మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి, మోడీ అనే మాట కూడా లేకుండా గంట సేపు మాట్లాడారు... మళ్ళీ నేను కేంద్రం పై పోరాడుతున్నా ని చెప్తున్నారు... ఇప్పుడు ఇంకో పోటుగాడు వచ్చాడు... ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి... మోడీ మీద అవిశ్వాసం అంటూ, అదే నోటీసు తీసుకుని వెళ్లి మోడీ ఆఫీస్ లో కూర్చునే పోటుగాళ్ళు వీళ్ళు... ఈ రోజు ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టాడు... ఈ ప్రెస్ మీట్ లో, చంద్రబాబు చంద్రబాబు అనే మాట 130 సార్లు అంటే, కనీసం ఒక్కసారైనా మోడీ అనే మాట అనలేదు... మళ్ళీ కేంద్రం పై మేము ఇరగదీసి పోరాడుతున్న అంటున్నాడు...

jagan 06042018 3

అంతే కాదు, చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలు కూడా చేసాడు.. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది హేమామాలినితో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లారు అంట... అక్కడ హేమామాలినితో ఏమి మాట్లాడారో చెప్పటానికి, రేపు అఖిలపక్షం సమావేశం పెట్టారంటూ, జగన్ మదమెక్కిన మాటలు మాట్లాడుతూ, కనీసం మోడీని ఒక్క మాట కూడా అనలేదు... అంతే కాదు, చంద్రబాబు ఏదన్న బావి చూసి, దాంట్లో దూకి చావాలి అంట... రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది అంట... ఇలాంటి వాడు, మన ఖర్మకి మన ప్రతిపక్ష నాయకుడు... తన అవినీతిపై కేంద్రం విచారణ చేయిస్తుందన్న భయంతో ఎంపీలతో చంద్రబాబు ఆందోళన చేయిస్తున్నారు అంట...

jagan 06042018 3

11 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో A1 గజ దొంగ అని ఊరు అంతా తెలుసు... 16 నెలలు చిప్ప కూడు తిని, సోనియా గాంధీ కాళ్ళ పై తల్లిని, చెల్లిని పడేసి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి రోజు A2తో ప్రధానికి బూట్ పాలిష్ చేపిస్తూ, ఈ పోటుగాడు చంద్రబాబు పోరాటాన్ని విమర్శలు చేస్తున్నాడు... మోడీని ఒక్క మాట అంటే, శశికళ లాగా వెంటనే లోపల పడేసి కుళ్ళబొడుస్తారు అని భయం.. అందుకే హోదా ఇవ్వాల్సిన మోడీని, 19 విభజన హామీలను ఇవ్వాల్సిన మోడీని , ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనకుండా, మోడీ పై పోరాడుతున్న చంద్రబాబుని తిడుతూ, నేను ఎదో పొడుస్తున్నా అంటూ సొల్లు చెప్తున్నారు... చివరగా, ఈ పోటుగాడు, ఈ మాటలు ఎప్పుడు మాట్లాడాడో తెలుసా ? శుక్రవారం కోర్ట్ కి పోయి, సంతకం పెట్టి వచ్చి, నీతులు చెప్తున్నాడు...

దాదాపు నెల రోజుల క్రితం, ఏప్రిల్ 6న మా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు అని జగన్ ప్రకటించాడు.. అయితే, వెంటనే, పార్లమెంట్ సభ్యులు మాత్రమే, రాజ్యసభ సభ్యులు కాదు అంటూ, నొక్కి నొక్కి చెప్పారు... అయితే, ఇలా ఎందుకు అంటే, ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు.. నెల రోజులు నుంచి, ప్రతి రోజు మీడియా ఈ ప్రశ్న అడుగుతూనే ఉంది.... విజయసాయి రెడ్డి, వేమి రెడ్డి ఎందుకు రాజీనామా చెయ్యరు అని అడుగుతుంటే, ఒక్కరు అంటే దీనికి సమాధానం చెప్పటం లేదు... అయితే, కొన్ని రోజుల క్రిందట, పాదయత్రలో ఉన్న వైఎస్ జగన్, ఎంపీలను పిలిపించుకుని మాట్లడారు...

vijayasayi 06042018 1

ఆ సమయంలో ఒక ఎంపీ, ఇదే ప్రశ్న జగన్ ను అడిగారు... మేము ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోతున్నాం... విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చెయ్యరు అని అడుగుతుంటే, మా దగ్గర సమాధానం లేదు అని జగన్ దగ్గర గట్టిగా అడిగినట్టు సమాచారం.. అయితే, ఈ విషయం పై జగన్ క్లారిటీ ఇచ్చారు... మనకు పార్లమెంట్ సభ్యలు రాజీనామా చేస్తే, మ్యానేజ్ చేసుకునే అవకాసం ఉంది... మనకు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి... రాజీనామాలు ఆమోదించకుండా, మనం మ్యానేజ్ చెయ్యగలం... కాని రాజ్యసభలో పరిస్థితి వేరు అని చెప్తూ, దానికి కారణం చెప్పారు జగన్...

