వైసిపీ - బీజేపీ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందీ... కాకపొతే పిల్లి పాలు తాగుతూ, ఎవరు చూడటం లేదు అనుకున్నట్టే, వీళ్ళు కూడా ప్రజలకు ఏమి తెలియదు అనుకుని డ్రామాలు ఆడుతున్నారు... అవిశ్వాస తీర్మానం పెట్టి, అదే కాపీ తీసుకుని, ప్రధాని ఆఫీస్ లో ఉన్న విజయసాయ రెడ్డిని చూసాం, అయినా వీరిని ఎవరూ ఏమి అనకూడదు... వీరి బంధం బలపరిచే మరో సంఘటన చోటు చేసుకుంది... తెలుగుదేశం ఎంపీలు ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిసున్నా అవ్వని పని, వైసిపీ ఎంపీలు ఇలా అడగ్గానే పని అయిపొయింది... దీంతో, వైసిపీకి, బీజేపీ ఎంత బంధం ఉందో ఇట్టే అర్ధమవుతుంది... అయినా, వీళ్ళు వచ్చి, ఎదురు చంద్రబాబు మీద విమర్శలు చేస్తారు... మోడీని ఒక్కటి అంటే ఒక్క మాట అనరు... ఇంతకీ జరిగిన విషయం ఏంటి అంటే...
వైసీపీ ఎంపీలు ఈరోజు రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ను కలువనున్నారు. టీడీపీ ఎంపీలు కోరినా అవకాశం ఇవ్వని రాష్ట్రపతి.. వైసీపీ ఎంపీలు అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం 12:30గంటలకు రాష్ట్రపతిని వైసీపీ ఎంపీలు కలువనున్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చకు రాని సమయంలో రాష్ట్రపతిని టీడీపీలు కలవాలనుకున్నారు. ఈనెల 5,6 తేదీల్లో రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. కానీ రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రధాన మంత్రి నివాసం ముందు టీడీపీ ఎంపీలు మెరుపు ధర్నా చేశారు.
ప్రత్యేక హోదా డిమాండ్‌తో లోక్‌సభకు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పది రోజులు అయినా స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమోదించలేదు. రాజీనామాలను స్పీకర్ తిరస్కరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని, భావోద్వేగాలతో రాజీనామాలు చేశారంటూ ఆమోదించకపోవచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను టీడీపీ, ఇతర పార్టీలు డ్రామాలుగా అభివర్ణిస్తున్నాయి. జనం నిలదీస్తారన్న ఆందోళన వైసీపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి వినతిపత్రం పేరుతో మరో డ్రామాకు తెరలేపిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.