ఎంత పెద్ద దొంగ అయినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు... దాంతో దొరికిపోతాడు... కాకపోతే, నిజంగా దొంగతం చేసే వారికి సిగ్గు అనేది ఉంటుంది... దొరికిపోయామనే, బాధతో, ఎక్కడో ఒక చోట పరివర్తన పొందుతారు... కాని మన ముందు ఉండే దొంగలకు దొరికానా సిగ్గు ఉండదు.. జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్నా, నిస్సిగ్గుగా రోడ్డుల వెంట ఊరేగుతూ, రాజకీయాలు చేస్తారు... ఇప్పుడు అలాంటి దొంగలు గురించి, వీళ్ళు ఎలా దొరికారో చెప్పుకుందాం... వాళ్ళు ఎలాగూ సిగ్గు పడరు కాబట్టి, కానీసం ప్రజలకు అయినా అవగాహన ఉంటే, ఇలాంటి వారికి సరైన స్థానం చూపిస్తారనే ఆశ.. ఇక విషయానికి వస్తే, కర్ణాటక రాజకీయాల పరిణామాలు చూస్తున్నాం..
శ్రీరాములు, యెడ్యూరప్ప బీజేపీ తరుపున మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మల్యేలుగా ఎన్నిక అయ్యారు... ఒకరు సియం, మరొకరు డిప్యూటీ సియం అని చెప్పుకుని తిరుగుతున్నారు... ఈ నేపధ్యంలో, వారు మొన్నటి వరకు ఎంపీలుగా ఉన్నారు.. ఇప్పుడు ఎమ్మల్యేలుగా ప్రమాణస్వీకారం చేసే క్రమంలో, వారు ముందుగా ఎంపీ పదవులకు రాజీనామా చెయ్యాలి.. దీంతో వారు ముందుగా లోక్ సభ స్పీకర్ కు, రాజీనామా లేఖలు పంపించారు... అంతే వారు అలా పంపించారో లేదో, ఇలా రాజీనామాలు స్పీకర్ ఆమోదించారు... ఇక్కడ వరకు బాగానే ఉంది.. ఎవరు తప్పు బట్టరు.. అంతా పధ్ధతి ప్రకారం జరుగుతుంది..
అయితే, ఈ ఎంపీల రాజీనామాలు వెంటనే ఆమోదించిన స్పీకర్, వైసిపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదు ? అంటే అసలు వైసిపీ నేతల రాజీనామాలు నిజమా డ్రామానా ? లేకపోతే వీరు రాజీనామా ఇచ్చినా, స్పీకర్ ఆమోదించాలేదా ? ముందు ఇచ్చిన వీరి రాజీనామాల పై నిర్ణయం తీసుకోకుండా, ఈ రోజు ఇచ్చిన వారి పై నిర్ణయం తీసుకునే అవకాసం ఉంటుందా ? లేకపోతే ఇవన్నీ అమిత్ షా ఆడిస్తున్న నాటకాలా ? ఇంతలా దొరికిపోయిన తరువాత కూడా, జగన్ దీని గురించి ఎలా సమర్ధించుకుంటాడు ? నిజంగా రాష్ట్రం కోసం రాజీనామా చేస్తే, అవి ఇప్పటి వరకు ఎందుకు ఆమోదం పొందటం లేదు ? వేరే వారివి వెంటనే ఎందుకు ఆమోదం పొందాయి ? ఈ నాటకాలు ఎవరి కోసం ? వీటి పై ఎవరు సమాధానం చెప్తారు ? ప్రజలని ఇలా మభ్య పెడుతూ, దొంగ రాజీకయం చేస్తున్న జగన్, అమిత్ షా ల పై ప్రజలే సరైన నిర్ణయం తీసుకుని బుద్ధి చెప్తారు...