సీపీఐ, సీపీఐ పార్టీలు రాష్ట్రంలో పెద్ద ఉనికి లేకపోయినా, జగన్, పవన్ తో కలిసి, వచ్చే ఎన్నికల్లో దున్నేస్తాం అంటూ స్టేట్మెంట్ లు ఇస్తూ ఉంటారు... పవన్ విషయంలో అయితే, పవన్ తో రాసుకు పూసుకుని తిరుగుతూ, హడావిడి చేస్తున్నారు... అయితే, పవన్ కళ్యాణ్ పొత్తులు ఏమి లేవని, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అంటూ వారం క్రిందట చేసిన ప్రకటనతో, కమ్యూనిస్ట్ పార్టీలు అవాకయ్యాయి.. ఇంకా బహిరంగంగా, పవన్ పై విమర్శలు చెయ్యకపోయినా, లోలోపల మాత్రం రగిలిపోతున్నాయి.. కలిసి ఉద్యమాలు చేసాం, ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేసి, సొంతగా పోటీ చేస్తాడు అంటాడు ఏంటి అంటూ, బాధ పడుతున్నాయి.. ఒకసారి పవన్ ను కలిసి , ఈ విషయంలో క్లారిటీ తీసుకుని, ఇక తమ దారి తాము చూసుకోవటానికి రెడీ అవుతున్నాయి.. ఇది ఇలా ఉంటే, జగన్ విషయంలో మాత్రం, బహిరంగంగా విమర్శలు చేస్తున్నాయి...
భారతీయ జనతా పార్టీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చూస్తుంటే అర్ధమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా తమ పార్టీ గెలుస్తుందని అని చెప్పుకుంటే పర్వాలేదు గానీ.. విష్ణుకుమార్ రాజు మాత్రం ప్రతిపక్ష పార్టీ వైకాపా అధికారంలోకి వస్తుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటకలో గాలి సోదరులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్టు ఇక్కడ కూడా వైకాపా.. భాజపా కలిసిపోయాయా? అని ప్రశ్నించారు. భాజపా, వైకాపా నాయకులు దీని వెనకున్న రహస్య ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు, హోదా కోసం ఏ రోజూ మోదీని పల్లెత్తు మాట అనని జగన్.. చంద్రబాబు మీద మాత్రం విరుచుకుపడుతూ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. వైకాపా గురించి ఆ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా భాజపా నాయకులే పొగడ్తలు కురిపిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రిస్తా అని చెప్పిన ప్రధాని మోదీ.. మైనింగ్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి కర్ణాటక ఎన్నికల్లో టిక్కెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతిని సహించనని ప్రగల్భాలు పలుకుతున్న మోదీ అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి, జగన్, బీజేపీ ని తిట్టటం లేదు అనే దాక వచ్చారు.. పవన్ కూడా ఎలాగు ఈ కోవలో వాడే కాబట్టి, త్వరలోనే పవన్, బీజేపీ తో చేసుకున్న ఒప్పందం గురించి, కమ్యూనిస్ట్ ల నోటి వెంట వినబోతున్నాం... మొన్నటి వరకు కమ్యూనిస్ట్ లు అంటే నిజాయతీ అనే జనసేన, వీళ్ళ విమర్సలకు ఎలా రియాక్ట్ అవుతుందో మరి...