అవిశ్వాస తీర్మానం పై, గత నాలుగు రోజులుగా, పార్లమెంట్ నుంచి పారిపోతున్నాడు మోడీ... తనకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా సరే, ఎదో తెలియని భయం... అందుకే తెరాస, అన్నాడీయంకేతో డ్రామాలు ఆడిస్తూ సభ వాయిదా వేస్తున్నారు... అయితే, ఈ విషయం పై ఒక నేషనల్ ఛానల్ సంచలన కధనం ప్రచారం చేసింది... బీజేపీలో అంతర్గతంగా లుకలుకలు చెలరేగినట్లు ఆ కధనం సారంశం... అవిశ్వాసం కనుక వస్తే, కొంత మంది బీజేపీ ఎంపీలు, మోడీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాసం ఉన్నట్టు, అద్వానీ వర్గం ఎంపీ చెప్పినట్టు ఆ కధనం సారంశం... ఇది కనుక జరిగితే, అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే అమిత్ షా, దీని పై లెక్కలు వేయగా, 302 మంది మద్దతు తమకు లభిస్తుందని అంచనాకు వచ్చారు... అయితే, అవిశ్వాసం కనుక పెడితే, ఆయాన వైఖరి పై నచ్చని సొంత పార్టీ నేతలు వోటింగ్ గు గైర్హాజరు అవ్వటం కాని, వ్యతిరేకంగా వోట్ వేసే అవకాసం ఉన్నట్టు సమాచారం... ఇటీవల త్రిపురలో బీజేపీ అగ్రనేత ఆడ్వాణీని మోదీ అవమానించిన తీరు చాలా మంది పార్టీ ఎంపీల మనసు గాయపరిచింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు పూర్తి సంఖ్యలో ఎంపీలు రాకపోవడం..
అదే సందర్భంలో, విప్ జారీ చేసినా ఉభయసభల్లో బెంచీలు ఖాళీగా కనపడడం పార్టీ అగ్ర నేతలను కలవరపరుస్తోంది... ఈ పరిణామాలు చూస్తుంటే, అవిశ్వాసం కనుక వస్తే, ఇక మోడీకి మూడినట్టే అని, అందుకే, ధైర్యం చెయ్యలేక, అవిశ్వాసం నుంచి పారిపోతున్నారని చెప్తున్నారు...చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి పలు అంశాలు బయటకు వస్తాయని, అది కర్ణాటక ఎన్నికల్లో తమకు నష్టం చేకూరుస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం... అందుకే ఇక శుక్రవారం, పార్లమెంటు ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి...