విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం, పార్లమెంట్‌లో ఇచ్చిన హామీల అమలు, కేంద్ర సాయంపై చర్చించేందుకు అఖిలసంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సమావేశమైంది. సచివాలయంలోని బ్లాక్‌-1లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే పోరాటానికి మద్దతిస్తామని అఖిలసంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. దేశాన్ని కదిలించగల అనుభవం, సమర్ధత ఉన్న నాయకుడు చంద్రబాబు ఈ పోరాటానికి దశ,దిశ నిర్దేశించాలని అఖిలసంఘాలు సూచించాయి.

cbn akhilapaksham 27032018

రానున్న 10 రోజులలో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటానికి సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.. రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి మన నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.... మరిన్ని గంటలు అదనంగా పనిచేయడం ద్వారా జపాన్ తరహా నిరసన తెలియచేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. రాజకీయాలకు అతీతంగా జరిపే శాంతియుత పోరాటంలో ఈ రోజు జరిపిన సమావేశానికి గైర్హాజరైన రాజకీయ పక్షాలను మరోసారి ఆహ్వానించాలని, వచ్చే సమావేశంలో విద్యార్థులు, విద్యుత్, ఇతర సంఘాలను కూడా భాగస్వాముల్ని చేయాలని నిర్ణయించారు....

cbn akhilapaksham 27032018

సంయమనంతో చేయాల్సిన ఉద్యమం అయినందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా అవాంచనీయ ఘటనలకు తావివ్వకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు... ముఖ్యంగా తమ భవిష్యత్ దెబ్బతింటుందని ప్రజలలో ఎక్కడా సందేహం రాకుండా ఈ ఉద్యమాన్ని శాంతియుత పంథాలో నడపాలని పిలుపిచ్చారు... జాతీయస్థాయిలో ఇఫ్పటికే దాదాపు అన్ని రాజకీయపక్షాలు ఏపీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు... 2,3 తేదీలలో ఢిల్లీ వెళ్లి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులను కలుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం, మోడీ వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఇప్పటికే రాష్ట్రమంతటా ఆందోళన బాట పట్టారు... మరో పక్క పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం కూడా ప్రతి రోజు పెడుతూ వస్తుంది... అయితే, బీజేపీ మాత్రం, అవిశ్వాసం ఎదురుకునే ధైర్యం చెయ్యలేక పోతుంది... ముందు వైసిపీ అవిశ్వాసం పెట్టినా ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వలేదు... వాళ్ళు బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతున్నారు అని అందరికీ తెలుసు కాబట్టి... ఎప్పుడైతే, తెలుగుదేశం అవిశ్వాసం నోటీసు ఇచ్చిందో, దేశంలోని అన్ని పార్టీలు, చంద్రబాబుకి మద్దతుగా నిలిచాయి... అయినా, కేంద్రం మాత్రం, అవిశ్వాసం పై చర్చ పెట్టటం లేదు...

cbn delhi 27032018

ఇప్పటికే రాష్ట్రానికి, కేంద్రం చేస్తున్న అన్యాయం పై, అన్ని వివరాలు పుస్తకం రూపంలో, దేశంలోని అన్ని పార్టీల నేతలకు తెలుగుదేశం ఎంపీలు ఇచ్చారు... అయితే, మోడీ - అమిత్ షా పై యుద్ధం అంటే మామూలు విషయం కాదు.. ఇప్పటికే మీ రాష్ట్రాన్ని నాశనం చేసే ఆపరేషన్ చేస్తున్నాం అంటూ లీకులు కూడా ఇచ్చారు... అందుకే, కేంద్రం చేస్తున్న అన్యాయం పై, అన్ని పార్టీల మద్దతు కోసం, ఏకంగా చంద్రబాబు రంగంలోకి దిగారు... చంద్రబాబునాయుడు వచ్చే నెల 2వతేదీన ఢిల్లీ వెళ్లనున్నారు... 3వతేదీన కూడా అక్కడే ఉండనున్నారు...

cbn delhi 27032018

ఇదే విషయం, ఈ రోజు జరిగిన అఖిలపక్ష భేటీలో చంద్రబాబు చెప్పారు.. ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నేతలను కలుస్తానని, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పోరాటం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు... ఇప్పటికే చంద్రబాబు అమరావతి నుంచి కొట్టిన దెబ్బకు విలవిలలాడుతూ, ప్రతి రోజు అవిశ్వాసం పై చర్చ జరపకుండా పారిపోతున్న బీజేపీ పెద్దలు, ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఢిల్లీలో కూర్చుంటే, రాజకీయంగా మా పరిస్థితి మరింత క్లిష్టం అవుతుందని భావిస్తున్నారు... ఇప్పుడు అందరి ద్రుష్టి చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై ఉంది... ఈ పర్యటనలో, దేశ రాజకీయాలు మరిన్ని ములుపులు తిరగనున్నాయి...

