రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఊహించని పరిణామం చోటుచేసుకుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు... ఈరోజు ఉదయం లేవగానే పత్రికల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త చూసి చాలా ఖంగుతిన్నానని కేటీఆర్ వెల్లడించారు... హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా-2018 సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ వింగ్స్‌ ఇండియా-2018 సదస్సును ప్రారంభించారు.

ktr 08032018 2

వింగ్స్‌ ఇండియా-2018 సదస్సు నాలుగు రోజుల పాటు జరగనుంది. అయితే వింగ్స్ ఇండియా సదస్సుకు ముఖ్య అతిథిగా రావాల్సిన అశోక్ గజపతి రాజు… ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల కారణంగా రాలేకపోవడం చాలా దురదృష్టకరమని వివరించారు. దాంతో ఈ సదస్సుకు తాను ముఖ్య అతిథిగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు.

ktr 08032018 3

అశోకగజపతిరాజు కు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. దేశంలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే అశోక్ గజపతి రాజు సారథ్యంలో మూడేళ్లలోనే 50 నుంచి 60కిపైగా విమానాశ్రయాలు కొత్తగా ఏర్పాటు చేశారని ఆ ఘనకీర్తి ఆయన దక్కుతుందని పేర్కొన్నారు. ఇంకా భారత వైమానిక రంగం మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నానని కేటీఆర్‌ వివరించారు.

కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన ఇద్దరు రాజీనామాలు సమర్పించారు. కాగా పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు.. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడంలో కేంద్రం విఫలమైన కారణంగానే మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వీరిద్దరూ ప్రధానికి వివరించారు. తమ రాజీనామాకు దారితీసిన కారణాలను పరిస్థితులను వివరించారు. కాగా ఈ ఇద్దరూ మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తమ సొంత వాహనాల్లో వెళ్లడం గమనార్హం. రాత్రి 7గంటలకు అశోక్, సుజనా ఇద్దరూ మీడియాతో మాట్లాడనున్నారు.

rajeenam 08032018 2

కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజు, శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రిగా సుజనా చౌదరి ఉన్న విషయం తెలిసిందే. 2014 మే 26న మంత్రిగా అశోక్ గజపతి, నవంబర్ 9న సుజనా చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ప్రధానితో సుమారు 10 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం వీరిద్దరూ ఈ సాయంత్రం 6.45 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. మోదీ అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆలస్యంగా రాజీనామా లేఖలను సమర్పించారు. తొలుత సుజనా చౌదరి ఇంటికి వెళ్లిన అశోక్‌ గజపతిరాజు ఆయనతో కలిసి కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. మోదీతో కొద్దిసేపు మాట్లాడి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలో పరిస్థితులను, తాము రాజీనామాలు చేసేందుకు దారితీసిన పరిస్థితులను వివరించినట్లు సమాచారం.

rajeenam 08032018 3

నిన్న సాయంత్రం కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెనువెంటనే సీఎం చంద్రబాబు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌, మంత్రులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన తర్వాత బుధవారం అర్ధరాత్రి కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఉదయమే తమ రాజీనామా పత్రాలను తీసుకొని పార్లమెంట్‌ వద్దకు చేరుకున్న అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం వేచిచూశారు. అయితే ప్రధాని రాజస్థాన్‌ పర్యటకు వెళ్లడంతో సాధ్యపడలేదు. ఈ సాయంత్రం 4.30గంటల సమయంలో దిల్లీకి చేరుకున్న ప్రధాని నేరుగా సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేసి సుమారు 20 నిమిషాలు మాట్లాడారు.

సొంత పార్టీ నేతలే మంత్రి పదవి ఇవ్వకపోతే, నాయకుడుని దుమ్మెత్తి పోసే రోజులు ఇవి... అలాంటిది, చంద్రబాబు నిర్ణయం వల్ల, తమ మంత్రి పదువులు కూడా పోయినా, వారు మాత్రం వెళ్తూ వెళ్తూ చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో చెప్పి వెళ్లారు... అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన భాజాపా నేతలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఎపి బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు తదనంతరం శాసనసభలో తమ రాజీనామాల విషయమై మాట్లాడారు.

