పూర్తి చెయ్యటానికి మాత్రం అనేక అడ్డంకులు పెడుతుంది. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష కోసం, రాష్ట్ర ప్రజల జీవనాడికి ఇబ్బందులు కలిగిస్తుంది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలతో సహా డిజైన్ల ఆమోదం, రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కేంద్రం కావాలని ఆలస్యం చేస్తుంది. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం నిధులు విడుదల చేసినా.. ప్రధాని మోదీకి గానీ, బీజేపీకిగానీ ఎలాంటి క్రెడిట్‌ దక్కదనే నిశ్చితాభిప్రాయానికి కేంద్రంలోని పెద్దలు వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే... పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌మెంట్‌ చేయడంలో సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోందని జల వనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి.

polavaram 20052018 2

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ.1089 కోట్లను రీయింబర్స్‌ చేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ఆర్థికశాఖ లిఖిత పూర్వకంగా వెల్లడించింది. రెండుసార్లు అధికారికంగా సమాచారం పంపినందున ఒకటి రెండురోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ నుంచి రూ.1089 కోట్ల నిధులు పీపీఏకు చేరుతాయని రాష్ట్ర జల వనరులశాఖ ఆశించింది. కానీ, అంతలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, నాబార్డుల మధ్య కుదిరిన మొమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌(ఏంవోఏ)లో కొద్దిపాటి సవరణలు చేసుకోవాల్సి ఉందంటూ నాబార్డు పేర్కొంది. ఈ ఫైళ్లకు మోక్షం కలిగితే తప్ప.. మార్చి నెలలో విడుదల కావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తం విడుదల కాదు.

polavaram 20052018 3

మరో ముఖ్యమైన విషయం... పోలవరం 2013-14 తుది అంచనాలు రూ. 58,319.06 కోట్లకూ కేంద్ర జల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా ఈ తుది అంచనాలపైనా ఎలాంటి నిర్ణయామూ తీసుకోలేదు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పనులకు సంబంధించిన డిజైన్లపైనా కేంద్ర జలసంఘం ఆమోదం తెలపకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. ఎక్కడా ఎలాంటి తప్పూ కనిపించకపోవడంతో.. గతంలో వేసిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ వేస్తూ కేంద్రం కాలయాపన చేస్తోంది. వీటన్నింటిపైనా కేంద్రంతో మాట్లాడేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది. వారంలో ఢిల్లీకి వెళ్లి చర్చలు జరపాలని నిర్ణయించింది. అవసరం అయితే, పోలవరం పై కూడా మరో పోరాటానికి సిద్ధం అంటూ చంద్రబాబు చెప్పారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, మేము సియం అయిపోతున్నాం అని చెప్పే పవన్, జగన్ మాత్రం, పోలవరం పై ఒక్కటంటే ఒక్క మాట కూడా కేంద్రాన్ని అనటం లేదు..

గత వారం రోజులుగా తిరుమల పై జరుగుతున్న కుట్రలో మరో ఆరోపణ, శ్రీవారి వజ్రం అమ్ముకున్నారు అంటూ రమణ దీక్షితులు చేసిన ఆరోపణ... సరిగ్గా అమిత్ షా తిరుమల వచ్చి వెళ్ళిన రెండో రోజే, రమణ దీక్షితులు ఈ విష ప్రచారం మొదలు పెట్టారు.. ఇక దీన్ని పట్టుకుని, జగన్ మోహన్ రెడ్డి సాక్షి చేస్తున్న ప్రచారం అయితే ఇక సరే సరి... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అరచకాలు అన్నీ ఇన్నీ కావు.. వీరు కూడా కబురులు చెప్తున్నారు.. సరే ఏది ఏమైనా, వీళ్ళు చేస్తున్న విష ప్రచారం పై, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. వారి ఆభరణాల భద్రత విషయంలో జస్టిస్ వాద్వ కమిటీ, జస్టిస్ జగన్నాధరావు కమిటీలు ఆభరణాలు సక్రమంగా ఉన్నాయని టిటిడి కి రిపోర్ట్ ఇచ్చాయిని ఆయాన అన్నారు.

eo 20052018 2

అప్పట్లో ఆభరణాలు అన్ని సక్రమంగా ఉన్నాయని అర్చకులు కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టారని, అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. 2001 గరుడసేవ రోజున శ్రీవారి హారంలోని రూబీ డైమండ్ కనపడలేదని కొంతమంది అర్చకులు టిటిడి దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి అధికారులు వెతకగా పగిలిన రూబీ డైమండ్ పీసులు ఇప్పటికి టీటీడీ వద్ద ఉన్నాయి. రూబీ డైమండ్ ను వేలం వేశారని రమణ దీక్షితులు చెప్తున్న మాటలు అవాస్తవం అని టిటిడి ఈఓ అనిల్ కుమార్ అన్నారు. ఆగమ సలహాదారులు ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు ఉంచేందుకు టిటిడి కి ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు. మార్చి 1 1979 నుంచి స్వామివారి కైంకర్యాలు అగమోక్తంగా సమయం ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం అని, జీయర్ స్వాముల పర్యవేక్షణలో స్వామివారి కైంకర్యాలు యధావిధిగా జరుతున్నాయిని అన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. శ్రీవారి ఆలయంలో తవ్వకాలు జరుగుతున్నాయనేది అవాస్తవం అని, ఆలయం లో చిన్నచిన్న రిపేర్లు జరుగుతున్నాయిని, అవికూడా ఆగమ సలహదారుల సంప్రదింపుల తర్వాతే జరిగాయని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.