అప్పట్లో వైఎస్ఆర్ అసెంబ్లీ సాక్షిగా, చంద్రబాబుని అన్న మాట..."నీ తల్లి కడుపున ఎందుకు పుట్టావ్" అనేలా చేస్తా అంటూ అసెంబ్లీ సాక్షిగా అన్న మాట ఇది... ఈయన గారి పెద్ద కొడుకు సమానుడు, జగన్ కు సోదర సమానుడు అయిన గాలి జనార్ధన్ రెడ్డి, చంద్రబాబు మీద ఒక ప్రెస్ మీట్, అనరాని మాటలు అన్నారు... రోడ్డు మీద ఉండే మనుషులు కూడా అలాంటి మాట్లడారు.. కాని, చంద్రబాబు వీరి స్థాయికి ఎప్పుడు దిగలేదు... కాలమే సమాధానమే చెప్తుంది అని వదిలేసారు.. నిజంగానే ఇద్దరికీ కాలమే సమాధానం చెప్పింది... డబ్బు, పదవి చూసుకుని ఎగిరిన వారికి, సరైన రీతిలోనే కాలం సామధానం చెప్పింది... ఇప్పుడు కొత్తగా విజయసాయి తయారయ్యాడు...

vijyasai 27032018

ఈ రోజు రాజ్యసభ వాయిదా పడిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుని అనరాని మాటలు అన్నాడు... బజారులో ఉండే మనుషుల భాష మాట్లాడాడు... దీనికి కారణం, వెనుక మోడీ ఉన్నాడు అనే ధైర్యం... అప్పుడే ఫ్రెష్ గా, మోడీ కాళ్ళ మీద పడి వచ్చాడు... దాంతో మరింత బూస్ట్ అప్ వచ్చినట్టు ఉంది, బయటకు వచ్చి ఊగిపోయాడు... ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు...’ అంటూ చంద్రబాబు స్థాయి వ్యక్తిని అన్నాడు... చంద్రబాబు స్థాయి అనే కాదు, ఏ మనిషిని అయినా, ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా ?

vijyasai 27032018

ఇదే రాజకీయం ? ఇదేనా రాజకీయ నాయకులు మాట్లాడే భాష ? చంద్రబాబు తల్లి దండ్రుల గురించి మాట్లాడే నీచ సంస్కృతికి ఇలాంటి వాడు దిగజారాడు అంటే, ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యంగా రెచ్చిపోతున్న లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్, కూడా ఇలాగే మాట్లాడుతుంది కదా ? ఒక ఆర్ధక నేరగాడు, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A2, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న ఒక ముద్దాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఈ మిడిసిపాటు చూసి, వైఎస్ఆర్, గాలి జనార్ధన్ రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు...

బీజేపీ నడిపిస్తున్న స్క్రిప్ట్ లో పావుగా మారి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుని ఎలా తిడుతున్నాడో చూస్తూనే ఉన్నాం... మోడీని ఒక్క మాట కూడా అనకుండా, రోజుకి ఒక మాట మాట్లాడుతూ, అవిశ్వాసం పెట్టమని ఒకసారి, అవిశ్వాసం ఎందుకు పెట్టారని మరోసారి, మంత్రులు రాజీనామా చెయ్యాలని ఒకసారి, మంత్రులు రాజీనామా చేస్తే ఏమి వస్తుంది అని మరో సారి, అఖిలక్షం పెట్టమని ఒకసారి, అఖిలపక్షం ఎందుకు అని మరోసారి, ఇలా బీజేపీ నడిపిస్తున్న స్క్రిప్ట్ ప్రకారం నడుస్తూ, చంద్రబాబుని తిడుతూ కాలం గడిపేస్తున్నాడు... అయితే, బీజేపీ మాత్రం అనేక రకమైన ఆపరేషన్ లు చేస్తూ, రాష్ట్రంలో అనిశ్చితికి ప్రయత్నిస్తుంది అనే సమాచారం బయటకు వస్తుంది...

pawan 27032018

దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది... ఏ టైంలో, ఏ పరిస్థితి వస్తుందో, ఎలాంటి కుట్రలు పన్నారో అని అలోచించి, అలెర్ట్ అయ్యింది... పవన్ కల్యాణ్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది. పవన్‌కు భద్రతగా ఉండేందుకు నలుగురు గన్‌మెన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. నలుగురు గన్‌మెన్లను రెండు షిఫ్ట్‌ల్లో ప్రభుత్వం కేటాయించింది.... గుంటూరు సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, రాష్ట్రాన్ని ఎంతో కించ పరుస్తూ, మోడీని ఒక్క మాట కూడా అనుకుండా పవన్ మాట్లాడుతున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, పవన్ కు బద్రత పెంచింది...

pawan 27032018

నిజానికి, రాజకీయ ప్రత్యర్థులకు భద్రత తగ్గిస్తారు... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇలాంటివి ఎన్నో చూసాం... అయితే ఇక్కడ పవన్ అన్ని మాటలు అంటున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం, ఇక్కడ పవన్ కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది... కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్ని రాష్ట్రంలో అల్లకల్లోలం సృస్టిస్తాయి అనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అంటున్నారు... టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి జరిపి ఆ నెపం ప్రభుత్వం మీద వేయొచ్చన్న భయమే తాజా నిర్ణయానికి కారణం కావొచ్చు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read