అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు Justice M.Satyanarayana Murthy, Justice D.V.S.S.Somayajulu తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ పై, హైకోర్టు స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్యవ్యాఖ్యానం ఈ రోజు హైలైట్ అనే చెప్పాలి. 'తెలుగు రాష్ట్రాల్లో నీతికి, నిజాయితీకి పేరున్న సిన్సియర్ సీనియర్ మోస్ట్ అధికారి' అంటూ జగన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి వై శ్రీ లక్ష్మి మీద హైకోర్టు వ్యాఖ్య చేస్తూ, ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం అని, ఆమె చేసిన పనులు అందరికీ తెలుస్తూ అంటూ, వ్యంగంగా హైకోర్టు స్పందించింది. న్యాయమూర్తులు కేసు నుంచి తప్పుకోవాలన్న దానిపై హైకోర్టు సంధించిన ప్రశ్నలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. "ఇద్దరు జడ్జీలకు అమరావతిలో భూములు ప్రభుత్వం ఇచ్చిందని అంటున్నారని, నిజానికి వారు మార్కెట్ వేల్యూ ప్రకారం, అక్కడ 30 లక్షల పెట్టి కొనుక్కున్నారని తెలిపారు. వీరితో పాటు 14 జడ్జిలకు అక్కడ భూములు ఇచ్చారని తెలిపారు. వీరికే కాకుండా, వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు, ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు కూడా అక్కడ భూములు కేటాయించారని తెలిపారు.

highcourt 03032022 2

జడ్జీలకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. జడ్జీలకు కార్లు, ఇళ్లు వంటి సదుపాయాలు కల్పించేది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు జడ్జీలు కూర్చునే కుర్చీని, సంతకం పెట్టే పెన్నుని కూడా సప్లై చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. అందుకని ప్రభుత్వ వ్యవహారాల్లో జడ్జీలకు ఆర్ధిక పరమైన ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని అనుకోవాలా ?" అంటూ హైకోర్టు స్పందించింది. జడ్జీలకు ఇళ్ళ కేటాయింపు ఎలా జరిగిందో కూడా చూడకుండా, ఈ పిటీషన్ వేయటం, జడ్జిల మీద బురద చల్లటానికే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటీషన్ వేయటం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అర్ధం అవుతుంది అంటూ, హైకోర్టు వ్యాఖ్యానించింది. "bench hunting tactics" అనేవి ప్రైవేటు పార్టీలు చేయటం చూసామని, మొదటి సారి ఒక ప్రభుత్వమే ఇలా చేయటం చూస్తున్నాం అని అన్నారు. మొత్తం మీద హైకోర్టు వ్యవహరించిన తీరు, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇష్టం వచ్చినట్టు కోర్టుల పైన కామెంట్స్ చేస్తున్న ప్రభుత్వానికి, సుతి మెత్తగా హెచ్చరికలు పంపించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు ఘన విజయం సాధించారు. రాజధాని అమరావతి పై రైతులు వేసిన పిటీషన్లు అన్నిటినీ కూడా హైకోర్టు విచారణకు స్వీకరిస్తున్నట్టు తీర్పు ఇస్తూ, పలు సంచలన విషయాలు పేర్కొంది. సీఆర్డీఏ రద్దు చేసే శాసనఅధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటుగా రైతులకు ఖర్చులు కూడా ఇవ్వాలని చెప్పి, హైకోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల్లోగా అమరావతిలో జరుగుతున్న పనుల పై స్టేటస్ రిపోర్ట్ తమకు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. సిఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయటం, మాస్టర్ ప్లాన్ అమలు చేయటం, ఇలా వివిధ అంశాల పై కోర్టుకు వెళ్ళిన రాజధాని రైతులకు, కోర్టు గుడ్ న్యూస్ వినిపించింది. ఆరు నెలల లోగా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లోగా మొత్తం పనులు అన్నీ పూర్తి చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే భూములు ఇచ్చిన రైతులు మూడు నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృధి పారించిన ప్లాట్లను రైతులకు అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతిలో చేసిన అభివృద్ధి పనుల పైన ఎప్పటికప్పుడు ఆ నివేదికను కోర్టుకు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చ్సింది.

hc 03032022 2

అలాగే మరో విషయం ఏమిటి అంటే, అమరావతి రాజధానిలో ఉన్న భూములు, ఎక్కడా కూడా తనఖా పెట్టకూడదని, ఎక్కడా కూడా రాజధాని అవసరాలకు తప్ప ఎక్కడా కూడా అమరావతి భూములు వాడుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ ముఖ్యంగా హైకోర్టు చెప్పిన విషయం, సీఆర్డీఏ చట్టం రద్దు చేసే శాసన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ హైకోర్టు చెప్పిన విషయం ఇక్కడ చాల ముఖ్యమైన అంశం. ఇక్కడ ఎవరు అయినా ఈ చట్టం రద్దు చేయటం కుదరదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఆ చట్టం ప్రకారం అక్కడ అభివృద్ధి చేసి చూపించాల్సిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని దొంగ దారుల్లో వెళ్ళినా, ఇక అక్కడ అభివృద్ధి చేయాల్సిందే. ఎక్కడా కూడా వెనకడుగు వేయటానికి వీలు లేదు. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, సిఆర్డీఏ చట్టం విషయంలో మాత్రం, ప్రభుత్వం ఏమి చేయలేదు అనే విషయం ఇప్పుడు హైకోర్టు తీర్పు చూస్తే అర్ధం అవుతుంది. అమరావతి విషయంలో జగన్ ఏమి చేస్తారో చూడాలి మరి.