bjp ministers 08032018

సీఎం చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బాబు లాంటి నాయకులుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను మంత్రిగా సఫలం అయ్యాయని చెప్పారు. తాను మంచి స్నేహితులను సంపాదించుకున్నానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేశారని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి వెంకయ్యనాయుడు, బీజేపీ నాయకత్వం కారణమన్నారు. అలాగే రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు అభివృద్ది పధంలో పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. తన వైద్య శాఖలో కూడా చంద్రబాబు సహకారంతో ఎన్నో సంస్కరణలు చేశానని, తద్వారా దేశంలోనే స్పూర్తి దాయకమైన రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దగలిగామని అన్నారు.

bjp ministers 08032018

మంత్రిగా అవకాశం ఇచ్చి సహకరించిన చంద్రబాబుకు మంత్రి మాణిక్యాలరావు ధన్యవాదాలు తెలిపారు. రెండు పుష్కరాలు నిర్వహించే అదృష్టం తనకు దక్కిందని, దేవాదాయశాఖలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు. గతంలో స్మార్ట్‌ఫోన్‌ ఎలా వాడాలో కూడా తెలియదని...చంద్రబాబు స్ఫూర్తితో కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ నేర్చుకున్నా అని అసెంబ్లీలో మాణిక్యాలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధతకు పోటీ లేదని మంత్రి మాణిక్యాలరావు ప్రశంసలు కురిపించారు. సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే ఏపీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని, పోలవరం ముంపు మండలాలు సాధించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సమర్ధత, కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏపీకి బీజేపీ శత్రువు కాదు.. మిత్రుడే అని మాణిక్యాలరావు తెలిపారు.

bjp ministers 08032018

మరోవైపు వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ తరపున ఎంపికైన ఇద్దరు మంత్రులు సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. కృష్ణా, గోదావరి పుష్కరాలను మంత్రి మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని, వైద్య ఆరోగ్యశాఖలో కామినేని శ్రీనివాస్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కితాబిచ్చారు. ఓ ముఖ్యమంత్రిగా వారి సమర్థవతమైన సేవలను అభినందిస్తున్నానని బాబు వ్యాఖ్యానించడంతో.. అసెంబ్లీలో కేబినెట్ సహచరులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నిన్న కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే... కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ బయటకు వస్తున్నట్టు ప్రకటించారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం కేంద్ర కేబినెట్‌లో ఉన్న అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వైదొలగనున్నారు... మరో పక్క ఇదే నిర్ణయం చెప్పటానికి, ప్రధాని మోడీకి ఫోన్ చేసినా, ఆయన అందుబాటులో రాలేదు... అయితే అనూహ్యంగా ప్రధాని మోడీ, కొద్ది సేపటి క్రిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫోన్ చేసారు... వీరిద్దరి సంభాషణ దాదాపు 10 నిమిషాల పాటు జరిగినట్లు తెలుస్తోంది.

modi cbn 08032018

ఈ రోజు ఉదయం రాజస్థాన్‌లో భేటీ పడావో- భేటీ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ఈ సాయంత్రం 4.30గంటలకు తన నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడినట్టు సమాచారం. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ప్రధానితో మాట్లాడి తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించగా వీలు పడలేదు. నిన్న మంత్రిమండలి సమావేశం ఉండటం, ఈ రోజు రాజస్థాన్‌ పర్యటన నేపథ్యంలో మాట్లాడటం కుదరకపోవడంతో ఈ సాయంత్రం మోదీ చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడినట్టుగా ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

modi cbn 08032018

. వీరిద్దరి సంభాషణలో ప్రధానంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ ఇద్దరి మంత్రుల రాజీనామాకు దారితీసిన కారణాలను చంద్రబాబు వివరించినట్టు సమాచారం. అలాగే, ఇద్దరు మంత్రులు రాజీనామాలు సమర్పించేందుకు మోదీ అపాయింట్‌మెంట్‌ కోరడంతో.. వారికి మోదీ ఈ సాయంత్రం 6గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఉదయమే ప్రధానికి రాజీనామా లేఖలు అందజేయాలని అనుకున్నా... మోదీ రాజస్థాన్ పర్యటనలో ఉండడంతో కుదరలేదు. దీంతో టీడీపీ కేంద్ర మంత్రులు ఈ సాయంత్రం మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read