గత అర్థరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించగా వైసీపీ నేత యలమంచిలి రవి అడ్డుకున్నారు. మాకు చెప్పకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ పనుల కోసమే విగ్రహాన్ని తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. అయినా యలమంచిలి రవి అక్కడే కూర్చుని హంగామా చెయ్యగా... అతనిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత కాకాని విగ్రహాన్ని అధికారులు తొలగించారు. అయితే ఈ విషయం పై రచ్చ రచ్చ చెయ్యాలని, వైసిపే ప్లాన్ చేసింది. ఈ రోజు ఉదయం, ఎదో జరిగిపోయింది అంటూ, సాక్షి టీవీలో హంగామా చేసారు.. కాని ప్రజలు మాత్రం, అర్ధం చేసుకున్నారు..

benzzcricel 13052018

ఒక పక్క ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది, మరో పక్క బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, అందుకే విగ్రహం తీసి ఉంటారు.. అయినా ఫ్లై ఓవర్ మొదలు పెట్టిన సమయంలో ఇది తెలిసిందే కదా, ఈ హంగామా ఎందుకు అని ప్రజలు లైట్ తీసుకున్నారు.. దీంతో మధ్యానం వరకు హడావిడి చేసిన వైసిపీ నేతలు, ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవటంతో, అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు... దీని పై, మంత్రి దేవినేని ఉమా స్పందించారు. బెంజ్ సర్కిల్‌లో ఫ్లై ఓవర్ పిల్లర్ పనులు పూర్తయిన తర్వాత కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని దేవినేని చెప్పారు. విగ్రహ తొలగింపుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ సర్కిల్‌కు కాకాని పేరు పెడతామన్నారు.

benzzcricel 13052018

కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని మళ్లీ అక్కడే ప్రతిష్టిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విగ్రహం తొలగింపుపై యలమంచిలి రవి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్లై ఓవర్ పనుల కోసం తొలగించాల్సి వచ్చిందని అన్నారు. విగ్రహం తొలగించే విషయం కాకాని మనవడికి, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు చెప్పామని గద్దె రామ్మోహన్ తెలిపారు. మళ్లీ విగ్రహం ప్రతిష్టించాలని కాకాని మనవడు కూడా కోరారని, ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యాక కాకాని విగ్రహం ప్రతిష్టిస్తామని ఆయనకు చెప్పినట్లు గద్దె వెల్లడించారు. ఈ పరిణామాలతో, వైసిపీ ఆవక్కయ్యింది.. అనవసరంగా చిన్న విషయం పై ఓవర్ రియాక్ట్ అయ్యం అంటూ, నాలుక కరుచుకున్నారు.. ఎదో జరిగిపోయింది అని జగన్ కు కూడా ఫోన్ చేసి చెప్పాం, రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చెయ్యవచ్చు అని జగన్ తో చెప్పాం, ఇప్పుడు ఏమి చెప్పాలి అంటూ బెజవాడ వైసిపీ నేతలు ఆందోళన చెందుతున్నారు...

ఈ రోజు మధర్స్ డే.. సోషల్ మీడియాలో, మధర్స్ డే విషెస్ హోరెత్తుతున్నాయి... ఇదే సందర్భంలో, మన రాష్ట్రం నుంచి అమెరికాలో చదువుకుంటున్న ఒక యువకుడు, తన తల్లికి మధర్స్ డే గిఫ్ట్ అంటూ, తాను గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాను అని, మధర్స్ డే రోజు, నా తల్లికి, తండ్రికి అంకితం అంటూ పోస్ట్ చేసాడు... అంతే కాదు, నాకు అమెరికాలో, కాపు కార్పొరేషన్ ద్వారా చదువుకునే అవకాసం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు అంటూ, తన జీవితంలో, చంద్రబాబుని, అతని తల్లి, తండ్రి తరువాత, అంతటి గుర్తింపు ఇచ్చాడు ఈ యువకుడు. ఈ సంఘటన, నిజంగా ఒక కనువిప్పు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల పిచ్చ ఉంది అనే వారికి చెంప పెట్టు...

