21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు... వారి పేర్లు బయటపెట్టిన గంటలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుంది... ఇది, గత సంవత్సరం వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి అన్న మాటలు... ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఇవే మాటలు చెప్తున్నారు... మ్యాటర్ జగన్ దగ్గర పెండింగ్ లో ఉంది... జాగ్రత్తా అంటూ, విజయసాయిరెడ్డి వార్నింగ్‌ ఇస్తున్నారు... తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. వీరి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు... అంతే కాదు, ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్ల అంతు కూడా చూస్తారు అంట... విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

vijayasai 16042018 1

ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా గుర్తుకురాని ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్‌ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, మీకు హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రి పదవులకే కాకుండా... ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేయించాలని.. అందుకు తాము సిద్ధమేనని..మీరు సిద్ధమా అంటూ విజయసాయి చంద్రబాబుకు సవాల్ విసిరారు....

vijayasai 16042018 1

అయినా ముందు, మీరు వెళ్లి, మీ రాజనీమాలు ఆమోదించుకోండి, అప్పుడు సవాల్ విసరండి అని, తెలుగుదేశం నేతలు ఎదురు అంటే, విజయసాయి రెడ్డి, వెళ్లి పియంఓ లో దాక్కోవాలి అంటూ, తెలుగుదేశం నేతలు అంటున్నారు.... అయినా, ఇలా బెదిరించటం ఎందుకు... మ్యాటర్ జగన్ దగ్గర ఉంచుకోవటం ఎందుకు... జగన్ ఆవేశంలో ‘‘21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే గంటలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతా’’ అంటూ చేసిన వ్యాఖ్యలు, రివర్స్ అయ్యి, జగన్ నుంచి 21 మంది వెళ్ళిపోయిన విషయం మర్చిపోయినట్టు ఉన్నారు... రాజ‌కీయాల్లో ప్ర‌గ‌ల్భాలుండ‌కూడ‌దు.. ప‌డ‌గొట్టాల‌నుకుంటే ప‌డ‌గొట్టేయ‌డ‌మే.. గంట‌లో ప‌డ‌గొడ‌తా.. రోజులో ప‌డ‌గొడ‌తాన‌ని ఎదుటి వాడిని రెచ్చ‌గొట్ట‌డం, మైండ్ గేమ్ మాత్ర‌మే కాగ‌ల‌దు. మైండ్ గేమ్ అధికారంలో ఉన్న వారికే బాగా ఉప‌క‌రిస్తుంద‌నేది నిష్టుర స‌త్యం, 21 మంది ఎమ్మెల్యేల చేరికితో రుజువైనా బుద్ధి రాలేదు. అయనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అంటే కావాల్సింది ప్రజల సపోర్ట్, ఎమ్మెల్యేల సపోర్ట్ కాదు అని జగన్ తెలుసుకోవాలి.

ఢిల్లీ మీద యుద్ధం అంటూ, మన రాష్ట్రంలో బంద్ లు అంటూ, మన ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టేలా, వైసిపీ, జనసేన, చలసాని, కమ్యూనిస్ట్ లు బంద్ చేస్తున్నారు... వీరి ఎవరికీ, ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసే దమ్ము లేదు... ఇక్కడ మాత్రం, మన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, నెల తిరగ కుండానే, రెండో సారి బంద్ కు పిలుపు ఇచ్చారు... పోనీ సాయంత్రం దాకా ఏమైనా చేసారా అంటే, 11 గంటలకే, వెళ్ళిపోయారు... అయితే, తిరుపతిలో, వైసిపీ మాత్రం రెచ్చిపోయింది... ఈ రోజు ఉదయం రాష్ట్ర బంద్ సందర్భంగా తిరుపతి బస్టాండ్ సమీపంలో ఓ వాహన దారుడు రోడ్ ప్రక్కన పార్క్ చేసిన టూవీలర్ బైక్ దహనం చేశారు. వాహనదారుడు లబోదిబోమంటున్నారు. త‌న‌కు న్యాయం చేయాలని కోరారు. వైస్సార్ సీపీ నాయకులు పై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానన్న బాధితుడు.

