నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేసాయి... కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ మిత్రపక్షం ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, రద్దు చేసి, వైకాపా ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది... చంద్రబాబు పై ఏ విధంగా కక్ష సాదిస్తున్నారో, ఇది ఒక ఉదాహరణ... దీని పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పీయుష్ గోయల్ ఇలా చెయ్యటం చంద్రబాబుని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది... ఎందుకంటే, పీయుష్ గోయల్ కు, చంద్రబాబు అంటే ఎంతో గౌరవం... నాకు చంద్రబాబు ఆదర్శం అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు...
తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ విషయం పై, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షం ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వైకాపా ఎంపీకి ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎవరిని అవమానిస్తున్నారు.. అంటూ భాజాపా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టితో దోషులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజలే మనకు హైకమాండ్, ప్రజల ఆకాంక్షలే మనకు ముఖ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఆర్థిక బిల్లులపై చర్చ సాగుతున్న వేళ, రాష్ట్రానికి హోదా, నిధుల సాయంపై మాట్లాడాలని, ఎంపీలందరూ సభకు విధిగా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకుని మెలగాలని, ప్రతిపక్షాలను ప్రజలు మరచిపోయేలా చేయాలని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదని ఇక్కడ శాసనసభ, శాసన మండలిలో, అక్కడ లోక్సభ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ సమస్యలే ప్రతిధ్వనించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పార్లమెంటు జరిగేటప్పుడు దిల్లీ వేదికగా పోరాటం చేయాలని తర్వాత రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆర్ధిక బిల్లులు హడావుడిగా పూర్తిచేసి పార్లమెంటు నిరవధిక వాయిదా వేయొచ్చని.. ఆర్ధిక బిల్లులపై చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధికలోటుపై చర్చించాలని సూచించారు.