ఎంత పెద్ద దొంగ అయినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు... దాంతో దొరికిపోతాడు... కాకపోతే, నిజంగా దొంగతం చేసే వారికి సిగ్గు అనేది ఉంటుంది... దొరికిపోయామనే, బాధతో, ఎక్కడో ఒక చోట పరివర్తన పొందుతారు... కాని మన ముందు ఉండే దొంగలకు దొరికానా సిగ్గు ఉండదు.. జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్నా, నిస్సిగ్గుగా రోడ్డుల వెంట ఊరేగుతూ, రాజకీయాలు చేస్తారు... ఇప్పుడు అలాంటి దొంగలు గురించి, వీళ్ళు ఎలా దొరికారో చెప్పుకుందాం... వాళ్ళు ఎలాగూ సిగ్గు పడరు కాబట్టి, కానీసం ప్రజలకు అయినా అవగాహన ఉంటే, ఇలాంటి వారికి సరైన స్థానం చూపిస్తారనే ఆశ.. ఇక విషయానికి వస్తే, కర్ణాటక రాజకీయాల పరిణామాలు చూస్తున్నాం..

ycp 19052018 2

శ్రీరాములు, యెడ్యూరప్ప బీజేపీ తరుపున మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మల్యేలుగా ఎన్నిక అయ్యారు... ఒకరు సియం, మరొకరు డిప్యూటీ సియం అని చెప్పుకుని తిరుగుతున్నారు... ఈ నేపధ్యంలో, వారు మొన్నటి వరకు ఎంపీలుగా ఉన్నారు.. ఇప్పుడు ఎమ్మల్యేలుగా ప్రమాణస్వీకారం చేసే క్రమంలో, వారు ముందుగా ఎంపీ పదవులకు రాజీనామా చెయ్యాలి.. దీంతో వారు ముందుగా లోక్ సభ స్పీకర్ కు, రాజీనామా లేఖలు పంపించారు... అంతే వారు అలా పంపించారో లేదో, ఇలా రాజీనామాలు స్పీకర్ ఆమోదించారు... ఇక్కడ వరకు బాగానే ఉంది.. ఎవరు తప్పు బట్టరు.. అంతా పధ్ధతి ప్రకారం జరుగుతుంది..

ycp 19052018 3

అయితే, ఈ ఎంపీల రాజీనామాలు వెంటనే ఆమోదించిన స్పీకర్, వైసిపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదు ? అంటే అసలు వైసిపీ నేతల రాజీనామాలు నిజమా డ్రామానా ? లేకపోతే వీరు రాజీనామా ఇచ్చినా, స్పీకర్ ఆమోదించాలేదా ? ముందు ఇచ్చిన వీరి రాజీనామాల పై నిర్ణయం తీసుకోకుండా, ఈ రోజు ఇచ్చిన వారి పై నిర్ణయం తీసుకునే అవకాసం ఉంటుందా ? లేకపోతే ఇవన్నీ అమిత్ షా ఆడిస్తున్న నాటకాలా ? ఇంతలా దొరికిపోయిన తరువాత కూడా, జగన్ దీని గురించి ఎలా సమర్ధించుకుంటాడు ? నిజంగా రాష్ట్రం కోసం రాజీనామా చేస్తే, అవి ఇప్పటి వరకు ఎందుకు ఆమోదం పొందటం లేదు ? వేరే వారివి వెంటనే ఎందుకు ఆమోదం పొందాయి ? ఈ నాటకాలు ఎవరి కోసం ? వీటి పై ఎవరు సమాధానం చెప్తారు ? ప్రజలని ఇలా మభ్య పెడుతూ, దొంగ రాజీకయం చేస్తున్న జగన్, అమిత్ షా ల పై ప్రజలే సరైన నిర్ణయం తీసుకుని బుద్ధి చెప్తారు...

వెంకయ్య నాయుడు, మొన్నటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి కావాల్సిన సహాయం చేసిన కేంద్ర మంత్రి... తన సొంత శాఖలోనే కాక, మిగతా శాఖల్లో రాష్ట్రానికి సంబంధించిన పనులు చూసుకునే వారు... ఆయన ప్రాతినిధ్యం వహించిన పట్టణాభివృద్ధి శాఖలో చేతనైన సహాయం చేశారు... రాష్ట్రానికి ఇళ్ళ కేటాయింపు, అండర్గ్రౌండ్ డ్రైనేజికి నిధులు, అమరావతికి స్మార్ట్ సిటీ హోదా... ఇలా ఎన్నో పనులు చూసుకునే వారు... ఇలా ఉండగానే ఉప-రాష్ట్రపతిగా వెళ్ళిపోయారు... వెంకయ్యను ఇలా అర్ధాంతరంగా పంపించటం వెనుక చాలా ఊహాగానాలు వినిపించాయి... ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది... నష్టం మాత్రం రాష్ట్రానికి జరిగింది...

venkayya 19052018 2

ఉప రాష్ట్రపతి అంటే ఎదో రబ్బర్ స్టాంప్ అనుకున్నారు... చెప్పింది ఊ కొట్టి, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకున్నారు... రాజ్యసభని మైంటైన్ చేయటం అనుకున్నారు... కాని ఉప రాష్ట్రపతి హోదాలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తపిస్తున్నారు వెంకయ్య.. మోడీ, అమిత్ షా అసలు ఆంధ్రప్రదేశ్ విషయాలు కనీసం పట్టించుకోని సమయంలో, అవకాసం దొరికిన ప్రతి సారి వెంకయ్య, మన గురించి ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉందని 15వ ఆర్థికసంఘానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విభజన చట్టంలో చేసిన హామీలు, పార్లమెంట్‌లో ప్రకటించిన వాగ్దానాలను, ప్రత్యేక ప్యాకేజీని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.

