ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కని, తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన గుణపాఠం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జపాన్ తరహా ఆందోళన చేయడం ద్వారా హక్కులు సాధించుకుంటామని తెలిపారు. ఒక వైపు నిరసన ప్రకటిస్తూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. తన మనవాడి పుట్టిన రోజును పురస్కరించుకుని, ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు.. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. 

cbn 21032018 2

జపాన్‌ తరహాలో ఆందోళన, అభివృద్ధి రెండూ కొనసాగుతోంది. మా ఇంటి కులదైవం - నేను ఆరాధించే దేవుడు వేంకటేశ్వరస్వామి అన్నారు. ‘ప్రత్యేక హోదా పోరాటానికి సమాంతరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే జపాన్‌ తరహా పోరాటం చేస్తున్నాను. ఏపీ హక్కుల కోసం ప్రాంతీయ పార్టీల సహకారన్ని తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడితెస్తా. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని శ్రీవారిని ప్రార్థించా’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నా రాజకీయ జీవితంలో ఇప్పటివరకు మూడు సంక్షోభాలు చూశాను. ఆగస్టు సంక్షోభం తరువాత రాష్ట్ర విభజన మరో సంక్షోభం. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేయటం మరో సంక్షోభం. ఈ సంక్షోభాల నుంచి ఎలా గట్టెక్కాలో నాకు బాగా తెలుసు అని ముఖ్యమంత్రి అన్నారు.

cbn 21032018 3

ఇది ఇలా ఉండగా, జపాన్ తరహా ఉద్యమం పై తెలుగుదేశం అధ్యయనం చేస్తుంది... జపాన్ తరహా ఉద్యమం అంటే, మన నిరసన, ఎవరికీ నష్టం లేకుండా చెయ్యటం... అంటే ఉద్యోగులు మరింత ఎక్కువగా పనిచేయడం, రహదారులను ఊడ్చడం, పట్టణాలు, నగరాల్లో మౌన ప్రదర్శనలు చేయడం వంటి వాటి ద్వారా కేంద్రం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది... ఈ నిరసనలు ఎలా ఉండాలి ? ఇంకా ఎంత వినూత్నంగా, ఎవరికీ నష్టం జరగకుండా, అదే విధంగా మన కష్టం, బాధ ఎదుటి వారికి తెలియ చేసేలా, ఉద్యమం ఉండాలని చంద్రబాబు అంటున్నారు... ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ఉద్యమాన్ని సమాంతరంగా నడపాలనేది చంద్రబాబు యోచన...

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై తెలుగుదేశంప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ లో, కెసిఆర్, అన్నాడీయంకేని అడ్డు పెట్టుకుని ఎలా పారిపోతుందో చూస్తున్నాం.... అలాగే వివిధ డిమాండ్ల పై ఆయా పార్టీల సభ్యులు వెల్ లో ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు... వరుసగా 12వ రోజు సభ వాయిదా పడింది... రాజ్యసభలో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది... పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు‌ ప్రారంభమైనప్పటి నుంచీ ఇదే వరస. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడో వారంలోకి అడుగుపెట్టడంతో ఇప్పటికైనా పరిస్థితి అదుపులోకి వస్తుందని భావించారు...

venkiah 21032018 2

ఈ నేపధ్యంలో వెంకయ్య నాయుడు అందరినీ అవాక్కయ్యే నిర్ణయం తీసుకున్నారు... రాజ్యసభ సభ్యులకు బుధవారం విందు ఇవ్వాలని భావించిన వెంకయ్య, అందుకు తగిన ఏర్పాట్లను గతవారమే చేసుకున్నారు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి, సభలో అధికార, ప్రతిపక్ష నాయకులు, ఫ్లోర్ లీడర్లతో ఇప్పటికే విందు గురించి మాట్లాడిన వెంకయ్య, ఆహ్వాన పత్రికలను కూడా సిద్ధం చేసుకున్నారు... అయితే, అనూహ్యంగా, వెంకయ్య విందు రద్దు చేసుకున్నారు... సభ్యులకు ఇచ్చే మర్యాదపూర్వక విందును రద్దు చేసినట్టు చెప్పారు..

venkiah 21032018 3

అయితే, ఈ నిర్ణయం పై, అందరూ ఆశ్చర్యపోయారు... దీనికి కారణం, సభ సక్రమంగా సాగనందుకు మాత్రమే ఈ విందు రద్దు చేసుకున్నారని బయటకు చెప్తున్నారు... అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి, సభలో అధికార, ప్రతిపక్ష నాయకులు, ఫ్లోర్ లీడర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చి, ఇలా చెయ్యటంతో, ఏమైనా బలమైన కారణం ఉందా అనే సందేహం కూడా వస్తుంది... ఎందుకంటే, ఇలాంటి వాయిదాలో, కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉన్నాయి.. దీంట్లో కొత్త ఏమి లేదు... మరి, వెంకయ్య ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని, ఢిల్లీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు...

