జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాసం డ్రామా వెనుక ఎంత క్రిమినల్ మైండ్ దాగుందో తెలుసా ? ప్రజలని జగన్ బ్యాచ్ ఎలా పిచ్చోల్లని చెయ్యాలని భావించిందో తెలుసా ? వేసే డ్రామాలు వెయ్యక, పెద్ద పోటుగాడిలా పవన్ ని కెలిక, ఇప్పుడు మెడకు చుట్టుకునేలా చేసుకున్నాడు జగన్... అసలు జగన్, మోడీ మీద అవిశ్వాసం పెట్టే దమ్ము ఉందా అని అందరూ అనుకున్నారు... నోటి మాట వేరు, ఒక సంతకం పెట్టి, మోడీ మీద నాకు విశ్వాసం లేదు అని చెప్పటం వేరు... జగన్ అంత సాహసం చెయ్యగలడా ? మరి అవిశ్వాసం డ్రామా ఏంటి ? బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడా ? అసలు జగన్ ప్లాన్ ఏంటి ? ఇది తెలిస్తే, జగన్ ప్రజలని ఎలా పిచ్చోల్లని చేద్దామనుకున్నాడో అర్ధమవుతుంది...

jagan 03032018 2

మార్చి 21న అవిశ్వాసం పెడతామంటుంది వైసీపీ.. అయితే దీని వెనుక, ఎన్నో లెక్కలు ఉన్నాయి... అచ్చం మన A1, A2 లెక్కలు లాగా... నిజానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ వైసీపీకి ఐదుగురు సభ్యులే ఉన్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడానికి సమయం తీసుకొని మార్చి 21న పెట్టాలని వైసీపీ అనుకుంటోంది. లోక్‌సభ 198వ నిబంధనను అనుసరిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఈ నిబంధన ప్రకారం 50 మంది ఎంపీలు దానికి మద్దతిస్తే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అంగీకరిస్తారు.

jagan 03032018 3

అయితే దీనికి వెంటనే సమయం కేటాయించరు. నిబంధనల మేరకు తీర్మానాన్ని అంగీకరించిన 10 పని దినాల్లో ఎప్పుడైనా స్పీకర్‌ చర్చకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 6న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. వైసీపీ మార్చి 21న తీర్మానం పెడితే సరిగ్గా 10వ పనిదినాన సభ ముగుస్తుంది. ఈ లెక్కలన్నీ ముందే వేసుకుని అవిశ్వాస తీర్మానం 21న పెట్టాలని వైసీపీ భావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే మరో వాదన ప్రకారం, అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే కనీసం రెండు వారల ముందు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలి.. ఇలాగే పోయిన సారి సమైఖ్య ఉద్యమం అప్పుడు, నోటీసు తిరస్కరించారని గుర్తు చేస్తున్నారు.. ఇవన్నీ లెక్కలోకి వేసుకుని, జగన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు... లేకపోతే, నీ మీద నాకు విశ్వాసం లేదు మోడీ, అని రికార్డెడ్ గా చెప్పే దమ్ము జగన్ కు ఉందా ?

ఈ రోజు ఉదయం టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే... బీజేపీ వైఖరి పై విసుగెత్తిపోయిన చంద్రబాబు, కేంద్రం పై పోరాటం చెయ్యటానికి సిద్ధం అయ్యారు... రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. విభజనచట్టం హామీలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు హోదా-ప్యాకేజీ మతలబును లేఖలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.

amith phone 02032018 2

మిత్రపక్షం అయినా సరే, ఎందుకు కేంద్రం పై పోరాడుతున్నమో చెప్పదలుచుకున్నారు... అయితే, ఈ పరిణామంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అలెర్ట్ అయ్యారు... ఇలా చేస్తే, బీజేపీ కి రాజాకీయంగా నష్టం అనుకున్నారో ఏమో కాని, వెంటనే చంద్రబాబుకి ఫోన్ చేసారు.. మీరు వెంటనే ఢిల్లీ రండి... సోమవారం మీరు వస్తే, అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ, అమిత్ షా చంద్రబాబుని కోరారు... విభజన హామీల పై చర్చిద్దాము రండి అన్నారు...

amith phone 02032018 3

దీని పై చంద్రబాబు స్పందిస్తూ, నేను ఢిల్లీ రావటం కుదరదు అని చెప్పేసారు.. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే వంక చెప్పారు... కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబరావులను చర్చలకు పంపుతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదిలేదని అమిత్‌షాకు చంద్రబాబు తేల్చిచెప్పారు... అయితే నిన్ననే అమిత్ షా, వెంకయ్య సమక్షంలో చర్చలు జరపగా, ఇంకా ఇంతకూ మించి ఏమి చెయ్యలేమని, కొన్ని అంశాలు చేద్దాం, చూద్దాం అని చెప్పటంతో, విసుగెత్తిపోయి, చంద్రబాబు ఈ రోజు ఉదయం, అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర వైఖరి గురించి లేఖలు రాయటానికి రెడీ అయ్యారు... ఇలాంటి సమావేశాలతో టైం పాస్ తప్ప, చేసేది ఏమి ఉండదు అని చంద్రబాబు అభిప్రాయం...