cbn kapu 13052018 2

రాజకీయంలో మునిగి తేలే వారికి, ఆ కుల పిచ్చ ఉందేమో కాని, నిజంగా లబ్ది పొందుతున్న వారికి, ఏ రకమైన కుల పిచ్చ లేదు... నవ్యాంధ్రకు అభివృద్ధి ఎంత ముఖ్యమో, సంక్షేమం కూడా అంతే ముఖ్యం అని నమ్మిన చంద్రబాబు, ఆ దిశగా సరి కొత్త పధకాలు ప్రవేశ పెట్టారు.. తాను హామీ ఇచ్చినట్టుగా కాపు కార్పొరేషన్ పెట్టి, ఎంతో మంది యువతకు సహాయ పడుతున్నారు... అందులో ఒక పధకం, ఈ విదేశీ విధ్య... విదేశాల్లో ఎక్కడ కావలి అంటే అక్కడ చదివిస్తాను, మీరు బాగా చదువుకోండి అని భరోసా ఇచ్చారు... కాపులకే కాదు, అన్ని కులాలకి ఈ పధకం ఉంది... ఇంకెవరైన చంద్రబాబు తన వర్గం వారికే, తన కులం వారికే, చేస్తున్నాడు అంటే, ఇది చూపించి వాళ్ళ బుర్రలో ఉన్న బూజు దులపండి.

cbn kapu 13052018 3

చంద్రబాబు అందరివాడు..అందరి బాగు కోసం పరితపించేవాడు. అందరి సహకారం ఉంటేనే, నవ్యాంధ్ర ముందుకు వెళ్తుంది అని నమ్మే వాడు.. అందుకే, అన్ని వర్గాల ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా, వారు నిలదొక్కుకునే విధంగా ఊతం ఇస్తున్నారు. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు, నైపుణ్యాభివృద్ధికి శిక్షణ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు, విద్యార్థులు విద్యోన్నతి పథకం ద్వారా వివిధ ప్రవేశ పరీక్షలకు, ఉద్యోగులకు శిక్షణ, విదేశాలలో విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ తన వంతు కృషిచేస్తోంది. ఇలాంటి చోట కుల రాజకీయాలతో ఎదో జరిగిపోతుంది అని భ్రమ పడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి... మా రాష్ట్రంలో కుల పిచ్చ లేదు, కృతజ్ఞత మాత్రమే ఉంది..

రాష్ట్ర విభజనలో నష్టపోయిన రాష్ట్రానికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది. అది చట్టంలో ఉంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ కి, ఏ నాడు రూపాయి అడ్వాన్సు గా ఇవ్వలేదు కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. కేంద్రం ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తుంది. అది కూడా టైంకు ఇవ్వదు. ఎప్పటికో ఇస్తుంది. దీని వల్ల కనీసం ఏడాదికి, వడ్డీ రూపంలో 300 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై భారం పడుతుంది. తాజాగా మారిన పరిస్థితుల్లో, అసలు రూపాయి కూడా కేంద్రం ఇవ్వటం లేదు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1098 కోట్లను రీయింబర్స్‌ చేస్తున్నట్లుగా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

polavaram 13052018 2

అప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని ఒకసారి.. అరుణ్ జైట్లీకి ఆపరేషన్ జరిగిందని ఒకారి చెప్పి తప్పించుకున్నారు. కొన్ని రోజుల క్రితం, ఇదిగో ఇస్తున్నాం అని ఒక ప్రకటన ఇచ్చారు.. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తోన్న ప్రభుత్వానికి... కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కొత్తగా మరోషాక్‌ ఇచ్చింది. ఈ నిధులు విడుదల చేయాలంటే నాబార్డు, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చేసుకున్న మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్స్‌(ఎంవోఏ)కు సవరణ చేయాలని, కొత్తగా కొన్ని అంశాలను చేర్చాల్సి ఉందని పేర్కొంది.

