ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, తెలుగుదేశం పార్టీ నాయకులు తిడుతున్నారని, స్పెషల్ స్టేటస్ సాధించేది ఇలాగేనా అంటూ, ఈ విషయం కూడా ABN RKకి లింక్ పెట్టి మరీ, పవన్ ట్వీట్ చేస్తూ బాధపడుతున్నారు... ప్రధాని మోడీని, ఈ దేశంలో ఎదుర్కునే దమ్ము ఎవడికీ లేకపోతే, గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ రఫ్ ఆడిస్తుంది... మా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఎందుకు ఇవ్వరు అంటూ మోడీకి చుక్కలు చూపిస్తున్నారు... చంద్రబాబు అయితే, రోజుకి ఒకసారి, మోడీని చాకిరేవు పెడుతున్నారు... మీటింగ్ లు పెట్టి, మోడీ మాట్లాడిన వీడియోలు చూపించి, డాక్యుమెంట్ లు చూపిస్తూ, మోడీ మోసాన్ని ఎండగడుతున్నారు... మొన్న ధర్మ పోరాట దీక్షలో అయితే, బాలయ్య ఉతికి ఉతికి పెట్టాడు... టీలో పడిన ఈగని కూడా చీకి అవతల పారేసే రకం మోడీ అంటూ తిట్టాడు.. ఇది పట్టుకుని రెండు రోజులు నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు పిసుక్కుంటున్నారు..

pk 22042018

ఇప్పుడు ఈ పిసుక్కునే జాబితాలో, పవన్ కళ్యాణ్ కూడా చేరాడు... మా మోడీని తెలుగుదేశం నేతలు బాగా తిడుతున్నారు అంటూ ట్వీట్ చేసి బాధపడుతున్నాడు... ఈయనేమో ట్విట్టర్ లో శ్రీ రెడ్డిని, రాం గోపాల్ వర్మని, కత్తి మహేష్ తో తిట్టుకుంటూ కూర్చుంటాడు... మరి మోడీతో పోరాడే, తెలుగుదేశం పై మాత్రం, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు... మోడీని తిట్టకూడదు అంట... ఒక్కసారి ATM దగ్గరకు వెళ్లి, జనాలు మీ మోడీ ని ఎలా తిడుతున్నారో చూడు పవన్... ఒక్కసారి GST వళ్ల, ఎంత బొక్క పడిందో, వ్యాపారస్తులు మీ మోడీని ఎలా తిడుతున్నారో విను పవన్... చిన్నారుల పై రేప్ లు చేస్తుంటే, మీ మోడీ మౌనాన్ని, ఎలా తిడుతున్నారో చూడు పవన్... మీ మోడీని ప్రతి ఆంధ్రుడు తిడతాడు.. హైదరాబాద్ లో కూర్చుంటే, మా కడుపు మంట నీకు ఏమి తెలుస్తుంది పవన్ ?

pk 22042018

ఇలాగే మా మోడీని తిడితే ఊరుకోను అని విజయసాయి రెడ్డి కూడా, తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ ఇచ్చాడు.. మా మోడీని తిడుతున్నారు అంటూ, చంద్రబాబు పై రాజ్యసభ చైర్మెన్ కు నోటీసు కూడా ఇచ్చాడు... మొత్తానికి జగన్, పవన్, మోడీని ఒక్క మాట కూడా అననివ్వటం లేదు... మోడీని ఆర్దిస్తున్నా అంటూ పవన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తాడు... మోడీని కలుస్తూనే ఉంటాం అంటూ, జగన్ చెప్తాడు... ఇది మన ఖర్మ.. ఆపరేషన్ గరుడలో, వెళ్ళ పాత్రలు ఇలా బయట పెడుతూ, మోడీ పై అమితమైన విశ్వాసం చూపిస్తున్నారు.... మోడీని, ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా తిడితే, బీజేపీ కంటే ముందే జగన, పవన్ వచ్చేసి, మోడీని సమర్ధిస్తారు... మా మోడీని తిడతారా అంటూ, విరుచుకుపడతారు... ఏంటో, ఈ గోల మనకి... ఒకడికి మించిన పెర్ఫార్మన్స్, ఒకడు ఇరగాదీస్తున్నాడు...

