ముఖ్యమంత్రితో ఉన్న వైరం పక్కన పెట్టి మరీ, ఆదివారం విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు గవర్నర్ నరసింహన్... కేంద్రం పంపించిన రాయబారం తీసుకువచ్చి చంద్రబాబుని కలిసారు గవర్నర్. ముఖ్యంగా కర్ణటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం... చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి ఇబ్బందికరంగా ఉన్నాయని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
అయితే దీని పై చంద్రబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకునే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, పోరాటం ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక, గవర్నర్ వెళ్ళిపోయారు...
అయితే, ఈ విషయాలన్నీ ఢిల్లీ పెద్దలకు చెప్పటానికి, గవర్నర్ ఢిల్లీ వెళ్తున్నారు... మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ మూడు రోజుల పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు పెద్దలను ఆయన కలవనున్నారు. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నారు... అలాగే ఇక్కడ పవన్, జగన్ పోషిస్తున్న పాత్ర గురించి కూడా చర్చించనున్నారు... గవర్నర్ నివేదిక చుసిన తరువాత, కేంద్రం మరో ప్లాన్ తో ఆంధ్రప్రదేశ్ పై పట్టుకు ముందుకు రానుంది.. ఇప్పటికే పవన్, జగన్, తమ తమ పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తున్నారు... కులాల వారీగా, కుట్రలకు బేస్ సెట్ చేసుకున్నారు... చంద్రబాబు ఎలాగు లొంగడు అని తెలుసుకున్న ఢిల్లీ పెద్దల, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి...