వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కామెడీ టైమింగ్ అదిరిపోయింది... ఒక పక్క రాష్ట్రం మొత్తం, జగన్ మోడీకి భయపడి, ఇంత అన్యాయం జరుగుతున్నా ఏమి అనట్లేదు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది... ఇది పోగొట్టటానికి జగన్ ఒక కామెడీ ఛాలెంజ్ చేసారు... ఏప్రిల్‌ 6 లోపు ప్రత్యెక హోదా ఇవ్వకపోతే, మా ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు... ఇక్కడ కామెడీ ఏంటి అంటే, విజయసాయి రెడ్డి మాత్రం రాజీనామా చెయ్యరు... పార్లమెంట్ సభ్యులు మాత్రమే రాజీనామా చేస్తారు... అయితే, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయి రెడ్డికి మినహయింపు ఎందుకో అందరికీ తెలిసిందే...

jagan challeng 13022018 2

అయితే, పార్లమెంట్ సభ్యులలో కూడా ఎంత మంది రాజీనామాకు రెడీ అవుతారో చూడాల్సి ఉంది... ఇప్పటికే మేకపాటి టిడిపితో టచ్ లో ఉన్నారు, ఇక మిగిలిన నలుగురిలో ఇద్దరు జగన్ బంధువులే, ఒకాయిన వ్యాపార భాగస్వామి, ఇంకో ఆయిన ఏంటో ఆయనికే తెలియదు... మొత్తానికి, ఇప్పుడు జగన్ వీరి చేత రాజీనామా చేయిస్తారా, లేక పోయిన ఏడాది చెప్పినట్టు, ఇది కూడా కామెడీ ఛాలెంజ్ మాత్రమేనా అనేది చూడాల్సి ఉంది... జగన్ రాజీనామా అంటే, ప్రజలకు అదే అభిప్రాయం ఉంది... పోయిన ఏడాది కూడా ఇలాగే అన్నారు, టైం కూడా ఇచ్చారు, రాజీనామాలు చెయ్యవయ్యా అంటే, తుర్రు మన్నాడు.. ఇప్పుడు మోడీతో కుమ్మక్కు అయిపోయావ్ అనే విమర్శలు వస్తున్న వేళ, మరో డ్రామా మొదలు పెట్టాడు జగన్...

jagan challeng 13022018 3

అయితే, అసలు ఈ రాజీనామాలతో జగన్ సాధించేది ఏంటి అంటే ? ఏమి లేదు... జగన్ ఎంపీలు రాజీనామా చేస్తే, అక్కడ మోడీకి పోయేది ఏమి ఉండదు.. నిజానికి పార్లమెంట్ వేదికగా మాత్రమే, కేంద్రాన్ని దేశం మొత్తం ముందు దోషిగా నిలబెట్టచ్చు.. జగన్ ఎంపీలు, ఎలాగూ పార్లమెంట్ లో మోడీని చూస్తే, పారిపోతారు కాబట్టి, లోపల ఉన్నా, లేకపోయినా ఒకటే అనుకున్నారో ఏమో... మరొకటి ఏంటి అంటే, డిసెంబర్ లో ఎలక్షన్స్ వస్తాయి అంటున్న టైంలో, కేవలం ఆరు నెలల ముందు రాజీనామా చేస్తే, ఎవరికి లాభమో జగన్ కి మాత్రమే తెలియాలి... అయినా, వీళ్ళు చేసినప్పుడు సంగతి కదా... అయినా ఇక్కడ మరో విషయం... జగన రాజీనామాలు చేసేది ప్రత్యేక హోదా కోసం అంట.. పోలవరం కోసం కాదు, ఆర్ధిక లోటు భర్తీ కాదు, EAP నిధుల కోసం కాదు, రైల్వ జోన్ కోసం కాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కాదు, దుగ్గిరజపట్నం పోర్ట్ కోసం కాదు, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధుల కోసం కాదు, వివిధ విద్య సంస్థల నిధులు కోసం కాదు, ఉమ్మడి ఆస్తుల విభజన కోసం కాదు, 9,10 షడ్యుల్ సంస్థల కోసం కాదు... ఇది ఆయనగారి తెలివి.. చివరగా, జగన్ గారు.. ఏప్రిల్ 6 శుక్రవారం... కోర్ట్ కి పోవాలి గుర్తుపెట్టుకోండి...

