గత అర్థరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించగా వైసీపీ నేత యలమంచిలి రవి అడ్డుకున్నారు. మాకు చెప్పకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ పనుల కోసమే విగ్రహాన్ని తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. అయినా యలమంచిలి రవి అక్కడే కూర్చుని హంగామా చెయ్యగా... అతనిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత కాకాని విగ్రహాన్ని అధికారులు తొలగించారు. అయితే ఈ విషయం పై రచ్చ రచ్చ చెయ్యాలని, వైసిపే ప్లాన్ చేసింది. ఈ రోజు ఉదయం, ఎదో జరిగిపోయింది అంటూ, సాక్షి టీవీలో హంగామా చేసారు.. కాని ప్రజలు మాత్రం, అర్ధం చేసుకున్నారు..
ఒక పక్క ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది, మరో పక్క బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, అందుకే విగ్రహం తీసి ఉంటారు.. అయినా ఫ్లై ఓవర్ మొదలు పెట్టిన సమయంలో ఇది తెలిసిందే కదా, ఈ హంగామా ఎందుకు అని ప్రజలు లైట్ తీసుకున్నారు.. దీంతో మధ్యానం వరకు హడావిడి చేసిన వైసిపీ నేతలు, ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవటంతో, అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు... దీని పై, మంత్రి దేవినేని ఉమా స్పందించారు. బెంజ్ సర్కిల్లో ఫ్లై ఓవర్ పిల్లర్ పనులు పూర్తయిన తర్వాత కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని దేవినేని చెప్పారు. విగ్రహ తొలగింపుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ సర్కిల్‌కు కాకాని పేరు పెడతామన్నారు.
కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని మళ్లీ అక్కడే ప్రతిష్టిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విగ్రహం తొలగింపుపై యలమంచిలి రవి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్లై ఓవర్ పనుల కోసం తొలగించాల్సి వచ్చిందని అన్నారు. విగ్రహం తొలగించే విషయం కాకాని మనవడికి, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు చెప్పామని గద్దె రామ్మోహన్ తెలిపారు. మళ్లీ విగ్రహం ప్రతిష్టించాలని కాకాని మనవడు కూడా కోరారని, ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యాక కాకాని విగ్రహం ప్రతిష్టిస్తామని ఆయనకు చెప్పినట్లు గద్దె వెల్లడించారు. ఈ పరిణామాలతో, వైసిపీ ఆవక్కయ్యింది.. అనవసరంగా చిన్న విషయం పై ఓవర్ రియాక్ట్ అయ్యం అంటూ, నాలుక కరుచుకున్నారు.. ఎదో జరిగిపోయింది అని జగన్ కు కూడా ఫోన్ చేసి చెప్పాం, రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చెయ్యవచ్చు అని జగన్ తో చెప్పాం, ఇప్పుడు ఏమి చెప్పాలి అంటూ బెజవాడ వైసిపీ నేతలు ఆందోళన చెందుతున్నారు...