నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేసాయి... కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్ మిత్రపక్షం ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, రద్దు చేసి, వైకాపా ఎంపీకి అపాయింట్‌మెంట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది... చంద్రబాబు పై ఏ విధంగా కక్ష సాదిస్తున్నారో, ఇది ఒక ఉదాహరణ... దీని పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పీయుష్ గోయల్ ఇలా చెయ్యటం చంద్రబాబుని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది... ఎందుకంటే, పీయుష్ గోయల్ కు, చంద్రబాబు అంటే ఎంతో గౌరవం... నాకు చంద్రబాబు ఆదర్శం అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు...

railwayzone 13032018 2

తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ విషయం పై, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షం ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వైకాపా ఎంపీకి ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎవరిని అవమానిస్తున్నారు.. అంటూ భాజాపా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టితో దోషులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజలే మనకు హైకమాండ్, ప్రజల ఆకాంక్షలే మనకు ముఖ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు.

cbn piyush 14032018

ఆర్థిక బిల్లులపై చర్చ సాగుతున్న వేళ, రాష్ట్రానికి హోదా, నిధుల సాయంపై మాట్లాడాలని, ఎంపీలందరూ సభకు విధిగా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకుని మెలగాలని, ప్రతిపక్షాలను ప్రజలు మరచిపోయేలా చేయాలని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదని ఇక్కడ శాసనసభ, శాసన మండలిలో, అక్కడ లోక్‌సభ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ సమస్యలే ప్రతిధ్వనించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పార్లమెంటు జరిగేటప్పుడు దిల్లీ వేదికగా పోరాటం చేయాలని తర్వాత రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆర్ధిక బిల్లులు హడావుడిగా పూర్తిచేసి పార్లమెంటు నిరవధిక వాయిదా వేయొచ్చని.. ఆర్ధిక బిల్లులపై చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధికలోటుపై చర్చించాలని సూచించారు.

కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం పై గత రెండు నెలలుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే... కేంద్ర బడ్జెట్ లో అన్యాయం పై, చివరకు మిత్రపక్షం అయిన తెలుగుదేశం కూడా, కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు వచ్చింది.. ఎన్డీఏలో కొనసాగుతూ, బీజేపీని ఇబ్బంది పెడుతుంది... ఎన్డీఏ నుంచి కూడా త్వరలో బయటకు రానుంది... ప్రతి రోజు అసెంబ్లీలో చంద్రబాబు , డైరెక్ట్ గా కేంద్రాన్ని, మోడీని నిందిస్తూ, వారు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు... ఇంత జరుగుతున్నా, ఇన్ని ఆందోళనలు రాష్ట్రంలో జరుగుతున్నా, కేంద్రం మాత్రం ఏ మాత్రం స్పందించటం లేదు...

parliament 14032018 2

ఈ నేపధ్యంలో కేంద్రం పై, మరో ఒత్తిడి పెంచే వుహ్యంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది... కేంద్ర బడ్జెట్‌కు ఎంపీ గల్లా జయదేవ్ కీలక సవరణలు ప్రతిపాదించారు. ఆర్థిక బిల్లులోని క్లాజ్ 1 ఆఫ్ 2ని ఏపీకి వర్తింపజేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఏపీకి నిధుల కోసం ఆర్థికబిల్లులో కొత్త చాప్టర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుంధేల్‌ఖండ్ తరహా ప్యాకేజి ఇవ్వాలని కూడా ఆ ప్రతిపాదనలో ఉంది..

parliament 14032018 3

పోలవరం నిర్మాణంలో 2017 అంచనాల ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజికి నిధులు కేటాయించేలా సెక్షన్ 90లో సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. 13వ షెడ్యూల్‌లో కూడా పలు కీలక మార్పులు చేపట్టేలా సవరణలు జరగాలని సూచించారు. అమరావతి నిర్మాణానికి రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించేలా సెక్షన్ 94 ఆఫ్ 3లో సవరణలు చేపట్టాలని, ఏపీకి ఎఫ్ఆర్‌బీఎం పరిమితి కూడా పెంచాలంటూ జయదేవ్ ప్రతిపాదించారు. ఇవన్నీ చట్టంలో పెట్టిన అంశాలు... ప్రత్యేక హోదా లాగా, నోటి మాట కాదు.. దీంతో ఇప్పుడు, కేంద్రం ఎలా స్పందిస్తుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది... తెలుగుదేశం కూడా మిగతా పక్షాలని ఏకం చేసి, ఈ ప్రతిపాదన పై మెజారిటీ సభ్యుల అంగీకారం తెచ్చుకోగలిగితే, అది బీజేపీకి పెద్ద దెబ్బ అవుతుంది... మరి ఈ విషయంలో, చంద్రబాబు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి...

