ఆపరేషన్ గరుడ.... రాష్ట్రంలో అనిశ్చితి తీసుకోరాలి... దాని కోసం, కులాల మధ్య, మతాల మధ్య కొట్లాటలు పెట్టాలి... కొన్ని వర్గాలని చంద్రబాబుకి బద్ధ వ్యతిరేకంగా తయారు చెయ్యాలి... అందుకోసం, వీళ్ళు ఇప్పటికే కొన్ని వర్గాలను టార్గెట్ గా పెట్టుకున్నారు.. ఐవైఆర్, ముద్రగడ లాంటి వారు ఎలాగూ బహిరంగంగానే పని చేస్తున్నారు... వీళ్ళ అసలు రంగు అందరికీ తెలుసు కాబట్టి, సొంత సామాజిక వర్గం వారే ఛీ కొట్టే పరిస్థితి, అందుకే రోజుకి ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది... బురద జల్లుతుంది, మిగతా పని ప్రశాంత్ కిషోర్ బీహార్ బ్యాచ్, దేవ్ చింతలబస్తీ బ్యాచ్, బీజేపీ పైడ్ బ్యాచ్ చూసుకుంటుంది.. తాజగా తిరుమల వేదికగా అతి పెద్ద కుట్ర చేస్తున్నారు.. 10 రోజుల క్రితం, తిరుమల కొట్టేయటానికి కేంద్రం ప్లాన్ వేసింది.. ప్రజల ఆగ్రహంతో వెనక్కు తగ్గారు.. దీని మీద వైసీపీ, జనసేన, బీజేపీ మాట్లాడవు...

heritage 18052018 2

ఈ ప్రజా ఆగ్రహం నుంచి డైవర్ట్ చెయ్యటానికి, తిరుమలలో ఉన్న మరో స్లీపర్ సెల్ ఆక్టివేట్ అయ్యాడు... ఆయినే ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు.. మొన్న అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు, 40 నిమషాలు ఈయనతో సమావేశం అయ్యారు... కట్ చేస్తే, సడన్ గా వెళ్లి చెన్నై లో ప్రెస్ మీట్ పెట్టి, తిరుమలలో ఘోరాలు జరిగిపోతున్నాయి అని హడావిడి చేసారు... ఈయన గతంలో చేసిన ఘనకార్యాలు, ఇంకా ప్రజలకు గుర్తు ఉంది... అప్పట్లో వైఎస్ఆర్ ఇంటికి వెళ్లి, పూజలు చెయ్యటం... ముకేష్ అంబానీ గెస్ట్ హౌస్ కు వెళ్లి ఆశీర్వాదం అందిచటం లాంటి ఎన్నో సంఘటనలు, ప్రధాన అర్చుకుడిగా చేసి, అదే చేత్తో వచ్చి స్వామి వారికి పూజలు చేసిన ఈ ఘనుడు, వైఎస్ఆర్ హయాంలో జరిగిన స్వమి వారి బంగారం మాయం గురించి, రెండు కొండలు జీఓ గురించి, ఏ నాడు నోరు విప్పలేదు...

heritage 18052018 3

అమిత్ షా ఏమి చెప్పాడో ఏమో కాని, చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి, అసలు తిరుమలలో ఘోరాలు జరిగిపోతున్నాయి అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు... ఆయన పని అక్కడితో అయిపొయింది, తరువాత పని ప్రశాంత్ కిషోర్ బీహార్ బ్యాచ్, దేవ్ చింతలబస్తీ బ్యాచ్, బీజేపీ పైడ్ బ్యాచ్ ది... తిరుమలలో హెరిటేజ్ నెయ్యి మాత్రమే వాడాలి అని హుకం జారీ చేసారని, 100 కోట్లు హెరిటేజ్ కు కట్టబెడుతున్నారని విపరీతమైన విష ప్రచారం చేస్తున్నారు... అయితే వాస్తవం ఏంటి అంటే, గత నాలుగు ఏళ్ళు హెరిటేజ్ వార్షిక నివేదికలు చుస్తే, నాలుగు ఏళ్ళలో హెరిటేజ్ supplies 40 లక్షలు మాత్రమే ఉన్నాయి.. అది కూడా కొన్ని సందర్భంల్లో ఓపెన్ టెండర్ లో, మజ్జిగ సరఫరా చేసారు... తిరుమలకు కావాల్సింది ఆవు నెయ్యి.. అంత నెయ్యి ఆంధ్రా తెలంగాణాలో ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు అందుకే 2015 వరకు కర్ణటక మిల్క్ ఫెడెరేషన్ నుంచి నెయ్యి సప్లై చేసేవారు... https://bangaloremirror.indiatimes.com/bangalore/others/Tirupati-laddu-Tirumala-Tirupati-Devasthanams-TTD/articleshow/49159208.cms

