ఒక్కొకరికి ఒక్కో రోజు, చాలా ముఖ్యం.. మన ప్రతిపక్ష నాయకుడుకి, ఎన్ని పనులు ఉన్నా శుక్రవారం కోర్ట్ కి వెళ్ళాలి.. చంద్రబాబు మాత్రం, ఎన్ని పనులు ఉన్నా, సోమవారం వచ్చింది అంటే పోలవారమే... ఈ రోజు తిరుపతిలో సాయంత్రం అతి పెద్ద బహిరంగ సభ ఉంది.. అయినా సరే, ముందు పోలవరం మీద సమీక్ష చేసిన తరువాతే ఏమైనా అంటూ, దాదాపు రెండు గంటల పాటు, పోలవరం పై వీక్లీ రివ్యూ జరిపారు చంద్రబాబు.. సోమవారం గ్రీవెన్స్‌ హాల్‌లో 58వ సారి పోలవరంపై ముఖ్యమంత్రి వర్చవల్ రివ్యూ నిర్వహించారు. వర్షాకాలం వచ్చేలోగా మే, జూన్ నెలల్లో వీలైనంత వేగంగా పోలవరం ఎర్త్‌వర్క్, కాంక్రీట్ పనులు చేపట్టాలని, లక్ష్యాన్ని అధిగమించినప్పుడే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలమని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. నీరు-ప్రగతి పనులు కూడా ముమ్మరంగా జరగాలని, తాను ప్రతి జిల్లాలోనూ త్వరలోనే పర్యటిస్తానని వెల్లడించారు.

పోలవరం నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో స్పిల్‌వే కాంక్రీట్ పనులు లక్ష క్యూబిక్ మీటర్లు దాటడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈనెలలో 1,15,658 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే కాంక్రీట్ పనులు జరగడం రికార్డుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.02% పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం కుడి ప్రధాన కాలువ 89.44%, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.16%, స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ ఎర్త్‌వర్క్ 72.30%, స్పిల్‌వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16.40%, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 85.10%, జెట్ గ్రౌటింగ్ పనులు 64.90%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60% పూర్తయినట్టు చెప్పారు. గత వారం రోజుల్లో 5.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 32 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 19 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 806.29 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 5.76 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,214.6 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,800 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 13,430.84 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ. 8,294.97 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో రూ. 5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ. 2,952.71 కోట్లు కేంద్రం నుంచి రావాల్సివుందని చెప్పారు.

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చాలా ఇరుకుగా ఉందని, హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న వేళ, ఇరుకుగా ఉండే ఈ ఎయిర్ పోర్ట్ కాకుండా, పెద్ద ఎయిర్ పోర్ట్ కావాలని, శంషాబాద్ లో, మొట్ట మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టారు చంద్రబాబు... అయితే, ఆయన అధికారం కోల్పోయి, రాజశేఖర్ రెడ్డి వచ్చాడు.. అది 2008 మార్చ్ 23వ తేది... బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి షిఫ్ట్ అవుతున్న వేళ, రాజశేఖర్ రెడ్డి, దివంగత ఎన్టీఆర్ ను ఎలా అవమానపరిచారో అందరికీ గుర్తుండే ఉంటుంది... బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఇంటర్నేషనల్ టెర్మినల్ కు రాజీవ్ గాంధి పేరు, డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది...

అయితే, బేగం పెట్ ఎయిర్ పోర్ట్ మూసివేసి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చే సమయంలో, ఇక్కడ ఇంటర్నేషనల్ టెర్మినల్ కు రాజీవ్ గాంధి పేరు పెట్టారు కాని, డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు మాత్రం రాజశేఖర్ రెడ్డి పెట్టకుండా అవమానించారు... అది కరెక్ట్ కాదని, ఇవాళ మీరు ఉంటారు, రేపు మేము వస్తాం, ఇలా చెయ్యటం సంప్రదాయం కాదని, చంద్రబాబు, తెలుగుదేశం శ్రేణులు, ఎంత మొత్తుకున్నా, రాజశేఖర్ రెడ్డి వినలేదు... ఆయనేమన్నా గొప్ప నాయకుడా ఏంటి అంటూ, తన స్టైల్ లో వెటకారంగా నవ్వి, టిడిపి వాళ్లకి పనేం లేదు అంటూ, అవమానించారు.. అయితే, అప్పుడు చంద్రబాబు చెప్పినట్టే, వీరు అధికారంలోకి రాగానే, డొమెస్టిక్ టెర్మినల్ కు, ఎన్టీఆర్ పేరు పెట్టారు... మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు, పాదయాత్రలో డ్రామాలు ఆడుతూ, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాను అంటూ చెప్తున్నాడు...