అమరావతి పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిగా ఉంటుందా లేదా ? అమరావతితో పాటు మూడు రాజధానులు అంటూ జగన్ మోహన్ రెడ్డి గందరగోళం సృష్టిస్తున్న నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ, ఏపి రాజధాని అమరావతిగా నిర్ధారిస్తూ, అమరావతి కేంద్ర బడ్జెట్ లో కేటాయించింది. 2022-23 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉందని, ఏపి విభజన చట్టంలో పేర్కొన్న నేపధ్యంలో, రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పేరుతోనే, బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఇది పెట్టింది. కేంద్ర బడ్జెట్ లో అమరావతికి ఇచ్చిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి ఈ నిధులు కేటాయిస్తూ, బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. అందులో కొంత మొత్తాన్ని ఇప్పటికే కేంద్రం విడుదల చేసిందని, మిగతాది ఈ బడ్జెట్ లో కేంద్రం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లెక్కల్లో చెప్పింది.

amaravati 02032022 2

అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం కూడా రూ.1,126 కోట్లుగా అంచనా వేసిన కేంద్రం, ఈ బడ్జెట్ లో కేంద్రం కొంత కేటాయించింది. అలాగే GPOAకి భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా, కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందులో 2020-21, 2021-22 బడ్జెట్‍లో మొత్తం రూ.4.48 కోట్లు కేంద్రం ఖర్చు చేసినట్టు ఈ బడ్జెట్ లో స్పష్టం చేసారు. ఉద్యోగ నివాస గృహాలకు సంబంధించి, వాటికి అవసరం అయిన భూ సేకరణకు కూడా, 2021-22లో రూ.21 కోట్లు అంచనా వేసి, ఇప్పటి వరకు రూ.18.3 కోట్లు ఖర్చు చేసామని కేంద్రం బడ్జెట్ లెక్కల్లో తెలిపింది. అలాగే ఎకౌంటు జనరల్ స్టాఫ్ క్వార్టర్స్ కు కూడా రూ.200 కోట్లు అంచనా వ్యయంగా కేంద్రం నిర్ధారించింది. ఇవన్నీ కూడా అమరావతిలోనే ఈ నిర్మాణాలు చేపట్టటానికి కేంద్రం ఈ నిధులు కేటాయించింది. పట్టాభివృద్ధి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ లో ఈ విషయాలు అన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా కేంద్రం, ఇప్పుడు అమరావతినే రాజధానిగా గుర్తించటంతో, వైసీపీకి షాక్ తగిలింది అనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు రాజధాని అమరావతి విషయంలో కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పుని వెల్లడించనుంది. ప్రధానంగా మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నా, సిఆర్డీఏ మళ్ళీ అమలులోకి వచ్చినా కూడా, రైతులకు సంబంధించి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, ముఖ్యంగా భూసమీకరణ ఒప్పందాన్ని అమలు చేయక పోవటం, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవి అయితే ఉన్నాయో, వాటిని అమలు చేయక పోవటం, అదే విధంగా మాస్టర్ ప్లాన్ కి తిలోదకాలు ఇవ్వాటం, ఈ మూడు అంశాల పై రైతులు ప్రధానంగా పట్టు బట్టారు. తాము దాఖలు చేసిన పితెషన్ లో ఈ అంశాలు కూడా ఉన్నాయని, అందు వల్ల వీటి పైన విచారణ కొనసాగించాలని పిటీషనర్లగా ఉన్న రైతుల తరుపు న్యాయవాదులు కోర్టుకు అభ్యర్ధించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవటంతో, ఈ పిటీషన్లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వాదించారు. సుమారు వారం రోజులు పాటు జరిగిన ఈ వాదనలు అనంతరం, గత నెల 4వ తేదీన హైకోర్టు, ఈ తీర్పుని రిజర్వ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

amaravati 03032022 2

ఈ కేసు పైన, ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సమావేశం అయ్యి, తీర్పు ఇస్తుందని, నిన్న రాత్రి హైకోర్టులో ప్రకటించిన షెడ్యుల్ లో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా రాజధాని అమరావతికి సంబంధించి, రైతులు మాత్రం, తాము వేసిన పిటీషన్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నా మళ్ళీ, ప్రజలు అభిప్రాయాన్ని సేకరించి, ఈ సారి సమగ్ర చట్టాన్ని పెడతామని చెప్పి, హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటం పట్ల, ఈ పిటీషన్ లైవ్ లో ఉంచాలని, పిటీషనర్ తరుపున న్యాయవాదులు కోరారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చే తీర్పు పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మూడు రాజధానులు చట్టం ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది కనుక, ఈ పిటీషన్లు విచారణ చేయనవసరం లేదనే ప్రభుత్వ వాదన ఎంత వరకు హైకోర్టు ఈ అంశం పై ఏకీభవిస్తుంది, అసలు ఏమి చెప్తుంది అనేది ఈ రోజు తేలిపోతుంది.

Advertisements

Latest Articles

Most Read