2016 నుంచి, ప్రతి ఆరు నెలలకు టెండర్ పిలిచి, నెయ్యి సప్లై చేసుకుంటున్నారు.. అప్పటి నుంచి మహారాష్ట్రకు చెందిన Govind Milk and Milk Products Pvt Ltd (http://www.dnaindia.com/india/report-renowned-tirupati-laddus-now-use-ghee-from-maharashtra-2130312), హర్యానాకు చెందిన Karnal Milk foods Ltd (http://news.tirumala.org/common-devotees-to-get-priority-during-srivari-brahmotsavam-ttd-chairman-dr-ch-krishnamurthy/) నెయ్యి సరఫరా చేసారు... ఇది జనవరిలో పిలిచిన టెండర్ http://www.tirumala.org/Documents/201801122004418779.pdf.. ఈ నిబంధనలకు అసలు హెరిటేజి సరిపోదు.. ఎందుకంటే, హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి ఇంత పెద్ద ఎత్తున సరఫరా చేసే క్యాపెసిటీ లేదు కాబట్టి... అలాంటిది, ఈ మూడు బ్యాచ్ లు కలిసి, ఇలా విష ప్రచారం చేస్తున్నాయి... తద్వారా, ఒక వర్గాన్ని, దూరం చెయ్యటానికి చేస్తున్న విష ప్రచారం ఇది.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఒక కార్పొరేషన్ పెట్టి, ఆ పేదలను చంద్రబాబు ఆదుకుంటున్నారు, అండగా ఉంటున్నారు కాబట్టి, వారిని దూరం చెయ్యటానికి, ఇలాంటి వేషాలు వేస్తున్నారు... ఈ మూడు పార్టీలు చేస్తున్న విష ప్రచారం గురించి, ఒకటికి రెండో సార్లు అలోచించి, ప్రజలు ఒక అభిప్రాయానికి రావాలి... లేకపోతే రాష్ట్రంలో వారు చెయ్యాలి అనుకున్న ఆపరేషన్ చేసి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, కులాల మధ్య కొట్టుకునేలా చేస్తారు... మన నవ్యాంధ్రని ప్రగతి వైపు వెళ్ళకుండా ఉత్తరాది పార్టీ చేస్తున్న కుట్రకు, మన రాష్ట్రంలో పార్టీలు ఎలా సహకరిస్తున్నాయో అర్ధం చేసుకోండి... అయినా ఇంత విష ప్రచారం జరుగుతుంటే, అధికార తెలుగుదేశం ఏమి చేస్తుంది ? టిటిడి అధికారులు ఏమి చేస్తున్నారు ? ఇలాంటి విష ప్రచారాలు ఖండించే పని లేదా ?

జనతాదళ్(లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు తన తనయుడు రేవణ్ణ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా, ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ…న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సభలో మెజారిటీ లేకుండా అధికారం కోసం అర్రులు చాచిన బీజేపీకి సుప్రీం తీర్పు చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. బల నిరూపణలో యెడ్యూరప్ప విఫలం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. మరో పక్క, పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శనం కోసం ఆలయంలో ఉన్న సమయంలో దేవెగౌడకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

modigowda 18052018 2

ప్రధాని మోదీ ఫోన్‌ చేసిన విషయాన్ని దేవెగౌడ తనయుడు రేవణ్ణ ధృవీకరించారు. ‘మన మాజీ ప్రధాన మంత్రి శ్రీ దేవెగౌడ జీ తో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భాజపాకు, కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు మధ్య అధికారం కోసం పోరాటం జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడకు ప్రధాని ఫోన్‌ చేసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

modigowda 18052018 3

ఇది ఇలా ఉండగా, జేడీఎస్‌ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి గురువారం చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. 1984లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని చెప్పారు. ‘161 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కర్టాటకలోని నంది హిల్స్‌లో క్యాంప్‌కు వెళ్లాం. అసెంబ్లీలో బల నిరూపణ సమయం వరకూ ఒక్కరు కూడా మా నుంచి విడిపోలేదు. మీరు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’ అని కుమారస్వామికి సలహా ఇచ్చారు. జేడీఎస్-కాంగ్రెస్‌ కూటమికి మెజారిటీ ఉన్నా తమను కాదని.. ప్రభుత్వ ఏర్పాటుకు అప్రజాస్వామికంగా గవర్నర్‌ బీజేపీకి అవకాశం ఇచ్చారని జేడీఎస్‌ నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్‌ నిర్ణయం అప్రజాస్వామికమని దేశమంతా భావిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