అయినా, నువ్వు అధికారంలోకి రావాలి కదా, అంటూ తెలుగుదేశం విమర్సిస్తుంది... మీ నాన్న లాగా, కడప జిల్లాకు పేరు పెట్టుకున్నట్టు, ఎన్టీఆర్ ఒక జిల్లాకు పరిమితమైన నేత కాదని, డ్రామాలు ఆపాలి అంటూ చెప్పారు.. అంతే కాదు, జగన్ కు, ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే, ఎన్టీఆర్ కు భారత రత్న సిఫార్సు చెయ్యాలని అంటున్నారు... ఎలాగూ, మీకు మోడీ మంచి స్నేహితుడు, విజయసాయి రెడ్డి లాబయింగ్ బాగా చేస్తారు కాబట్టి, ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చేలా ప్రయత్నం చెయ్యాలని... అది మీరు చెప్పిన ఫార్ములానే, ఎలాగూ చంద్రబాబు తి ఏడు సిఫార్సు చేస్తున్నారు, మీరు కూడా చేస్తే, అన్ని పక్షాలు అడుగుతున్నాయని కాబట్టి, మోడీ పై ఒత్తిడి ఉంటుంది, అంటూ జగన్ కు, తెలుగుదేశం శ్రేణులు పంచ్ లు వేస్తున్నారు... అప్పుడు నీకు, ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమో ఉందో తెలుస్తుందని, మీ నాన్న చేసిన పాపం పోతుందని అంటున్నారు...

పసిబిడ్డ ఆంధ్ర రాష్ట్రం, పాకుతూ, లేచి నిలుచోవటానికి అపసోపాలు పడుతుంటే... అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, అధిపత్యం కోసం, అధికారం కోసం, చంద్రబాబుని నిలువరించేందుకు కేంద్రంలో పెద్దలు వంచన చేస్తుంటే... మీకు అడ్డం రాను, రాస్త్రనికి చేయూత నివ్వండి మహాప్రభూ అంటూ ఒకరకంగా తలవొగ్గారు చంద్రబాబు... అయినా ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి...మిత్రధర్మాన్ని విస్మరించి..ద్రోహం చేసిందెవరో తెలియదా...?వంచన చేసిందెవరో తెలియదా ...? మోడీ మోసం పై ధర్మ పోరాటం చేస్తుంటే, ఇదే రోజు జగన్, వైజాగ్ లో వంచన దీక్ష అంటూ, చంద్రబాబుకు వ్యతిరేకంగా దీక్ష చెయ్యటం ఏంటి ?

చంద్రబాబు కి వ్యతిరేకంగా, రాష్ట్ర సమస్యలపై దీక్షలు చేయండి... పెన్షన్ లు ఇవ్వకపోతే , నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, రైతు ఋణమాఫీ చేయకపోతే, డ్వాక్రా ఋణమాఫీ చేయకపోతే, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టకపోతే, అన్న కాంటీన్ లు పెట్టకపోతే, ఉద్యోగులకు నలభైమూడు శాతం ఫిట్ మెంట్ ఇవ్వకపోతే, రిటైర్ మెంట్ ఏభైఎనిమిది నుండి అరవై చేయకపోతే, పట్టిసీమ నీరు కృష్ణ లో అనుసంధానం చేయకపోయి ఉంటే, కృష్ణా డెల్టా ఎండిపోయుంటే, పులివెందులకు నీరు ఇవ్వకపోయుంటే, అనేక ఆటంకాలమధ్య పోలవరం ఏభైశాతం పనిపూర్తవక పోయి ఉంటే, పక్క రాష్ట్రం ధనిక రాష్ట్రం ఒక్క ఉద్యోగం అయినా ఇవ్వకపోయినా, రెండుసార్లు డియస్ సీ ప్రకటించకపోతే, ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకు రాకపోతే, రాష్ట్రంలో అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేయకపోతే, సంవత్సరం లోపల మన రాష్ట్రం, మన రాజధాని మనదగ్గర నుండే పాలన చేయకపోతే, హుద్ హుద్ లాంటి జలప్రళయం ని సమర్థవంతంగా ఎదుర్కోక పోతే, కియామోటార్స్, హీరో మోటార్స్, ఆపిల్ లాంటి కంపెనీలు రాకపోతే, అన్నిటికన్నా ముప్పై మూడువేల ఎకరాలు ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క రక్తం చుక్క కారకుండా కేవలం తన మీద నమ్మకంతో రైతులు ఇవ్వకపోతే, అప్పడు కదా చంద్రబాబు కి వ్యతిరేకంగా దీక్షలు చేయాల్సింది.