vijayasayi 06042018 1

పార్లమెంట్ అయితే, మనం రాజీనామాలు ఆమోదించకుండా మ్యానేజ్ చెయ్యవచ్చు... అదే సాయన్న రాజ్యసభలో రాజీనామా చేస్తే, అక్కడ ఉన్నది వెంకయ్య నాయుడు... ఆయన మీద ఇప్పటికే మనం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసాం.. అదీ ఆయన్ను మ్యానేజ్ చెయ్యటం కష్టం.. మరి, సాయన్న ఫిర్యాదు చెయ్యగానే, వెంకయ్య ఆమోదం చేస్తే, మన పరిస్థితి ఏంటి అంటూ జగన్ ప్రశ్నించారు.. వేమి రెడ్డి నిన్న కాక మొన్న రాజ్యసభ సభ్యుడు అయ్యారు... ఆయన మనకు కొంత కమిట్మెంట్ ఇచ్చారు.. ఇప్పుడు ఆయన్ను రాజీనామా చెయ్యమంటే, నేను ఆ కమిట్ అయ్యింది వదులుకోవాలి.. అందుకే రాజ్యసభ సభ్యలు రాజీనామా చెయ్యరు... మీరే ఎలాగొలా మ్యానేజ్ చెయ్యండి.. మీ రాజీనామాలు ఆమోదం పొందవు, నాది హామీ అని ఎంపీలు చెప్పారు జగన్... మొత్తానికి, వెంకయ్య దెబ్బకు, జగన్, విజయసాయి ఇలా భయపడుతున్నారు...

మనం ఎన్నో నిరసనలు చూసాం... రిలే నిరాహార దీక్షలు విన్నాం, కాని రిలే పాదయత్రలు ఎప్పుడైనా విన్నామా ? గంట సేపు పాదయత్ర అనే కొత్త కాన్సెప్ట్ తో, కమ్యూనిస్ట్ లు, జనసేన పార్టీ ఈ రోజు విజయవాడలో కదం తొక్కారు... బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడుకి పాదయాత్ర చేసి, స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టారు, జనసేన పవన్ కళ్యాణ్, సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ.. పాపం, బెజవాడ ఎండలు ఎలా ఉంటాయో తెలిసి ఉండదు, అందుకే రొప్పుతా రొప్పుతా మూడు కిలో మీటర్లు నడిసారు... సీపీఎం కార్యదర్శి మధు అయితే ఎండకు తట్టుకోలేక చొక్కా కూడా విప్పేసి, నిడిచారు... పాపం, ఈ బెజవాడ ఎండ దెబ్బకు, ముగ్గురికి మైండ్ పోయినట్టు ఉంది... మీడియా సమావేశం పెట్టి, ఏమి చెప్పారో చూడండి...

pk 06042018 2

ముందుగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దగ్గరకు వద్దాం... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం లేదంట, పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో కాఫీ తాగి వచ్చారంత... చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదంట... ఇక సీపీఎం నేత మధు దగ్గరకు వద్దాం, ఈ రోజు వీళ్ళు చేసిన రిలే పాదయాత్రతో మోడీ భయపడి పోయారు అంట... పోరాటం అంటే ఇలా చెయ్యాలి ఆంట.. చంద్రబాబు చేసేది పోరాటమే కాదు అంట, అందుకే, శనివారం ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరుకాబోమని మధు స్పష్టం చేశారు.

pk 06042018 3

ఇక మన హీరో గారి దగ్గరకు వద్దాం... ఇక్కడ ఈయన ఏమి చెప్తున్నాడో ఆయనికే అర్ధం కాదు... ఈ రోజు అయితే, బెజవాడ ఎండ దాటికి పూర్తిగా బాలన్స్ తప్పాడు.. మొన్నటి దాకా తెలంగాణా తరహ పోరాటం చెయ్యాలి అన్నాడు... ఈ రోజు, అఖిలపక్ష సమావేశం కోసం నన్ను ఆహ్వానించారు అని, కాని ఇప్పుడు మాత్రం అఖిలపక్ష మీటింగ్ వల్ల ఇప్పుడు ఏం లాభమో తనకు అర్థం కావడం లేదని, వెళ్లి కాఫీ, టీలు తాగి రావడం తప్ప ఏం చేస్తామని అంటున్నాడు పవన్... ఇంకా వింత ఏంటి అంటే, చంద్రబాబుకి క్లారిటీ లేదు అంట... ఏమి చేస్తున్నాడో ఆయనికే తెలియటం లేదు అంట... కాబట్టి ముందు చంద్రబాబు ఒక క్లారిటీ తెచ్చుకుని, తన దగ్గరకు మంత్రులని పంపిస్తే, అప్పుడు చంద్రబాబుకి క్లారిటీ ఉందో లేదో తెలుసుకుని, అప్పుడు అఖిలపక్షం పై స్పందిస్తాడంట పవన్... తాను జేఎఫ్‌సీ పెట్టబట్టే, చంద్రబాబు పోరాటం మొదలు పెట్టారంట... అవిశ్వాసం కూడా ఆయన అన్ని పార్టీలకు సందేశాలు ఇవ్వబట్టే, అందరూ మద్దతు ఇచ్చారంట...

