పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ల చేస్తూ, చంద్రబాబు పై చేస్తున్న చౌకబారు ఆరోపణలు పై, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏప్రిల్ 20వ తేదీన సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం రోజు నుంచే పవన్ కళ్యాణ్ ట్వీట్లు ప్రారంభం కాగా, ఆ వ్యవహారంపై పరోక్షంగానే తప్ప నేరుగా స్పందించని చంద్రబాబు మంగళవారం డైరెక్టుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ఎన్నడూ విమర్శించలేదని... ఎదుటివారి మీద బురద చల్లే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదని సిఎం చంద్రబాబు అన్నారు. మొన్నటిదాకా మనతోనే ఉన్న ఆయన ఇప్పుడు మనల్నే విమర్శిస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ఎవరిపైనా విమర్శలు చేయలేదని...కేవలం సమస్యలపైనే పోరాడానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
పవన్ కల్యాన్ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిరాధార ఆరోపణలతో ఆయన సాధించేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. వైసీపీని బీజేపీ రెచ్చగొడుతోందన్నారు. కేంద్రం అందరినీ ఆడిస్తోందని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఆటలు సాగినా... ఏపీలో సాగబోవని బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిచి.. ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గవర్నర్ రాజకీయ వ్యవహారాలు నెరుపుతున్నారంటూ ఆరోపించారు. వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయని, గవర్నర్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
ఇదిలా ఉండగా పవన్ ట్వీట్ లపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఒక్కరే గట్టిగా పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు చేపట్టే నిరసనలు పక్క దారిపడుతుందని... ఇలాంటి టైంలో ఈ తరహా రాజకీయాలకు తెరలేపడం కుట్రలో భాగమేనని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను రాజకీయాలకు ఆపాదించడంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఉందని.. ఒక వేళ టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగితే చంద్రబాబు చేపట్టే నిరసనలు పక్కదారి పడతాయని, అప్పుడు బీజేపీ, పవన్, జగన్ ఏదైతే ఆశిస్తున్నారో అది సక్సెస్ అవుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి... ఇవి పెద్దవి అయితే, కులాల గొడవలుగా కూడా మారతాయని, అందుకే పవన్ చేస్తున్న ట్వీట్ లకు స్పందించవద్దు అని చెప్పారు.. పవన్ చేసే ట్వీట్ లు కూడా, మరీ దిగజారి ఉంటున్నాయని, ఇలాంటివి రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదని, ప్రజలే అలాంటి వారికి బుద్ధి చెప్తారని, తెలుగుదేశం భావిస్తుంది..