జగన్ మోహన్ రెడ్డి పరువు చంద్రబాబు కాపాడటం ఏంటి ? ఇద్దరూ ప్రత్యర్ధులు కదా అనుకుంటున్నారా ? కానీ మీరు విన్నది నిజం. నిన్న జగన్ మోహన్ రెడ్డి పరువుని కాపాడింది చంద్రబాబే. నిన్న కేంద్ర జల శక్తి శాఖా మంత్రి షెకావత్ పోలవరం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గున్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధాన సమస్య నిర్వాసితుల సమస్య. అయితే ముందే ట్రైనింగ్ ఇచ్చిన కొంత మందిని తెప్పించుకుని, జగన్ తోపు, జగన్ తురం అని కేంద్ర మంత్రి ముందు డబ్బా కొట్టించుకున్నారు. ఇక్కడ వరకు బాగానే గట్టెక్కారు. అయితే కేంద్ర మంత్రి నిర్వాసితుల కాలనీలు చూసే ప్రోగ్రాం కూడా. అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది, ఇక్కడ జరగటానికి ? ఇక్కడ కూడా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. అందుకే అధికారులకు అద్భుతమైన ఐడియా వచ్చింది. గతంలో చంద్రబాబు హాయంలో దాదాపుగా పూర్తి చేసిన కాలనీలు ఎంపిక చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, దేవీపట్నం నిర్వాసితులకు, తూర్పు గోదావారి జిల్లా ఇందుకూరులో నిర్మించిన నిర్వాసితుల కాలనీకి, కేంద్ర మంత్రిని తీసుకుని వెళ్లారు. జగన్ మోహన్ రెడ్డి ఈ కాలనీలు గురించి కేంద్ర మంత్రికి వివరించారు.

jagan 05032022 2

ఎవరైనా ఏమి అనుకుంటారు ? జగన్ మోహన్ రెడ్డే కట్టాడు అనుకుంటారు కదా? ఈ రకంగా చంద్రబాబు చేసిన పనిని తన పనిగా కేంద్ర మంత్రికి చూపించుకున్నారు. జగన్ పరువుని, చంద్రబాబు తన పనితనంతో ఇలా కాపాడాడు. మూడేళ్ళ క్రితమే ఈ కాలనీని చంద్రబాబు హయాంలోనే పూర్తి చేసారు. ఏడాది క్రితం వరదలు వచ్చినప్పుడు, ఈ ఇళ్ళను నిర్వాసితులకు కేటాయించారు. అప్పుడు కూడా లోకేష్ ఇక్కడకు వెళ్లి, తాము కట్టిన కాలనీలకు కనీసం మౌళిక వసతులని ఈ ప్రభుత్వం రెండేళ్ళలో చేయలేక పోయిందని విమర్శలు కూడా చేసారు. ఈ కాలనీకి కొంచెం మెరుగులు అద్ది, నిన్న కేంద్ర మంత్రికి, జగన్ మోహన్ రెడ్డి తన పనిగా చూపించుకున్నారు. విషయం తెలియని కేంద్ర మంత్రి, జగన్ మోహన్ రెడ్డి బాగా కట్టారు అంటూ అభినంధించి, ప్రశంసించారు. టిడిపి హాయంలో 6,551 ఇళ్లు పూర్తి చేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క నిర్వాసితుడకి కూడా ఇళ్లు కట్టి ఇవ్వలేదు. ఏదైతేనేం చంద్రబాబు చేసిన పనిని, తన పనిగా చెప్పుకుని, జగన్ పరువు కాపాడుకున్నారు.

జగన్ మార్క్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందో, ఈ మధ్య గౌతం సవాంగ్ ని చూసిన అందరికీ అర్ధం అవుతంది. వాడుకుంటారు, వాడుకుంటారు, వాడుకుంటారు, చివరకు లాచి ఒకటి పీకుతారు. ఇది గౌతం సవాంగ్ ఒక్కడి విషయంలోనే కాదు, అంతకు ముందు ఎల్వీ సుభ్రమణ్యం, అలాగే పీవీ రమేష్, ఇలా అనేక మంది అధికారులను వాడుకుని, వదిలేయటంతోనే అయిపొయింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో జాస్తి నాగభూషణ్‌ చేరారు. ఆయనతో ఇక అవసరం లేదు అనుకున్నారో, లేదా మరే కారణమో కానీ, నెత్తిన పెట్టుకున్న వారే, ఇప్పుడు ఇంటికి పంపించి పడేయటంతో, జగన్ మార్క్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మరోసారి అర్ధం అవుతుంది. జాస్తి నాగభూషణ్‌, మాజీ సుప్రీం కోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్ కుమారుడు. ఈయనకుదాదపుగా రెండేళ్ళ క్రితం రాష్ట్ర అదనపు అడ్వకేట్‌ జనరల్ పదవి ఇచ్చారు. అయితే ఈ నియామకం పై అప్పట్లోనే అనేక చర్చలు జరిగాయి. ఆ తరువాత, ఈయనకు ఇష్టం వచ్చినట్టు పేమెంట్ లు ఇస్తూ, జీవోలు ఇవ్వటం పైన కూడా చర్చ జరిగింది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా, జాస్తి నాగభూషణ్‌ ను ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంది. అప్పట్లో వాళ్ళ అవసరాలు అలా ఉండేవి మరి. ఇప్పుడు ఈయనతో అవసరం లేదు అనుకున్నారో ఏమో కానీ, ఇపుడు పొగ బెట్టి సాగనంపారు.