విభజన చట్టంలో హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు న్యాయం కోసం పోరాడతానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని తెలిపారు. విభజన ఇంకా పూర్తవ్వలేదని అన్నారు. విభజన కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..

cm vijayasayi 13032018 2

బీజేపీలో జరిగే కీలక నిర్ణయాలన్నీ వైసీపీకి ముందే ఎలా తెలుస్తున్నాయని సీఎం అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ముందే ఎలా తెలిసింది?. కోవింద్ బీహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడే సాయిరెడ్డి వెళ్లి కలిశారు. ఆర్థిక నేరస్తులకు అధికారం దగ్గర అంత స్వేచ్ఛ ఉండకూడదు. టీడీపీ.. ఎన్డీఏలో ఉన్నా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా చెప్పే వరకూ నాకు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలియదు అని చంద్రబాబు అన్నారు..

cm vijayasayi 13032018 3

మోదీ ప్రత్యేక హోదా ఇస్తారని పూర్తి విశ్వాసం ఉందని విజయసాయి అంటున్నారు. అలాంటప్పుడు వైసీపీ అవిశ్వాసం ఎందుకు పెడుతుందో అర్దం కావడం లేదని అన్నారు... వైసీపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి నన్ను విమర్శిస్తోందని, ప్రజలు మోస పోరని, వైసీపీని శాశ్వతంగా శిక్షిస్తారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ-1, ఏ-2 నిందితులు ప్రధానిని ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. దోచుకున్న ఆస్తులు రికవరీ చేసి రాష్ట్రానికి ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినట్లు చంద్రబాబు చెప్పారు...

ఇది నిజంగానే షాకింగ్ న్యూస్... నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా, ఏపీ చీఫ్ సెక్రటరీకి, రైల్వే జోన్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ లేదని తేల్చి చెప్పారు... దీంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఇదే సందర్భంలో రాజకీయంగా దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అలోచించి, ముందుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ని కలవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను చంద్రబాబు ఆదేశించారు.. చంద్రబాబు ఆదేశాల ప్రకారం, తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ అప్పాయింట్మెంట్ తీసుకున్నారు...

railwayzone 13032018 2

ఈ రోజు సాయంత్రం, నాలుగు గంటలకు తెలుగుదేశం ఎంపీలకు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ అప్పాయింట్మెంట్ ఇచ్చారు.... ఈ సందర్బంగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఇవ్వాల్సిందే అని, దానికి సంబాధించి అన్ని విషయాలతో పాటు, కొన్ని ఏళ్ళుగా ప్రజల సెంటిమెంట్ గురించి కూడా ప్రస్తావించటానికి రెడీ అయ్యారు... అయితే అనూహ్యంగా, అప్పాయింట్మెంట్ టైం ఇప్పుడు కాదని కబురు వచ్చింది, మరి కొంత సేపటికే, అప్పాయింట్మెంట్ కాన్సిల్ అయినట్టు తెలుగుదేశం ఎంపీలకు కబురు వచ్చింది...

railwayzone 13032018 3

దీంతో అసలు ఏమైందా అని వాకబు చేసారు, మళ్ళీ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు... ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌, వైసిపీ ఎంపీతో సమావేశం అయ్యారనే వార్త తెలుగుదేశం ఎంపీలకు తెలిసింది... వైసిపీ ఎంపీ శివప్రసాద్, పియూష్ గోయల్ ని కలిసి, కొన్ని ప్రాజెక్ట్ ల పై వినతి పత్రం ఇచ్చారని తెలిసింది... దీంతో, తమకు అప్పాయింట్మెంట్ కావలనే రద్దు చేసి, మనల్ని రెచ్చగొట్టటానికే, వైసిపీ ఎంపీతో సమావేశం అయ్యారని తెలుగుదేశం ఎంపీలు భావిస్తున్నారు... దీంతో, వెంటనే శ్రీకాకుళం ఎంపీ రామ్ మోహన్ నాయుడు, రైల్వే జోన్ ఆవశ్యకత పై, పియూష్ గోయల్ కు లెటర్ రాసారు... మొత్తానికి, ఈ ఎపిసోడ్ తో మళ్ళీ, బీజేపీ - వైసిపీ బంధం మరో సారి బయట పడింది... స్వతహాగా పియూష్ గోయల్ ఇలా చెయ్యరని, పై నుంచి ఒత్తిడి వల్లే, ఇలా చేసారని, తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి...

Advertisements

Latest Articles

Most Read