తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్ వస్తున్న సమయంలో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తిరుపతి ప్రజలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.. అయితే, ఆ సమయంలో బీజేపీ నేతలు దాడి చెయ్యటంతో, తెలుగుదేశం శ్రేణులు కూడా ఎదురుతిరిగి, వారి పై దాడి చేసిన వారి, కారు అద్దాలు పగలగొట్టిన విషయం తెలిసిందే... దీని పై, అమిత్ షా కార్ పై దాడి జరిగింది అంటూ, వీర్రాజు, విశాఖ రాజు, తెగ బాధపడుతూ, ఎదో జరిగిపోయింది అంటూ, పెర్ఫార్మన్స్ ఇరగదీస్తున్నారు.. అయితే, ఆ బీజేపీ వారికి మించిన పెర్ఫార్మన్స్, ఈ రోజు జగన్ ఇచ్చారు... ఆయన బాస్ అమిత్ షా పై, నిరసన తట్టుకోలేని జగన్, తన బాస్ పై దాడి జరిగింది అంటూ, దారుణం అంటూ, కైకలూరులో స్పందించారు...

jagan 12052018 2

ఇప్పటి వరకు అమిత్ షా పేరు కూడా తలవని జగన్, మొదటి సారి అమిత్ షా పేరు తలవటంతో అందరూ ఆశ్చర్యపోయారు... విభజన హామీల అమలు కోసం, ఒక్కసారి కూడా, అమిత్ షా ని కాని, మోడీ ని కాని ఇప్పటి వరకు జగన్ తలవని విషయం తెలిసిందే.. అయితే, అమిత్ షా పై, తెలుగుదేశం నిరసన విషయంలో మాత్రం, ఖండఖండాలుగా ఖండించారు జగన్.. రుమలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై సీఎం చంద్రబాబే దాడి చేయించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ఆ పని తానే చేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పలేకపోయారని, అమిత్ షాపై దాడిని ఖండించి తూచ్ అనిపించారని అన్నారు.

jagan 12052018 3

ఈ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా కైకలూరు గాంధీబొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ... అమిత్ షా వాహన శ్రేణిపై రాళ్లు వేయడం తనకు ఆశ్చర్యమేసిందన్నారు. రాక్షసుడు మనిషిగా పుడితే ఎలా ఉంటాడో చంద్రబాబే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తాను ఎంతో శాంతి స్వరూపుడుని అని, ఇలాంటి దాడులు, ఎప్పుడూ చూడలేదని, దారుణం అంటూ, బాధపడ్డాడు జగన్... ఎన్నికలకు ఏడాది ముందు డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు... చంద్రబాబు అంతా పథకం ప్రకారమే చేశారని, పైగా ఆ దాడిని ఖండిస్తున్నట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆరోపించారు... మొత్తానికి జగన్ బాధపడటం చూస్తుంటే, బీజేపీ వారి కంటే, అమిత్ షా పై నిరసన కార్యక్రమం జగన్ ని, ఎక్కువ బాధ కలిగించినట్టు ఉంది.. పాపం...

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దుర్గ గుడి దగ్గర ఫ్లై-ఓవర్ నిర్మాణంతో అటు వైపు ట్రాఫిక్ కష్టాలు కొంచెం తగ్గే అవకాసం ఉంది. బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లై ఓవర్, బందర్ రోడ్డు విస్తరణ తరువాత, అటు వైపు కూడా ఉపసమనం వచ్చే అవకాసం ఉంది. ఎటు పోయి, ఇప్పుడు సమస్య అంతా రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు. ఈ మార్గం గన్నవరం ఎయిర్ పోర్ట్ వైపు ఉండటం, సిటీ ఎక్కువగా ఇటు వైపు పెరగటం, విద్యా సంస్థలు, ఆఫీసులు ఎక్కువగా రావటంతో, ఈ రోడ్డులో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. సాయంత్రం వేళ నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్ రావటానికి, దాదపుగా 30-45 నిమషాల సమయం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారాలు ఆలోచిస్తుంది ప్రభుత్వం.