jasti 05032022 2

అప్పట్లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే జస్టిస్ ఎన్వీ రమణ పైన, జాస్తి చలమేశ్వర్ సాయంతోనే, జగన్ ప్రభుత్వం , ఎన్వీ రమణ పైన ఎదురు దా-డి చేసింది అనే ప్రచారం ఉంది. జడ్జిల మీద ఫిర్యాదులు చేయటంలో, ఈయన సహాయం తీసుకున్నారు. ఆ సమయంలోనే జాస్తి చలమేశ్వర్ కుమారుడికి, పదవి ఒకటి కల్పించి మరీ ఇచ్చారు. ఈయన ఎక్కువగా ఢిల్లీలో ఉంటూ, జగన్ వ్యవహారాలు చక్క బెట్టే వారు. నేరుగా సియం ఆఫీస్ కు వెళ్ళేంత చనువు పొందారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఈ మధ్య కాలంలో జాస్తి నాగభూషణ్‌ ను పక్కన పెడుతూ వచ్చారు. సియం ఆఫీస్ లోకి ఎంట్రీ కూడా లేకుండా పోయింది. కేసులు కూడా ప్రభుత్వం తరుపున ఏమి ఇవ్వటం లేదు. వీటి అన్నిటిని నేపధ్యంలో, తనకు జరిగిన అవమాన భారాన్ని భరించ లేక, జాస్తి నాగభూషణ్‌ నిన్న తన పదవికి రాజీనామా చేసారు ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేసారు. జగన్ మోహన్ రెడ్డి వాడుకుని వదిలిసేన జాబితాలో, ఈయన కూడా చేరిపోయారు.

నిన్న అమరావతి విషయంలో హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతి విషయంలో అమరావతే రాజధాని అని హైకోర్టు చెప్పటం ఒక అంశం. ఇది రైతులకు, అమరావతి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో సంతోషించే అంశం. ఇక వైసీపీ వాళ్ళు, ఇది రాజకీయంగా వాడుకుందాం అనే ప్లాన్ లో ఉన్నారు. చంద్రబాబు మ్యానేజ్ చేసాడని, చంద్రబాబు మూడు ప్రాంతాలకు వ్యతిరేకం అని, అమరావతి చంద్రబాబు బినామీ అని ఇలా అనేకం చెప్పుకుంటూ ఉంటారు. అయితే వాళ్లకు దీని కంటే ముందు అర్ధం కాని విషయం, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కుంది. నిన్న హైకోర్టు ఇచ్చిన 300 పేజీల అమరావతి తీర్పులో అనేక సంచలన విషయాలు, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గుండె గుబేల్ మనే విషయాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేక పోతుంది. పనులు చేసే వాళ్ళు లేరు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఉంది. అప్పులు చేస్తే కానీ రోజు వారీ కూడా గడవని పరిస్థితి. ఆర్ధిక మంత్రి బుగ్గన ఢిల్లీ చుట్టూ అప్పుల కోసం తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు, జగన్ కు మామూలు షాక్ కాదనే చెప్పాలి.

