వైఎస్ వివేక కేసులో, నిన్న ఒక్క రోజే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోర్టు ఆదేశాల ప్రకారం, అఫిడవిట్లు అన్నీ , ఆయా పార్టీలకు ఇవ్వాలని చెప్పటంతో, సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ రోజు వైసీపీ ఆడిన డ్రామా, దాన్ని చంద్రబాబు మీదకు తోసేయటం, ఇదంతా ఎంత కట్టు కధ అల్లరో చూసి, అసలు వివేక కేసులో వీళ్ళ ప్లానింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. నిన్న పులివెందుల సిఐ శంకరయ్య చెప్పిన విషయాలు, అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. అవినాష్ రెడ్డి తనకు ఫోన్ చేసి వివేక గుండెపోటుతో చనిపోయారని చెప్పినట్టు సీఐ శంకరయ్య చెప్పారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి అందరూ కలిసి ఆధారాలు చెరిపేసారని తెలిపారు. తనకు ముందు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి రమ్మన్నారని, తాను సిబ్బందితో అక్కడకు వెళ్లానని, ఈ లోపే దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు ఆలస్యం అయ్యింది అంటూ అరిచారాని సిఐ తెలిపాడు. ఆ తరువాత లోపలకు వెళ్లి చూస్తే ఇళ్లు మొత్తం రక్తం మరకలు ఉన్నాయని, వెంటనే అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చి, ఇది గుండెపోటు కాదని చెప్పానని సిఐ శంకరయ్య చెప్పాడు. వెంటనే అక్కడే ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి నోరు మూసుకుని ఉండు అని తనని బెదిరించారని, సైలెంట్ గా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపాడు.
అయితే అక్కడ ఉన్న మరో అనుచరుడితో, ఇది గుండెపోటు కాదని చెప్తుంటే, అంతా పెద్దోళ్ళు చూసుకుంటారు అంటూ తనకు చెప్పాడని అన్నారు. ఇక అప్పుడే కానిస్టేబుల్ తో అక్కడ సీన్ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తూ ఉండగా, దేవిరెడ్డి శంకర్ రెడ్డి గట్టిగా గట్టిగా అరిచాడని, దీంతో వీడియో తీయటం ఆపేసామని చెప్పాడు. తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మొత్తం నడిపించాడని, భారతి తండ్రికి చెందిన గంగిరెడ్డి ఆస్పత్రి నుంచి సిబ్బంది తెచ్చి కుట్లు వేసారని, మొత్తం క్లీన్ చేసిన తరువాత, రిఫ్రిజిరేటర్ బాక్స్ తెప్పించారని, అయితే అందులో పెట్టేందుకు తాను అంగీకరించ లేదని, ఫిర్యాదు చేయాలని, పోస్ట్ మార్టం చేయకుండా ఇలా ఫ్రీజర్ లో పెట్టకూడదని వాదిస్తే, కేసు లేదు ఏమి లేదు అని అవినాష్ రెడ్డి చెప్పాడని సిఐ తెలిపాడు. అయితే తాను గట్టిగా ఎదురు తిరగటంతో, నామమాత్రంగా ఒక ఫిర్యాదు రాసిచ్చారని తెలిపాడు. బడీని ఫ్రీజర్ లో పెట్టి, పూలు కప్పేసి, గాయాలు కనిపించకుండా, మొత్తం వ్యవహారం కానిచ్చేయాలని అవినాష్ రెడ్డి చూసాడని సిఐ తెలిపారు.