ఈ రోజు అమరావతిలో జరుగుతున్న, తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు... ఆంధ్రప్రదేశ్ డిమాండ్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసాను అంటున్న జేఎఫ్‌సీ పై చంద్రబాబు స్పందించారు. పవన్ కల్యాణ్... ఆయన పని ఏదో చేసుకుంటున్నాడు... పోనివ్వండి.. పవన్ జేఎఫ్‌సీతో మనకు ఇబ్బంది లేదు... పవన్ పోరాటంలో అర్థం ఉంది... రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ పోరాటం చేస్తున్నారు.. అని నేతలతో చంద్రబాబు చెప్పారు...
అయితే ఒక విషయంలో మాత్రం పవన్ కి చురకలు అంటించారు... రాష్ట్ర పరిస్థితికి మొదటి ముద్దాయి కాంగ్రెస్సేనని, కాంగ్రెస్‌తో కలిసి పవన్ జేఎఫ్సీ ఏర్పాటు చేసి ఏం లాభం? అని చంద్రబాబు అన్నారు. నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ విధించిన డెడ్‌లైన్‌పై కూడా చంద్రబాబు చర్చించారు. శ్వేత పత్రం ఇవ్వాల్సింది కేంద్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం కాదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్వేత పత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు...
పోలవరవం లెక్కలు లాంటివి, పారదర్శకంగా వెబ్ సైట్లో కూడా ఉంచామని, ఇంకా పవన్ కల్యాణ్ కు కొత్తగా ఇచ్చేదేముంటుందనే విషయాన్ని సున్నితంగా వివరించాలని నాయకులకు సూచించారు... పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తున్నారని అనే అభిప్రాయం ఉందని, మనది కూడా అదే ఆరాటమన్నారు... అలాగే కేంద్రం బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని, హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేయాల్సి ఉందని టీడీపీ నేతలతో అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలోనే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేలా ఉందని చంద్రబాబు అన్నారు...