ముఖ్యమంత్రితో ఉన్న వైరం పక్కన పెట్టి మరీ, విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు గవర్నర్ నరసింహన్... నిజానికి గవర్నర్ ఈ రోజు వైజాగ్ పర్యటన ముగించుకుని హైదరబాద్ వెళ్ళిపోవాల్సి ఉంది. అయితే, ఈ రోజు చంద్రబాబు అప్పాయింట్మెంట్ అడిగి, విజయవాడ వచ్చారు... ఫ్లైట్ లో కాకుండా, వైజాగ్ నుంచి ట్రైన్ లో వచ్చారు... గవర్నర్ ఎందుకు వస్తున్నారో అని అందరూ అనుకున్నారు... కేంద్రం నుంచి రాయబారం ఏమన్నా తెస్తున్నారేమో అనే గుసగుసలు వినిపించాయి... ఈ రోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబుని కలిసారు గవర్నర్... మర్యాద పూర్వక మీటింగ్ అని చెప్పినా, కేంద్రం నుంచి తీసుకువచ్చిన రాయబారం చంద్రబాబుకు చెప్పారు.. సుమారు గంటన్నర సేపు వారు మాట్లాడుకున్నారు.

cbn govener 22042018

ముఖ్యంగా కర్ణటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం... చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి, కర్నాటక ఎన్నికల పై ప్రభావం పాడుతాయని, ఇప్పుడిప్పుడే అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగు పడుతుంది అని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

cbn govener 22042018

అయితే దీని పై చంద్రబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకునే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, పోరాటం ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. చంద్రబాబు చేసిన దీక్షా ప్రభావం కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాపై పడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఒక ముఖ్యమంత్రి 12 గంటలపాటు నిరాహారదీక్ష చేయడం దేశవ్యాప్తంగా సంచలన వార్తగా నిలిచింది. ఈ ప్రభావం కర్నాటక ఎన్నికలపై కూడా పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు కర్నాటక ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ చర్చ జరుగుతోంది.

ముసుగులు నెమ్మదిగా తోలిగిపోతున్నాయి... జూన్ నెలలో ఆవిష్కరించబోయే గొప్ప సంఘటనకు, ఈ రోజు రోజా చిన్న టీజర్ వదిలింది... మా పవన్ కళ్యాణ్ అంటూ, కొత్తగా మాట్లాడుతుంది రోజా... పవన్ పై విరుచుకుపడే, వైసిపీ గత నెల రోజులుగా, ఆ దూకుడు తగ్గించింది... ఇక రోజా సంగతి అయితే చెప్పనవసరం లేదు... మొన్న ఒక టీవీ చర్చలో, బండ్ల గణేష్ కు కౌంటర్ ఇస్తూ, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసింది రోజా... అయితే, సడన్ గా, నిన్నటి నుంచి, పవన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ, పవన్ కు మద్దతు ప్రకటించింది రోజా... శ్రీరెడ్డిని ఉద్దేశిస్తూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఇష్టం వచ్చినట్లు దూషణలకు దిగడం సరికాదని రోజా వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా పవన్ ను కించపరిచి హర్ట్ చేయడం మాత్రం సరికాదని రోజా అన్నారు.

roja 22042018 1

అంతే కాదు, పవన్ చెప్తున్న వాటికి కూడా మద్దతు పలికారు.. చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారని రోజా వ్యాఖ్యానించారు. కొన్ని ఛానల్స్ పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. పవన్, ఆయన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. స్వలాభం కోసం సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాస్టింగ్ కౌచ్ పైన ఎవరికీ ఫిర్యాదు చేయకుండా ఏదో చెప్పడం సరికాదన్నారు... రోజా మాటి మాటికి, మా పవన్, మా పవన్ అనటం చూస్తుంటే, జూన్ నెలలో బీజేపీ, జనసేన, వైసిపీ కలిసి ఒకే వేదిక పై నుంచి వస్తున్నారు అనే వార్తలకు బలం చేకురినట్టు అయ్యింది...

roja 22042018 1

ఇది ఇలా ఉండగా, రోజా వ్యాఖ్యల పై జనసేన అభిమానులు మాత్రం, టెన్షన్ పడుతున్నారు... పవన్ ని పొగిడినా టెన్షన్ ఎందుకు అనా ? ఆమె హిస్టరీ అలాంటింది మరి... ఇప్పటికే పవన్ రాజకీయంగా రోజుకి ఒక మెట్టు దిగుతున్నాడు అని, రోజా లాంటి పవర్ ఫుల్ లేడీ మద్దతు ప్రకటిస్తే, ఇక పాతాళమే అని, ఖంగారు పడుతున్నారు... రోజా కలవగానే చంద్రబాబు మీద అలిపిరి దాడి... రోజా, వైఎస్ఆర్ ను కలవగానే, పావురాలు గుట్ట... రోజా, జగన్ ను కలవగానే, 16 నెలలు జైలు జీవితం... ఇవన్నీ గుర్తు చేసుకుని బెంబేలెత్తి పోతున్నారు.... రోజా, పవన్ కు మద్దతు పలకపోవటమే మంచిదని, పవన్ ఎదో కిందా మీదా పడుతున్నారని, ఇప్పుడు రోజా మద్దతు ఇస్తే, పవన్ ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందని అంటున్నారు...

ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ అంటే, విపక్షాలు ఎలా విరుచుకుపడతాయో చూస్తూ ఉంటాం... నారాయణ విద్యా సంస్థల కోసం,మంత్రి నారాయణ అవినీతి చేస్తున్నారు అని, అదని, ఇదని ఎన్నో విమర్శలు చేస్తాయి... ప్రభుత్వ విద్యను కావాలని, బ్రస్టు పట్టిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తాయి... అయితే, వాళ్ళు ఏ విమర్శ అయితే చేసారో, వాటికి సమాధానం చెప్పేలా, నారాయణ చేసిన పని, ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వాస్తవానికి నారాయణ పేదకుటుంబంలో పుట్టారు. కిరోసిన్ దీపం వెలుగులో చదువుకున్నారు. ఆయన తండ్రి బస్సు కండెక్టర్. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నారాయణ చదువుకున్నారు. చదువుతోనే ఏదైనా సాధ్యమని గ్రహించారు. డిగ్రీలో యూనివర్శిటీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. గోల్డ్ మెడల్ అందుకున్నారు. తిరుపతి ఎస్.వి యూనివర్విటీలో పీజీ చేశారు. అక్కడా కూడా ఫస్ట్ ర్యాంకరే! మరో గోల్డ్ మెడల్ సాధించారు. నెల్లూరులో డిగ్రీ చదువుకున్న వి.ఆర్. కాలేజీలోనే గెస్ట్ లెక్చరర్‌గా చేరారు. అప్పట్లో రోజుకి నాలుగు రూపాయల వేతనం. ఇంటి దగ్గర ట్యూషన్లు మొదలెట్టారు. నారాయణ ప్రతిభని చూసి ఎయిడెడ్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అది పర్మినెంట్ అయ్యింది. ఒక పక్క ట్యూషన్లు కూడా కొనసాగిస్తూ అంచలంచెలుగా ఎదిగారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. అలా సక్సెస్‌ రేట్‌ పెంచుకుంటూ ఉన్నతస్థాయికి చేరారు. అపర కోటీశ్వరుడయ్యారు. ఇదంతా ఎవరో చెప్పింది కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉద్దేశించిన అప్పుడప్పుడూ నారాయణ చెప్పే విషయాలే!

narayana 22042018 1

అయితే, ఆయన మంత్రి అయిన తరువాత, విపక్షాలు ఆయాన పై, విమర్శలు గుప్పిస్తూ వచ్చాయి... ఈ నేపథ్యంలో గత ఏడాది నారాయణ ఒక ప్రయోగం చేపట్టారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏదైనా చేయాలన్న తలంపు ఆయనకి కలిగింది. ఇందుకోసం ప్రభుత్వ విద్యావిధానంలో మార్పుకి ఏదో ఒకచోట శ్రీకారం చుట్టాలని భావించారు. నెల్లూరు వి.ఆర్. కాలేజీ ఆవరణలో మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీని ప్రారంభించారు. 49 మంది నిరుపేద విద్యార్థులకి అక్కడ చదువుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు- స్వయంగా ఆయనే ఐ.ఐ.టి, నిట్ ఫౌండేషన్‌తో ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. వారానికొకసారి మంత్రి నారాయణ ఈ కాలేజీకి వచ్చేవారు. పిల్లలతో మాట్లాడేవారు. వారికి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే ప్రావీణ్యులైన అధ్యాపకులతో పాఠాలు చెప్పించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, అధికారులు, మేయర్ అబ్దుల్ అజీజ్ వంటి ప్రముఖులు తరుచూ ఇక్కడికి వచ్చి వసతులు, బోధన తదితర అంశాలను పరిశీలించి వెళ్లేవారు.

narayana 22042018 1

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఈ కాలేజీపైనా వారు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీ పేరు మీద నిధులు దోచేస్తున్నారహో అంటూ ధూంధాం చేశారు. అయితే, మొన్న వచ్చిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్య పోయారు... ఇక్కడి విద్యార్థులు అద్భుతం చేసి చూపించారు. నూరుశాతం ఉత్తీర్ణులయ్యారు. అంతే కాదు ఏకంగా 32 మంది పదికి పది పాయింట్లు సాధించారు. 12 మంది 9.8 పాయింట్లు, అయిదుగురు 9 పాయింట్లకి పైగా మార్కులు పొందారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఏ కార్పొరేట్ కాలేజీ కూడా సాధించనంత గొప్ప విజయాన్ని అందించారు. ఈ రిజల్ట్‌ చూసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆశ్చర్యపోయారు. వెంటనే మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులని తన వద్దకి పిలిపించుకున్నారు. అందరినీ అభినందించారు. ఇదే తరహాలో ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటినీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందట. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు దొరకకుంటేనే ప్రైవేటు విద్యాసంస్థలకి వెళ్లి చదువుకునే రోజులు రావాలంటూ ప్రభుత్వ పెద్దల్లో చర్చలు కూడా సాగుతున్నాయట.

Advertisements

Latest Articles

Most Read