eo 20052018 3

2013 జనవరిలో ప్రభుత్వ జిఓ నెం 1171, go ms నెం 611ప్రకారం అర్చకులకు 65 సం రిటైర్మెంట్ ను ప్రభుత్వం వర్తింపజేసిందని, జి.ఓ ప్రాకారం ఏ.యస్ నరసింహ దీక్షితులు, భక్తవత్సల దీక్షితులు రామచంద్ర దీక్షితులను రిటైర్ చేశారని చెప్పారు. 956 టిటిడి సర్వీస్ రూల్స్ ప్రకారం టిటిడి లో పనిచేసే ఉద్యోగులు, అర్చకులందరు పదవీవిరమణ చేయాలని ఉందని, సర్వీస్ రూల్స్ ప్రకారమే నూతన ప్రధాన అర్చకుల నియామకాలు జరిగాయని చెప్పారు . మిరాశి రద్దైయాక ప్రధాన అర్చక నాలుగు కుటుంవాలను నుండి ఒక్కక్కరిని‌ తీసుకున్నామని, ఇప్పుడు వంతులు లేకుండా అందరు కలసి ఉత్సవాలు,కైంకర్యాలు నిర్వహిస్తున్నారని, మిరాశి అర్చకులకి గాని,బ్రహ్మణులకు మాత్రం నష్టం జరగలేని చెప్పారు.

2014కు ముందు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతి సారి, ఇప్పటి ప్రధాని, అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, నేను అధికారంలోకి వచ్చేస్తున్నా, అచ్చే దిన్ వచ్చేస్తుంది, మీకు పెట్రోల్ అతి తక్కువ ధరకే ఇస్తాను అని.. కట్ చేస్తే, ఆయన నాలుగేళ్ళ పరిపాలనలో, పెట్రోల్ రేట్ లు ఆల్ టైం హై కు చేరుకున్నాయి.. కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు సైలెంట్‌గా ఉన్న పెట్రోలియం సంస్థలు.. ఒక్కసారిగా విరుచుపడుతున్నాయి...లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల మార్కును దాటేసింది. రోజూ వారీ ధరలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ధరల పెరుగుదల మరింత ఎక్కువైందని సామాన్యులు వాపోతున్నారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.76పైసలు ఉండగా, ముంబైలో అధ్యధికంగా రూ.84.07కి చేరింది. భోపాల్‌లో రూ.81.83, పాట్నాలో రూ.81.73, శ్రీనగర్‌లో రూ.80.35గా ఉంది.

modi 20052018 2

డీజిల్‌ ధర హైదరాబాద్‌లో రూ.73.45గా ఉండగా.. తిరువనంతపురం‌లో రూ.73.34, రాయ్‌పూర్‌లో రూ.72.96, గాంధీనగర్‌లో రూ. 72.63, భువనేశ్వర్‌లో రూ.72.43, పట్నాలో రూ.72.24, ముంబయిలో రూ. 71.94, కోల్‌కతాలో రూ.70.12, చెన్నైలో రూ.71.32గా ఉంది. పెట్రోల్‌ ధర తక్కువగా పనాజీలో రూ.70.26గా ఉండగా.. పోర్ట్‌బ్లెయర్(అండమాన్‌)‌లో డీజిల్‌ ధర తక్కువగా రూ.63.35గా నమోదైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గిందేమీ లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2014 నుంచి 2016 వరకు మొత్తం 9 సార్లు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ.11.70పైసలు, డీజిల్‌పై రూ.13.47పైసలు అదనపు భారం పడింది.

modi 20052018 3

ప్రస్తుత పెంపుతో పెట్రోల్‌ ధర జీవిత కాల గరిష్ఠానికి చేరింది. దిల్లీలో సెప్టెంబర్‌ 14, 2013లో పెట్రోల్‌ ధర రూ.76.06 ఉంది. ఇప్పుడు ఆ రికార్డును చెరిపివేస్తూ రూ.76.24కు చేరింది. మరోవైపు డీజిల్‌ ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం చమురు సంస్థలు గత ఏడు రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి... మొత్తానికి, ప్రజలను అన్ని వైపుల నుంచి, చావ గొడుతుంది మోడీ ప్రభుత్వం... రోజూ వారీ ధరలు అంటూ ఒక తల తిక్క విధానం తీసుకువచ్చారు.. రోజు వారీ విధానంతో, అతి తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్ లభిస్తుంది అని ప్రచారం చేసారు.. చివరకు ఆల్ టైం హై కు తీసుకువెళ్ళారు... మోడీ గారు చెప్పిన అచ్చే దిన్, ప్రజలకా ? గుజరాత్ కంపెనీలకా ? మనమే తప్పుగా అర్ధం చేసుకున్నామేమో...

Advertisements

Latest Articles

Most Read