పవన్ కళ్యాణ్ వైఖరి పై కాపునాడు తీవ్రంగా స్పందించింది... మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు, ఢిల్లీకి లొంగిపోవటం పై, తీవ్రంగా స్పందించింది... మాకు కులం ముఖ్యం కాదని, రాష్ట్రం ముఖ్యమని, ఇప్పటికైనా పవన్ మారాలని పవన్ కు తలంటింది... విభజన హమీల కోసం, మోడీ లాంటి బలమైన నేతతో చంద్రబాబు యుద్ధం చేస్తుంటే, ఆయానకు రాష్ట్ర ప్రజలందరూ సహకరిస్తున్నారని, చంద్రబాబు తప్ప ఏ నాయకుడు ఢిల్లీతో పోరాటం చెయ్యటం లేదు కదా అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది...

pawan 21032018 2

చంద్రబాబు పోరాటాన్ని కాపులు అందరూ సహకరిస్తాం అని, అలా కాదని చంద్రబాబుని మన వాళ్ళే బలహీన పరిస్తే ఎలా అంటూ నిలదీసింది... చంద్రబాబుని బలహీన పరిస్తే ఎలా అంటూ, పవన్ కళ్యాణ్ ను నిలదీసింది... రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇప్పటికైనా మోడీతో పోరాటం చెయ్యాలని పవన్ ను కోరింది.. బీజేపీ భావలాని పవన్ వకాల్తా పుచ్చుకోవటం ఆశ్చర్యం అని అంటుంది... ఇప్పటికే ఒకసారి చిరంజీవి రూపంలో అవమానాలు పొందామని, మళ్ళీ మీరు అదే తప్పు చేసి, మన సామాజిక వర్గం పరువు తియ్యవద్దు అని పెర్కుంది...

pawan 21032018 3

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్... ఇక్కడ ప్రతి ఒక్కరు మన రాష్ట్ర అభివృద్ధి కోసమే చూస్తున్నారు... కులాలు, మతాలూ, ప్రాంతాలు ఇక్కడ అప్రస్తుతం... ఒక ఢిల్లీ పార్టీ ఎలా ముంచిందో, మరో ఢిల్లీ పార్టీ ఎలా మోసం చేస్తుందో చూసి, ఆంధ్రోడు రగిలిపోతున్నాడు.. ఆ ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలని, వారు కుళ్ళుకునేలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోతుకుంటున్నారు... దీని కోసమే, మనకు అన్యాయం చేస్తున్న ఢిల్లీ పై చంద్రబాబు పోరాడుతుంటే, ప్రతి ఒక్కరు ఆయన వైపు నిలుస్తున్నారు... ఇప్పటికైనా జగన్, పవన్, లాలూచి పనులు మాని, రాష్ట్రం కోసం పోరాడాలి...

ఒక పక్క ఏమో మోడీతో పోరాటం చేస్తున్నా, థర్డ్ ఫ్రంట్ తీసుకువస్తున్నా, అని ఒక రెండు ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసాడు కెసిఆర్... దీంతో మన పవన్ కళ్యాణ్, ఆహా ఓహో అన్నాడు... తరువాత కెసిఆర్ కూతురు కవిత గారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటానికి మా మద్దతు అన్నారు... దీంతో మన పవన్ కళ్యాణ్ గారు, చెల్లలు కవిత గారికి ధన్యవాదాలు చెప్పారు... ఇక అవిశ్వాసం పెట్టండి, నేను మద్దతు తీసుకు వస్తా అని సవాల్ విసిరాడు పవన్.. తీరా చూస్తే, దేశంలో అన్ని విపక్షాలు అవిశ్వాసానికి మద్దతు ఇస్తుంటే, కెసిఆర్ మాత్రం, నేను మద్దతు ఇవ్వను అంటున్నాడు...

kcr 21032018 2

ఒక పక్క మోడీకి వ్యతిరేకం అంటూ, మోడీ మీద అవిశ్వానికి మాత్రం మద్దతు ఇవ్వను అంటున్నాడు... ‘పక్కింట్లో పెళ్లయితే మా ఇంట్లో రంగులేస్తామా?’ అని టీఆర్‌ఎస్‌ ఎంపీలు అంటున్నారు... మాకు వాళ్ళు పట్టిన అవిశ్వాసం పై మాకు అవసరం లేదని అంటున్నారు... కేసీఆర్‌ను ఎవరో ఆడిస్తున్నారని విమర్శిస్తున్నారని... మమ్మల్ని ఎవరూ ఆడించలేరన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు...

kcr 21032018 3

టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సమస్యలపై మంత్రిమండలిలో చర్చించి చెబుతామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తమ నిరసన అడ్డంకి కాదని వినోద్‌ తెలిపారు... కెసిఆర్ ఇలాంటి డ్రామాలు ఆడుతూ, పక్కింటోడి పెళ్లికి మాకు ఎందుకు హడావిడి అంటూ, అవహేళన చేస్తున్నారు... కెసిఆర్ గారు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది... అన్నీ తరిగి ఇచ్చేస్తాం... మీ వళ్ళ నష్టపోయిన ఒక రాష్ట్రాన్ని, మీ చర్యలతో మరింత క్షోభ పెడుతున్నారు...

Advertisements

Latest Articles

Most Read