ramaravarappadu 12052018 2

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ షడ్యుల్ ప్రకారం నడుస్తున్నా, దుర్గ గుడి ఫ్లై ఓవర్ మాత్రం నెమ్మదిగా నడుస్తుంది... ఇవి ఇలా ఉండగా, ఇప్పుడు మరో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది అనే సంకేతాలు వస్తున్నాయి... రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు ఐదు కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒక పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే విఐపి మూమెంట్ ఉండటం, ఎక్కువ కాలేజీలు, ఆఫీసులు, స్కూల్స్ రావటంతో, గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది... ప్రధానంగా సిటీలోకి భారీ వాహనాలు రావటంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై అనేక ఫిర్యాదులు అందటం, అలాగే 1100 కు ఎక్కువ ఫిర్యాదులు దీని మీద రావటంతో, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ramaravarappadu 12052018 3

రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు ప్రస్తుతం రెండు లైన్ల రోడ్డు ఉంది. దీనిని విస్తరించాలంటే రహదారికి ఇరు వైపులా నివాస, వాణిజ్య భవనాలు అధికంగా ఉన్నాయి. రామవరప్పాడు - ప్రసాదంపాడు మధ్య 70 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. దీనిని రెట్టింపు విస్తరిస్తే గానీ ట్రాఫిక్ ఇబ్బందులు తీరవు. అందుకు భూమి కావాలి. సేకరించాలంటే రెండు వైపులా ఉన్న ప్రైవేటు ఆస్తులకు భారీగా పరిహారం చెల్లించాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా రామవరప్పాడు - ఎనికేపాడు మధ్య ప్రస్తుతం ఉన్న రోడ్డుపైనే ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడితే తక్కువ వ్యయం అవుతుందని అంచనాకు వచ్చారు. రోడ్డు విస్తరణ చేపడితే 2000 కోట్లు అవుతాయని, అదే ఫైఓవర్ నిర్మిస్తే రూ. 500-600 కోటు వ్యయం సరిపోతుందని ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీని పై చంద్రబాబు కూడా కసరత్తు చేసారు.. ఇది హైవే ప్రాజెక్ట్ అయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఈ ప్రాజెక్ట్ తీసుకోదని, CRDA ద్వారా, ఈ ప్రాజెక్ట్ మనమే చేద్దామని, వర్క్ అవుట్ చెయ్యమని, అధికారులని ఆదేశించారు...

ప్రత్యేక హోదా, విభజన హామీలు కంటే, మన రాష్ట్రానికి రావలసిన అతి పెద్ద ఆస్తి, 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల్లో వాటా... ఇది తెలంగాణా రాష్ట్రంలో నుంచి రావాలి కాబట్టి, అటు జగన్ కాని, ఇటు పవన్ కాని అడగడు... హైదరాబాద్ లో ఉంటూ, ఏపి రాజకీయలు చేసే ఎవరూ అడగరు... అటు కేంద్రం, పట్టించుకోదు... ముందు నుంచి ఈ సమస్య పై, కేవలం చంద్రబాబు మాత్రమే పోరాడుతున్నారు... తాజాగా చీఫ్ సెక్రటరీ స్థాయిలో మరో సమావేశం జరిగింది... రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల ఆస్తుల పంపకాలపై నాన్చుడు ధోరణిని విడనాడాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వీటి పంపిణీ కోసం కేంద్వ్రం నియమించిన షీలాబిడే కమిటీ ఇచ్చిన సిఫారసులను అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చేసిందని, వాటి పంపకాలు కూడా దాదాపుగా జరిగిపోయినట్లేనని చెప్పింది.

