రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ భాజపా ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్ పై ఐటి మంత్రి లోకేష్ స్పందించారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చెప్పారు... కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని తెలిపారు... బీజేపీకి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.. ఎన్నడూ కవివినీ ఎరుగని రీతిలో రాయలసీమకు నీళ్లందించామన్నారు... అనంతలో కియా, చిత్తూరులో ఫాక్స్ కాన్ కంపెనీలను ఏర్పాటు చేస్తోంది తెదేపా ప్రభుత్వమేనని ప్రజలు గుర్తించారని లోకేష్ అన్నారు... ఇదే సందర్భంలో రెండో రాజధాని అంటూ, బీజేపీ చేస్తున్న హడావిడి పై, వారికి అదిరిపోయే పంచ్ వేసారు లోకేష్...
“కర్నూలుని రెండో రాజధానిగా చేయాలని భాజపా నాయకులు అంటున్నారు. వారి డిమాండ్ తో నేనూ ఏకీభవిస్తాను. ఈ దేశానికి రెండో రాజధానిగా కర్నూలుని చేయాలి. దక్షిణ భారతంలో దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేయా లన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అదేదో కర్నూ లులో ఏర్పాటు చేస్తే వాళ్లు కోరుకున్నదీ జరుగుతుంది. మనం కోరుకున్నదీ జరుగుతుంది. రాష్ట్రానికి ఒక రాజధాని కట్టుకోవడానికే నిధుల్లేక ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది కర్నూలులో రాష్ట్ర రెండో రాజధాని ఏర్పాటు చేయాలనడంలో అర్ధం లేదు. రాయలసీమ డిక్లరేషన్ అప్రస్తుతం” అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో కూడా బీజేపీ వైఖరి పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరుచుకుపడుతున్నారు... మీరు పాలించే అన్ని రాష్ట్రాల్లో రెండు రాజధానులూ రెండు అసెంబ్లీలూ పెట్టారా? అసలు అమరావతి రాజధానికే దిక్కు లేదు... రెండోది కట్టాలా? ముందు చెయ్యాల్సినవి చెయ్యండి, లేకపోతే మీరే రాయలసీమలో కట్టండి.... దక్షణ భారత నినాదాలు చేస్తుంటే, ఇలా మాట్లాడకూడదు అన్న మీరే, ఇలా ఎందుకు చేస్తున్నారు ? సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు సంస్థానాలని కలిపితే....ఆయన వారసులు అని చెప్పుకునే మీరు ప్రాంతీయతను రెచ్చగొట్టి పబ్బమ్ గడుపుకోవాలి అని చూస్తున్నారు,నిస్సిగ్గుగా... ఆంధ్రులుగా మా హక్కును అడిగితే ప్రాంతీయతను రెచ్చగొట్టి కుక్కలు చింపిన విస్తరి చెయ్యలనుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో బీజేపీ వైఖరి పై పోస్ట్ లు పడుతున్నాయి..