polavaram 13052018 3

దీంతో.. ఆ ఒప్పంద సవరణలను ఈ నెల 4వ తేదీన కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వద్ద ఈ ఫైలు పెండింగ్‌లో ఉంది. అక్కడి నుంచి కేంద్ర జల వనరులశాఖకు, అనంతరం నాబార్డుకు ఈ ఫైలు చేరి... రీయింబర్స్‌మెంట్‌ కావాల్సిన రూ.1098 కోట్లు పీపీఏ ద్వారా రాష్ట్రానికి వచ్చే సరికి మరో 15 రోజులైనా పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వచ్చినప్పుడు ఎంవోఏను సవరించాలని భావిస్తే తప్పులేదుగానీ... ఇప్పటికే రీయింబర్స్‌మెంట్‌కు ఆమోదం తెలిపిన రూ.1098 కోట్ల విడుదలకు కొత్తగా ఎంవోఏను సవరించాలని కేంద్రం నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా, కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్ - 2017కు త్వరలో మోక్షం లభించనుంది అంటూ వార్తలువ్ అస్తున్నాయి. ఈ బిల్ అన్ని కీలక దశలు దాటుకొని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) వద్దకు చేరుకుంది. ప్రధాని ఆమోదిస్తే కాని, రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి బిల్ ఆమోదం పొందదు. ఇదంతా లాంఛనప్రాయమేనని అధికార వర్గాలు చెప్తున్నా, ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితిలో మోడీ, ఈ బిల్ ను ఆమోదిస్తారా లేదా అనేది సస్పెన్స్ లో పడింది. యూపీఏ సర్కారు చివరి దశలో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూములను సేకరించడం దాదాపు అసాధ్యంగా మారింది.

ap bill 13052018

దీంతో అనేక రాష్ట్రాలు దానికి సవరణలు తీసుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2017లో ఈ చట్టాన్ని సవరించింది. ఈ బిల్లును గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అంతకు ముందే గుజరాత్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా సొంతంగా భూసేకరణ బిల్లులు రూపొందించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాయి. అవన్నీ 2016లో కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లోని అంశాలతోనే రూపొందాయి. ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేసి భూములను కోల్పోయిన రైతులకు రెట్టింపు పరిహారం వంటి అంశాలను జోడించింది. ఇప్పటిదాకా గుజరాత్‌, తెలంగాణ బిల్లులే రాష్ట్రపతి ఆమోదం పొందాయి. వీటిని కేంద్ర వ్యవసాయ శాఖతో సంబంధం లేకుండా నేరుగా హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పీఎంవో ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేశారు.

ap bill 13052018

ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల బిల్లులను అలా కాకుండా నేరుగా కేంద్ర వ్యవసాయ శాఖ పరిశీలనకు పంపించారు. ఏపీ బిల్లులో సామాజిక ప్రభావ అంచనా, ఆహార భద్రత వంటి అంశాలను పట్టించుకోలేదని పెండింగ్‌లో పెట్టారు. ఇదే అంశంపై గత నెల 12న ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, రెవెన్యూశాఖ ఓఎ్‌సడీ రామ్‌ప్రసాద్‌లు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సత్యపాల్‌ చౌహాన్‌తో చర్చలు జరిపారు. ఈ భేటీకి కేంద్ర వ్యవసాయ, న్యాయ శాఖల అధికారులను కూడా పిలిపించారు. ఈ భేటీలో ఏపీ ప్రతినిధులు తన వాదనలను గట్టిగా వినిపించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లోని క్లాజులనే తాము చేర్చామని, ఇదే పంథాలో రూపొందించిన గుజరాత్‌, తెలంగాణ బిల్లులను ఆమోదించి తమది నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఈ బిల్లును అంగీకరించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ, హోం శాఖ ఒప్పుకొన్నాయి.

Advertisements

Latest Articles

Most Read