ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి, తలమానికంగా ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, మరి కొన్ని గంటల్లో కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. సరిగ్గా నాలుగు నెలల కిందట ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి చెన్నైకి విమాన సర్వీసు ప్రారంభించింది. ఇప్పుడు ఇదే సంస్థ రాష్ట్ర రాజధాని అమరావతికి, కడప నుంచి మరో సర్వీసు నడపడానికి సిద్ధమైంది. జిల్లాలోని విద్యార్థులు, మధ్య తరగతి ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి నేరుగా ఒక్కటంటే ఒక్క రైలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప జిల్లా నుంచి విజయవాడకు ప్రయాణించే వారు అధికంగా ఉన్నారు. రైల్లో విజయవాడ వెళ్లాలంటే రేణిగుంట వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళ్లాలి లేదా నంద్యాల మీదుగా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఇలా వెళ్లాలంటే కడప టు అమరావతి విజయవాడకే దాదాపు 18 గంటలకు పైగా సమయం పట్టేది.

gannavaram 01032018 2

ఇప్పుడు విజయవాడకే విమాన సర్వీసు రావడం, రైల్లోని మొదటి ఏసీ టిక్కెట్‌ ధర, ఏసి బస్సు ధర కంటే తక్కువుగా ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకంలో భాగంగా రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ లో భాగంగా ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి మూడో సర్వీసును మార్చి 1 నుంచి విజయవాడకు ప్రారంభిస్తోంది. ప్రారంభ ఆఫర్‌ ధర రూ.599 నుంచి ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేశారు. మామూలు రోజుల్లో, 903 రూపాయాలు ఉంటుంది. ఈ పథకంలో భాగంగా నడిచే విమాన సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తాయి. ఈ సర్వీసుల ప్రతిరోజూ నడుస్తూ ఉంటాయి. జిల్లా ప్రజలు సాధారణ, జాతీయ పండుగల సమయాల్లో తక్కువ ధరకే విమానంలో ప్రయాణించి తమ కోరికను తీర్చుకోవచ్చు. పండుగ సమయాల్లో విమాన ధరలు సాధారణ టికెట్‌పై 50 శాతం పైగానే తగ్గింపు ధర ఉంటుంది.

gannavaram 01032018 3

ఇప్పుడు కడప నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలకు ట్రూజెట్‌ సంస్థ తమ సర్వీసులను నడపడమే గాకుండా త్వరలో కడప నుంచి చెన్నై నుంచి బెంగళూరు మధ్య నడపడానికి సిద్ధం అవుతుంది. విమాన టికెట్‌ ధరలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒక రోజు ఎక్కువ, మరో రోజు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీకెండ్‌లో విమాన ధరలు ఎక్కువగా ఉంటాయి. నెల, 15 రోజుల ముందే టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే ధర తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఉదయం 7.40 గంటలకు ట్రూజెట్‌ విమానం వస్తోంది. ఈ సర్వీసు కడపకు ఉదయం 8.05 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి కడప నుంచి విజయవాడకు 10.30 గంటలకు వస్తుంది. ఇదే విమానం ఇక్కడ నుంచి 10.35 గంటలకు హైదరాబాద్‌ వెళుతుంది.

అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రేపటి నుంచి కొత్త కళ సంతరించుకోబోతుంది... మార్చి ఒకటి నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ మరింత సందడిగా మారనుంది.. ఇప్పటివరకు ప్రతి రోజు 41 సర్వీసులు నడుస్తూ ఉండగా, రేపటి నుంచి మరో 12 కొత్తగా వచ్చి చేరుతున్నాయి... దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లో, ప్రతి రోజు నడిచే సర్వీసుల సంఖ్య 53కు చేరనుంది.. వీటిలో భాగంగానే విజయవాడ నుంచి కడపకు తొలి విమాన సర్వీసు మార్చి ఒకటిన ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ పథకంలో భాగంగా రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌(ఆర్‌సీఎం) కింద గన్నవరం నుంచి ప్రారంభమవుతున్న తొలి విమాన సర్వీసు కూడా ఇదే. అతి తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోనికి తేవడంతో పాటు చిన్న పట్టణాలు, నగరాల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడంలో భాగంగా కేంద్రం ఉడాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది.