ycp 16042018 1

సామాన్య ప్రజల ఆస్థులు ధ్వంసం చేస్తూ, కేంద్రం పై యుద్ధం ఏంటో వీరికే తెలియాలి... ఇలా బంద్ చెయ్యటం వళ్ళ, రాష్ట్రానికి నష్టం తప్ప, మోడీకి ఏమన్నా అవుతుందా ? ఇలా బంద్ లతో,ర రాష్ట్రం నాశనం అవ్వాలనే వారి ప్లాన్ సక్సెస్ అయినట్టే కాని, వారికి ఏమి అవ్వదు... సామాన్య ప్రజలు ప్రయాణాలు వాయిదా పడితే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? బ్యాంకు లు మూసుకుపొతే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? స్కూల్స్ మూసుకుపొతే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? వ్యాపారాలు మూసేస్తే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? ఎవరి కోసం చేస్తున్నారు ఇది ?

ycp 16042018 1

మరో పక్క చంద్రబాబు బంద్ పై, కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సీఎం మాట్లాడుతూ ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఉద్యమసంస్థలు ఆలోచించాలన్నారు. తమని తాము శిక్షించుకోరాదని.. అన్యాయం చేసిన వారిని శిక్షించాలని సూచించారు. తాము చేపట్టే నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలన్నారు. అరగంట సేపు నిరసనలో పాల్గొని...మరో గంటసేపు అదనంగా పని చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న రాష్ట్ర బంద్‌లో టీడీపీ మినహా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘ఏపీకి కేంద్రం చేయూత’ బుక్‌లెట్‌‌ను అంటూ, రాష్ట్ర బీజేపీ నేతలు ఒక పుస్తకం విడుదల చేసి, దాంట్లో దొంగ లెక్కలు అన్నీ రాసి, లక్షల లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు.... ఈ సందర్భంగా, చంద్రబాబు భిక్షతో ఎమ్మల్సీ అయిన మాధవ్ అనే కొత్త కృష్ణుడు, విష్ణు కుమార్ రాజు, రెచ్చిపోయి మాట్లాడారు... అయితే, వీరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం, ఈ సొల్లు అంతా మీరు చెప్పటం ఎందుకు, కేంద్రం చేత ఇవే మాటలు చెప్పించండి అని అంటున్నారు... కేంద్ర ప్రభుత్వం చేత, రాష్ట్రానికి చేసింది ఏంటో చెప్తే, అప్పుడు నమ్ముతాం అని, ఏమన్నా తేడా ఉంటే కోర్ట్ కి వెళ్ళవచ్చు అని, కేంద్రం చేత ఆఫిషయల్ గా, ఇదే పుస్తకం విడుదల చేపించ వచ్చుగా అని అడుగుతున్నారు...

bjp ap 15042018

చంద్రబాబు, ఇలాగే అసెంబ్లీలో అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున రికార్డెడ్ గా చెప్పారని, మీరు కూడా కేంద్ర ప్రభుత్వం చేత ఆఫిషయల్ గా చెప్పమని అడుగుతున్నారు... అలాగే చంద్రబాబు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తరుపునే అన్ని విషయాలు చెప్పారు కాబట్టి, ఆయాన ఎమన్నా తప్పులు మాట్లాడినా, కోర్ట్ లో కేసు వెయ్యమని చెప్తున్నారు ప్రజలు... ‘ఏపీకి కేంద్రం చేయూత’ బుక్‌లెట్‌‌ కేంద్రంతో విడుదుల చేపించండి... అప్పుడు ఆంధ్రా మొత్తం, మీ వెంటే ఉంటాం అని ప్రజలు అంటున్నారు... మరి రాష్ట్ర బీజేపీ నాయకులు, రెడీనా ? ఎలాగూ పార్లమెంట్ నుంచి పారిపోయారు, ఇప్పటికైనా కేంద్రం చేత, రాష్ట్రానికి చేసింది ఏంటో రాత పూర్వకంగా ఇవ్వండి అని కోరుతున్నారు ప్రజలు...

bjp ap 15042018

అయితే, భారతీయ జనతా పార్టీ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీని ‘బబుల్ గమ్ జనతా పార్టీ’గా టీడీపీ నేత బుద్దా వెంకన్న అభివర్ణించారు. తమ స్థాయిని మరిచి బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే బాగుండదని హెచ్చరించారు. ఏపీ బీజేపీ నేతలు ఐదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారని, మోదీ భజన ఇక చెల్లదని, ఆయన ఒక చెల్లని నాణెమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ప్రత్యేకహోదా ఏపీకి ఇవ్వమని చెప్పి ఈశాన్యరాష్ట్రాలకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గుజరాత్ లో రూ.లక్ష కోట్లతో ఒక పట్టణాన్ని నిర్మిస్తున్న కేంద్రం, ఏపీపై మాత్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని, బీజేపీ విడుదల చేసిన లేఖలో తెలిపినవన్నీ అసత్యాలేనని అన్నారు.