telangana 12052018 2

సీఎస్‌ల పరంగానే గాక అధికారుల స్థాయిలోనూ భేటీలు జరపాలనే ప్రతిపాదనను ఆమోదించారు. విభజన సమస్యలపై శుక్రవారం మెట్రోరైలు భవన్‌లో ఏపీ సీఎస్‌ దినేశ్‌కుమార్‌, తెలంగాణ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఇరు రాష్ట్రాల ఎస్‌ఆర్‌ విభాగం ఉన్నతాధికారులు రామకృష్ణారావు, ప్రేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రక్రియకు అనుమతించాలని నిర్ణయించారు. సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పరస్పర బదిలీల అంశానికి సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత అనుమతించాలని నిర్ణయించారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు ఏపీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు.

telangana 12052018 3

మరోవైపు హైదరాబాద్‌లో సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపీ వాటాగా వచ్చిన భవనాలు తమకు అప్పగించేయాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. తమ ముఖ్యమంత్రి తో చర్చించి చెప్తామని దినేశ్‌ సమాధానమిచ్చారు. మరోవైపు 9వ షెడ్యూలులో స్థిరాస్తులు లేని సంస్థలు కొన్ని అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో కొందరు ఉద్యోగులు, కొద్దిపాటి నిధులు మాత్రం ఉన్నాయి. వీటి విషయంలోనూ సానుకూల పంపకాలకు సుముఖత వ్యక్తమైంది. మరోవైపు హైదరాబాద్‌లోని మ్యూజియంలలో ఉన్న పురావస్తు సంపదను కూడా పంచాలని ఏపీ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. ఆయా మ్యూజియంలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కళాఖండాలు, ఇతర పురావస్తు సంపదను అప్పగించాలని అడిగారు. ఏపీ జెన్‌కోకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ బకాయిలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటోంది. బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శిని అడిగారు.

చంద్రబాబు రహస్య పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎమ్మెల్యేలు టాప్‌ గ్రేడ్‌ కొట్టేశారు. మిగిలిన వారిలో కొందరికి ఫస్ట్‌క్లాస్‌ రాగా, ఇంకొందరు సగటు మార్కులతో గట్టెక్కారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరును అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రహస్యంగా నిర్వహించిన పరీక్ష (సర్వే) ఫలితాలను గురువారం ఎమ్మెల్యేల సమావేశంలో వెల్లడించారు. కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ 79.66 శాతం మార్కులతో నెం.1 స్థానంలో నిలిచారు. ఆయన తరువాత స్థానంలో 70 శాతం పైబడిన మార్కులతో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలకు 60 శాతం మార్కులే వచ్చాయి.

cbn survey 12052018 2

జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు... అచ్చెన్నాయుడు(శ్రీకాకుళం), లలితకుమారి(విజయనగరం), అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణ (విశాఖ), తోట త్రిమూర్తులు, జోగేశ్వరరావు (తూ.గో), చింతమనేని ప్రభాకర్‌, నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ (ప.గో), వల్లభనేని వంశీ, శ్రీరాంతాతయ్య, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ (కృష్ణా), గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర పనితీరు బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేయించి.. ‘మూడు నెలలకొకసారి సమాచారం తెప్పించుకుంటానని కార్యకర్తల మనోభావాలను గమనించాలని, పనితీరును మెరుగు పరుచుకోవాలని’ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు.

cbn survey 12052018 3

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల పని తీరును అంచనా వేయడానికి ఐదు ప్రశ్నలను తయారు చేసి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఒక్కో ప్రశ్నకు 70 శాతం దాటిన వారికి టాప్‌ గ్రేడ్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది? కార్యకర్తలకు అందు బాటులో ఉంటున్నారా? పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపుతున్నారా? నియోజకవర్గంలోని నాయకులందరిని సమన్వయంతో కలుపుకెళ్తున్నారా లేదా? సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్నారా? అనే ఐదు ప్రశ్నలకు కార్యకర్తల నుంచి సమాధానాలు సేకరించారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఫోన్లు చేసి వివరాలు నమోదు చేసుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read