gannavaram 28022018 2

తొమ్మిది నెలల కిందట 2017 ఏప్రిల్‌ 27న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద నడిచే సర్వీసులు ఇప్పటివరకూ గన్నవరం నుంచి లేవు. ఉడాన్‌ పథకంలో భాగంగా విజయవాడ నుంచి ప్రారంభమవుతున్న తొలి సర్వీసు ట్రూజెట్‌ విమానయాన సంస్థ నడుపుతోంది. రూ.700 ప్రారంభ ధర నుంచి ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఉడాన్‌లో భాగంగా నడిచే విమాన సర్వీసులకు టిక్కెట్‌ ధర రూ.2500 లోపే ఉంటుంది. విజయవాడ నుంచి కడపకు ఈ సర్వీసు నిత్యం నడుస్తుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడి నుంచి కడపకు వెళుతుంది. తిరిగి కడప నుంచి ఇక్కడికి వచ్చి మళ్లీ హైదరాబాద్‌కు వెళుతుంది. రోజూ ఉదయం 7.45కు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.05కు కడపకు బయలుదేరుతుంది. తిరిగి కడప నుంచి బయలుదేరి ఉదయం 10.45కు విజయవాడ చేరుతుంది. ఉదయం 10.55కు బయలుదేరి హైదరాబాద్‌కు వెళుతుంది.

gannavaram 28022018 3

చెన్నైకు ఉదయం సర్వీసు.. విజయవాడ నుంచి చెన్నైకు వెళ్లాలంటే ప్రస్తుతం మధ్యాహ్నం 12.35కు ఎయిరిండియా సర్వీసు ఉంది. దాని తర్వాత మళ్లీ మధ్యాహ్నం 2, సాయంత్రం 5.20కు స్పైస్‌జెట్‌ సర్వీసులు చెన్నై వెళ్లేందుకున్నాయి. తాజాగా మార్చి ఒకటి నుంచి స్పైస్‌జెట్‌ సంస్థ ఉదయం 10.30కు విజయవాడ నుంచి చెన్నైకు కొత్త సర్వీసును ప్రారంభిస్తోంది. దీనివల్ల ఉదయం 10.30కు విజయవాడలో బయలుదేరి 11.45కు చెన్నైకు చేరిపోవచ్చు. నిత్యం నగరం నుంచి నడుస్తున్న మూడు సర్వీసులకూ భారీ డిమాండ్‌ ఉంది. దీంతో ఉదయం వేళ మరో సర్వీసును స్పైస్‌జెట్‌ ప్రారంభిస్తోంది. మార్చి రెండు నుంచి ఇండిగో సంస్థ సైతం నిత్యం పది సర్వీసులను హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నైలకు ప్రారంభిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ, 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.. జనసేన పార్టీ నిర్మాణం జరగక పోయినా, పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీ తరుపున, బీజేపీ పార్టీ తరుపున, ప్రచారం చేసారు... అయితే, గత కొంత కాలంగా, బీజేపీ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తెలియచేసిన పవన్, అవకాసం దొరికినప్పుడు, తెలుగుదేశం పార్టీ పై కూడా విమర్శలు చేసారు... మరో పక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉంటూ ఉన్నా, పార్టీల పరంగా, జనసేన, తెలుగుదేశం మాత్రం ఎప్పుడూ మిత్రపక్షంగా కనిపించ లేదు..

