బీజేపీ అధిష్టానం ప్రవర్తిస్తున్న తీరుతో, ఒక్కో మిత్రపక్షం ఎన్డీఏ నుంచి దూరం అవుతుంది... ఇప్పటికే శివసేన, తెలుగుదేశం పార్టీ బీజేపీ పై యుద్ధం ప్రకటించాయి... శివసేన ఇప్పటికే 2019లో మిత్ర బంధాన్ని తెంచుకోనున్నట్లు ప్రకటించింది... తెలుగుదేశం కూడా, పార్లిమెంట్ సమావేశాల్లో మిత్రపక్షంగా ఉంటూ ఆందోళన చెయ్యాలని, వ్యుహాత్మకంగా వెళ్తుంది.. పార్లమెంట్ సమావేశాల లోపే, తెలుగుదేశం కూడా బయటకు వచ్చేస్తుంది... ఇప్పటికే, ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగిన తమ మంత్రులతో రాజీనామాచేయించింది... మరో పక్క అకాలీ దళ్ పార్టీ కూడా, మిత్రపక్షాలతో బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు పై, బహిరంగంగానే విమర్శలు చేస్తుంది... ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో పార్టీ చేరింది...
రళకు చెందిన ఎన్డీఏ మిత్రపక్షం భారత్ ధర్మ జన సేన(బీడీజేఎస్) చేరింది. కొద్దిరోజులుగా ఎన్డీఏ నుంచి వైదొలగాలా.. వద్దా అన్న అంశంపై మీమాంసలో ఉన్న బీడీజేఎస్.. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వస్తుండటంతో పొత్తు తెంచుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీంతో కేరళలో ఉన్న ఒకేఒక్క మిత్రపక్ష పార్టీని ఎన్డీఏ కోల్పోయింది... దీంతో మరోసారి, మిత్రపక్షాలతో మోడీ-అమిత్ షా ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశం అయ్యింది... మోడీ-అమిత్ షా వైఖరిని, అద్వానీ-వాజ్ పాయి తో పోల్చుకుంటూ, మిత్రపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా, యూపీలో కంచుకోటగా భావించే గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి తన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఫలితాలను చూసిన బీజేపీ మిత్రపక్షాలు చడీచప్పుడు కాకుండా జారుకుంటున్నాయి...