సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి కర్నూలు విమానాశ్రయంగా నామాకరణం చేయడం జరిగిందని ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సీఆర్డీఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎయిర్ పోర్టు (ఓర్వకల్లు) పనులను వచ్చే జూన్ నెరాఖరులోగా పూర్తి చేసి రన్వే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక అక్టోబర్ మాసం నుండి కర్నూలు-విజయవాడ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు - విజయవాడకు అతి తక్కువ టిక్కెట్ ధర రూ.1500కే జిల్లా ప్రజలకు విమానయ ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.
కర్నూల్ జిల్లా లో ఓర్వకల్లు సమీపాన విమానాశ్రయ పనులు వేగవంతం చేసారు.. అక్టోబరు నాటికి పూర్తిచేసి, డిసెంబరుకు ప్రయాణాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు , జూన్ 30వతేదీ నాటికి రన్వే పనులు పూర్తి చేస్తారు.. టర్మినల్ బిల్డింగ్, ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత డిసెంబరు ఆఖరు లోగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు..
రూ.1500 ఛార్జీతో 35 నిమిషాల్లో విజయవాడ చేరుకునే అవకాశం ఉంది..నెల్లూరు, పుట్టపర్తిలో విమానాశ్రయ పనులు జరుగుతున్నాయి..పుట్టపర్తి నుంచి జూన్ నుంచి విజయవాడకు విమాన ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.. కర్నూల్ జిల్లాలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. ఈ సెప్టెంబర్ లో ఓర్వకల్లు లో విమానాశ్రయం ప్రారంభం కానుందని ప్రకటించారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.