గత నాలుగు రోజులుగా, హైదరాబాద్ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఏకంగా దేశ ప్రధాని ఇక్కడ వచ్చి, అతి పెద్ద రామానుజుల వారి విగ్రహం ఆవిష్కారించారు. ఇది మొత్తం చినజీయార్ స్వామి సారధ్యంలో జరిగిన కార్యక్రమం. అయితే ఒక పక్క దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే, ఈ రోజు బయటకు వచ్చిన రెండు వీడియోలు చినజీయార్ స్వామి ప్రతిష్టను పాతాళానికి పడేశాయి. ఈ వీడియోలు చూసిన వారు, చినజీయార్ ని తప్పు బడుతున్నారు. గుడివాడలో క్యాసినో వ్యవహారం ఎంత రచ్చ రచ్చ అయ్యిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో లేని నీచ సంస్కృతిని ఇక్కడకు తీసుకుని వచ్చి, రాష్ట్ర పరువు గంగలో కలిపారు. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, ఇది కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో జరిగిన తంతు కావటం, కొడాలి నాని పాటలు, వైసీపీ రంగులతో రచ్చ రచ్చ చేసారు. అయితే ఈ క్యాసినో ఆర్గనైజర్ చీకోటి ప్రవీణ్, కొడాలి నానికి, వంశీకి దగ్గర వాడు. అయితే ఇక్కడ క్యాసినో నడిపిన చీకోటి ప్రవీణ్, చినజీయార్ స్వామితో కలిసి ఉన్న రెండు వీడియోలు బయటకు వచ్చాయి. ప్రవీణ్ చీకోటి చేస్తున్న ఒక ఫంక్షన్ కు చినజీయార్ స్వామి రావటం ఒక వీడియో అయితే, రెండో వీడియో ఏకంగా ప్రవీణ్ చీకోటి, చినజీయార్ స్వామిని కారులో ఎక్కించుకుని స్వయంగా తిరగటం.
ఒక పెద్ద కారులో క్యాసినో నడిపే ప్రవీణ్ చికోటి, చినజీయార్ స్వామితో కలిసి వెళ్ళటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రెండు వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఒక పక్క గుడివాడ క్యాసినో వివాదాస్పదం అవ్వటం, ఇప్పుడు ఈ వీడియోలు బయటకు రావటంతో, చినజీయార్ స్వామి పైన కూడా విమర్శలు వస్తున్నాయి. అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న స్వామి, ఇలా ఒక జూదగాడితో కలిసి తిరగటం, ఆశీర్వాదం అందించటం, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక పక్క చినజీయార్ పై నిన్నటి వరకు ప్రశంసలు వస్తే, ఇప్పుడు ఇలా జుదగాళ్ళతో ఉండటంతో వివాదాస్పదం అయ్యింది. ఎక్కడో ఉంటే ఆశీర్వాదం ఇచ్చారు అంటే, ఎవరో తెలియక ఇచ్చారు అనుకోవచ్చు. అలా కాకుండా, అలాంటి వాడితో కలిసి, ఈయన కారులో వెళ్తున్నారు అంటే, ఎంత చనువు లేకపోతే వెళ్తారు, ఇలాంటివి స్వామి వారికి తగునా అనే విమర్శలు వస్తున్నాయి. మరి దీని పైన ఎలాంటి వివరణ అటు వైపు నుంచి వస్తుందో చూడాలి.