అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! జాతీయ రహదారి 44 పక్కన పొలాలు, చిన్నపాటి గుట్టలతో కూడిన సుమారు 600 ఎకరాల స్థలం! ఇప్పుడు... ఆ స్థలం రూపు రేఖలు శరవేగంగా మారిపోతున్నాయి... రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో అక్కడే కీలక అడుగు పడనుంది.. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో, ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ ‘కియ’ మోటార్స్ కార్ల తయారీ ప్లాంటు కీలక అడుగు ఫిబ్రవరి 22న జరగనుంది... ఈ నెల 22న జరిగే ఫ్రేమ్‌వర్క్ అమర్చే పనులను ప్రారంభించాల్సిందిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటర్స్ ఎండీ కూఖ్యున్ షిమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు...
అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించాలని సీఎం చంద్రబాబును కోరారు... ప్లాంటు అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని సీఎంను కొరనున్నారు. ఆ రోజు సీఎం కియ ప్లాంటును సందర్శించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.. 2019 ద్వితీయార్థం నుంచి భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది... అయితే 2019 సంక్రాంతి నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది...
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా సంస్థ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే... ఎర్రమంచి ప్లాంటులో 4 వేల మందికి శాశ్వతంగా.. 7వేల మందికి తాత్కాలికంగా ఉపాధి కల్పిస్తారు. 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.