cbn pk 28022018 2

ఇది ఇలా ఉంటే, నిన్న ఒక ఇంటర్వ్యూ లో, జనసేనతో పొత్తు గురించి ప్రశ్నలు అడగగా, చంద్రబాబు స్పందించారు... జనసేన పార్టీతో పొత్తు అనేది, ఎన్నికలు వచ్చినప్పుడు నిర్ణయిస్తామని, అప్పటి రాజకీయ పరిస్థితులని బట్టి, పొట్టు ఉంటుంది అని, ఇప్పటికిప్పుడు జనసేనతో పొత్తు ఉంటుందా, ఉండదా అనే ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేము అని చంద్రబాబు అన్నారు... చంద్రబాబు ఇలా వ్యాఖ్యలు చెయ్యటం వెనుక, పవన్ కళ్యాణ్, టిడిపితో మిత్రపక్షంగా లేరు అనే విషయం అర్ధమవుతుంది.... అదే విధంగా భవిష్యత్తు పొత్తుల పై ఇంకా ఏమి తేలలేదు అని విషయం స్పష్టమవుతుంది...

cbn pk 28022018 3

మరో పక్క, వచ్చే ఎన్నికల్లో ప్రజా అజెండా ఎవరైతే అమోదిస్తారో వారితో జతకట్టి అడుగులు వేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పవన్‌కల్యాణ్‌ కూడా తమ ఆలోచనా విధానంలోనే నడుస్తున్నారని... ఆయనతో కలిసి నడిచే ఆలోచనలో ఉన్నామన్నారు. కడపలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నామని.. అనంతరం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దేశంలో, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి ఒక అవగాహనకు వస్తామన్నారు. కూటమిలో ఎవరు ఉండాలనేది, ఎవరెవరితో కలిసి ముందుకు వెళ్లే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.

2014 ఎన్నికల్లో, తెలుగుదేశం, బీజేపీ కలిసి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అక్కడ తెలంగాణాలో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే... అయితే, ఆంధ్రప్రదేశ్ లో పొత్తులోనే ఉన్నాం అని చెప్తూ, తెలంగాణాలో మాత్రం తెలుగుదేశంతో పొత్తు లేదు అని బీజేపీ నాయకులు చెప్తూ వస్తున్నారు.. చివరకు అమిత్ షా కూడా, ఇదే మాట చెప్పారు... ఈ విషయం పై చంద్రబాబు ఈ రోజు స్పందించారు... ఈ రోజు చంద్రబాబు చాలా రోజుల తరువాత హైదరాబాద్ వెళ్లారు... హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను ఆయన కలిశారు... తెలంగాణలో టీడీపీ బలోపేతం పై చర్చించారు...

cbn bjp 28022018 2

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘2014 ఎన్నికల సమయంలో బీజేపీతో పెట్టుకున్నాం. మనం ఇరవై సీట్లు గెలిచాం. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్సీని కూడా గెలిపించాం. తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో మనకు చెప్పకుండానే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని వాళ్లే ప్రకటించారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఏది చేసినా చెప్పి చేయాలి. కానీ బీజేపీ అలా చేయలేదు" అంటూ బీజేపీ వైఖరని ఎండగట్టారు.. బీజేపీ ఆడుతున్న ద్వంద్వ వైఖరి పై ఇప్పటికే తెలంగాణాలో నేతలు గుర్రుగా ఉన్నారు...

cbn bjp 28022018 3

మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో, తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం అంటూనే, రోజు సోము వీర్రాజు లాంటి నేతలు బూతులు తిడుతూ ఉంటారు... రాష్ట్రానికి అన్యాయం జరిగింది అయ్యా అంటే, మా మోడీ ఎంతో చేస్తున్నారు, ఇంకా చెయ్యల్సింది ఏమి లేదు, చంద్రబాబు ఇచ్చిన డబ్బులు అన్నీ తినేస్తున్నారు అంటూ, పిచ్చ ప్రచారం చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో రోజులు గడుపుతుంది... తాజాగా తెలంగాణా విషయంలో బీజేపీ వైఖనికి చంద్రబాబు బహిరంగంగానే ఎండగట్టారు... ఈ వ్యాఖ్యల, ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా పడే అవకాసం ఉంది...

Advertisements

Latest Articles

Most Read