బీజేపీకి సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది... 15 రోజుల టైంతో, మ్యానేజ్ చెయ్యాలి అని చుసిన బీజేపీకి చుక్కు ఎదురు అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో రెండో రోజువిచారణ జరిగింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం భావించింది. ఈ ఉదయం 10.30గంటలకు సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ యడ్యూరప్ప గవర్నర్‌ను కోరిన లేఖలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో భాజపా తరఫున వాదిస్తున్న ముకుల్‌ రోహత్గి ఆ లేఖలను కోర్టుకు అందించారు.

supreme 18052018 2

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని, బలపరీక్షలో దీన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రోహత్గి తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఇంతకంటే ఏం చెప్పలేమన్నారు. కాగా.. గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం తేలాలంటే బలపరీక్షే సరైన మార్గం అని న్యాయస్థానం భావిస్తోంది. రేపే బలపరీక్ష పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. దీనికి కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూడా అంగీకరించాయి. ‘ఎవర్ని పిలిచారు అన్నదాన్ని పక్కనబెడితే బలపరీక్షే దీనికి పరిష్కారం. శాసనసభలోనే బలాబలాలు తేలాలి. బలపరీక్ష రేపే నిర్వహిస్తే ఏమవుతుంది’ అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.

supreme 18052018 3

ఈ సందర్భంగా ఏజీ రోహత్గి స్పందిస్తూ.. బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. తాము ఎవరికీ సమయం ఇవ్వాలనుకోవడం లేదని వ్యాఖ్యానించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టును కోరారు. కానీ దీనిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలు తమ చేతులు పైకి ఎత్తడం ద్వారా మద్దతు తెలియజేయాలని, ఎమ్మెల్యేల సంఖ్యను స్పీకర్ లెక్కించాలని తీర్పు చెప్పింది.

బీజేపీ వ్యవస్థలను ఎలా దిగాజారుస్తుందో చూస్తున్నాం... రాష్ట్రానికి ఒక చట్టం, ప్రాంతానికి ఒక న్యాయం, తాము ఏది అనుకుంటే అది, అది చేస్తున్నారు మోడీ - అమిత్ షా.. తమకి ఏది నచ్చితే అదే చేస్తున్నారు.. అదే చట్టం అంటున్నారు... ఇక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే కరెక్ట్ అంటూ, ఎగబడి పోతున్నారు.. ఎవరు ప్రశ్నించినా వారు తెలుగుదేశం పార్టీ అనో, దేశద్రోహి అనో ముద్ర వేసి, తప్పించుకుంటున్నారు... కర్ణాటక ఎన్నికల ఫలితాలు తరువాత, ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చూస్తున్నాం... గవర్నర్ ని అడ్డు పెట్టుకుని, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.. డబ్బు, అధికార మదంతో, ఏమి చేస్తున్నారో వారికే తెలియటం లేదు.. ఇదే పధ్ధతి సుప్రీం కోర్ట్ లో చేద్దాం అనుకుని, బొక్క బోర్లా పడ్డారు...

supreme 18052018 2

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ సందర్భంలో, బీజేపీ తరుపున లాయర్ చేసిన వాదనలు ఆశ్చర్యం కలిగించాయి.. రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో, బీజేపీకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, వింత వాదన చేసింది.. ముందుగా బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని కోరింది... అంటే బేరసారాలు చేసుకోవటానికి, దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు, కాని ఓటింగ్ విషయంలో వీరు చేసిన వాదనతో, సుప్రీం కోర్ట్ కూడా ఆశ్చర్యపోయింది...

supreme 18052018 3

అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టును కోరారు... దీంతో సుప్రీం కోర్ట్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది... ఇదేమి కొత్త పద్ధతి అంటూ చురకలు అంటించింది... ఇలా ఎప్పుడూ జరగలేదు కదా, కొత్తగా ఇదేంటి అంటూ ఆగహ్రం వ్యక్తం చేసింది. దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలు తమ చేతులు పైకి ఎత్తడం ద్వారా మద్దతు తెలియజేయాలని, ఎమ్మెల్యేల సంఖ్యను స్పీకర్ లెక్కించాలని తీర్పు చెప్పింది.. దీంతో మరోసారి బీజేపీ వైఖరి బయట పడింది... రహస్య ఓటింగ్ పెడితే, ఎవరు ఎవరికీ ఓటు వేసారో తెలియదు.. అప్పుడు ఫిరాయింపు చట్టం అనేది రాదు... అందుకే బీజేపీ ఈ ఎత్తు వేసింది... కాని సుప్రీం ఇలాంటివి కుదరవు అంటూ, బీజేపీ విజ్ఞప్తిని తోసి పుచ్చింది...

Advertisements

Latest Articles

Most Read