jagan 040320221 2

ఇందులో కోర్టు ముఖ్యంగా చెప్పిన అంశం, అమరావతిని అభివృద్ధి చేయాలి, సీఆర్డీఏ చట్ట ప్రకారం, అందులో చెప్పిన అంశాలు, అలాగే చెయ్యాల్సిన పనులు చేసి తీరాల్సిందే అని కోర్టు చెప్పింది. నవ నగరాల నిర్మాణం పూర్తి చేయాలనీ చెప్పింది. రైతులకు ఆన్ని సౌకర్యాలతో భూములు అభివృద్ధి చేయాలని, అంటే డ్రైనేజి, రోడ్డులు, లైట్లు, విద్యుత్, తాగు నీరు ఇలా అన్నీ సదుపాయాలతో మూడు నెలల్లో వారికీ ప్లాట్లు ఇవ్వాలని తెలిపింది. రాజధాని నగరాన్ని ఆరు నెలల్లో నిర్మించాలని, ఒప్పందం ప్రకారం ఇది చేయాలని చెప్పింది. అలాగే భూములు అమరావతి రాజధాని కోసం తప్ప, దేనికీ కూడా తనఖా పెట్టటానికి వీలు లేదని చెప్పింది. పనులు పురోగతి ఎప్పటికప్పుడు కోర్టుకు చెప్పాలని కోర్టు తేల్చి చెప్పింది. ఇక అమరావతి పిటీషన్లు వేసిన వారికి, రూ.50వేల చొప్పున ఖర్చులకు ఇవ్వాలని కూడా కోర్ట్ చెప్పింది. అసలకే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న జగన్ ప్రభుత్వం, ఇవన్నీ ఎలా చేయాలి ? చేయకపోతే కోర్టు దిక్కరణ అవుతుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుంది ? కోర్టుని మరింత సమయం అడుగుతుందా ? లేక సుప్రీం కోర్టుకు వెళ్లి, ఈ తీర్పు రద్దు చేయాలని కోరుతుందా ? ఏమి జరుగుతుందో చూడాలి మరి.

గతంలో ఏసిబి డీజీగా పని చేసి, కొద్ది రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ డీజీగా నియమించబడ్డ పీఎస్‍ఆర్ ఆంజనేయులు, ఈ రోజు హైకోర్టు ముందుకు హాజరు అయ్యారు. గతంలో ఒక కేసు విచారణకు సంబంధించి, ఈ విచారణకు హాజరు అయ్యారు. ప్రకాశం జిల్లాలో ఒక విద్యా సంస్థ పై గతంలో రైడ్లు చేసి, ఆ రైడ్లలోని వ్యక్తులకు సంబంధించి, ఎలాంటి చార్జ్ షీట్ దాఖలు చేయటం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో చార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదని, ఇన్ని రోజులు పాటు ఎందుకు పెండింగ్ లో ఉంచుకున్నారు అని చెప్పి, హైకోర్టు వ్యాఖ్యానించింది. అవినీతి కేసుల్లో ఈ విధంగా జాప్యం చేయటం, సమంజసమా అని ప్రశ్నించింది. దీని పైన వివరణ ఇచ్చేందుకు, అప్పట్లో ఏసిబి డీజీగా ఉన్న పీఎస్‍ఆర్ ఆంజనేయులను నేరుగా హైకోర్టుకు హాజరు అయ్యి, సమాధానం చెప్పాలని చెప్పి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే ఈ రోజు పీఎస్‍ఆర్ ఆంజనేయులు హైకోర్ట్ కు హాజరు అయ్యారు. హైకోర్టుకు తన వివరణ ఇచ్చారు. ఈ కేసులో తాము చార్జ్ షీట్ దాఖలు చేసామని కోర్టుకు చెప్పారు. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి, చార్జ్ షీట్ దాఖలులో జాప్యం జరిగినందుకు, పీఎస్‍ఆర్ ఆంజనేయులు హైకోర్టుని క్షమాపణ కోరారు. ఈ విధంగా కేసు ఆలస్యం అయినందుకు, కోర్టుకు క్షమాపణ చెప్పారు.

psr 04032022 2

దీంతో, హైకోర్టు పీఎస్‍ఆర్ ఆంజనేయులను, వచ్చే వాయిదా నుంచి, కోర్టుకు రావాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. గతంలో కూడా ఈ కేసు హైకోర్టులో జరిగినప్పిటికీ, కింద కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే కింద కోర్టులో ఉన్నా కూడా, నేటి వరకూ కూడా కేసు విచారణ జరగుతున్నా కూడా, ఎలాంటి చార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయలేదు అంటూ, సదరు విద్యా సంస్థల చైర్మెన్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు ఈ కేసు పైన పది రోజుల క్రితం విచారణ నిర్వహించి, ఈ విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో ఇన్నేళ్ళు అయినా కూడా నేటి వరకు కూడా ఎందుకు చార్జ్ షీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. అదే విధంగా అవినీతి కేసులు దర్యాప్తు చేసేప్పుడు, నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే, వెంటనే చార్జ్ షీట్ వేయాలి కదా అని ప్రశ్నించింది. ఇది కేవలం దర్యాప్తుని సాగదేయాలనే ఉద్దేశమే అని కోర్టు వ్యాఖ్యానించింది.

Advertisements

Latest Articles

Most Read