కేంద్రంలో ఉన్న మోడీ, మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అంటూ, చిన్న పిల్లల దగ్గర నుంచి, పండు ముసలి వాళ్ళ దాకా, రాష్ట్రంలో ఆందోళన చేస్తుంటే, ప్రతిపక్ష వైసిపీ మాత్రం, రివర్స్ గేమ్ ఆడి, ఎప్పటిలాగే చివరకు సెల్ఫ్ గోల అయ్యి, మరో సారి పరువు పోగొట్టుకుంది... అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంటే, జగన్ మాత్రం వెరైటీగా చంద్రబాబుని తిట్టటం మొదలు పెట్టారు... పోనీ తిడితే తిట్టాడు, అదే నోటితో మోడీని ఏమన్నా అంటున్నాడా అంటే, అదేమి లేదు... చివరకు ఏమి తేల్చాడు అంటే, చంద్రబాబు అవినీతి చేస్తున్నారని, కేంద్రం ఎక్కువ డబ్బులు ఇస్తే, చంద్రబాబు మరింత అవినీతి చేస్తారని, మోడీ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వటం లేదు అని తేల్చారు...

jagan 13022018 2

జగన్ ఇంత డైరెక్ట్ గా బీజేపీకి వంత పాడుతూ ఉండటంతో, ప్రజలు కూడా బిజెపి, వైకాపా కుమ్మక్కు అయిపోయారు అనే అభిప్రాయానికి వచ్చేశారు... ఇదే విషయం ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా తేలటంతో, జగన్ నిన్న హుటాహుటిన ముఖ్య నేతలను పాదయాత్ర జరుగుతున్న చోటికి పిలిపించి మీటింగ్ పెట్టారు... వారితో ప్రజలు ఎలా తిడుతున్నారో చెప్పి, డ్యామేజ్ కంట్రోల్ చెయ్యటానికి ప్లాన్ వేసారు... అయితే, ఇక్కడ కూడా కొన్ని కండిషన్లు పెట్టాడు జగన్... నేను ఎక్కడా ప్రత్యక్షంగా కేంద్రం పై మాట్లాడను అని, మొన్న బంద్ రోజు ఎలా అయితే, ఒక నిమషం ప్లెకార్డ్ పట్టుకుని ఫోటోలు దిగానో, నా నిరసన అంత వరుకే పరిమితం అని, నా నుంచి మీరు ఎక్కువ కోరుకోవద్దు అని ముందే నేతలు చెప్పాడు జగన్...

jagan 13022018 3

చివరకు, కేంద్రం పై మనం కూడా పోరాడుతున్నం అనే ఫీల్ రావాలి అని, అలా అని మనం నిజంగా మోడీని తిట్టం అని, అక్కడ కూడా చంద్రబాబునే తిడదాం అని ప్లాన్ చేసి, చివరకు ఒక కంక్లుజన్ కు వచ్చారు... వచ్చేనెల 1న తాము రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసారు, 3న తమ పార్టీ నేతలు అందరూ పాదయాత్ర చేసి నిరసన తెలుపుతారు, 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతారు... ఎక్కడా ధర్నల్లో జగన్ మాత్రం పాల్గునడు... పేరుకు కేంద్రం మీద నిరసనగా చేసినా, టార్గెట్ మాత్రం చంద్రబాబే అని తేల్చారు....

తెలంగాణాలో, హరిత హారం అంటే ఎగబడ్డారు, ఆంధ్రప్రదేశ్ లో వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు గురించి....అది హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, హరిత హారం అని తెలంగాణా ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే, ఒక్కొక్కడు ఎగబడి, మొక్కలు నాటుతూ ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేసి, లెక్చర్లు ఇచ్చారు.... సరే, మంచి పనికి సహకిరించారు, దాంట్లో తప్పేమీ ఉందిలే అనుకున్నాం...కాని అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వనం-మనం అంటే, ఒక్కడు కాకపొతే, ఒక్కడు కుడా కన్నెత్తి ఇటు చూడలా...