మన దేశ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు లాయర్ అన్న సంగతి తెలిసిందే... ఇప్పుడు ఇవే లాయర్ తెలివి తేటలు, మన రాష్ట్ర సమస్యల పై చూపిస్తూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు... గురువారం కేబినెట్‌ సమావేశం వివరాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, ఏపి పై అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం విస్మయానికి గురి చేసింది... రెవెన్యూలోటు భర్తీ, ప్రత్యేక ప్యాకేజీ కింద ఆర్థిక సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు చెప్పిందని, దానిపై ఆ ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.. ఏపీ ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పిన మరుక్షణమే తాము నిర్ణయం వెలువరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

jaitley 02032018 1

అయితే, విలేకరులు ఆ ఫార్ములా ఏంటో చెప్పండి అంటే మాత్రం, దాన్ని బహిర్గతం చేయలేనని పేర్కొన్నారు... దీని పై కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గున్న రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతూ, జైట్లీ గారు ఆ స్థాయిలో ఉండి అలా మాట్లాడటం అభ్యంతరకరం అని చెప్పారు... వారు మనకు ఏ ఫార్ముల పంపించలేదని చెప్పారు... పార్లమెంట్ సమావేశాలు జరిగే టైంలో చర్చలు జరిపాం అని, అప్పట్లో మనకు రావాల్సిన 16 వేల కోట్ల పై అడిగామాని, వారు రుణ మాఫీ అని, అవి అని, ఇవి అని అన్నీ వాటిల్లో లెక్కేసి, ఎదో లెక్క చెప్పారని, మనం వాటికి ఒప్పుకోలేదు అని చెప్పారు..

jaitley 02032018 1

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, దీని పై ఈ రోజు జరిగిన ఎంపీల మీటింగ్ లో మాట్లాడారు... ఆర్ధికలోటు భర్తీకి ఫార్ములా ఇచ్చామన్న కేంద్రం వాదన పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం ఫార్ములా ఇచ్చారు..?వాళ్లిచ్చిన ఫార్ములా ఏమిటి..?
మేము అడగడం ఏమిటి..? ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలిగాని మీరే చెప్పండి అనడం కరెక్ట్ కాదు, ఆ ఫార్ములా ఏంటో ప్రజల మందు ఉంచండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం తొలుత అంగీకరించిన రూ.7,500 కోట్ల రెవిన్యూలోటులో ఇప్పటివరకూ ఇచ్చిన రూ.4వేల కోట్లు మినహాయించి, మిగిలిన రూ.3,500 కోట్లు విడుదల చేయాలని ఇదివరకే కోరినట్లు తెలిపారు.

jaitley 02032018 1

అయితే కేంద్రం మాత్రం, మరో 100-150 కోట్లు ఇస్తే సరిపోతుంది అంటున్నారని చెప్పారు... కాగ్‌ నిర్ధారించిన రూ.16వేల కోట్ల లెక్క సరైందో కాదో తేల్చడానికి 14వ ఆర్థికసంఘం అధ్యక్షుడు వైవీరెడ్డి నేతృత్వంలో కమిటీ వేయాలని సూచించారు. అయితే ఇంతవరకూ కేంద్రం మాత్రం తాను చెప్పిన దారిలోకే రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంలో మార్పులేదని చెప్పినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఒక అవినీతి పుటకతో పుట్టిన పత్రిక రాస్తుంది... కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకి, చంద్రబాబుకి తీవ్ర విభేదాలు వచ్చాయని... అదే పత్రికకు తోడు ఉన్న, మరో ఛానల్ కధనం అల్లుతుంది, అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీని వదిలి, బీజేపీ లో చేరి పోతారని.. ఇలా అశోక్ గజపతి రాజు పై అనేక తప్పుడు కధనాలు ప్రసారం చేస్తున్నారు... నిజానికి, ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో, విలువలు ఉన్న నాయకుల లిస్టు తీస్తే, టాప్ 3లో రాజు గారు ఉంటారు... అలాంటి నేత పై తప్పుడు కధనాలు అల్లుతున్నా, వారి మాటలకు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, నేనేంటో చంద్రబాబుకి తెలుసు, ప్రజలకి తెలుసు అని కాంగా ఉన్నారు...

ashok 02032018 2

ఇది ఇలా ఉండగానే, శుక్రవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొంతమంది ఎంపీలు కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయిస్తే బాగుంటుందని సూచించారు. పదవులు పట్టుకుని కేంద్రంలో టీడీపీ మంత్రులు వేలాడుతున్నారని, ఇది ప్రజల అభిప్రాయంగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామాలు చేసి బయటకు వచ్చేయాలన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ క్షణంలో రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

ashok 02032018 3

ఒకవేళ తాము ఢిల్లీలో ఉన్నసమయంలో చంద్రబాబు రాజీనామాలు చేయాలని ఆదేశిస్తే... ఆ మరుక్షణమే ప్రదానికిగానీ, రాష్ఠ్రపతి, లోక్‌సభ స్పీకర్‌కుగానీ రాజీనామా లేఖలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ముందు ఈ పదవులు ఓ లెక్కకాదని అశోక్‌గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఆయన ఒకేసారి అటు ఎంపీలకు, అటు తప్పుడు కధనాలు అల్లుతున్న వారికి, దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు... దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజీనామాలు అనేది ఒక అస్త్రం మాత్రమేనని, అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read