జనాలను ఫేక్ చేసి, పిచ్చోళ్లని చెయ్యటంలో, జగన్ పార్టీతో పోటీ పడుతుంది రాష్ట్ర బీజేపీ.. నిజానికి, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇలా ఫేక్ చెయ్యటం బాగా అలవాటు... అలా ఫేక్ చేసే, అధికారంలోకి కూడా వచ్చింది... అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది... కాని, వీరు కూడా, జగన్ దొరికినట్టు, సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ దొరికిపోతున్నారు... ఈ రోజు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, ఒక అబద్ధపు ప్రచారాన్ని చెప్తూ, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు వెళ్లి మన దేశ ప్రధాని గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం గల నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విదేశాల్లో పర్యటించి దేశ పరువును తీస్తున్నారని విషం చిమ్మారు... పాకిస్థాన్‌కు చంద్రబాబు మోస్ట్‌వాంటెడ్ పర్సన్‌గా మారారని విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లి మోదీని నిందించడమంటే దేశ పౌరులందర్నీ అవమానించడమేనని మండిపడ్డారు.... కాని ఇదంతా అబద్ధం... కింద ఉన్న వీడియో కూడా చూడండి...

state bjp 15042018

రెండు రోజుల క్రిందట సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గున్నారు... ఈ సందర్భంగా, చంద్రబాబు ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానంతో, ఆయన స్టేట్స్మెన్ అనే విషయం మరో సారి రుజువైంది... దక్షిణాది రాష్టాల పట్ల కేంద్రం వివక్ష అవలంబిస్తోందన్నారు. దీనిపై మీ అభిప్రాయం, ఏంటి అని ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ, "అది చర్చించడానికి ఇది వేదిక కాదు. ఆ అంశంపై మనం భారత్ లో కూర్చుని మాట్లాడుకుందాం. కానీ నేను ఒక్క విషయం స్పష్టం చేయదలిచాను. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు శిక్షకు గురికాకూడదు. ఇది దేశాభివృద్ధినే ఆటంకపరుస్తుంది." అంటూ సమాధానం చెప్పి ఆపేశారు...

state bjp 15042018

ఇదే విషయం, మేము కూడా ఆర్టికల్ రాసాము... "ధట్ ఈజ్ చంద్రబాబు... మోడీ చేస్తున్న అన్యాయం పై అడిగిన ప్రశ్నకు, ఇది ఆయన సమాధానం..." అంటూ అదే రోజు ఆర్టికల్ కూడా రాసాం... పరాయి దేశంలో, అంతర్జాతీయ వేదికల పై, మన ప్రధాని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో, చంద్రబాబు ఇలా సమాధానం చెప్పి, ఎంతో హుందాగా వ్యవహరించారు... కాని, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, చంద్రబాబు పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు... చంద్రబాబు సింగపూర్ తెలుగుదేశం వాళ్ళతో మాత్రమే రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, ఏమి చెయ్యాలి అనే దాని పై మాట్లాడారు... మిగతా ఆఫీషియల్ ప్రోగ్రామ్ లో ఎక్కడా, ప్రధాని మోడీని కించపరచలేదు... మోడీ లాగా అమెరికా వెళ్లి, అందరి ముందు మన్మోహన్ సింగ్ ను వింర్సించలేదు... ఎంతో హుందాగా వ్యవహరించారు... ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇప్పటికైనా ఆపి, కేంద్రం నుంచి నాలుగు ప్రాజెక్ట్లు, డబ్బులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే, ప్రజలు కనీసం డిపాజిట్ అన్నా ఇస్తారు...

Advertisements

Latest Articles

Most Read