cbn 13022018 2

ఇలాంటి వారికి మొఖం పగిలిపోయే వార్త.. చేసే పని పట్ల చిత్తసుద్ధి ఉండాలి అనేది అందుకే.. ‘స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2017’ పేరిట కేంద్ర అటవీ, పర్యావరణశాఖ పరిధిలోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఫ్ఎస్ ఐ) రూపొందించిన నివేదికలో, పచ్చదనం పెంపొందించడం లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది... తెలంగాణ ఐదో స్థానం సాధించింది... 2015-17 మధ్య కాలంలో ఏపీలో 2,141 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది... 1,101 చదరపు కిలోమీటర్లతో కర్ణాటక, 1,043 చ.కి.మీ.తో కేరళ, 885చ.కిమీ.తో ఒడిశా, 565 చ.కి.మీ.తో తెలంగాణ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి....

cbn 13022018 3

అందుకే చేసే పని పై చిత్తసుద్ధి ఉండాలి అనే అనేది... ఒక ప్రణాలిక చంద్రబాబుకి ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనం ఇంత పెరిగింది... తెలంగాణాలో పోల్చటానికి కారణం, అక్కడ హైదరాబాద్ బ్యాచ్ ఆంధ్రా పై అవలంభిస్తున్న విధానం వలన.. అమరావతి కట్టుకుంటే, చెట్లు నరికేశారు అని మీడియా స్టొరీలు వేస్తుంది... హరిత హారం, వనం-మనం పోల్చుతూ, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని హేళన చేస్తూ కధనాలు వేస్తాయి... చివరకు ఏమైంది ? అక్కడ ఫోటోలు దిగి, కెసిఆర్ ద్రుష్టిలో పడటానికి సినిమా బ్యాచ్ ఎగబడితే, ఇక్కడ మా రాష్ట్రం కోసం, వాడవాడలా, పెద్ద, చిన్నా అందరం కలిసి, వనం-మనం కార్యక్రమాన్ని దేశ చరిత్రలో నిలాపాం... ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసి, ఇంతటితో దులుపుకుని వెళ్ళిపోలా....ఆ మొక్కకి, మేమే రోజు నీళ్ళు పోసాం, దగ్గరుండి పెంచాం, పెద్దది చేసాం, మా రాష్ట్రాని హరితాంధ్రప్రదేశ్ చేసుకుంటున్నాం... దాని ఫలితాలే ఇవాళ, పచ్చదనం పెంపొందించడం లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది...

ఈ రోజు అమరావతికి దేశ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ లాంటి మహా సంస్థకు అధినేత ముఖేశ్‌ అంబానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి రానున్నారు... ఇవాళ అమరావతిలో పర్యటించనున్న ముఖేష్ అంబానీ.. సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు... ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వీరి మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది... రాష్ట్రంలో పెట్టుబడులుకు ఉన్న అవకాశాలు ఇప్పటికే స్టడీ చేసిన రిలయన్స్ గ్రూప్, ఏ రంగంలో పెట్టుబడులు పెడతారో అని ప్రభుత్వ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి..

velagapudi 13022018

ఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల తన ముంబై పర్యటనలో భాగంగా అంబానీని కలిసిన మంత్రి లోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించి రాష్ట్ర పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంబానీ సీఎంతో భేటీ కానున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీజీ కేంద్రాన్ని ముఖేష్ అంబానీ పరిశీలించనున్నారు.

velagapudi 13022018

అధికారిక కార్యక్రమాలు అయిపోయిన తరువాత, ముఖ్యమంత్రి నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ భేటీలో పారిశ్రామిక రంగంతో పాటు, తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చించే అవకాసం ఉంది... ఇటీవల చంద్రబాబు, బీజేపీకు దూరం అవుతున్నారు అనే సంకేతాలు, దేశ వ్యాప్తంగా బలంగా వెళ్ళిన నేపధ్యంలో, ఆ విషయాలు పై కూడా, ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాసం ఉంది... మొత్తానికి ముకేష్ అంబానీ ఎలాంటి పెట్టుబడులు పెడతారు, ఎంత పెడతారు అనే దాని పై, ఆసక్తి నెలకొంది...

Advertisements

Latest Articles

Most Read