venkayya 19052018 3

తమ విధివిధానాల పరిధిలో ఏపీ నిర్ధిష్ట అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్థిక సంఘం సభ్యులు ఆయనకు హామీ ఇచ్చారు. ఏపీతో సహా అనేక రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘం విధి విధానాల పట్ల అభ్యంతరాలు వ్యక్త పరిచిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌, సభ్యులతో విధివిధానాలు, దాని పర్యవసానాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై కమిషన్‌ అనుసరించే స్థూల సూత్రాలపై వివరంగా చర్చించారు. శుక్రవారం తన నివాసంలో ఆయన ఆర్థికసంఘం ఛైర్మన్‌ ఎన్‌కేసింగ్‌, సభ్యులు శక్తికాంతదాస్‌, రమేష్‌చంద్ర, అరవింద్‌ మెహతాలతో ఉపరాష్ట్రపతి భవన్‌లో దాదాపు గంటసేపు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నిబంధలకు విరుద్ధంగా గవర్నర్ వాజూభాయ్ వాలా నియమించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్‌తో కూడిన కాంగ్రెస్ న్యాయవాదుల బృందం రాత్రి 8 గంటల ప్రాతంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని తమ పిటిషన్‌ను రిజిస్ట్రార్‌కు అందజేసింది. దీనిపై తక్షణ విచారణ జరపాలని న్యాయవాదుల బృందం ఆ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌ సీజేఐ కార్యాలయానికి చేరడంతో సీజేఐ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన, ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దీని పై విచారణ చేస్తామని చెప్పారు.

jds 19052018 3

2010లో ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించిన బోపయ్య అప్పట్లో యడ్యూరప్పపై విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా ఆయన వ్యతిరేక ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని, తద్వారా ఆయనకు అనూకూలంగా వ్యవహరించారని, అయితే బోపయ్య నిర్ణయాన్ని ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిందని పిటిషన్‌లో న్యాయవాదుల బృందం పేర్కొన్నట్టు తెలుస్తోంది. 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేశ్‌పాండేకు బదులు మూడుసార్లు మాత్రమే ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేను, అందులోనూ గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ వాజూభాయ్ నియమించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

 

jds 19052018 2

బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తూ గవర్నర్ తీసుకున్ని నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరింది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు యడ్యూరప్ప బలపరీక్ష సమయంలో నిబంధనల ప్రకారం ప్రోటెం స్పీకర్ నిర్ణయం కీలకమవుతుంది. స్పీకర్‌కున్న అన్ని అధికారాలూ ప్రోటెం స్పీకర్‌కూ ఉంటాయి. ఇప్పటికే అమిత్ షా మోడీ అండతో, గవర్నర్ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. దీని పై సుప్రీం కోర్ట్ కూడా, మొట్టికాయలు వేసింది. అయినా సరే, మళ్ళీ ప్రోటెం స్పీకర్‌ విషయంలో నిబంధనలు తుంగలోకి తొక్కి, గవర్నర్ వ్యవహరించారు. మరి, తరువాత ఏమి అవుతుందో చూడాలి.

రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ఒక పధకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయనిముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. నిన్న పార్టీ సభ్యులతో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తుంటే, అతి పెద్ద కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ‘కొద్ది రోజుల క్రితం గుంటూరులో పనిగట్టుకుని విధ్వంసం సృష్టించారు. ఒక చిన్నారిపై జరిగిన అఘాయత్యాన్ని అడ్డం పెట్టుకొని విధ్వంసానికి ప్రణాళిక రచించారు. అంతకు ముందు తిరుపతిలో కూడా అటువంటి ప్రయత్నమే జరిగింది. ఆ తర్వాత తిరుమల పవిత్ర క్షేత్రంపై రమణ దీక్షితులు ద్వారా బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మరో పది కుట్రలకు పథక రచన చేస్తున్నారు" అని చంద్రబాబు అన్నారు.

cbn 19052018 2

'రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చిత్రించడం ద్వారా మన ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కుట్రలతో ప్రభుత్వంపైనా, టీడీపీపైనా చెడు అభిప్రాయం కలిగించి మనం చేసిన మంచి పనులపై నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని అనుకుంటున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి’ అని పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు విధ్వంసం పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారని తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. 3000 మంది జనం, 87 వాహనాలు రాత్రికి రాత్రి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

cbn 19052018 3

మూడు రోజుల కిందట బాలాజీనగర్‌కు చెందిన చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేయబోగా అది పాతగుంటూరు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆ ఘటన అంతగా మారటానికి ముగ్గురు నేతలు ఉన్నారని, అందువల్లే ఆ రోజున పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌ ముందు దాని పరిసరాల్లో అల్లర్లు జరిగాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు ఈ అల్లరకు ఆద్యుడిగా భావిస్తున్న కీలక యువకుడితో పాటు మొత్తం ఆరుగురిని గుర్తించారు. ఆరోజు వారు ఫోన్లు చేసి అప్పటికప్పుడు యువకులను పిలిపించినట్లు వారు వినియోగించిన సెల్‌ఫోన్ల కాల్‌డేటాను విశ్లేషించి తెలుసుకున్నారు. వీడియో ఫుటేజీల ఆధారంగా పోలీసులపై రాళ్లు రువ్వటం, అదనపు ఎస్పీ వాహనాన్ని పగలగొట్టినట్లు ఆధారాలు పోలీసులు సేకరించారు. విచారణ ఇంకా కొనసాగుతుంది.

Advertisements

Latest Articles

Most Read