మరేంటయ్యా ...కేంద్రం మోసం చేసింది...మోదీ కక్ష గట్టాడు, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది...ప్రజలంతా ఆగ్రహంతో కేంద్రం మీద యుద్దం చేస్తుంటే... మీరేంటయ్యా ప్రజల మీద యుద్దం ప్రకటించారు... మీ కేసుల గురించా ? ప్రజలందరికీ తెలుసు ...ఇక డ్రామాలు చాలించి ...ముసుగులు తీసి ప్రత్యక్ష యుద్దం చేయండి...బాబు కావాలో, మీరు కావాలో ప్రజలు తేల్చుకుంటారు.. రోజులుమారాయి...మీ డ్రామాలు...అసలు నయవంచన మీదే, అని ప్రజలుకు బాగా అర్దమయింది...సమయం కోసం చూస్తున్నారు...

తిరుపతిలో వెంకన్న పాదాల చెంత, నాలుగేళ్ళ క్రిందట, సరిగ్గా ఇదే తేదిన నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్ధిగా వచ్చి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు... వాటిని నెరవేర్చకుండా మోసగించారని మండిపడుతున్న చంద్రబాబు నాయుడు, అదే ఏప్రిల్‌ 30న అదే ప్రాంగణం నుంచి మోదీ మోసాన్ని జనానికి తెలియజెప్పే విధంగా సభ నిర్వహిస్తున్నారు... ఎన్నికలకు ఏడాది సమయమేఉండటం, తిరుపతి నుంచే తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయం కలిగి ఉండటాన్ని బట్టి ఇది ఎన్నికల ప్రచారానికి నాందిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. తెదేపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో కేంద్రంపై పోరాటానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారని అవగతమవుతోంది. ఈ సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో పార్టీ ఉందని సమాచారం. ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా మోదీ ప్రసంగ పాఠాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించనున్నారు. అందులో మోదీ పేర్కొన్న ప్రతి అంశాన్నీ ప్రస్తావిస్తూ నాడు ఏమి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలా వాగ్దాన భంగానికి పాల్పడ్డారో.. వివరించనున్నారు. తెలుగు ప్రజల ఇలవేల్పు సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఇచ్చిన హామీని ఏ విధంగా విస్మరించారనేది వివరించనున్నారు...

అయితే, ఈ సభ జరగకుండా ఉండటానికి, కేంద్రం ఇప్పటికే గవర్నర్ ను, ఐబి చీఫ్ ను చంద్రబాబు వద్దకు పంపించింది... చంద్రబాబు ఇక్కడ మీటింగ్ పెట్టి విమర్శలు చేస్తే, కర్నాటక ఎన్నికల పై ప్రభావం పడుతుందని, ఇప్పుడిప్పుడే అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగు పడుతుంది అని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.. అయితే, ఇవన్నీ చంద్రబాబు పట్టించుకోలేదు.. మరింత విమర్శల దాడి పెంచారు.. అయితే, ఈ సభ అనివార్యం అని తెలుసుకున్న బీజేపీ పెద్దలు, మమ్మల్ని ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి, కాని కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా వోట్ వెయ్యమని పిలుపు ఇవ్వద్దు అని, అది ఎన్నికల పై, అక్కడ తెలుగు వారి ప్రభావం చూపిస్తుందని, చంద్రబాబుకి వర్తమానం పంపించారు... అయితే, చంద్రబాబు మాత్రం, ప్రజలకు ఏది కావాలో, నేను అదే మాట్లడతా అని, తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది..

Advertisements

Latest Articles

Most Read