సింగపూర్‌ విమానయాన సంస్థకు చెందిన సిల్క్‌ ఎయిర్‌ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టింది... సిల్క్‌ఎయిర్‌ బృందం గన్నవరం ఎయిర్ పోర్ట్ ని సందర్శించింది... అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. సింగపూర్‌ నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడానికే ఈ బృందం విచ్చేసింది... అంతర్జాతీయ టెర్మినల్‌ భవనంలో ఉన్న ఏర్పాట్లు, రన్‌వే సహా అన్నింటినీ పరిశీలించారు.

silkair 12032018 2

విమానాశ్రయంలో ఉన్న ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. విజయవాడ నుంచి ముంబయికి ప్రస్తుతం నడుస్తున్న ఎయిరిండియా సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు కేంద్ర విమానయానశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా సిల్క్‌ఎయిర్‌ కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణామం. విజయవాడ నుంచి నేరుగా దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు విమాన సర్వీసులను తొలుత ప్రారంభించాలని స్థానిక పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఆ రెండు దేశాలకు వెళ్లిపోతే ప్రపంచంలో ఎక్కడికైనా తేలికగా చేరుకునేందుకు విమాన కనెక్టివిటీ ఉంటుంది.

silkair 12032018 3

అందుకే తొలుత కనీసం వారంలో రెండు మూడు రోజులైనా దుబాయ్‌, సింగపూర్‌లకు సర్వీసులను నడపాలని ఇక్కడి వాళ్లు కోరుతున్నారు. మార్చి 15 తర్వాత అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉంటామంటూ విమానాశ్రయం అధికారులు ఎయిరిండియాకు కొద్దిరోజుల కిందట లేఖను సైతం సమర్పించారు. విదేశీ సర్వీసును ప్రారంభించాలంటే కనీసం 45 రోజుల ముందు నుంచి టిక్కెట్లను విక్రయించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా ఎయిరిండియాకు విమానాశ్రయం తరఫున అనుమతి తెలియజేస్తూ లేఖను పంపించారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన 15 మంది సిబ్బంది గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో రూపాయి ఖర్చు లేనిది, కేవలం మోడీ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది ఏదన్న ఉంది అంటే, అది వైజాగ్ రైల్వే జోన్.. అయితే ఇప్పుడు దీన్ని కూడా పక్కన పడేసింది కేంద్రం... మొన్నటి దాక, అదిగో రైల్వే జోన్, ఇదిగో రైల్వే జోన్ అంటూ ఊరించారు... రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో, రైల్వే జోన్ తీసుకువచ్చి తీరుతాం, మా కేంద్రం పై, మాకు నమ్మకం ఉంది అంటూ, హడావిడి చేసారు... ఈ నేపధ్యంలో, ఈ విషయంలో రూపాయి ఖర్చు లేదు కాబట్టి, కనీసం ఇదైనా మన రాష్ట్రానికి వస్తుంది అని, అందరూ భావించారు.. కాని కేంద్రం, మన పై కక్ష కట్టింది... రైల్వే జోన్ లేదు అని తేల్చి చెప్పినట్టు సమాచారం...

vizag zone 12032018 2

ఈ రోజు ఢిల్లీలో, రాష్ట్ర అధికారులతో, కేంద్ర హోం శాఖ అధికారులు విభిజన అంశాల పై చర్చులు జరుపుతున్నారు... ఇవన్నీ రొటీన్ గా జరిగే సమావేశాలే. ప్రస్తుతం జరుగుతున్న విషయాలకి, ఈ సమావేశానికి సంబంధం లేదు... అయితే, ఈ సందర్భంలో రైల్వే జోన్ విషయం ప్రస్తావనకు రాగా, అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం రైల్వేజోన్‌ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ దినేష్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు... ఇదే సందర్భంలో, ఛీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్‌ ఇది సరి కాదు అని వారితో వాదనకు దిగినట్టు సమాచారం..

vizag zone 12032018 3

ఏపీకి రైల్వేజోన్ ఇచ్చేస్తున్నాం అని, ఒడిశాతో చర్చలుజరుపుతున్నామని, అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరువాత, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటిస్తామని కొద్దిరోజుల క్రితమే కేంద్ర పెద్దలు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగానే, కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగింది. విభజన హామీలు నెరవేర్చాలని తెలుగుదేశం ఆందోళన చేస్తున్న నేపధ్యంలో, ఈ సమయంలోనే రైల్వేజోన్ ఇవ్వటం సాధ్యం కాదని పుండు మీద కారం చల్లింది.

శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా, కేంద్రం చేస్తున్న అన్యాయం చెప్తూనే, జగన్ ఆడుతున్న డ్రామాలు కూడా, శాసనమండలి వేదికగా చంద్రబాబు బహిర్గతం చేసారు... ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ ద్వంద వైఖరి అవలంబిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు... ఒకరు విశ్వాసం అంటారు, ఇంకొకరు అవిశ్వాసం అంటారు అంటూ, వైయస్ఆర్‌సీపీ వైఖరిని ఎండగట్టారు... మోదీపై విశ్వాసం ఉందంటూనే ఆయన పై అవిశ్వాసం ఎలా పెడతారని ఎద్దేవా చేశారు... ప్రజలు వీళ్ళు ఆడుతున్న డ్రామాలు అర్ధం చేసుకోవాలని అన్నారు...

cbn jagan 12032018 2

ప్రత్యేక హోదా కోరుతూనే.. అది మోదీ వల్లే సాధ్యమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు... మోదీపై విశ్వాసం ఉందని చెబుతూనే ఆ పార్టీ కేంద్రం అవిశ్వాసం పెడతామంటోంది.... దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? ప్రజలు అమాయకులా అంటూ, మండిపడ్డారు... మళ్ళీ ఇలాంటి పనులకి తెలుగుదేశం మద్దతు ఇవ్వలంటున్నారు.... అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలనడం హాస్యాస్పదమని కొట్టి పారేశారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు... ఆంధ్రప్రదేశ్ కోసం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అవి తీసుకుంటామని, రాజకీయాలు కోసం ఇప్పుడు ఆలోచించమని, అవి ఎన్నికలప్పుడు చూసుకుంటామని అన్నారు...

cbn jagan 12032018 3

తమకు ఎవరిపైనా కోపం లేదని, ఎవరితోనూ వైరం పెట్టుకునే ఆలోచన లేదని అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం అందరితోనూ సఖ్యతతో వ్యవహరిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. చాలా అంశాల్లో కేంద్రం సహకరించకపోయినా, భారమైనా సరే రాష్ట్రం ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఆర్‌బీఐ ఒప్పుకోకపోయినా రైతు రుణమాఫీ చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.. విభజన చట్టంలో ఉన్న వాటినే అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామే తప్ప వ్యక్తిగతంగా ఏమీ కోరడం లేదన్నారు....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్స్ ఆసక్తి రేపుతున్నాయి... కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా కేంద్రంలో ఏ మాత్రం చలనం రాకపోవటంతో, మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి... చంద్రబాబు డైరెక్ట్ గా బీజేపీని ప్రశ్నలు వెయ్యటంతో, త్వరలోనే ఇక ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు అనే సంకేతాలు వస్తున్నాయి... ప్రతిపక్ష పార్టీ అయిన జగన్, ఎక్కడ కేంద్రాన్ని నిందించటం లేదు...

ncbn tweets 12032018 2

ఈ సందర్భంలో చంద్రబాబు డైరెక్ట్ గా రెండు ట్వీట్స్ వేసారు... "కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు. 'సెంటి మెంట్‌కు డబ్బులు రావు' అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారు." అంటూ ఒక ట్వీట్ ... అలాగే, "రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడతాం.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. ఆ అనుభవం నాకుంది. కష్టపడే తత్వం ప్రజలకుంది. కానీ హక్కుల విషయంలో బీజేపీ అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా మాట్లాడుతూ.. న్యాయం చేయాల్సింది పోయి ఎదురు దాడి చేయడం ఎంత వరకు న్యాయమో ఆలోచించుకోవాలి." అంటూ మరో ట్వీట్ వేసారు...

ncbn tweets 12032018 3

అంతకు ముందు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో సీఎం ప్రసంగించారు... గవర్నర్ తీర్మానానికి సమాధానం చెప్తూ, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు... రాష్ట్ర విభజనలో బీజేపీ భాగస్వామేనని, విభజన చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత బీజేపీదేనని అన్నారు. విభజన సెంటిమెంట్‌ను గౌరవించినట్లే ప్రత్యేక హాదా సెంటిమెంట్‌ను కేంద్రం గౌరవించాలని అన్నారు. మీ డబ్బు - మా డబ్బు అంటూ ఉండదని, ఆ డబ్బందా ప్రజలదేనని అన్నారు. దేశానికి దక్షిణాది నుంచే పన్నుల రూపంలో అధిక ఆదాయం వస్తోందని, ఆ డబ్బుతో ఉత్తరాదిని అభివృద్ధి చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు..

Advertisements

Latest Articles

Most Read