అసలు పవన్ కళ్యాణ్ కు ఎంత క్లారిటీ ఉందో ఒక చిన్న ఉదాహరణ... అఖిలపక్షానికి మీరెందుకు వెళ్లరు అని విలేకరులు అడిగితే, పవన్ స్పందిస్తూ 'ముఖ్యమంత్రి..అసలు హోదా మీద..ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నాడు అనేది మాకు తెలియచేసినట్టయితే..అఖిలపక్షానికి వెళ్లే వాడిని" అని సమాధానం ఇచ్చారు... దానికి విలేకరి స్పందిస్తూ, "అది తెలియచెయ్యటానికేగా అఖిలకపక్షం అని పెట్టి అందరినీ రమ్మంది" అని చెప్పారు... దీనికి పవన్ స్పందిస్తూ "అంటే..అదీ.. ఆ.. అఖిల పక్షం రెండు సంవత్సరాల క్రితం పెట్టుంటే బాగుండేది" అని బదులు ఇచ్చారు... ఇది బెజవాడ ఎండల ఎఫెక్ట్... ఈయనకు పిచ్చ క్లారిటీ ఉంది అంట, చంద్రబాబుకి క్లారిటీ లేదు అంట... ఇంకా ఏమి మాట్లాడతాం...

ఈ రోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం... రెండు సీట్లతో మొదలైన బీజేపీ, ఇప్పుడు ఈ స్థానానికి రావటానికి, అద్వానీ, వాజ్ పాయి, వేసిన పునాదులు మర్చిపోకూడదు... ఇక అమిత్ షా, మోడీ హాయం వచ్చిన తరువాత, అంతా ఫేక్ ప్రాపగండా... అహంకారంతో, ఏమి కనిపించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.. ఈ రోజు అమిత్ షా మాట్లాడిన మాటలు, వీరు ఎంత అహంకారంతో ఉన్నారు అనటానికి ఒక ఉదాహరణ... బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, ప్రతిపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చారు. వరదలు వచ్చినపుడు కుక్కలు, పిల్లులు, పాములు చెట్లపైకి ఎక్కిపోయి, తమను తాము కాపాడుకుంటాయన్నారు.

amitshah 06042018

2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఉధృతిని తట్టుకోలేక విపక్షాలన్నీ థర్డ్ ఫ్రెంట్ పేరుతో ఏకమవ్వాలని చూస్తున్నాయన్నారు. మోదీ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ ఎస్ ఇలా అన్నీ జంతువులు కూడా ఒక చెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. మాకు ఎదురు లేదు అంటూ, ప్రతిపక్ష పార్టీలని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు... తిరిగే ఇదే భాషలో, చెప్పాలి అంటే, మీ బీజేపీ వాళ్ళని ఏ జంతువుతో పోల్చాలి అమిత్ షా గారు ?

amitshah 06042018

ఇదేంత అహంకార పూరిత స్టేట్మెంట్ ఆంటే 2 సీట్ లు ఉన్నప్పుడు మీరు కూడా ఇంతే... కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బలంగా ఉన్నప్పుడు, మీ మోడీ, గుజరాత్ వదిలి బయటకు రావాలి అంటే భయపడే వారు... చరిత్ర మర్చిపోయి, మనం ఎక్కడ నుంచి వచ్చామో మర్చిపోయి విర్రవీగితే, ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు... మళ్ళీ రెండు సీట్లలోకి పడిపోవటానికి ఎంతో కాలం పట్టదు.. అహంకారం మానండి... ప్రతిపక్షాలు కుక్కలు, పిల్లులు, పాములు అయితే, మిమ్మల్ని కూడా ఎదో ఒక జంతువుతో పోలుస్తారు... మీ స్థాయికి, ఇంత దిగజారి మాట్లాడితే, అంతకంటే దిగాజారి మిమ్మల్ని మాట్లాడే వారు ఉంటారు.. కొంచెం అహంకారం తగ్గించుకోండి సార్...

Advertisements

Latest Articles

Most Read