ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి పేరుతో ఆందోళన చేస్తున్న, సినీ హీరో శివాజీ మొదటిసారి జగన్ పై ఫైర్ అయ్యారు.... మొన్న ఢిల్లీలో వైసిపీ జరిపిన ఆందోళన, జగన్ ప్రసంగాల గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుని నిత్యం తిడుతూ ఉంటే లాభం ఏంటి ? ఒక్కసారైనా మోడీని విమర్శించరా ? ప్రతిపక్షంలో ఉంటూ కూడా, కేంద్రం పై డైరెక్ట్ గా ఎందుకు పోరాడటం లేదు ? ఢిల్లీలో ఆందోళన మంచిదే, కాని కనీసం మోడీని అడుగుతూ ఒక్క పోస్టర్ అన్నా, ఒక్క ప్రసంగం అన్నా ఇంగ్లీష్ లో ఉందా ? అంటూ జగన్ పై మండి పడ్డారు శివాజీ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ చంద్రబాబుని విమర్శిస్తాడేంటని సినీనటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత శివాజీ ప్రశ్నించారు. జగన్ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సాధన సమితి పోరాడుతుంటే కూడా జగన్ మద్దతు తెలపడంలేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని విమర్శించారు.
అలాగే గవర్నర్ ఫై కూడా విమర్శలు చెసాఉ... రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద శని గవర్నర్ నరసింహనేనని నటుడు శివాజీ ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గవర్నర్ నరసింహన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు... తెలంగాణ తరహాలో ఉద్యమం చేస్తే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని అన్నారు. నాయకులు హోదా కోసం పోరాడితే ప్రజలు వారి వెనకాలే ఉంటారని అన్నారు.